ఏటీఎంలలో డబ్బు కొరత


Mon,February 11, 2019 11:20 PM

ఫస్టు తారీఖు వచ్చిందంటే చాలు రాష్ట్రవ్యా ప్తంగా ఉన్నటువంటి ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదు. ఏటీఎంల నిర్వహణను బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. తమ డబ్బులు తాము తీసుకోవడం కోసం ఇన్ని ఇబ్బందులు పడటమేంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. ఈ నిర్ణయంతోనే దేశవ్యాప్తంగా డబ్బుల కొరత ఏర్పడింది. నల్ల ధనాన్ని అరికడుతామని గొప్పలకు పోయిన మోదీ నల్లధనాన్ని తీసుకురావడంలో ఘోరం గా విఫలమయ్యారు. ఇప్పటికైనా అధికారు లు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలె. ఏటీఎంలల్లో డబ్బులు ఉండేలా చూసుకో వాలి.
- తోట చంద్రశేఖర్, ముత్తారం, పెద్దపల్లి జిల్లా

టీడీపీ నేతల ద్వంద్వ వైఖరి

టీఆర్‌ఎస్ ఎంపీలు విభజన హామీలను అమలుచేయాలని పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఏపీ, తెలంగాణల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు సంయమనంతో వ్యవహరించింది. అప్పుడు టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న కారణంగా కేంద్రంలోని పెద్దలు కూడా సరిగా స్పందించలేదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలనే ఉచిత సలహా లు ఇచ్చేవారు. కానీ నాలుగేండ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రాగానే ఆ పార్టీ నేతలు మిగతా పార్టీలపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. కేంద్రంలోని పెద్దలు తెలంగాణకు ఇచ్చిన నిధుల గురించి అసత్యాలు పలికినప్పుడు లెక్కలతో సహా కేసీఆర్ ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల వైఖరిని బాహాటంగానే ఎండగట్టారు. కానీ చంద్రబాబు అండ్ కో చేస్తున్నట్టు ఇతరులపై ఆరోపణలు చేయలేదు. కేంద్రం అడుగుతున్న లెక్కలకు సరైన సమాధానం చెప్పాలి. అంతేగానీ తాము ఏ పార్టీ వెంట వెళ్తే అందరూ మా వాదనకే మద్దతు ఇవ్వాలనే విధంగా టీడీపీ మాట్లాడటం సరికాదు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ద్వంద్వ వైఖరిని విడనాడి ఏపీ అభివృద్ధి కోసం పాటుపడాలి..
- ఎం. మల్లేష్, జనగామ

398
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles