సహకార బ్యాంకులను విస్తరించాలె

Fri,August 31, 2018 12:40 AM

రాష్ట్రంలో సహకార బ్యాంకులు చాలానే ఉన్నాయి. కానీ వాటిలో కనీసం ఏటీఎంల సౌకర్యం కూడా లేదు. దీనివల్ల ప్రజలు ఆ బ్యాంకుల సేవలను ఉపయోగించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి బ్యాంకులకు ఏటీఎంల ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే సహకార బ్యాంకులను విస్తరించాలి. అప్పుడే సహకార బ్యాంకుల వినియోగం పెరుగుతుంది. ప్రజలకు బ్యాంకు సేవలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్

జేబు దొంగలను అరికట్టాలె

నగరంలో జేబు దొంగలు ఎక్కువయ్యారు. ఆర్టీసీ బస్సులను కేంద్రంగా చేసుకొని సెల్‌ఫోన్లు, ప్యాకెట్ పర్సులు, బంగారు గొలుసులను దొంగిలిస్తు న్నారు. దీంతో అమాయక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి దొంగతనాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా పోలీసు అధికారులు జేబుదొంగలపై దృష్టి కేంద్రీకరించాలి.
- తాళ్లపల్లి మనోజ్‌కుమార్, మలక్‌పేట్, హైదరాబాద్

కొత్త జోనల్ వ్యవస్థ చారిత్రాత్మకం

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో రెండు జోన్లు మాత్రమే ఉండేవి. తద్వారా మొత్తం ఖాళీల్లో 80 శాతం మాత్రమే స్థానికులకు వచ్చేవి. దీనివల్ల స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగేది. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ చొరవతో 7 కొత్త జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ నిన్న గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం శుభపరిణామం. కొత్త జోనల్ వ్యవస్థ వల్ల స్థానికులకే 95 శాతం ఉద్యో గాలు దక్కుతాయి. ఇది హర్షణీయం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ఇది ప్రతీక. దీనికి కారకుడైన కేసీఆర్ అభినం దనీయుడు. ఆయనకు రాష్ట్ర ప్రజల తరఫున అభినందనలు.
- సూరం అనిల్, వరంగల్

150
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles