జాగ్రత్తగా ఉండాలె

Wed,June 5, 2019 01:05 AM

సెల్ఫీల సరదా ప్రాణాల మీదికి తెస్తున్నది. ఇలాంటి ఉదంతాలు ఇటీవల అనేకం జరిగాయి. ముఖ్యంగా రిజర్వార్లు, చెరువుల దగ్గర అప్రమత్తంగా ఉండాల్సిన యువత సెల్ఫీల పేరుతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నది. ఇలాంటి విషాదాలు జరుగుతుండటం బాధాకరం. ముఖ్యంగా మనకు తెలియని ప్రదేశాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలె. హెచ్చరిక బోర్డులను పరిగణన లోకి తీసుకోవాలి. అంతేగానీ ఇవేవీ పట్టించుకోకుండా నీళ్లలోకి దిగడం కాని, నీళ్లలో సెల్ఫీలకు ప్రయత్నించటం కాని మంచిది కాదు. ప్రభుత్వం కూడా ఈ ఘటనల నేపథ్యంలో చెరువులు, రిజర్వాయర్ల దగ్గర భద్రత పెంచాలి. పర్యాటక స్థలాలైతే నిర్ణీత ప్రదేశంలోకి తప్పా ప్రమాదకర ప్రాంతాల్లోకి జనాలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలి.
- సీహెచ్. వెంకటేశ్, వరంగల్

పర్యావరణాన్ని కాపాడుకోవాలె

పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు ఇలాంటి నీతి సూత్రాలను మనం వింటూనే ఉంటున్నాం. కానీ వీటిని పాటించినట్లు ఎక్కడా కనిపించదు. విచ్చలవిడి అడవుల నరికి వేత, ప్రృకతి సృష్టి అయిన కొండలను పిండి చేయడం లాంటి పనులతో పర్యావరణం దెబ్బతింటున్నది. కేవలం మానవ తప్పిదాల వల్లనే ప్రకృతి ప్రకోపిస్తున్నది. తద్వారా విపరీతమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవల్సిన మన అందరిది.
- కొత్వాల్ ప్రవీణ్‌కుమార్, బేగంపేట, హైదరాబాద్

అప్రమత్తత అవసరం

తొలకరి పలుకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వానలు కురిసాయి. ఇది సంతోషకరమైన విషయం. అయితే వానకాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. డ్రమ్ముల్లో నీటిని నిల్వ ఉంచుకోకూడదు. అప్పుడే ఈగ లు, దోమల నివారణ సాధ్యమవుతుంది.
- కొలిపాక శ్రీనివాస్, సముద్రాల, హుస్నాబాద్

236
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles