కేంద్రం నిర్లక్ష్య వైఖరి

Mon,September 10, 2018 11:04 PM

2014 ఎన్నికల సమయంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలను ఇప్పిస్తామని బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది. కేంద్రం గడిచిన నాలుగేండ్లలో వాగ్దా నం చేసిన ఉద్యోగాల సంఖ్యలో పదో వంతు కుడా భర్తీ చేయలేకపోయింది. ఈ కాలంలో దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడటం, విదేశీ పెట్టుబడులు తగ్గిపోయిన కారణంగా ప్రైవేట్‌రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన అనుకున్న స్థాయిలో జరుగలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సుమారు 24 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. ఒక్క విద్యారంగంలోనే పది లక్షలకుపైగా పోస్టులు భర్తీకాక ఖాళీగా ఉన్నాయి. పోలీసు బలగాలు, రైల్వేశాఖ, రక్షణ సర్వీసులు, ఆరోగ్యరంగం, పారా మిలిటరీ, కోర్టులు ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ మంజూరుచేసిన పోస్టులు. వీటన్నింటినీ ప్రభుత్వం భర్తీచేస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. సిబ్బందిపై అదనపు భారం తప్పుతుంది. కానీ కేంద్రం ఆ దిశగా ఆలోచన చేయట్లేదు.

అయితే దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 25 లక్షల ఉద్యోగాలను భర్తీచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎం దుకు అలసత్వం ప్రదర్శిస్తున్నదో అర్థం కావడం లేదు. శాశ్వత ప్రాతిపదికపై కాకుండా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించి చాలీచాలని జీతాలిచ్చి వారితో శక్తికి మించి పనులు చేయించుకుంటున్నది. మరో పక్క ప్రభుత్వ విద్య నిర్వీర్యమైపోయి, ప్రైవేట్‌రంగం ఊపందుకున్నాక విద్య వ్యాపారంగా మారిపోయింది. లక్ష లు ఖర్చుచేసి డిగ్రీలు పొందిన తర్వాత సరైన ఉద్యోగాలు లభించకపోవడంతో యువతలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంటున్నది. వారిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు వీధి న పడుతున్నాయి. ఉద్యోగాలు తగ్గిపోవడంతో ఉద్యమా లు, రిజర్వేషన్ల కోసం ఆందోళనలు ఉపందుకుంటున్నా యి. దేశంలో తాజా గణాంకాల ప్రకారం ఒకటిన్నర కోట్ల నిరుద్యోగ యువత ఉన్నది. నిరుద్యోగ శాతంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఐదవ స్థానంలో ఉందని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీన్నిబట్టే తెలుస్తున్నది కేంద్రం నిరుద్యోగం విషయం ఎంత అలసత్వం ప్రదర్శిస్తున్నదో.
- సి.కనకదుర్గ, విజయ్‌నగర్ కాలనీ, హైదరాబాద్

142
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles