పరివర్తనా సారథులు


Sat,February 9, 2019 12:05 AM

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు పరివర్తనా సారథులు కావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలను సర్పంచ్‌లు, ప్రజలు అందరూ అర్థం చేసుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలె. ఎన్నికల్లో ఎంతోమంది అభ్యర్థులు పోటీచేశారు. కానీ ఇప్పుడు ఆ విభేదాలను మరిచిపోయి అందరూ కలిసి గ్రామాభివృద్ధికి పాటుపడాలె. కొత్తగా ఏర్పడిన అధికారాలు, విధులు, బాధ్యతలను గమనిస్తే, సర్పంచ్ ఒంటరిగా ఏమీ సాధించలేడని తెలుస్తుంది. అం దువల్ల సర్పంచ్ మిగతా వర్గాలన్నిటినీ కలుపుకొని నడువాలె. ఎన్నికలప్పుడు ఏ విధంగానైతే ప్రజల దగ్గరికి రోజూ తిరిగారో, అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజలతో సంబంధాలు పెట్టుకొని వారి సహకా రం తీసుకొని కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలె. గ్రామంలో ఉన్న, గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేస్తున్న విద్యావంతుల, వ్యాపారుల సహకారం తీసుకోవాలె. విద్యావంతులు కూడా తాము సహకరిస్తామని సర్పంచ్‌కు హామీ ఇచ్చి ముందుకు నడిపించాలె. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రజల చైతన్యం. ఒక ఇంటిలోని వ్యక్తులంతా ఎట్లయితే తమ ఆదాయం ప్రకా రం నడుచుకొని, ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారో, అదేవిధంగా గ్రామాన్ని ఒక కుటుంబంగా భావించి చక్కదిద్దుకోవాలె. ప్రజలు తమ బాధ్యతగా పన్నులు చెల్లించా లె. గ్రామసభను గొడవల కోసం కాకుండా, నిర్మాణాత్మకం గా ఉపయోగించుకోవాలె. గొడవపడితే అందరికీ నష్టం.

కలిసి పనిచేస్తే అందరం అభివృద్ధి చెందుతాం. చెట్లు పెంచ డం మొదలుకొని, సంపూర్ణ అక్షరాస్యతవరకు అన్నిరంగా ల్లో ప్రజలు భాగస్వాములు కావాలె. గ్రామంలోని యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోకుండా, విద్యావంతుల సహాయంతో జీవితంలో స్థిరపడాలె. ముఖ్యమంత్రి కేసీఆ ర్ గ్రామాలకు నలభై వేల కోట్ల రూపాయల నిధులు ఉం టాయని చెప్పారు. ఆ నిధితోపాటు మరిన్ని నిధులను గ్రామాలు సమకూర్చుకొని పురోభివృద్ధి చెందాలె. ప్రజలం తా చైతన్యవంతులై అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశం. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలె. ఆ దిశగా ముందుకు పోవాలె.
- పి. విద్యాసాగర్, విశ్రాంత ఉపాధ్యాయుడు రేకొండ, చిగురుమామిడి మండలం, కరీంనగర్ జిల్లా

445
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles