బోధనపైనే శ్రద్ధ వహించాలె

Mon,March 11, 2019 11:12 PM

మానవులు నిర్మించుకున్న అన్ని రంగాల్లోకి విద్యారం గం విలక్షణత కలిగి ఉంటుంది. ఈ రంగమొక్క టే మానవ వనరులను నిర్మించి సమాజాలను చైతన్యవంతం చేసి, ప్రగతి పథంలో నడిపిస్తుంది. అలా గే సనాతన ధర్మంలో చెప్పిన చాతుర్వర్ణ వ్యవస్థ ఇం దులో తప్పనిసరి అవుతుంది. వర్ణం అంటే కులం అని ఎవరూ పొరపడకూడదు. వర్ణం అనేది వృత్తి, ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుందని భగవద్గీత వివరిస్తుంది. ఉదాహరణకు పాఠాలు బోధించవలసిన గురువుకు సాత్వికగుణం లేకపోతే బోధనకు కావలసిన సహనం ఉండదు. అలాగే శత్రువుల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవలసిన రాజుకు రాజసం వల్ల కలిగే పౌరుషం లేకపోతే తన ధర్మం నిర్వర్తించలేడు. ఇక జ్ఞానం లేశ మాత్రం లేకుండా, ఆలోచన తక్కువగా ఉండి, హద్దులేకుండా తిండి తిని ఎక్కువ గంటలు నిద్రపోయేవారికి శారీరక బలం ఎక్కువై తామస గుణా లు పెరుగుతాయి. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మన ప్రస్తుత విద్యారంగం-ముఖ్యంగా దేశంలో ఎందుకింత నిర్వీర్యమైందో తెలుసుకోవాలి గనుక! వర్ణాల వ్యవస్థ మనుషులను విడదీయడానికి రాలేదు. పనులను రకరకాలుగా విభజించి ఎవరి శక్తి, తెలివి, ప్రవృత్తిని బట్టి వారు ఆయా రంగా లు ఎన్నుకోవాలన్నది వర్ణ వ్యవస్థ ముఖ్యోద్దేశం. అయితే బుద్ధుడు, వివేకానంద తర్వాత అఖండ మేధావి అయిన అంబేద్కర్ ఈ వ్యవస్థను సరి గ్గా వర్ణించారు. స్వార్థపరుల చేతుల్లో ఈ ప్రకృతి సహజమైన విభజన అశాస్త్రీయంగా ఎలా మారి స్థిరపడిందో వివరించారు. పనిని విభజించే బదు లు పనివారిని విభజించారు అన్నారాయన.ఇక ఇప్పుడున్న డిగ్రీ కాలేజీల్లో కూడా ఉపాధ్యాయుల సంఖ్య పెంచడం, మారిన కాలానికి సరిపోయే పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు ప్రవేశపెట్టడంతో పాటు కేవలం చదువు మీద శ్రద్ధ పెట్టేటట్టు విద్యార్థులను, వారిని తీర్చిదిద్దేటట్టు ఉపాధ్యాయులను తయారుచేయాలి. ఇది లేకనే ఇప్పుడు 93 శాతం జనరల్ డిగ్రీ విద్యార్థులు ఉద్యోగాలకు తగిన నిపుణతలు కలిగి లేరని సర్వేలు చెప్తున్నాయి.


వర్ణాన్ని బట్టి తారుమారు చేసి వృత్తిని బట్టి కులాలేర్పరిచారు. కాలక్రమేణా ఆ కుల వ్యవస్థ బలప డి సమాజ విచ్ఛేదం జరిగింది. బోధించే ఉపాధ్యాయులందరూ సాత్విక వర్ణం కలిగిన వారే! వీరికి విద్యావ్యాప్తి తప్ప ఇంకో వ్యాపకం, వ్యాపారం ఉండకూడదు. తమ విద్యార్థులను ఏ రకంగా జ్ఞానవంతులుగా, ఉత్తమ పౌరులుగా సమాజానికి ఉపయోగపడే విధంగా తయారుచేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విషయం మనసులో లేని వాడే నిజమైన బోధకుడు. తన జ్ఞానం పెంచుకుంటూ తనకు అప్పగించిన విద్యార్థులకు దాన్ని పంచేవాడే నిజమైన గురువు. క్రమశిక్షణ, జ్ఞానర్జన పట్ల తన విద్యార్థులను చైతన్యవంతులను చేసి వారికి వ్యక్తిత్వ వికాసం కలిగిస్తూ, ఉద్యోగ ఉపాధులు సంపాదించుకునే శక్తి, నిపుణతలను కలిగించాలి. మరి ఇప్పుడు ఒకటో క్లాసు నుంచీ డిగ్రీ కాలేజీల వరకు పరిస్థితి ఎలా ఉంది? స్కూళ్లలో టీచర్లకు బోధనేతర పనులు ఎన్ని అప్పగించబడుతున్నాయి? విద్యార్థుల మార్పులు, ఉత్తీర్ణతా శాతం గురించిన మీటింగులే కానీ, బోధనా పద్ధతులు, పాఠ్యాంశాలు, వెనుకబడిన విద్యార్థుల గురించిన చర్చలు ఎంత రెగ్యులర్‌గా, అర్థవంతంగా జరుగుతున్నాయి? తాము పాఠశాలల్లో ఉన్న సమయంలో ఎంత బోధనకు, ఎంత ఇతర విషయాలకు ఉపాధ్యాయులు కేటాయిస్తారు? పైగా 40, 50 నిమిషాల క్లాసులు ఎంత హానికరంగా తయారయ్యాయి? కొంతకాలం క్రితం బీహార్, యూపీ రాష్ర్టాలలో ఈ విషయంలో పరిశీలించగా ఒక్కొక్క టీచర్ రోజుకు 6 గంటల టీచింగ్ సమయంలో 1 గంట పాటు క్లాసు నుం చి క్లాసుకు తిరుగుతూ దాదాపు 3 కిలోమీటర్ల నడుక సాగించటం జరుగుతున్నదట. ఈ పద్ధతి మార్చకుండా టీచర్ల ఉత్సాహం, బోధనా పటిమ నిలబెట్టగలరా? ఇక ఇంకొంతమంది ఉపాధ్యాయులకు బయటి వ్యాపారాలు, కోచింగ్ సెంటర్ల ట్యూషన్ కాస్లులుంటాయి.

వీటిని ఉపేక్షిస్తే అసలు వారు ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తారా? ఈ విషయాలన్నీ విద్యారంగంలోని అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తారా? మన రాష్ట్రం లో పరిస్థితులు మెరుగుబడి ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాలు సంతృప్తికరంగా పెరిగాయి కాబట్టి, వారు తమ సమయాన్ని పూర్తిగా తమ వృత్తికే కేటాయించేటట్టు నియంత్రించాలి. అంతేకాక ఉపాధ్యాయులందరికీ బోధ నా పద్ధతుల్లో రెగ్యులర్‌గా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. ఎప్పుడో వచ్చే ఎన్నికల బాధ్యతలు తప్ప వారికి ఏ ఇతర బోధనేతర బాధ్యతలు అప్పగించకూడదు. ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది. వారు తీసుకునే ప్రతి క్లాస్‌ప్లాన్ పేపర్ మీద రాయాలనేటువంటి పనులకు కూడా చాలా తక్కువ సమయం కేటాయించాలి. పేపర్ వర్క్ ఎక్కువ, బోధన తక్కువ గా ఉన్న విద్యావ్యవస్థ ఎప్పటికీ బాగు పడదు. ఇక మిగితా వారికి కూడా వారి వారి ఉద్యోగాలననుసరించి బాధ్యతలు అప్పగించాలి. విద్యార్థు లు కూడా తమ వ్యక్తిగత పనులను చేసుకుంటూ తమ చదువుల కోసం అత్యధిక సమయం కేటాయించేటట్టు ప్రణాళికలు రచించాలి. క్లాసులు ఊడువటం, శుభ్రంగా పాఠశాలను ఉంచటం లాంటి పనులు నేర్పించాలంటే వారంలో ఒకరోజు వాటికి కేటాయించి చేయించవచ్చు. దీని ఉద్దే శం విద్యార్థులు తమ చదువు మీదే ఎక్కువ సమయం కేటాయించాలని! ఇక ఇప్పుడున్న డిగ్రీ కాలేజీల్లో కూడా ఉపాధ్యాయుల సంఖ్య పెంచ డం, మారిన కాలానికి సరిపోయే పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు ప్రవేశపెట్టడంతో పాటు కేవలం చదు వు మీద శ్రద్ధ పెట్టేటట్టు విద్యార్థుల ను, వారిని తీర్చిదిద్దేటట్టు ఉపాధ్యాయులను తయారుచేయాలి.
Kanakadurga
ఇది లేకనే ఇప్పుడు 93 శాతం జనరల్ డిగ్రీ విద్యార్థులు ఉద్యోగాలకు తగిన నిపుణతలు కలిగి లేరని సర్వేలు చెప్తున్నాయి. ఇక ఇంజినీరింగ్ కాలేజీల్లో ఉపాధ్యాయులు డ్యూటీలు చూస్తే బాధ కలుగుతుంది. విద్యార్థుల్లో ఎవరైనా హద్దుదాటి ప్రవర్తిస్తున్నారంటే కౌన్సిలింగ్ చేయడంతో పాటు ప్రతి క్లాసు తర్వాత అటెండెన్స్ పంపించడం మొదలైన పనుల్లోనే 90 శాతం సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఇక ఏఐసీటీఈ గాని, న్యాక్ టీములు వస్తాయంటే ఇక రెండు నెలల పాటు సమయం వృథా చేయడం తప్పనిసరి. ఈ వాతావరం ఇలాగే ఉం టే ఉపాధ్యాయులకు అకడమిక్ ప్రోగ్రామ్స్ అయిన, సెమినార్లు జరుపటం లేదు. దీంతో ఉపాధ్యాయులకు అకడమిక్‌గా ఎదిగేందుకు అవకాశమేదీ? ఇక పీహెచ్‌డీ వంటివి ప్రాజెక్టులు చేసేవారికి వారానికి ఒకరోజు కూడా కేటాయించడానికి సమయం దొరుకదు. ఇవన్నీ కలిసి ప్రొఫెషనల్ కాలేజీలో కూడా అకడమిక్ వాతావరణం కనిపించదు. దీన్ని పూర్తిగా మార్చి బోధన తప్ప, ఇతర బాధ్యతలు టీచర్లకు ఇవ్వకుండా వారి బోధనా పద్ధతులు, అర్హతలు బలపడేట్టు కాలేజీ యాజమాన్యాలు శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు కూడా విద్య మీద శ్రద్ధ, వారి భవిష్యత్తు మీద భరోసా కలిగించే విధానాలు రూపొందించాలి. ముఖ్యంగా టీచర్లకు ఇతర వ్యాపకాలు, వ్యాపారాలు లేకుండా చూడాలి. ఒకటో క్లాసు నుంచీ, డిగ్రీదాకా ఈ రకంగా గురుశిష్యులను తీర్చిదిద్దగలిగితే విద్యారంగం బాగుపడుతుంది.

417
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles