కవిగాయక యోధుడు


Sat,February 9, 2019 11:13 PM

SADASHIVA
నీళ్లు, నిధులున్నా తెలంగాణలో ఎం దుకు బతుకలేకపోతున్నమో.. మోసం చేసిందెవరో చెబుతూ తన కవిత్వంతో, పాటలతో ప్రజలలో చైతన్య బీజా లు నాటిన మల్లావఝల సదాశివుడు ఉత్త ర తెలంగాణ పారిశ్రామిక ప్రాంతంలో పాటల శివుడిగా ప్రసిద్దుడు. ఆయన తన రాతల నిండా జనసామాన్యం వాడుక భాషలో, చిన్నచిన్న పదాలతో లోతైన భావాలను, భావనలను పలికించిండు. పల్లెగొంతు పెగిలితే ఓ చెల్లెల/ పాటపుట్టె ను వినవే ఓ చెల్లెల నెత్తూటి బొట్లను చెమ ట చుక్కలుజేసి! మట్టినీ తడిపిన తనువు తంబూరాయె తట్టమోసిన కండ, నాటూలేసిన నడుము/ టింగు టింగున కదుల పంబనాదమాయే /ఆటకూ పాటకూ డప్పూలమోతకూ ఓచెల్లె మనపల్లె కన్నతల్లి గాద/ అంటూ పాట పుట్టుకకు మూలమైన పల్లెల కష్టజీవుల చెమట కాల్వలకు పబ్బతివడుతూ, పల్లె బతుకులనూ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను, పాటలుగా కట్టి స్వయంగా పాడి జనంలో ఆవేశాన్ని రగిల్చిన చెకుముకి సదాశివుడు. సదాశివుడు మట్టి సంబంధాలూ మానవ సంబంధాల అవసరాన్నీ వస్తువులుగా తీసుకొని కవిత్వ రంగం లో కూడా తనదైన ముద్రను పదిలపరిచిండు. రోజువారీ జీవితం కోడి కూత తో పనులకు కదిలినట్టే, పారిశ్రామిక ప్రాంత జీవన పోరాటం సైరన్ కూతతో మొదలౌతుందని గ్రహించి, మార్చింగ్ సాంగ్ వంటి ఆ సైరన్‌నే తన కవితా సంకలనానికి శీర్షికగా ఎంచుకొని కవితా సంపుటాన్ని వెలువరించిండు. నైతిక విలువల పట్ల తనకున్న నిబద్ధతను సూటిగా ప్రకటిస్తూ .. రేపటి ధర్మ యుద్ధానికి రూపాన్ని నేను/బాణాన్ని నేను, వ్యూహాన్ని నేను/వంగిపోయిన వెన్నెముకను వజ్రాయు ధం చేసింది నేను/ చలత్ చమూతరంగాల అంతరంగాలనావహించే/ కదన కుతూహలాన్ని నేను అంటూ తన లక్ష్యాన్ని ప్రతిధ్వనిస్తడు. తలాపున గోదావరి పారుతున్నా తెలంగాణ గొంతెండుతున్న తీరును గొంతెత్తి పాడి ఆలోచింపజేసిండు.

ఎండి బీటలువారిన తెలంగాణ బీళ్లను చూసి కన్నీళ్లను సిరాగా మార్చి పాలకులను నిలదీసిన కవి, గాయకుడు సదాశివుడు. బతికినంత కాలం తెలంగాణనే పలవరించి నినదించాడు. పాఠశాలలోనూ పాటల శాలలోనూ తన గురువు స్వర్గీయ చొప్పకట్ల చంద్రమౌళి అని, తనపాటలో తడీ, తండ్లాట, సున్నితత్వం తెలంగాణ మట్టి పెట్టిన భిక్ష అని సవినయంగా చెప్పుకునేవాడాడు సదాశివుడు. సదాశివుడు సెప్టెంబర్ 2న కరీంనగర్ జిల్లా (నేడు పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలంలోని మురుమూర్ గ్రామంలో జన్మించారు. తండ్రి వెంక టకిష్ణయ్య, తల్లి లక్ష్మీనరసమ్మ. సదాశివుడు వృత్తిరీత్యా ప్రభు త్వ ఉపాధ్యాయుడైనా అప్పటి సామాజిక పరిస్థితుల్లో విప్లవ మార్గం పట్టి రైతుకూలీ పోరాటాలు, యువజన సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర వహించిండు. సామాజిక ఉద్యమా ల్లో కొనసాగుకుంటూనే ఉపాధ్యాయ సంఘాల నాయకత్వా న్ని కూడా కొనసాగించిండు. 20 ఏండ్ల పాటు విప్లవ, అభ్యుదయ గీతాలెన్నింటినో రచించి బాణీలు కట్టి గానం చేసిన విరామమెరుగని వాగ్గేయకారుడాయన. సదాశివుడు రచించిన ఏమున్నదక్కో.. ఈ ఊళ్లో మనకింక ఏమున్నదక్కా ఇళ్లు సర్దుకున్న.. ముల్లె సర్దుకున్న ఎల్లి పోతావున్న ఈ ఊళ్లో మనకింక ఏమున్నదక్కా అనే పాట వలస బతుకుల వలపోతకు అద్దంపట్టింది. ఆర్.నారాయణమూర్తి ఎర్రసైన్యం సినిమా కోసం రాసిన ఈ పాట దిక్కులేని పక్షుల్లా వలసపోయే తెలంగాణ రైతుల వెతలను కళ్లకు కట్టింది. ఈ పాట గురించి చెప్పుతూ నేనూ ఊరు విడిచి ముల్లె సదురుకొని బయల్దేరిన్నాడు ఏ మట్టిమీది మమకారం తన గాత్రాన్ని గద్గధం చేసిందో ఆ మమకార మే తన పాటకు అశృలిపిగా అమరిందని ఇవాళ ఆ వేదనే వలసల దుఃఖంగా ప్రవహించిందని అంటడు. దళారులు తమ దోపిడీ విధానాల కింద స్వార్థ రాజకీయాల అండతో అప్పు కింద భూమి ని, ఇండ్లనూ లాక్కుంటే అన్నీ పోగొట్టుకున్న రైతు గుండెకోత పాట నిలువెల్లా కన్నీటి సెగై కమ్ముకున్నదంటడు.

జాబిలమ్మకు జిలుగు పోగుల దుప్పటి కప్పిన చేతులివంటూ చేనేత కార్మికుల జీవనశైలిని గుండెకరిగేలా వర్ణించిండాయ న. వరకట్న రక్కసి కోరలకు బలవుతున్న ఆడబిడ్డలను చూసి కళ్లు చెమర్చిండు. చిన్న వయస్సులోనే తనువు చాలిస్తున్న అబలలను చూసి పారాణి ఆరలేదు చెల్లెలా.. అప్పుడే నూరేండ్లు నిండాయా చెల్లెలా? అని అన్నగా ఆక్రోశించిండు. ఆయన పాటల్లోని పల్లె వాతావరణం పల్లె ఆత్మకు అద్దం పడుతది, పల్లె పాయిరానికి పాదాలు కడుగుతది. బతుకు తత్వాలను బతుకమ్మ జెప్పంగా పల్లె పాడిన పచ్చపచ్చని పాటకు తానే ఆనవా లై ప్రతిధ్వనించిండు. రైతులూ, చేనేత కార్మికులూ, కూలీలూ, కష్టాలు పడుతున్న స్త్రీలూ, బాల కార్మికులూ, పల్లెలూ, రాజ్యం అణిచివేతకు బలైన ఎందరో అమరులు సదాశివుడి పాటల్లో ప్రాణమున్న చరణాలైండ్రు. వరంగల్ జనార్దన్‌కు స్మృతిగీతాన్ని సమర్పిస్తూ మహర్షి నా తెలంగాణా వాల్మీకీ ! వలసవాదం అణిచివేత ఇంకానా ఇకపై సాగవంటూ యుద్ధం ప్రకటించి / నేలకొరిగిన వీరుడా ! పరాజితుల కోసం సాగిన నీ పాట మా దగ్గర స్వరంజీవిగా ఉంది అది గాలై ఏరై హోరై/అంతటా విస్తరిస్తోంది.. మా కోటి రతనాల వీణపై కదన కుతూహలమై మోగుతుంది అంటూ ఆయన దీక్షను తన గొంతుకెత్తుకొని ఉద్యమానికి పునరంకితమైండు. ఉద్యమ పాటలే కాకుండా 90వ దశకంలో కరీంనగర్ జిల్లాలో చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమం అక్షర ఉజ్వల కోసం ఆయన ఎన్నో పాటలు రాసిండు. కంచుకంఠం లాంటి ఆయ న గొంతుతో ఎన్నో వేదికల మీద స్వయంగా పాడిండు. పారిశ్రామిక ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ పల్లెలో ఔత్సాహికులై న యువకులను ప్రోత్సహించి పలు సాహిత్య సాంస్కృతిక సంస్థల స్థాపనలో ముఖ్యపాత్ర పోషించిండు. చేతన సాహితీ సాంస్కృతిక సమాఖ్యను ప్రజాసాంస్కృతికోద్యమ నిర్మాణం లో భాగంగా స్థాపించి, ఎన్నో పాట కోయిలలను తీర్చిదిద్దిన పాటల గురువు ఆయిన. సదాశివుడు రాసిన పాటలు ఎర్ర కుంకుమ పేరుతో ఆడియో క్యాసెట్‌గా, పుస్తకంగా వచ్చాయి. సైరన్ పేరుతో ఆయన కవితలు పుస్తక రూపంలో వచ్చాయి.
shiva-kumar
కవి గాయక యోధుడు సదాశివుడు 2005 నవంబర్ 25న ఆకస్మికంగా తనువు చాలించిండు. 2007 నుంచి ఏటా మల్లావఝల సదాశివుడి స్మారక అవార్డును సాహిత్య సాంస్కృతికరంగాల్లో ప్రసిద్ధులైన వారికి అందజేస్తున్నరు. ఈయేడు ప్రముఖ కవి, కథారచయిత కోడూరి విజయకుమార్‌ను ఎంపికచేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ వికాస సమితి నిర్వహిస్తున్న సదాశివుడి సంస్మరణ సభలో పది వేల రూపాయల నగదుతో కూడిన ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
(మల్లావఝల సదాశివుడి స్మారక అవార్డు ప్రదానం సందర్భంగా..)

1444
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles