ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ ఎత్తుగడ


Fri,January 11, 2019 12:52 PM

Kanakadurga

ఎన్నికలు ఎదురుగా రావడంతో హడావుడిగా అగ్రవర్ణాల ను ఆకట్టుకోవటానికి 10 శాతం రిజర్వేషన్లు మోదీ ప్రకటించటం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు, అగ్రవర్ణాలకు తప్ప. ఈ మధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 5 రాష్ర్టాల్లో బీజీపీకి వచ్చిన ఫలితాలు ఈ అకస్మాత్ చర్యకు కారణం అని అందరికీ తెలుసు. అసలు ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక ఏం చేయాలి? ప్రజావసరాలను గమనించి, వారి అవసరాలను తీర్చేటట్టు పథకాలు రచించి, వాటిని ఎలా అమలు పరుస్తారో కూడా ఆలోచించి ఆచరణ సాధ్యంగా వాటిని మలిచి మ్యానిఫెస్టో తయారుచేసి ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుంచాలి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ ఉద్యమ సమయంలో ప్రజల మధ్య ఉండి వారి అవసరాలను గమనించిన నాయకుడు కేసీఆర్ వాటిని తన మ్యానిఫెస్టోలో పెట్టారు. నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాకుండా రాష్ర్టాభివృద్ధికి మరె న్నో మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను రచించి ప్రవేశపెట్టారు. ప్రతి పథ కాన్ని, తన ప్రతి ఆలోచనను నిపుణలతో చర్చించి, దానికి సమకూర్చ వలసిన నిధులు, పరిమితుల గూర్చి క్షుణ్ణంగా అధ్యయనం చేసి దానిని అమలుచేయటంతో అన్ని పథకాలు ఆశించినట్టు రూపుదిద్దుకున్నాయి. త్వరితగతిన అమలుకు నోచుకున్నాయి. సకల జనుల సర్వేలాంటిది సం క్షేమ పథకాల అమలుకు ఉపయోగపడితే, భూ సర్వే రైతులకు సంబం ధించిన పథకాలకు ఎంతో తోడ్పడింది. ఇట్లా ఏ పథకమైనా ఎందుకు, ఎలా చేస్తున్నారో తెలిస్తేనే ఆ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలు గుతుంది. వాటిని చెప్పిన పద్ధతిలో, సమయంలో చేస్తున్నారని ప్రజలకు తెలియడం చాలా ముఖ్యం. 2014లో రాష్ట్ర ఎన్నికల్లో కంటే 2018 డిసెంబర్ ఎన్నికల్లో శాసనసభ్యుల సంఖ్య అధికార పార్టీకి 25 ఎక్కువగా రావటానికి కారణం. ప్రభుత్వం ఏ దిశలో వెళుతుందో ప్రజలకు స్పష్టం గా తెలియడం, వారి కంటికి ఆ పథకాల ఫలితాలు ఎదురుగా ఉండటం! ఇది చాలా ముఖ్యం.

ఐదేండ్ల కాలపరిమితిలో చెప్పినవన్నీ వంద శాతం సాధించటం బహుశా ప్రపంచంలో ఏ పార్టీకీ సాధ్యపడదు. కానీ వారి ఆలోచనలు, నిర్ణయాలు చర్యల్లో రూపుదిద్దుకోవటం మొదలైతే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. దశ, దిశ తెలుస్తుంది! ఇక జాతీయ పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వ పనితీరు నాలుగున్నరేండ్ల నుంచి గమనిస్తున్నాం. స్వచ్ఛ భారత్ మొదలు ఎన్నో పథకాలు విన్నాం. పెద్దనోట్ల రద్దు లాంటి పెట్రోల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకా శాన్నంటుకోవడంతోటి కష్టాలను అనుభవించారు సామాన్య ప్రజలు. అసమానతలు, అవినీతికి ఇతర సామాజిక రుగ్మతలు సరిచెయ్యాలంటే ప్రక్షాళన పైస్థాయి నుంచి రావాలి. ఒక పక్క నోట్ల రద్దుతో దేశంలో బ్యాం కుల మందు, ఏటీఎంల ముందు మైళ్ల కొద్దీ క్యూలు, తట్టుకోలేని వృద్ధు లు వందల సంఖ్యలో మరణించడం, వందల పెండ్లిళ్లు కూడా సామా న్యులు వాయిదా వేసుకుంటే, రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్థు లు ఇంటి దగ్గర కాలుమీద కాలేసుకొని కూర్చుని బ్యాంకుల నుంచి వ్యానులను కొత్త నోట్ల కట్టలతో తమ ఇళ్లకి మరల్చుకుంటుంటే ప్రజా స్పందన ఎలా ఉంటుంది? ఒక పక్క ఒక టర్మ్ ఎన్నికైన ఎంపీలు జీవి తాంతం పింఛన్లు తీసుకుంటుంటే మామూలు జనాలను వారి గ్యాస్ సిలిండర్లు బీదవారి కోసం త్యాగాలు చెయ్యాలనడం ఏం న్యాయం? సామాన్య ప్రజలకు ఏం కావాలి? అన్నదాత అయిన రైతులకు వ్యవసా యానికి నీరు, కరెంట్, ఉద్యోగస్థులకు టైములో ప్రమోషన్లు, ఇంక్రిమెం ట్లు, ధరల నియంత్రణ, ఆడవారికి సమాజంలో రక్షణ, వివక్ష లేని జీవి తం, చిన్నపిల్లలకు మంచి గుణాత్మకమైన చదువు, విద్యార్థులకు చదువు అనగానే తగిన ఉద్యోగాలు! ఇవన్నీ ఒక్క టర్మ్‌లో ఎవరూ సాధించలేరు. కానీ వీటన్నింటి కోసం పటిష్టమైన పథకాలు రచించి అమలుచేయటం మొదలుపెట్టి సరైన దారిలో వెడుతున్నాయా అన్నది ప్రజలు గమనిస్తుం టారు. అయితే టర్మ్ అయిపోవస్తున్నది కాబట్టి ఆయా పథకాలు ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయో తేలికగా తెలుసుకుంటారు వారు.

ఈ లోపల నాయకులు పరస్పర వ్యతిరేక అభిప్రాయాలు కలిగి ఉంటే మాత్రం కష్టమే! చంద్రబాబు గారి హోదా మీద స్టేట్‌మెంట్ల లాగ! లేక మోదీ గారి నల్లధనం అరికట్టే పథకాల లాగా! నిజానికి మోదీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం ద్వారా మెజార్టీ ప్రజల మతాన్ని ఉద్ధరించదల్చుకున్నా విధానాలు వేరుగా ఉండాల్సింది. బ్రిటిష్ వారు వారి విద్యా విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారో మెకాలే ఒక లేఖలో స్పష్టంగా రాశాడు. I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is spiritual and cultural heritage. And therefore, I propose that we replace her old and ancient education system and her culture. If the Indians think that all that is forei gn and English is good and greater than their own, they will lose their self esteem, their native culture and they will become what we want them, a truly dominated nation. మెకాలే కలలుగన్న బానిస భారత్‌ను తన పాశ్చాత్య విద్యా విధానంతో, వైవిధ్యభరితమైన ఈ దేశానికి సరిపోని విద్యా విధానాలతో జవహర్‌లాల్ నెహ్రూ పూర్తిచేశాడు. మెకాలే కల సఫలమై ఇప్పటిదాకా తాము మోదీకి నిజంగా ఈ విషయాల మీద అవగాహన ఉంటే హిందుత్వ బారిన పడకుండా అసలైన వేద సంస్కృతి బోధించిన సనాతన ధర్మాన్ని తిరిగి విద్యావిధానంతో ప్రవేశపెట్టేవాడు. ప్రతి రాష్ట్రంలో ఒక సంస్కృత అకాడమీని స్థాపించిర, వేదాలను అన్ని భాషల్లోకి అనువదించి వాటి సారాం శాలను విద్యలో చొప్పించమని ఆదేశించేవాడు.

ఆవును తిన్నవాడిని చంపడం కాదు, గోవు గురించి వేదాలలో చెప్పిన విషయాలు విద్యార్థులకు శాస్త్రీయంగా బోధిస్తే, భవిష్యత్తులో గో భక్షణ ఆగిపోయేది. మరుగునపడ్డ వేద సంస్కృతి, వేద భాష సంస్కృతాన్ని పునరుద్ధరిస్తే ఈ జాతి తనంత తానే తిరిగి బలోపేతమౌతుంది. అప్పుడు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కాదు, ఎవరికీ రిజర్వేషన్లు అవసరమే పడదు. భక్తి కాకుండా శాస్త్రీయత పునాది అయిన ఆధ్యాత్మికత ఒక్క వేదాలే ప్రవచించాయి. దానిని మనుషులు అనుసరిస్తే ఈ వైరుధ్యాలన్నీ మాయ మవుతాయి. బీజేపీ అంత అఖండంగా గెలిచినప్పుడు ఇవన్నీ చేసే అవకా శం చాలా ఉండింది. ఇదే మీరు చేయకుండా హిందువులందరూ కలిసికట్టు గా ఉండాలన్న పిడి వాదనను తెరపైకి తెచ్చిన ఈ దేశం ఇంకా ఛిన్నాభిన్న మయ్యేట్టు చేశారు. ఇప్పుడు అగ్రవర్ణాల బిల్లు తెస్తే ఏం లాభం? ఎన్ని బిల్లు లు మూలబడి లేవు? మహిళా బిల్లు అప్పుడే సిల్వర్ జూబ్లీ చేసుకుంది. మోదీ గారు చెయ్యదల్చుకున్న పటేల్ విగ్రహం, బుల్లెట్ రైలు లాంటివి తప్ప ఏ పథకాలు బారసాల స్థాయి దాటి అన్నప్రాసన స్థాయికి చేరుకోనే లేదు. ఈ వ్యాసం రాస్తుండగానే ఒక స్నేహితురాలు వచ్చి చాలా సంతోషం గా కర్నూలులో విమానాశ్రయానికి పునాదిరాయి వేశాడు తెలుసా చం ద్రబాబు అంటూ ఆనందపడిపోయింది. పాపం! మా తెలంగాణలో అటువంటి పునాదిరాళ్లు చంద్రబాబు, కాంగ్రెస్ నేతలు మస్తుగా వేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న సగం రాళ్ళు ఈ 58 ఏండ్లలో వాళ్లేసిన పునాదిరాళ్లే తెలుసా? అన్నాను.


కొన్నేమో ఒకచోట పునాదిరా యి, ఇంకోచోట దానికి సంబంధించిన సంస్థ, కట్టడం-జేఎన్టీయూలాగా, నాగార్జునసాగర్ డ్యామ్ లాగ! ఎవరు నమ్మాలి వీళ్ళని? ఎన్నాళ్ళు? ఎన్నే ళ్ళు? మరి ఈ పార్టీలు, నాయకులు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఎంతో విలువైన సమయాన్ని పనికిరాని రాజకీయాలతో వృథా చేసుకొని ఇప్పుడు ఆఖరి క్షణంలో వెంటిలేటర్ల లాంటి పథకాలు, బిల్లులు పెడితే ఏం లాభం? రాజకీయ నాయకులూ, ప్రజలు ఎదిగారు, ఆలోచనాపరులయ్యారు. మరి మీరు ఎదుగక తప్పదు! మొన్న ఎన్నికల్లో తమ పథకాలు ఏ దశలో ఉన్నాయో కేసీఆర్ గారు ప్రజల ముందు ఆవిష్కరించినట్టు మీరూ వచ్చే ఎన్నికల్లో చేయగలరా? ఆలోచించండి!

1300
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles