కులవృత్తులకు భరోసా

Sun,September 9, 2018 12:02 AM

ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం అభివృద్ధి చెందితేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యపడుతుందని భావించి చిన్న విషయాలను సైతం ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తూ ఔరా అనిపించేలా పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉంటేనే రాజ్యం బాగుంటుందనే విషయం తెలిసిన జ్ఞాని, ఒక రైతు ముఖ్యమంత్రి అవడం వల్ల మన రాష్ట్రం దేశంలో ముందువరుసలో నిలిచింది.

కళలు సంస్కృతిపై ఆసక్తి ఉన్న ఎం దరో పాలకులు పాలించడం వల్ల తెలంగాణ బహుళ సాంస్కృతిక ప్రాంతం గా విరాజిల్లుతున్నది. విభిన్న భాషలు సం స్కృతితో తెలంగాణ రాష్ట్రం గంగా-జము న తెహజీబ్‌లాగ పిలువబడుతుంది. అలనాడు చక్రవర్తుల కాలంలో కనిపించిన వైభవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ప్రతిబింబిస్తున్నది.విభిన్న సంస్కృతులు సమాంతరంగా ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ, బోనాలు వంటి పం డుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి, నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా దేవాలయాల్లో ఉండే పూజారులకు వేతనాలిస్తూ మసీదుల్లో ఉండే మొజామ్, ఇమామ్, ముత్తవలిలకు నెలకు రూ.5000 గౌరవ వేతనం ఇవ్వడమనేది వారిలో విశ్వాసాన్ని కల్పిస్తున్నది. ప్రభుత్వమే ఇంటిపెద్దగా వ్యవహరిస్తూ పేదవారికి పండుగలకు బట్టలు పంపిణీ చేస్తూ, విందులు ఏర్పాటు చేస్తున్నది.తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎంబీసీ, సంచారజాతుల సం క్షేమానికి కృషిచేస్తూ వారి బాగోగులు చూస్తున్న తీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గుర్తింపు కూడా లేని ఎన్నోకులాల సామాజిక వికాసానికి కూడా తెలంగాణ ప్రభు త్వం ఎంతగానో కృషిచేస్తున్నది. కులవృత్తుల పైన ఆధారపడి జీవిస్తున్న వారి కోసం ఎన్నోరకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి మనుగడకు భరోసాను కల్పిస్తున్నది. తెలంగాణ పునర్నిర్మాణంలో అట్టడుగువర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశంలోనే మొదటిస్థానంలో నిలుస్తున్నాయి.

గొర్రెల పెంపకం, చేపల పెంపకం ద్వారా యాదవులను, మత్స్యకారులను ప్రోత్సహించడమే కాకుండా రాష్ట్రంలో పశు సంపద పెంచి మాంసం ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తూ వారి ఆదాయాన్ని కూడా పెంచే కార్యక్రమాలు చేపడుతున్నది. చేతివృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్న కుమ్మరి, మేద రి, రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వకర్మ వంటి కులాలకు వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను ఏర్పాటుచేసి తద్వారా వారిని అధునాతన యంత్రాలను సబ్సిడీతో అందించే కార్యక్రమాల ను చేపట్టింది. రజకులకు అత్యాధునిక వాషింగ్ యంత్రాలు, డ్రయర్‌లతో ధోబీఘాట్‌ల నిర్మాణం పైలట్ ప్రాజెక్ట్ కింద చేప ట్టి పూర్తిచేస్తున్నది.నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు కూడా ఏర్పాటు చేసుకునేందుకు లక్ష, రెండు లక్షల రూపాయలను సబ్సిడీ కిం ద అందించనుంది. అతి ప్రాచీనమైన కుమ్మరి వృత్తిని ఇప్పటికీ అవే పద్ధతుల ద్వారా చేస్తూ నడుములు వంగిపోయి అనారోగ్యాల పాలవుతున్న కుమ్మరులకు ఆధునిక యంత్రాలపై అవగాహన కల్పించేందుకు గుజరాత్ రాష్ట్రంలోని వేర్వే రు ప్రాంతాలకు కుమ్మరి కుల సంఘ పెద్దలను ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పంపింది. రాష్ట్రంలో ఎండిపోయిన ఎన్నోవేల చెరువులను గుర్తించి వాటికి పునర్జీవం పోస్తూ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు పూడికలు తీయడంతో ప్రస్తుతం చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. అం దులో లక్షల్లో చేప పిల్లల ఆటలు కనువిందు చేస్తున్నాయి. పశువుల ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి సంచార పశు వైద్యశాలలను ఏర్పాటుచేయడం ఇప్పటివరకు ఎవరు చేపట్టలేదు.

అన్ని వృత్తికులాలను ఆదుకునే యోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలను రచిస్తూ ఒక వినూత్న ప్రయాత్నానికి శ్రీకారం చుట్టారు. అత్యంత వెనుకబడిన కులాలను సైతం గుర్తించి వారి అభివృద్ధికి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేయ డం 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం వారి మొహాల్లో సంతోషాన్ని నింపాయి.ప్రజావసరాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడటం ఏవో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం మళ్ళా ఎన్నికల్లో కళ్లబొల్లి కబుర్లు చెప్పి గెలువడం నాయకులకు అలవాటైపోయింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మన మేం చేస్తే మన బతుకులు మారుతాయో మనమే నిర్ణయించుకోవాలని హితబోధ చేస్తున్నారు. వృత్తులను ఆధునీకరించి, వారికి ఆధునిక యంత్రాలు, పనిముట్లు అందజేయాలని నిర్ణయించారు. దీనికి గాను 70 నుంచి 80 శాతం సబ్సిడీ రుణాలను బ్యాంకు లింక్ లేకుండా ఇవ్వాలని నిర్ణయించారు.తెలంగాణ ప్రభుత్వం పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం 584 గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు సన్నబియ్యం తో కూడిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నది. అం తేకాకుండా గురుకులాలు చదువు, క్రీడ లు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది సర్కా రు బడులపై ప్రజలకు సన్నగిల్లిన నమ్మకానికి తిరిగి ప్రాణం పోసింది. అంతేకా దు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి సైతం ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.20 లక్షలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నది.
srinivas
మారుమూల తండాలను కూడా గ్రామా పంచాయతీలు గా మార్చి వారి జీవన విధానాల్లో గణనీయమైన మార్పునకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలా ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం అభివృద్ధి చెందితేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యపడుతుందని భావించి చిన్న విషయాలను సైతం ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తూ ఔరా అనిపించేలా పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషం గా ఉంటేనే రాజ్యం బాగుంటుందనే విషయం తెలిసిన జ్ఞాని, ఒక రైతు ముఖ్యమంత్రి అవడం వల్ల మన రాష్ట్రం దేశంలో ముందువరుసలో నిలిచింది.వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, పంట పెట్టుబడి కింద ఎకరానికి 8 వేల రూపాయలు, పక్కాగా పాసు పుస్తకాల పంపిణీ, రైతులకు 5 లక్షల బీమా యోజన, పం టలు దాచుకోవడానికి గిడ్డంగుల ఏర్పాటు, మంచి గిట్టుబా టు ధరను కూడా కల్పిస్తూ వారికి పూర్తిగా అండగా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అన్ని కులాల వారి ఆత్మ గౌరవం నిలబడే విధంగా రాజధాని నగరానికి ఏ రాత్రో వస్తే పడుకోవడానికి కూడా కనీస స్థలం లేని ఎంతోమంది పేద వారికి, పై చదువుల కోసం వచ్చే పేదింటి విద్యార్థులకు నీడను ఇచ్చేందుకు, పేదవారి ఆడపడుచుల పెండ్లిళ్లు చేసేందుకు, కులసంఘాల సమావేశాలు నిర్వహించేందుకు, వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఇలా అన్ని అవసరాలను తీర్చడం కోసం వారివారి జనాభా ప్రాతిపాదికన వేల కోట్ల విలువ చేసే భూములను కుల సంఘాలు ఎక్కడ కోరుకుంటే అక్కడే కేటాయిస్తూ కోట్ల రూపాయలను భవన నిర్మాణానికి వెచ్చించబోతున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు ఏం ఇచ్చి రుణం తీర్చుకుంటారు!
(వ్యాసకర్త: రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్)

380
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles