అభివృద్ధే అజెండా

Tue,September 4, 2018 11:08 PM

రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగేండ్లుగా తాము సాధించిన ప్రగతి నివేదికను ప్రజల ముందు ఉంచింది. దీనిపై కూడా విమర్శలు చేయడం సరికాదు. అధికారంలోకి తాము వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించాలి. అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేసి లబ్ధి పొందాలని భావిస్తే అది వారి అవివేకమే అవుతుంది. వ్యక్తిగత విమర్శలతో సాధించేది ఏమి ఉండదన్న విషయాన్ని ప్రతిపక్షాలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
-పి. సతీశ్, సిరిసిల్ల

బస్సుల సంఖ్య పెంచాలి


పరీక్షల సమయంలోప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాటు చేయాలి. పరీక్ష సమయంలో ఎంతమంది రాయబోతున్నార న్న సమాచారం ఆధారంగా బస్సులు ఆయా రూట్లలో నడుపాలి. అప్పు డు ఇటు ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయి.
-బి. రామాంజనేయులు, నల్గొండ

మార్గదర్శకులు


సమాజానికి మార్గనిర్దేశం చేసే కల్పతరువులు గురువులు. మనం ఏ స్థాయికి వెళ్లాలన్నా అది పాఠశాల విద్య నుంచే ఆరంభం అవుతుంది. ఇంజినీర్లుగా, ఉపాద్యాయులుగా, శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, లాయర్లుగా తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుంది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన మార్గనిర్దేశనం గురువులే చేస్తారు. పాఠశాల దేవాలయంతో సమానమని మంచిగా చదువుకుని ఇటు ఉపాధ్యాయులకు, అటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మార్గనిర్దేశం చేస్తారు. కాబట్టి ఉపాధ్యాయులను గౌరవించడం మన ప్రథమ విధి.
-అనంతవరం సిద్దిరామప్ప, సిద్దిపేట ్ల

87
Tags

More News

VIRAL NEWS