ట్రంప్ గారి రెండేండ్లు


Sat,January 12, 2019 12:29 AM

డొనాల్డ్ ట్రంప్ రెండేండ్ల కిందట అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఇంతవరకు అమెరికా జాతీయంగా, అంతర్జాతీయంగా అనుసరించిన ప్రభుత్వ విధానాలన్నింటినీ నకారాత్మక ధోరణితో వ్యతిరేకించారు, విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఎన్ని మాటలు మాట్లాడినా, జాతి వివక్షతో, దురభిమానంతో అమెరికా అమెరికన్లదే అంటూ ట్రంప్ ఇచ్చిన నినాదమే ఎక్కువగా క్లిక్ అయింది. జాతీయంగా, అంతర్జాతీయంగా ట్రంప్ అనుసరించే విధానాలేమిటో రెండేండ్లయినా స్పష్టం కావడం లేదు. ఇంతవరకు మోదీజీ అమెరికాలోని భారతీయుల భవిష్యత్తు గురించి ట్రంప్‌తో మాట్లాడకపోవడం ఈ స్వతంత్ర దేశం పరాధీనతకు ప్రబల నిదర్శనం. బంపుల మార్గంలో రెండేండ్ల పాలన పూర్తిచేస్తున్న ట్రంప్‌ను అభినందించాలో, అభిశంసించాలో ప్రపంచానికి అర్థం కావడం లేదు.
Prabhakar-Rao
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి ఓ వారం రోజులైతే రెండేండ్లవుతుంది. 2016 నవంబర్‌లో రిపబ్లికన్ పార్టీ (గ్రాండ్ ఓల్డ్ పార్టీ) అభ్యర్థిగా, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించి ఎలక్టోర ల్ కాలేజ్ ఓట్లతో (పాపులర్ ఓట్లలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ) గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ 2017 జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకా రం చేశారు. ట్రంప్ జాతీయంగా, అంతర్జాతీయంగా బంప్‌ల దారిలో నడుస్తూ అమెరికా అధ్యక్ష పదవిలో, వైట్‌హౌజ్‌లో రెండేండ్లు పూర్తిచేయ డం నిజంగా చోద్యమే, ఘన కార్యమే. తమ పార్టీ ప్రైమరీల్లో (ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ నుంచి రిపబ్లికన్ పార్టీలో దుమికిన వాడే) 16 మంది అభ్యర్థులను ఓడించి అధ్యక్ష పదవికి అభ్యర్థిగా టిక్కెట్ సంపాదించగలిగినప్పటికీ, మొత్తం ఓటర్లలో అధిక సంఖ్యాకులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఒపినియన్ పోల్స్ అన్నింటిలో ట్రంప్ ఓడిపోతాడన్న జోస్యం వినిపించినప్పటికీ, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ పత్రికలు ఆయనకు వ్యతరేకంగా సంపాదకీయాలను, రసవత్తర వార్తా కథనాలను ప్రచురించినప్పటికీ ఆయన గెలిచి నిలిచారు.


ఆయన మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్‌ను (అధ్యక్ష పదవి నుంచి అప్పుడే రిటైరవుతున్న ఒబామా తమ డెమొక్రటిక్ పార్టీ పక్షాన అనర్గళ ప్రసంగాలతో మేడమ్ హిల్లరీ గెలుపు కోసం ఉధృత ప్రచారం జరిపి న ప్పటికీ ప్రయోజనం కనిపించలేదు.!) పరాజయం పాలుచేసి ప్రపంచానికి, ముఖ్యంగా రాజకీయ పరిశీలకులకు దిగ్భ్రాంతి కలిగించారు. అధ్యక్ష పదవికి రెండేండ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ప్రచారం వివాదాలు, కీచులాటలు, కుమ్ములాటలు, అసభ్య-అశ్లీల ఆరోపణలతో మొదలైంది. ట్రంప్, ఆయన అనుచరులు, ప్రచార సహాయకులు హద్దు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారన్న విమర్శలు చెలరేగాయి. ట్రంప్‌కు అనుకూలంగా, హిల్లరీ క్లింటన్‌కు ప్రతికూలంగా రష్యా అధినేత ఫుతిన్, ఆయన ప్రభుత్వం వాళ్లు సైబర్ జోక్యం చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు వచ్చా యి. ఈ ఫిర్యాదుల మీద ఇప్పటికీ అమెరికా అటార్నీలు శోధన, విచార ణ జరుపుతుండటం విశేషం. చివరి క్షణాల్లో యు.ఎస్. ఫెడరల్ బ్యూరో అఫ్ ఇన్‌వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వెల్లడించిన కథనం హిల్లరీ క్లింటన్‌కు బాగా నష్టం కలిగించిందని విశ్లేషకులు భావించారు. ఎన్నికల ప్రచారం ముమ్మరమవుతున్న దశలో కొందరు మహిళలు-సుందరాంగులు- ట్రంప్ తమతో అసభ్యంగా ప్రవర్తించారని రొమాంటిక్ కథనాలను కొన్ని ఛానళ్లలో, పత్రికల్లో ప్రచారంలోకి తెచ్చారు. ఏమైనప్పటికీ, ట్రంప్ అసహనం, జాతి వివక్ష, దురుసుతనం, పరుష భాషణం, అజ్ఞానం, అవలక్షణాలు ఆయన ఎన్నికల విజయానికి దోహదపడ్డాయి.

అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే నాటికి ట్రంప్ వయస్సు డ్బ్భై ఒక్కటి. అప్పటికే ఆయన రియలెస్టేట్, వర్తకరంగంలో బడా శ్రీమంతుడు. ఇంత వయసున్నవా రు, ఇంతటి శ్రీమంతులు ఇంతవరకు అమెరికా అధ్యక్షుడు కాలేదని గతంలోని అధ్యక్షుల వివరాలను పరికిస్తే స్పష్టమవుతున్నది. మరికొన్ని విషయాల్లో కూడా ట్రంప్ మొదటివాడిగా కనిపిస్తున్నాడు. సాధారణం గా అమెరికాలో అధ్యక్షుని ఎన్నిక తర్వాత రాజకీయ వాతావరణం ప్రశాంతమవుతుంది. కానీ, ట్రంప్ ఎన్నిక మరింత వివాదాస్పదమై ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. అసాధారణ రీతిలో అమెరికా అం తటా ఆయన ఎన్నికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ముఖ్యంగా మహిళలు ముఖ్య నగరాల్లో వేల సంఖ్యలో ముందుకొచ్చి నువు మా అధ్యక్షుడివి కావు అన్న నినాదం గల ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవం కూడా రభసగా మారింది. ఒబామా రెండు ప్రమాణోత్సవాలకు అమెరికన్లు లక్షల సంఖ్యలో వచ్చారని, ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారని, ఉత్సవం పేలవంగా జరిగిందని పత్రికలు రాయడం, మీడియాలో ప్రచారం జరుగడం ట్రంప్ మండిపాటుకు కారణమైనాయి. ఇప్పటికీ మీడియా వాళ్లంటే అధ్యక్షుడు ట్రంప్‌కు ఒళ్లుమంట. ఈ మధ్య వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతున్న ఒక పత్రికా గోష్టిలో ఒక పాత్రికేయుడు ఇమ్మిగ్రేషన్ గురించి ప్రశ్నించడంతో ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అధికారులు మైక్ లాక్కొని ఆ సదరు పాత్రికేయుడిని బయటికి గెంటివేశారు.

ఇండియాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో రియల్ ఎస్టేట్ వర్త కం లాభసాటిగా నడుపుతున్న ట్రంప్‌కు అమెరికా, అంతర్జాతీయ రాజకీయాలతో సంబంధం తక్కువ. రాజకీయ పరిజ్ఞానం, పరిపాలనానుభ వం, ఆర్థికశాస్త్ర పరిజ్ఞానం, న్యాయశాస్త్రం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ట్రంప్‌కు శూన్యమనేది పచ్చినిజం. ఆయనకు తెలియదు, తెలిసిన వాళ్లు చెబితే ఆయన వినడు. ఇది ఆ మహానుభావుడి ప్రత్యేకత. చట్టం లేదు, గిట్టం లేదు. నేను చెప్పినట్టు చేయండి.. అని ట్రంప్ ఆదేశిస్తాడని గత రెండేండ్లలో, వైట్‌హౌజ్‌లో, ఆయన వద్ద ఉన్నత పదవుల్లో (విదేశాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, సలహాదారులుగా) కష్టపడి పనిచేసి, ఇక పనిచేయలేక రాజీనామా చేసి బయటికివచ్చిన మేధావులు, నిష్ణాతులు, పాలనాదక్షులు కొందరు వెల్లడించారు. ట్రంప్ ఎప్పు డేం మాట్లాడుతాడో, ఎప్పుడేం చేస్తాడో తెలియదని వాళ్లన్నారు. గత రెండేండ్ల ట్రంప్ పాలనలో ఆయనతో మొదట సన్నిహితంగా ఉండి, తర్వాత ఆయన ధోరణి నచ్చక బయటికివచ్చిన వారు అనేకులు. రెం డేండ్లు అయినప్పటికీ, ఈ మధ్యనే నవంబర్‌లో మధ్యంతర ఎన్నికల దెబ్బ తగిలినప్పటికీ (కాంగ్రెస్‌లో, ప్రతినిధుల సభలో, ప్రతిపక్షం డెమొక్రటిక్ పార్టీ నవంబర్ ఎన్నికల్లో మెజార్టీ సాధించింది) ట్రంప్ ప్రభుత్వం ఇంకా స్థిరంగా ఏర్పడలేదు, ఉన్నత పదవుల, మంత్రుల (అక్కడ కార్యదర్శులు) నియామకాలు పూర్తికాలేదు. నిన్నమొన్నటి వరకు తన వద్ద మంత్రులుగా, ఉన్నతాధికారులుగా ఉండి అభిప్రాయభేదాల కారణం గా రాజీనామా చేసి వెళ్తున్నవారిని పరుష పదజాలంతో, తిట్లతో అవమానించడం ట్రంప్ అలవాటు.

రాజీనామా చేసినవారు ఈ అవమానాలను సహించలేక ట్రంప్ బలహీనతలను, వ్యక్తిగత లోపాలను, ఆయ న దుర్గుణాలను బయట కక్కుతున్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.) మతోన్మాద టెర్రిజం అంతమైందని లెక్కలు వేసి అక్కడి నుం చి అమెరికన్ సేనల ఉపసంహరణకు అధ్యక్షుడు ట్రంప్ చేసిన హడావు డి నిర్ణయం పెద్ద తప్పిదమని భావించి, తనతో సంప్రదించకుండానే ట్రంప్ ఈ నిర్ణయం చేశారని బాధపడి రక్షణమంత్రి పదవికి జేమ్స్ మ్యాటిస్ రాజీనామా చేశారు. వైట్‌హౌజ్‌లో ఇప్పుడు హుందాతనం లేద ని, తన ప్రైవేట్ ఛాంబర్స్‌లో ఆ గది నుంచి ఈ గదికి అధ్యక్షుడు ట్రంప్ ఒంటరిగా పచార్లు చేస్తుంటాడని మాజీ రక్షణమంత్రి మ్యాటిస్ అన్నాడు. ఇప్పుడు వైట్‌హౌజ్‌లో తాను ఒంటరినని ట్రంప్ స్వయంగా ఈ మధ్య అన్నాడు. అది స్వయంకృతాపరాధ విషమ పరిణామం. మ్యాటిస్‌ను అమెరికన్ మీడియా మెచ్చుకోవడం ట్రంప్‌కు ఇష్టం కాకపోయేది. మ్యాటిస్ కంటే తెలివితేటలు తనకే ఎక్కువని ట్రంప్ అన్నాడు. అది ఆయన విపరీత ఆత్మస్తుతి స్వభావానికి ఒక మచ్చుతునక. ట్రంప్ విచి త్ర ధోరణిని తట్టుకోలేక, అభిప్రాయ భేదాలతో రెక్స్‌టిల్లర్‌సన్ విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. పదవిలో తన పక్కన ఉన్నంతకా లం టిల్లర్‌సన్‌ను ఆకాశానికి ఎత్తిపొగిడిన ట్రంప్ ఆయన రాజీనామా చేయగానే పనికిరాని వాడని హేళన చేశాడు. చట్టాలకు వ్యతిరేకమైన పనులు చేయాలని ట్రంప్ తన మీద ఒత్తిడి తెచ్చాడని టిల్లర్‌సన్ అన్నా డు. ట్రంప్ క్రూరుడని, మూర్ఖుడని, వెన్నుపోట్లు పొడిచే విశ్వాస ఘాతకుడని టిల్లర్‌సన్ విమర్శల వర్షం కురిపించాడు. పుస్తకాలు, అధికార పత్రాలు చదివే అలవాటు ట్రంప్‌కు లేదన్నాడు.

డొనాల్డ్ ట్రంప్ రెండేండ్ల కిందట అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఇంతవరకు అమెరికా జాతీయంగా, అంతర్జాతీయంగా అనుసరించిన ప్రభుత్వ విధానాలన్నింటినీ నకారాత్మక ధోరణితో వ్యతిరేకించారు, విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఎన్ని మాటలు మాట్లాడినా, జాతి వివక్షతో, దురభిమానంతో అమెరికా అమెరికన్లదే అంటూ ట్రంప్ ఇచ్చిన నినాదమే ఎక్కువగా క్లిక్ అయింది. జాతీయంగా, అంతర్జాతీయంగా ట్రంప్ అనుసరించే విధానాలేమిటో రెండేండ్లయినా స్పష్టం కావడం లేదు. ఎన్నికల సమయంలో నాటో అమెరికా సైనిక కూటమిని ట్రంప్ నాటో పనికిరాని దండుగ కూటమి అన్నాడు. రష్యాకు వ్యతిరేకంగా నాటో ఇంకా కొనసాగుతున్నది. రెండేండ్ల ట్రంప్ పాలనపై ఆయన మాజీ సన్నిహితులు, ఆయనతో కలిసి పనిచేసిన వారు, ఆయనకు దూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ట్రంప్ రెండేండ్ల పాలన లో మరో మాజీ సన్నిహితుడు సెనేటర్ బాబ్ కార్కర్. ఆయన (కార్కర్) రెండు పర్యాయాలు టెన్నెసి నుంచి సెనేట్‌కు ఎన్నికయ్యాడు. ట్రంప్ రెండేండ్ల పాలనలో వైట్‌హౌజ్ అడల్ట్ కేర్ సెంటర్ అయిందని కార్కర్ విమర్శించాడు. అంతే కాదు, ట్రంప్ మూడవ ప్రపంచ యుద్ధం తెచ్చే భయంకర ప్రమాదం పొంచి ఉందని కార్కర్ హెచ్చరించాడు. ఇటువంటి ప్రమాదం ఉంది గనుకనే అధ్యక్షుడు ట్రంప్‌ను ఇంపీస్ చేసే ఆలోచనకు అమెరికన్ కాంగ్రెస్‌లో అప్పుడే అంకురార్పణ జరిగింది. ట్రంప్ పాలనలో అక్కడి భారతీయులు, విశేషించి ఈ మధ్యనే ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లినవారు, వెళ్లాలనుకుంటున్నవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంతవరకు మోదీజీ అమెరికాలోని భారతీయుల భవిష్యత్తు గురించి ట్రంప్‌తో మాట్లాడకపోవడం ఈ స్వతంత్ర దేశం పరాధీనతకు ప్రబల నిదర్శనం. బంపుల మార్గంలో రెండేండ్ల పాలన పూర్తిచేస్తున్న ట్రంప్‌ను అభినందించాలో, అభిశంసించా లో ప్రపంచానికి అర్థం కావడం లేదు.

727
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles