అంచనాలు మార్చిన కేసీఆర్

Wed,September 12, 2018 01:13 AM

భారతీయ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతూ తెలివైన పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి పురుడు పోసుకున్న పార్టీ, కాంగ్రెస్ వ్యతిరేకతనే ఆవహించుకున్నవారు కొత్త ఊపిరులూదిన పార్టీ చివరికి తమ బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తుందని ఎవరైనా ఊహించారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు.
ప్రజల ఆకాంక్షలకు మించి పాలించిన నాయకుడిగా కేసీఆర్‌ది విజయగాథ. గతంతో పోలిస్తే చంద్రబాబు అంచనాలను అందుకోలేని నాయకుడి మిగిలిపోయారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంచి పాలన అందించారని ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందారు. కానీ ఇప్పుడు కొత్త రాజధాని నిర్మాణానికి వ్యవహరిస్తున్న తీరు, టీడీపీలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం, ఉన్న వనరులకు అనుగుణంగా అభివృద్ధి వ్యూహాన్ని రచించుకోలేక పోవడం, స్పెషల్ స్టేటస్ అనే గగన కుసుమాన్ని కోరడం- మొదలైనవన్నీ ఆయన ప్రతిష్ఠను మసకబార్చాయి.

KCR-CM
తన కుటుంబాన్నంతా వెంట బెట్టుకొని సోనియా నివాసాని కి వెళ్ళి ఆమెకు కృతజ్ఞతలు చెప్పిన నాయకుడు, ఇప్పుడు ఆమె కుమారుడిని, రాజకీయ వారసుడిని బఫూన్ అని అంటారని ఎవరైనా ఊహించగలరా? టీఆర్‌ఎస్ స్థాపకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు రాహుల్‌గాంధీని ఆ విధంగా అనగలిగా రు. ఇరువురు ముఖ్యంత్రులు రాజకీయ కుర్చీపరుగు ఆడుతున్నారు.ఈ మలుపులకు కారణం-ఒకప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇతరులకు కళ్ళు కుట్టే విధంగా ఎంతో పేరు గడించిన చంద్రబాబు ఇప్పుడు ఆ స్థాయిలో నిలువలేకపోతున్నారు. మరోవైపు ప్రధాని మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో సాధారణంగా ఉండిపోయిన కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆశ్చర్యకరమైన రీతిలో విజయవంతంగా పాలిస్తున్నారు.

మొదట తెలంగాణలో కేసీఆర్ వ్యవహార సరళిని పరిశీలిద్దాం. ఆయన రాజకీయ నైపుణ్యానికి గుర్తింపు లభించి, అందుకు ప్రతిఫలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ముఖ్యమంత్రిగా మొదటి రెండు సంవత్సరాలు కొన్ని అనవసర వివాదాలు సృష్టించినా, ఆ తర్వాత పదవీకాలం ముగిసే నాటికి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠ గల నాయకుడిగా ఎదిగారు. ఎంతో పేరున్న ఎకనమిక్ టైమ్స్ న్యాయ నిర్ణేతలు ఆయనను ఈ ఏడాది వ్యాపార సంస్కర్తగా గుర్తించారు.కేసీఆర్‌కు రెండు అంశాలు కలిసివచ్చాయి. మొదటిది- చతురత గల రాజకీయ నిర్వహణ. రాష్ర్టానికి ఆయన నాయకత్వం వహిస్తున్న తీరు ను, అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవై సీ బహిరంగంగా కొనియాడారు. ఆర్థికాభివృద్ధిలోనూ తెలంగాణ ప్రభు త్వం సమర్థతను చాటుకున్నది. తెలంగాణ ఉద్యమం సందర్భంలో దెబ్బతిన్న పురోభివృద్ధిని మళ్ళా పునస్థాపించింది. కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చిన రెండవ అంశం- కేసీఆర్ కుమారుడు, ఎంతో ముం దుచూపున్న నాయకుడు కేటీఆర్. ఐటీ, పురపాలన, నగరాభివృద్ధి, జవు ళి, ప్రవాస వ్యవహారాల మంత్రి అయిన కేటీఆర్ రాజకీయ నిర్వాహకుడిగా, ఆధునిక పరిపాలకుడిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు.

ఎంతో మంది రెండవతరం నాయకుల మాదిరిగా, కేటీఆర్‌కు రాజకీయ జీవితం వారసత్వంగా వచ్చింది. కానీ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ విజయం సాధించి పెట్టడం ద్వారా ఆయన తన రాజకీయ పటిమను చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ టీఆర్‌ఎస్‌కు కంచుకోట కాదు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్ ఆధిపత్యం ఉండేది. కానీ హైదరాబాద్‌పై ఆధిపత్యం టీఆర్‌ఎస్ సాధించడం ద్వారా రాజకీయంగా ప్రశంసలు పొం దారు.తెలంగాణ ఉద్యమం పట్ల సానుభూతితో లేని మా లాంటి వారికి హైదరాబాద్ భవిష్యత్తు ఏమిటనేదే ప్రధాన ఆందోళనగా ఉండేది. ఒకప్పుడు దేశానికి రెండవ రాజధానిగా నెహ్రూ ప్రశంసించిన హైదరాబాద్ నగరం చెన్నై, బెంగళూరు కన్నా వెనుకబడి, శతాబ్దాంతం నాటికి పుంజుకోవడం మొదలైంది. రాష్ట్ర విభజన జరిగితే ఇక్కడి నుంచి పెట్టుబడులు తరలిపోతాయని, నగరాభివృద్ధి కుంచించుకుపోతుందని చాలామంది భయపడ్డారు. కేసీఆర్ తొలినాటి రాజకీయ ప్రకటనలు ఇటువంటి ఇబ్బందిని కలిగించాయి. కానీ కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కాపాడవలసిన ప్రాధాన్యాన్ని తొందరగా పసిగట్టి, బిజినెస్ సెంటిమెంట్‌ను పునరుద్ధరించడానికి తీవ్ర కృషి చేశారు. సైబరాబాద్‌కు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా హైదరాబాద్ ఐటీరంగంలో బెంగళూరును సవాలు చేయగలుగుతున్నది. తండ్రి-కొడుకు సమన్వయం రాష్ర్టాభివృద్ధికి, నగర పురోభివృద్ధికి బాగా తోడ్పడుతున్నది. కేటీఆర్ రాజకీయ జీవితాన్ని రాహుల్ గాంధీతో పోల్చి చూస్తే, రాజకీయ నైపుణ్యాలు వారసత్వంగా రావని రుజువవుతున్నది. వీటిని అనుభవం ద్వారా సమకూర్చుకోవాలె, క్షేత్ర స్థాయిలో విజయం సాధించడం ద్వారా పార్టీ శ్రేణుల, ప్రజల ముందు నిరూపించుకోవాలె.
Sajay
ప్రజల ఆకాంక్షలకు మించి పాలించిన నాయకుడిగా కేసీఆర్‌ది విజయగాథ. గతంతో పోలిస్తే చంద్రబాబు అంచనాలను అందుకోలేని నాయకుడి మిగిలిపోయారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంచి పాలన అందించారని ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందారు. కానీ ఇప్పుడు కొత్త రాజధాని నిర్మాణానికి వ్యవహరిస్తున్న తీరు, టీడీపీలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం, ఉన్న వనరులకు అనుగుణంగా అభివృద్ధి వ్యూహాన్ని రచించుకోలేక పోవడం, స్పెషల్ స్టేటస్ అనే గగన కుసుమాన్ని కోరడం- మొదలైనవన్నీ ఆయన ప్రతిష్ఠను మసకబార్చాయి.కేటీఆర్ తండ్రికి కుడిభుజంగా ఉంటే, చంద్రబాబు తనయుడు లోకేశ్ ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రిగా తనదైన ముద్ర వేయలేకపోతున్నారు. ఇప్పుడు టీడీపీ ఆంతరంగికంగా టీఆర్‌ఎస్ కన్నా బలహీనమైన పార్టీ.
రాష్ట్ర విభజన జరిపినందుకు ఆంధ్రావారు నామరూపాలు లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీకి టీడీపీ దగ్గర కావడానికి ఈ పరిస్థితులే కారణం. రాజకీయ మనుగడకు ఉత్తమ, విజ్ఞతతో కూడిన పాలన అవసరమని చెప్పడానికి రెండు తెలుగు రాష్ర్టాలు విరుద్ధమైన తార్కాణాలుగా నిలుస్తున్నాయి.
(వ్యాసకర్త: రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు)
టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో..

1452
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles