బడ్జెట్‌పె చర్చ!


Sat,February 9, 2019 12:14 AM

దేశంలో అందరికంటే ముందు రైతుల సంక్షేమ పథకాలను, వ్యావసాయిక అభివృద్ధి పథకాలను అద్భుత రీతిలో ప్రవేశపెట్టి,జయవంతంగా అమలు జరుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలి పీయూష్‌జీ. ఆయన ఆ మర్యాద పాచలేదు. కాపీ ఎన్నడైనా కాపీయే. ఒరిజినల్ రైతుబంధు పథకంలో ఉన్న పటుత్వం, ప్రయోజకత్వం, పరమార్థం పీయూష్‌జీ కాపీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో లేదన్నది ఆర్థి క నిపుణులందరి ఏకగ్రీవ అభిప్రాయం.అడవిని గాచిన వెన్నెల అంటారు. మోదీజీ ప్రభుత్వపు (2014-2019) ఐదేండ్ల కాలం అమలుగాని వాగ్దానాలతో, నోట్లరద్దు, జీఎస్టీ వంటి అనాలోచిత వ్యర్థ పథకాలతో, వాగాడంబరంతో ఎదురుదెబ్బ కొట్టింది.

చాయ్ పె చర్చ హోగయా, ఈ మధ్యనే పరీక్ష పె చర్చ భీ హోగయా. స్వయంగా ప్రధాన మోదీజీ పరీక్షలపై చర్చను నిర్వహించి పరీక్షలనగానే భయకంపితుల య్యే, నిద్రాహారాలకు దూరమై శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసుకునే కోట్లాది విద్యార్థులకు అం డగా నిలిచి కొండంత ధైర్యం కలిగించారు. పరీక్షలు రాసిరాసి మోదీజీ బాగా అనుభవం సంపాదించినట్లున్నారు అని యాదగిరి కాలర్ సర్దుకుంటూ అన్నాడు. ఆ మధ్య ఎవరో ఒకాయన సమాచార సేకరణ హక్కు చట్టం కింద ప్రధాని మోదీజీ అకడమిక్ డిగ్రీల గురించి వాకబు చేశాడు. అదో పెద్ద రహస్యమని, ఆ విషయం మాత్రం అడుగొద్దని సంబంధిత అధికారుల సమాధానం. ఇస్తారికె సాథ్ దొప్ప అన్నట్లు ఒకరి తర్వాత దేశమంతటా ఎందరో చాయ్ పె చర్చ జరిపారు. చర్చలు, చర్చలే గానీ చేతలు లేవని యాదగిరి నసిగాడు. ఎవరేమన్నా ఇప్పుడు, మొన్నటి కేం ద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై, అందులోని మహిమాన్విత ప్రతిపాదనలపై కూలంకష చర్చ జరుగుతున్నది. తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయెల్ ఫిబ్రవరి 1న మోదీ ప్రభుత్వపు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సంవత్సరం-ఆర్థిక సంవత్సరం మారింది గనుక నాలుగేం డ్ల నుంచి ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ వస్తున్నది. గతంలో ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవాళ్లు.

పది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన ఘనుడు మితవాది, ముక్కుసూటిగా మాట్లాడటంలో మొనగాడు మొరార్జీదేసాయి. డైనాస్టీ ఆధిపత్యం కారణంగా, గుజరాతీ బిడ్డ మొరార్జీకి రావ లసినంత గుర్తింపు రాలేదని, సర్దార్ పటేల్‌కు జరిగిన అన్యాయమే మొరార్జీకి జరిగిందని రేపో మాపో మోదీజీ ధ్వజమెత్తినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మొరార్జీ లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి 29న పుట్టారు. ఏటా ఈ తేదీ రాదని విజ్ఞులందరికీ తెలుసు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక మిగిలి ఉన్నది రెండే ఫిబ్రవరి, మార్చి నెలలు. తర్వాత ఏప్రిల్, మే మాసాలలో 17వ లోక్‌సభ ఎన్నికలున్నాయి గనుక నందో రాజ భవిష్యతి! రెండు నెలలకే గనుక ఇది వోట్ ఆన్ అకౌంటుగా ఉండాలని కొందరు అభిప్రాయపడ్డారు. లోకులు పలు గాకులు! ఇది గ్రేట్ డెమొక్రసీ గనుక ఎన్నో అభిప్రాయాలు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. మీ అభిప్రాయాలతో విభేదిస్తూనే వాటిని గౌరవిస్తాను. అని ఒక డెమొక్రాట్ అన్నాడు. ఆయన లోకల్-ఇండియన్-డెమొక్రాటే, ట్రంప్ మీదికి కత్తులు దూస్తున్న అమెరికన్ డెమొక్రాట్ మాత్రం కాదు. ఇంతకు బడ్జెట్ పై చర్చకు కూర్చోవాలె.

పీయూష్‌జీ ప్రవేశపెట్టింది వోట్ ఆన్ అకౌంటా, తాత్కాలిక బడ్జెటా, సంపూర్ణ బడ్జెటా అన్న మీమాంస, తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎటొచ్చి రెండు మాసాల పిదప ఎన్నికలు జరుగుతా యి గనుక ఈ రెండు మాసాల కోసం సంపూర్ణ బడ్జెట్ ఏమిటి అని ఒక ఆర్థిక విషయ వేత్త ముక్కుమీద వేలేసుకున్నాడు. ఎవరు ముక్కుమీద వేలేసుకుంటారు, ఎవరు గొంతు విప్పుతారని ఆలోచిస్తూ ఊగిసలాటకు పోకుండా పీయూష్‌జీ తాత్కాలిక బడ్జెట్‌తో, రెండు మాసాల ఖర్చులకు సరిపోయే వోట్ ఆన్ అకౌంట్‌తో సరిపుచ్చుకోకుండా పలువర్గాలను ఇట్టే ఆకర్షించగలిగే, ముచ్చటగా మూడు ముఖ్య పథకాలతో సంపూర్ణ బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టారు. ఏండ్లుగా కొనసాగే, ఏదో ఒక ప్రభావం కలిగించే పథకాలివి. మోదీజీ ఆమోదముద్రతో పీయూష్‌జీ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ స్థూల వివరాలను వినగానే పీయూషమ్ము లొలుకు పెదవుల సంగతి చెప్పకు అంటూ ఒక కవిమిత్రుడు రాసిన గేయం జ్ఞాప కం వచ్చింది. మహనీయుల మహితోక్తులు ఏవీలేకుండా కేవలం అంకెల భారంతో మత్తేభం వలె నడిచిన బడ్జెట్ ఇది. కేవలం అంకెల డొంకలతో పీయూష్‌జీ ప్రసంగం కొనసాగింది. అమెరికా దవాఖానలో చికిత్స పొం దుతూ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీజీ రసవత్తరమైన ట్విట్టరింగ్ చేస్తున్నందుకు శ్లాఘించాలె.

తాత్కాలిక కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ జీ సమర్పించిన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం మోదీజీ గంభీర ప్రసంగాల వలె, కరడుగట్టిన హిందీ భాషావాదులకు అమితానందం కలిగించి ఉంటుంది. సందే హం లేదు. తెలంగాణ లక్షలాది పేద రైతులకు, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు తొలకరి ప్రారంభం కాకముందే వ్యవసాయంలో ఎదుర య్యే జటిల సమస్య పెట్టుబడిది. పెట్టుబడి లేక చాలా సందర్భాల్లో వ్యవసాయం మూలపడేది. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే కళ్లంలోనే పం టంతా రైతు ఇంటికి రాకుండా వడ్డీ వ్యాపారి హస్తగతమయ్యేది. కష్టించి పండించిన పంట గద్దల పాలైందని రైతు గుండెపోటుకు గురయ్యేవాడు. ఇంతటి ఘోర సమస్యను, పేద రైతులను నిత్య దారిద్య్రానికి గురి చేస్తు న్న తీవ్ర సమస్యను తెలంగాణలో చిత్తశుద్ధితో, సమర్థవంతంగా, చిటికెలలో పరిష్కరించిన ఘనత కేసీఆర్‌ది. తెలంగాణ రైతులకు సకాలంలో రెండు పంటలకు అవసరమైన పెట్టుబడి సహాయాన్ని భారీగా అందించే అపూర్వ పథకం రైతుబంధు. ఇప్పుడు ఈ రైతుబంధు పథకం ప్రపంచమంతటా ప్రసిద్ధి పొందింది. ఉద్యమకాలం నుంచి అంకురించిన ఉజ్వ ల ఆలోచనలతో, తెలంగాణ రాష్ట్రం అవతరించిన మరుక్షణం నుంచే కేసీ ఆర్ ప్రభుత్వం అరుదైన అంకితభావంతో, నిబద్ధతతో అమలుజరుపుతున్న రైతు సంక్షేమ, వ్యావసాయిక అభివృద్ధి పథకాలు లక్షలాది పేద రైతుల కుటుంబాలకు పెన్నిధులై అమిత ప్రభావం కలిగించాయని మొన్నటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రపంచానికి స్పష్టంగా వెల్లడైంది.

Prabhkar
ఈ టర్మ్‌లో మోదీజీ ప్రభుత్వం తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్‌జీ ద్వారా ప్రవేశపెట్టిన బడ్జెట్ పార్లమెంట్ ముందుకు, దేశ ప్రజల ముందు కువచ్చిన ఈ చివరి బడ్జెట్ ఆపద్ధర్మ బడ్జెట్ అని, ఆపదమొక్కుల బడ్జెట్ అని, వోటుకు నోటు అన్న ధోరణి ఈ బడ్జెట్‌లో ప్రత్యక్షరంలో ప్రస్ఫుటమవుతున్నదని విమర్శలు చెలరేగుతున్నాయి. గత ఐదేండ్ల నుంచి మోదీజీ ప్రభుత్వానికి రైతులు, రైతు సంక్షేమం, వ్యావసాయిక విషయా లు జ్ఞాపకం రాకపోవడం విచిత్రం. మర్‌తా క్యా నై కర్తా అని యాదగి రి అన్నాడు. మోదీజీ, జైట్లీ జీ, పీయూష్ జీ, వారి ఇతర సహచరులు, విశేషించి షహన్‌షా జీ గంపెడాశలు పెట్టుకున్నట్లు ఫిబ్రవరి 1 తాత్కాలి క బడ్జెట్ గట్టెక్కించగలుగుతుందా అన్నది తేలడానికి మూడు నెలలు ఆగాలె. నఖల్ నవేసీకు అఖల్ నహీ అంటారు. కాపీ కొట్టేవాడికి బుద్ధి పనిచేయదు. పీయూష్‌జీ బడ్జెట్‌లో రైతు బంధు పథకానికి కాపీ ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దేశంలో అందరికంటే ముందు రైతుల సంక్షేమ పథకాలను, వ్యావసాయిక అభివృద్ధి పథకాలను అద్భుత రీతి లో ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు జరుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలి పీయూష్‌జీ. ఆయ న ఆ మర్యాద పాటించలేదు. కాపీ ఎన్నడైనా కాపీయే. ఒరిజినల్ రైతుబంధు పథకంలో ఉన్న పటుత్వం, ప్రయోజకత్వం, పరమార్థం పీయూష్‌జీ కాపీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో లేదన్నది ఆర్థి క నిపుణులందరి ఏకగ్రీవ అభిప్రాయం.

అడవిని గాచిన వెన్నెల అంటా రు. మోదీజీ ప్రభుత్వపు (2014-2019) ఐదేండ్ల కాలం అమలుగాని వాగ్దానాలతో, నోట్లరద్దు, జీఎస్టీ వంటి అనాలోచిత వ్యర్థ పథకాలతో, వాగాడంబరంతో ఎదురుదెబ్బ కొట్టింది. చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు పీయూష్ జీ బడ్జెట్ వచ్చింది. ఇది బడ్జెట్ సర్జికల్ ైస్ట్రెక్ అవుతుందో కాదో ఇప్పుడే చెప్పలేం. ఒక ప్రసిద్ధ ఆంగ్ల దిన పత్రిక (అత్యంత సంయమనానికి మారుపేరు ఈ పత్రిక) పీయూష్ జీ తాత్కాలిక బడ్జెట్ ను షాపింగ్ ఫర్ వోట్స్ బడ్జెట్‌గా వర్ణించింది. సులభంగా, ఇబ్బంది లేకుండా, పేపర్ వర్క్ ఏదీ అవసరం లేకుండా అడుగగానే వలసినంత అప్పు అంటూ ఓ రోజు ఓ దినపత్రికలో పెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్ వచ్చిం ది. అది చూసి యాదగిరి సంతోషపడ్డాడు గిర్వీ, తాకట్లు, ఇక్కట్లు లేకుండానే అవసరమైన డబ్బు చేతికి వస్తుందని. కింద, అడ్వర్‌టైజ్‌మెంట్ అట్టడుగున ఉన్న అతిచిన్న ఫాంట్‌లో ఉన్న గమనికను యాదగిరి చూడలేదు. ఆ గమనిక అన్ని షరతులు వర్తిస్తాయి అతి ముద్దుగా కనిపించిం ది. యాదగిరి ఉత్సాహమంతా వెంటనే ఆవిరైంది. పీయూష్ జీ తాత్కాలిక బడ్జెట్‌లో మధ్యతరగతి ఆదాయపు పన్ను చెల్లింపుదారుల మీద, రెం డెకరాలకు మించని భూమి ఉన్న రైతుల మీద, అసంఘటిత వర్గపు కూలీ జనం మీద (ప్రధానమంత్రి శ్రమ్ యోగి మంథన్) దృష్టి అంతా కేంద్రీకృతమైంది. 18 ఏండ్ల యువప్రాయం నుంచి నెలకు రూ.55/- చొప్పున (29 ఏండ్ల వయసు నుంచి నెలకు రూ.100 చొప్పున) ప్రభుత్వానికి 42 ఏండ్లు చెల్లిస్తే 60 ఏండ్ల వయస్సు నుంచి శ్రమ్ యోగి మం థన్ పథకం కింద నెలకు మూడు వేలు (అప్పటికి అతనికి లేక ఆమెకు నెల ఆదాయం రూ.15 వేలకు మించకపోతే!) లభిస్తాయి. తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్‌జీ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లోని ఈ మూడు సంక్షేమ పథకాలు అప్పు అడ్వర్‌టైజ్‌మెంట్‌లోని షరతులు వర్తిస్తాయి వాక్యం వలె నేతి బీరకాయలనడంలో అనుమానం లేదు. బడ్జెట్ కాగితాలను చాలా సీరియస్‌గా స్టడీ చేస్తున్న తన సహాయ సంపాదకుడితో ఒక సుప్రసిద్ధ సంపాదకుడు మరింత సీరియస్‌గా అన్న మాటలివి.. పిచ్చోడివా! బడ్జెట్ బాగుందని, బాగా లేదని ఎవరన్నారో చూడు. పారిశ్రామిక, వాణిజ్య అధిపతులు బాగుందంటే ఇది పేదల బడ్జెట్ కాదను కో!... మోదీజీకి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ ప్రభుత్వపు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఎందుకు ప్రకటించడం లేదు?

957
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles