అజ్ఞానంతోనే ఈ అనర్థాలు


Tue,February 12, 2019 01:22 AM

రాజస్థాన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత సీపీ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవ్వాళ హిందుత్వం గురించి మాట్లాడుతున్న వారికెవరికీ హిందుత్వంపై మాట్లాడే అర్హత, హక్కు లేదని తేల్చేశారు. బ్రాహ్మణ కులంలో పుట్టిన జోషి బ్రాహ్మణులుగా పుట్టని వారెవరూ హిందుత్వంపై మాట్లాడటానికి అర్హత లేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వెనుకబడిన (తక్కువ) కులం లో పుట్టినారని చెప్పబడుతున్న నరేంద్ర మోదీ, ఉమా భారతి, సాధ్విరితంబర లాంటివారికి హిందుత్వం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బ్రాహ్మణులుగా పుట్టినవారికే పురాణాలు, ఇతిహాసాలపై అవసరమైన జ్ఞానం ఉంటుందని, మిగితావారికి ఆ జ్ఞానం ఉండే వీలులేదని సెలవిచ్చారు. బ్రాహ్మణ కులంలో పుట్టిన జోషీకి చారిత్రకంగా తమ పూర్వికు ల స్థితిగతులు, చరిత్రలో వారి పాత్ర గురించి అవగాహన ఉన్నట్లు లేదు. బ్రాహ్మణులకు మాత్రమే జ్ఞానం ఉంటుందని చేసిన ఆయన వ్యాఖ్యల తో ఆయన, కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. చారిత్రకంగా చూస్తే.. బ్రాహ్మణులు బ్రిటిష్ వారితో కలిసిపోయి అనేక రాయితీలు లబ్ధి పొందారు. ఇది బ్రిటిష్ వారి కాలంలోనూ, ఆ తర్వాత స్వాతంత్య్రానంతర భారతదేశంలోనూ కొనసాగింది. కానీ ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం అనేది ప్రధానపాత్ర వహించటంతో వారు కొంత వెనుకకు నెట్టబడినా, వారి ప్రాబల్యం మాత్రం కొనసాగుతున్నది. తరతరాల వారసత్వంగా వారికి ఉన్న సంస్కృత భాషార్హతతో వారు అనేక విధాలుగా లబ్ధి పొందారు. పాలకుల నుంచి నిధులు పొందారు. మత వ్యవహారాలు, పండుగలు, దైనందిన జీవితంలోని ఆచార వ్యవహారాల్లో వారి పాత్రతో వారు ధనికవర్గాల ప్రాపకం పొందారు. భారతదేశానికి యురోపియన్లు వచ్చిన తర్వాత బ్రాహ్మణవర్గాల పురాణ ఇతిహాస సాహి త్య జ్ఞానం, పురాతన గ్రంథాలు వారికి పెద్ద వనరులుగా మారాయి.

స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగా వారికి ప్రాధాన్యం పెరిగింది. యూరోపియన్లు వచ్చిన తర్వాత వారి పాలనా అవసరాలు తీర్చేందుకు సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం వారు బ్రాహ్మణులను తమ వద్దకు పిలిపించుకుని సంస్కృతాన్ని నేర్పించే పని కి ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంలోనే తరాలుగా చెబుతున్న మ్లేచ అర్థానికి కొత్త భాష్యం చెప్పారు. ఇతిహాసాల ప్రకారం మ్లేచులు సంస్కృతాన్ని సరిగ్గా పలుకలేరు. వారి జీవనవిధానం కారణంగా సం స్కృతం నేర్చుకొనే అర్హత కోల్పోయారని చెబుతారు. కానీ ప్లాసీ యుద్ధం తర్వాత పరిస్థితులకు అనుగుణంగా సంస్కృతాన్ని వినియోగించుకునే పరిస్థితి ఏర్పడింది. బ్రాహ్మణులు పెద్ద మొత్తంలో జీతభత్యాలు తీసుకొ ని యూరోపియన్లకు సంస్కృతాన్ని నేర్పించారు. అంతేకాకుండా యూరోపియన్ల విద్యాసంస్థల్లో కూడా బ్రాహ్మణులే చేరారు. వేల సంవత్సరాలుగా మరెవరికీ అందుబాటులో లేకుండా చేసిన సంస్కృతాన్ని బ్రాహ్మణులు బయటకి తీశారు. మారిన కాలపరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లో హిందు పురాణ గ్రంథాలు, ఇతిహాసా లు అందుబాటులోకి తెచ్చారు. బ్రాహ్మణులు శతాబ్దాలుగా సంస్కృతాన్ని అందరికీ అందుబాటులో ఉండేవిధంగా చూస్తే శూద్రులు దూరంగా ఉండేవారు కాదు. వలసపాలనలోని బెంగాల్‌లో ఆధిపత్య బ్రాహ్మణ వర్గం ప్రజలను సంప్రదాయక నీటి వనరుల నుంచి మంచినీరు కూడా తాగనిచ్చేవారు కాదు. బ్రాహ్మణేతరులను నిర్దిష్ట పనులు చేసేవారిగా విభజించి వారితో పనిచేయించే వారు. బంగారు ఆభరణాలు కూడా ధరించటానికి వీల్లేదని చెప్పారు. బెంగాల్‌లో అతిపెద్ద జమీందారు మహారాజా నుబ్‌కిస్సేన్ సోనార్-బని యా కుటుంబంలో పుట్టినా అతన్ని కాయస్థునిగా చెలామణి అయ్యాడు. ఆయన సాదుకున్న రాజా రాధాకాంత్ దేవ్ గొప్ప సంస్కృతిక పండితునిగా 19వ శతాబ్దంలో పేరుగాంచారు. ఆ కాలపు గొప్ప హిందుత్వ ప్రతినిధిగా, నేతగా పిలువబడినారు. హిందు పురాణాలు, ఇతిహాసాలపై పాశ్చాత్య మిషనిరీలు దాడి చేస్తు న్న తరుణంలో వాటిని ఎదుర్కోవానికి రామ్‌మోహన్‌రాయ్ నడుం కట్టారు.

నిజానికి హిందుత్వంలో అమానవీయ పద్ధతులు, ఆచారాలు లేవని, ఉపనిషత్తులలో నాడు అనుసరిస్తున్న విధానాలేవీ లేవని చెప్పుకొచ్చారు. 1810 ప్రాంతంలో సతీ సహగమనం దురాచారాన్ని బ్రిటిష్ పాలకులు నిషేధించినప్పుడు ఆయన, మనువు, యజ్ఞవల్క్యుడు చెప్పిన నీతి సూత్రాల ప్రకారం సతీసహగమనం ఆచరించటం తప్పని వాదించారు. ఆ తర్వాత కొంతకాలానికి వితంతు వివాహాన్ని ప్రచారం చేస్తూ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా పురాణ ఇతిహాసాల మద్దతును తెచ్చుకున్నారు. ఆయన వితంతు వివాహాలను వ్యతిరేకించే వారికి హిందు పురాణాల ఆధారంగానే సమాధానం చెప్పేవారు. సంఖ్యాబలం ఎంత ఉందన్న దానితో సంబంధం లేకుండా హిందూ ధర్మశాస్ర్తాల ప్రకారమే సతీ సహగమనం, వితంతు వివాహం తప్పుకాదని చెబుతూ, నాటి బ్రిటిష్ పాలకుల నిర్ణయానికి మద్దతు పలికారు. గుజరాత్‌కు చెందిన స్వామీ దయానంద సరస్వతి వేదాలను నిజమైన అర్థంలో అవగాహన చేసుకొని మసులుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తంగా చూస్తే.. బ్రిటిష్ వారి పాలనాకాలంలో బ్రాహ్మణవర్గం కొం త సరళమైంది. ఆధునికత సంతరించుకున్నది. కానీ మరోవైపు 1832 లో కలకత్తాలోని సంస్కృత కళాశాలలో ప్రేమ్‌చంద్ తర్కబాగిష్‌ను ప్రొఫెసర్‌గా బ్రిటిష్ ప్రభుత్వం నియమించినప్పుడు ఆయన అసలైన బ్రాహ్మణుడు కాదని బ్రాహ్మణవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. శూద్రమూలాల నుంచి వచ్చి బ్రాహ్మణ వర్గంలో చేరిన సంతతి నుంచి వచ్చినవానిగా ప్రేమ్‌చంద్‌ను వ్యతిరేకించారు. అప్పుడు బ్రిటిష్ అధికారి హొరేస్ హైమ న్ జోక్యం చేసుకొని ప్రేమ్‌చంద్ దగ్గర చదువటానికి ఇష్టపడనివారు ఎవరున్నా కాలేజీని వదిలి వెళ్లిపోవాలని తెలిపారు. దీంతో ప్రేమ్‌చంద్ నియామకాన్ని వ్యతిరేకించిన వారెవరూ కళాశాలను వదిలిపెట్టి వెళ్లలేదు. కాలక్రమంలో సమాజంలో అనేక సామాజిక సంస్కరణలు వచ్చా యి.

అయినా బ్రాహ్మణులు ఎవరూ తమ పాత సంప్రదాయ వాదనల ను విడిచిపెట్టలేదు. మరీ ముఖ్యంగా బెంగాల్ బ్రాహ్మణుల కన్నా బెనారస్ బ్రాహ్మణ వర్గం మరింత మొండిగా, తిరోగమణ వాదంతో ఉండేది. మరోవైపు మారుతున్న కాల పరిస్థితులు, సామాజిక మార్పుల నేపథ్యం లో బ్రాహ్మణులు సంస్కరణోద్యమాలకు నేతృత్వం వహించక తప్పలే దు. ఈ క్రమాన్ని చూస్తే మనకు అర్థమయ్యేదేమంటే.. తరతరాలుగా అన్నివిధాలుగా సమాజంపై ఆధిపత్యం వహిస్తున్న బ్రాహ్మణులు సంస్కరణోద్యమాల్లో కూడా తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. బ్రాహ్మణేతరులు ఎవరైనా ముందుకువచ్చి సామాజిక, సంస్కరణోద్యమాలకు ముందుండి నాయకత్వం వహించినా వారిని అణగదొక్కారు. మరుగున పడేశారు. 19వ శతాబ్దంలో ఆసాంతం.. హిందు, బ్రాహ్మణిజం చేసిందేమంటే, పురాణ, ఇతిహాసాల ఆధారంగానే అనివార్యంగా వస్తున్న సామాజిక మార్పులకు సమర్థనలు చెప్పుకున్నారు. సరిగ్గా ఆ సందర్భంలోనే మహాత్మాగాంధీ కూడా ఇతిహాసాల ఆసరాతోనే జాతీయోద్యమాన్ని ప్రజా ఉద్యమంగా నిర్మించి కొనసాగించటం గమనార్హం. గాంధీ మొట్టమొదటి సారి 1915 మే 8వ తేదీన రామరాజ్యం గురించి మాట్లాడారు. 1920 లో బ్రిటిషర్ల రాక్షస రాజ్యానికి వ్యతిరేకంగా రామరాజ్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తనకుతాను సనాతన వైష్ణవుడినని చెప్పుకున్న గాంధీ భగవద్గీత, సంత్ తులసీ దాస్ సూక్తులను చెబుతూ ప్రజల దగ్గరికి పోయారు. ఏదేమైనప్పటికీ 1929 నాటికి రామరాజ్యమంటే అన్ని మతాలను సమానంగా గౌరవించే లౌకిక రాజ్యమని భాష్యం చెప్పారు. అంతటితో ఆగకుండా.. రామరాజ్యం అంటే అర్థం హిందూ రాజ్యం కానే కాదని చెప్పారు. ఇంకా తన లక్ష్యం రామరాజ్యం గురించి చెబు తూ రామరాజ్యం అంటే అదొక ఆదర్శ రాజ్యం, దేవతల రాజ్యం అని వివరించారు. గాంధీ హిందువుల్లో అత్యధికులకు ఆరాధ్యమైన, అనుసరణీయమైన గీతను తీసుకొని దాని ఆధారంగానే లౌకికవాదాన్ని అభివృ ద్ధి చేసేందుకు తపనపడ్డారు. ఇక జవహర్‌లాల్ నెహ్రూను తీసుకుంటే.., ఆయనను పండిత్‌గా పిలిపించుకోవటానికే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఆయన మతరహిత లౌకికవాదం గురించి ప్రచారం చేశారు. ఇది మొన్నటి అటల్ బిహారి వాజపేయి దాకా కొనసాగింది.
rajesh-kochar
అదే సున్నిత హిందుత్వగా చెలామణి అయ్యిం ది. ఇప్పుడు అది రూపం మార్చుకొని అతివాద హిందుత్వ వాదంగా పరిణమించింది. సమకాలీన హిందుత్వ సూత్రీకరణలు సత్యం, ధర్మం అన్న కనీస జ్ఞానాన్ని కూడా గౌరవించని స్థితికి చేరుకున్నది. పురాణ ఇతిహాసాల పేరుతో గతకాలపు పోకడలకు పెద్దపీట వేసి మౌఢ్యానికి కిరీటం తొడుగుతున్నది. దాన్నే వారు హిందుత్వను పునర్నిర్మించటంగా చెప్పుకొంటున్నారు! పురాణ, ఇతిహాసాలపై కనీస పరిజ్ఞానం లేకుండా సమా జ విచ్ఛిన్నతకు పాల్పడుతున్నారు.
వ్యాసకర్త: ప్రఖ్యాత ది వేదిక్ పీపుల్ గ్రంథ రచయిత
(ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో....)

857
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles