వెలుగులు నింపిన ప్రభాకరుడు


Sat,February 9, 2019 12:12 AM

తెలంగాణ రాష్ర్టాన్ని 24 గంటలూ విద్యుత్ వెలుగులతో నింపవలసిన బాధ్యతను సీఎం కేసీఆర్ ప్రభాకరరావుకు అప్పగించారు. సీఎం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించి, ఆయన తన పదవికే వన్నె తెచ్చారు. ఇలాంటివన్నీ చూస్తే అనిపించింది చరిత్ర తనకు అవసరమైన వ్యక్తులను తానే ఎన్నుకుంటుందని!

వ్యక్తులు చరిత్ర సృష్టిస్తారా.. చరిత్ర వ్యక్తులను సృష్టిస్తుందా అని ప్రశ్న వేసుకుంటే.. సందర్భాన్ని బట్టి రెండింటికీ అవును అనే సమాధానమే వస్తుంది.పధ్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ సబ్బం డవర్ణాలనూ, సకల జనులనూ ఒక తాటిమీదికి తెచ్చి, అరువై ఏండ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేశారు కేసీఆర్. దీన్ని మరో కోణంలో చూస్తే.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో అరిగోసలు పడుతున్న తెలంగాణ, తనకు విముక్తి కలిగించే ఉద్యమ నాయకుడిని కేసీఆర్ రూపంలో కనుగొన్నది.

ఉద్యమకాలంలో సులభంగా పరిష్కరించలేని జఠిల రంగంగా పేరు గాంచిన తెలంగాణ విద్యుత్‌రంగ అభివృద్ధి గురించి చర్చ జరిగినప్పుడు, దాదాపు అందరినోటా వినిపించిన పేరు, సీఎం కేసీఆర్ బలంగా నమ్మిన పేరు దేవులపల్లి ప్రభాకరరావు. రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం 2014 జూన్ 5న టీఎస్‌జెన్‌కోకు ప్రభాకరరావును చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తర్వాత అతితక్కువ కాలంలోనే ఆయనకు ట్రాన్స్‌కో అదనపు బాధ్యతలు కూడా అప్పజెప్పుతూ మరింత బాధ్యతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టగా నే చేసిన తొలి ప్రసంగం ఇది. విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించారు. అదే ఉద్యమస్ఫూర్తిని తెలంగాణ విద్యు త్‌రంగాన్ని అభివృద్ధి చేసుకోవడంలోనూ కొనసాగించాలి. ఆయన ప్రసం గం విద్యుత్ ఉద్యోగులను ఉత్తేజితులను చేసింది.
cmd_profile
1969, ఫిబ్రవరిలో ఉమ్మడి రాష్ట్ర ఏపీఎస్‌ఈబీలో సాధారణ అకౌంట్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం ప్రారంభించిన ప్రభాకరరావు, అప్పటి నుంచి వివిధ హోదాల్లో నిరంతరాయంగా సేవలందిస్తూనే ఉన్నారు. 2019, ఫిబ్రవరి 10తో ఆయన విద్యుత్‌రంగంలోకి ప్రవేశించి యాభై ఏండ్లు గడువనున్నా యి. ఆయన విద్యుత్‌రంగ సేవల స్వర్ణోత్సవ సంవత్సరం ఇది. ఈ యాభై ఏండ్ల సుదీర్ఘ విద్యుత్‌రంగ ప్రస్థానంలో ఆయన ఓ కర్మయోగిలా తనకు నిర్దేశించిన ఉద్యోగ ధర్మాన్ని నిబద్ధతతో, ఆత్మగౌరవంతో, క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని 24 గంట లూ విద్యుత్ వెలుగులతో నింపవలసిన బాధ్యతను సీఎం కేసీఆర్ ప్రభా కరరావుకు అప్పగించారు. సీఎం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించి, ఆయన తన పదవికే వన్నె తెచ్చారు. ఇలాంటివన్నీ చూస్తే అనిపించింది చరిత్ర తనకు అవసరమైన వ్యక్తులను తానే ఎన్నుకుంటుందని!
Shivaji
జ్ఞానం, సమర్థత, అనుభవం, దార్శనికత, అందరినీ కలుపుగోలుతనం దేవులపల్లి ప్రభాకరరావు సొంతం. యాభై ఏండ్ల ఉద్యోగ జీవితంలో ఆయనను వరించిన పదవులు, అధికారిగా ఆయన సాధించిన విజయాలనేకం! ఎఫ్‌ఏ అండ్ సీసీఏగా సర్వీసులో ఉండగానే 1998లో అప్పటి ప్రభుత్వం ఆయనను ఏపీఎస్‌ఈబీ బోర్డు ఫైనాన్స్ మెంబర్‌గా నియమించింది. అక్క డినుంచి, ఫైనాన్స్ డైరెక్టర్‌గా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన తన సేవలు అందిస్తూనే ఉన్నారు.
1999లో విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా అమెరికా వెళ్లిన భార త అధికారుల బృందంలో సభ్యునిగా ఉన్నారు. విద్యుత్‌రంగంలో అనుసరించవలసిన పద్ధతుల గురించి ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో భాగస్వామిగా పాల్గొన్నారు. జపాన్-జేబీఐసీ ఫండింగ్‌లో భాగంగా భారీ జల విద్యుత్ కేంద్రం ఒప్పందం ఖరారు చేయడంలో ఆయన సేవలు అజరామరం. రాష్ట్ర విద్యుత్ సంస్థల అభివృద్ధి కోసం తక్కువ వడ్డీ రేట్లకు పెట్టుబడులు సాధించడంలో విశేష కృషి చేశారు. ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణంలో పెట్టుబడి వ్యయాలను గణనీయంగా తగ్గించి సంస్థలకు వందలాది కోట్ల రూపాయలను ఆదా చేశారు!

ప్రభాకరరావు సాధించిన విజయాలను తెలంగాణ ఏర్పడక ముందు- ఏర్పడిన తర్వాత అని కూడా చూడాలి. ఎందుకంటే.. ఆయన కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌రంగ పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్రం ఏర్పడితే అంధకారమవుతుందన్న హెచ్చరికలు ఒకవైపు. రాష్ట్రం ఏర్పడుతూనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చెల్లవు, తెలంగాణకు విద్యుత్ అందించవలసిన అవసరం ఆంధ్రా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు లేదన్న కుట్రలు మరోవైపు. వీటికితోడు, అరువై ఏండ్లుగా లోకల్ రిజర్వేషన్స్ అమలుకాకపోవడం వల్ల టీ విద్యుత్ సంస్థల్లోని మేనేజ్‌మెంట్ స్థాయి పోస్టుల్లో తిష్టవేసి ఉన్న ఆంధ్ర ఇంజినీర్లను వెనక్కి తీసుకోకుండా ఇబ్బందులు పెడుతున్న ఆంధ్ర విద్యుత్‌సంస్థల తీరు!

ఇన్ని అడ్డంకుల నడుమ, సీఎం కేసీఆర్ ప్రభాకరరావు తెలంగాణ విద్యుత్‌రంగానికి అనితర సాధ్యమైన అనేక విజయాల ను సాధించిపెట్టారు. ప్రపంచ మే ఆశ్చర్యపోయేలా చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్రసార పంపిణీ వ్యవస్థలను రెట్టింపుచేయడం, మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుపడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను త్వరితగతిన నిర్మించడం, గ్రామాలకు 24 గంటల నిరంతర విద్యుత్, పరిశ్రమలకు కోతల్లేని కరెంటు సరఫరా, వ్యవసాయ బావులకు 24 గంటల కరెంటు సరఫరా, తలసరి విద్యుత్ వాడకంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్ట డం, తెలంగాణ వరదాయినిలు కాళేశ్వరం వంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమైన కరెంటును అందుబాటులో ఉంచే ప్రణాళికలు రచించడం లాంటివి ఎన్నో చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం విద్యుత్‌రంగం సాధించిన విజయాల పరంపర అంతా ఒక ప్రత్యేక చరిత్ర. చాలామంది ఆయనను దేవులపల్లి ప్రభాకరరావు అని పిలువడం మర్చిపోయి కరెంట్ ప్రభాకరరావు అని పిలుస్తున్నారంటేనే అర్థమవుతున్నది విద్యుత్‌రంగంలో ఆయన ఎంతగా మమేకమైపోయారో. అందుకే ఈ యాభై ఏండ్లే కాదు, మరో యాభై ఏండ్లు కూడా తెలంగాణ విద్యుత్ రం గానికి సేవలు అందించే ఆయురారోగ్యాలు ఆయనకు అందివ్వాలని ఆయనను అభిమానించే తెలంగాణ విద్యుత్ ఉద్యోగులందరి పక్షాన నా ఆకాంక్ష!
-(టీఎస్‌జెన్‌కో, టీఎస్ ట్రాన్స్‌కో సంస్థల చైర్మన్, ఎండీ
దేవులపల్లి ప్రభాకరరావు విద్యుత్‌రంగ సర్వీసులోకి ప్రవేశించి రేపటితో యాభై ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా..)వ్యాసకర్త: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు

1003
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles