కాళోజీ

Sat,September 8, 2018 12:07 AM

వాక్యం రసాత్మకం కావ్యం
వాక్యం భావాత్మకం తత్వం
ప్రశ్నించనిదే ఇరుపక్షాల
తత్వం, పైత్యం బోధ పడదు
ఇరుపక్షాలను ప్రశ్నించెను కాళోజీ
నేను గాంధీని చూడలేదు
అంబేద్కర్‌ని చూడలేదు
ఆ యిద్దరినీ కాళోజీలో చూశాను
సంఘాల్లో చేరడం ఎందుకులే అన్నవాడు
అన్ని సంఘాల్లో తానై తిరిగినవాడు
ఏదీ నీది కాకపోతే అన్నీ నీవవుతాయి అన్న
బుద్ధుడి బోధనను అర్థం చేసుకున్నవాడు
అతని కవిత్వం ఒక నాదం, ఒక నినాదం
కవిత్వం అతని శ్వాస, ప్రజలే అతని ద్యాస
అతని కవిత్వం సులభసాధ్యం
కబీరును, ఖలీల్ జిబ్రాన్‌ను, గురు రవిదాస్‌ను
వేమనను, జాషువాను
తనలో కలుపుకున్నవాడు
వారి జీవనతత్వాన్ని నింపుకున్నవాడు
రామసింహ కవిలా చెర్విరాల బాగయ్యలా
అతడొక ఆశు కవి, ప్రజాకవి, మహాకవి
- బి.ఎస్.రాములు, 8331966987
(రేపు కాళోజీ జయంతి)

87
Tags

More News

VIRAL NEWS