మోసపూరిత మాటలు


Sun,January 12, 2020 12:54 AM

ప్రజలు సంపూర్ణ మెజారిటీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు రెం డోసారి పట్టం కట్టారు. కానీ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోలేదన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం మొదటి టర్మ్‌లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో విఫలమైంది. ఈ సారైనా నిరు ద్యోగ నిర్మూలన కోసం తగిన చర్యలు చేపడుతారని అందరూ భావించారు. కానీ ఆ దిశగా కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకువేయడం లేదు. ఆర్థికమాంద్యంతో అనేక రంగాలు కుదేలవుతున్నాయి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం ఉత్సాహం చూపిస్తున్నది.

Band
రెండో దఫా ఏడు నెలల బీజేపీ పాల నపై ప్రజలకు అనేక అనుమానా లు కలుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు అనేక హామీలు ఇచ్చిన కమలం పార్టీ వాటి అమలుపై ఆసక్తి చూపడం లేదు. సురక్షమైన, సుభిక్షమైన పాలన అందిస్తారని ప్రజలు మోదీకి పట్టం కట్టా రు. అయితే పాలనలో ప్రజల ఆశలు వమ్ము చేస్తున్నారు. రైతులు మొదలుకొని నిరుద్యోగుల వరకు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు.బీజేపీ రైతుల సంక్షేమం, మహిళలకు ఉపాధి భద్రత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు తదితర ప్రధానమైన అంశాలతో ఎన్నికల ప్రచారంలో లబ్ధి పొందింది. ఆ దిశగా పాలన చేయడం లేదనడానికి అనేక నిర్ణయాలే అద్దం పడుతున్నాయి.

బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, దాని ప్రకారమే నడుచుకుంటామని ప్రమాణ స్వీకారం చేశారు. కానీ రాజ్యాంగంలో మొదటిపేజీలో ఉన్న పీఠికను ధ్వంసం చేసేలా ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్య ఉల్లంఘనలకు పాల్పడుతూ ఫెడరల్‌ స్ఫూర్తిని, జాతీయతకు ఎన్డీయే ప్రభుత్వం భంగం కలిగిస్తున్నది. రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావడంతో, ఏన్డీయే పాలనపై స్థూలంగా విశ్లేషణ చేయాలి. ప్రజలకు వాస్తవాలు తెలిపి, కేంద్రం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలను ప్రజలకు వివరించాలి. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-1 పాలనలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో చిన్న, మధ్యతరహా ప్రజల వ్యాపారాలు ఛిన్నాభిన్నమయ్యాయి. రెండోసారై నా మంచిపాలన అందిస్తారని అందరూ భావించారు. ప్రజలు అనుకున్న దానికన్నా విరుద్ధ పాలన సాగిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్‌లో అమిత్‌ షా రంగప్రవేశం తర్వాత నిర్ణయాలన్నీ మోదీ, అమిత్‌ షా లకే పరిమితమయ్యాయి. ప్రజల అవసరాలు, తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలం ఉన్నది కదా అని కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలను పార్లమెంటు సాక్షిగా అవమానిస్తూ నియంతృత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కేంద్రంలోని పెద్దలు ఆర్థికవ్యవస్థ విషయంలో భారత్‌ను ప్రపంచ పటంలో అత్యున్నతస్థాయిలో ఉంచుతామన్నారు. కానీ వారి మాట లు నీటి మూటలని స్పష్టమవుతున్నది. ట్రిలియన్లు, బిలియన్లుగా ఆర్థి కప్రగతి సాధిస్తామని అంతర్జాతీయ వేదికలపై మోదీ చెప్పిన మాటలు ఆచరణలో కనిపించడం లేదు. 2019, మే తర్వాత దేశ ఆర్థికస్థితి ఘోరంగా దిగజారింది. 2025 నాటికి దేశ ఆర్థికవ్యవస్థను ఐదు ట్రిలియన్లకు పెంచుతామన్న మోదీ హామీ ఆచరణలో సాధ్యం కాదని ప్రభు త్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రి పరస్పర విరుద్ధ ప్రకటనలు పలు అనుమానాలకు తావిస్తున్నది. దేశ ఆర్థికవ్యవస్థపై వారి ప్రకటనలు చూస్తే వాళ్లకు ఎంత అవగాహన ఉన్నదో అర్థమవుతుంది. 2025 నాటికి భారత ఆర్థికవ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతామనేది ఎన్డీయే ప్రకటించింది. 2019-20లో ఉన్న ఫిగ ర్‌- 2.8 ట్రిలియన్‌ డాలర్లు. ఈ లెక్కన 2025 నాటికి మరో 3.2 ట్రిలియన్‌ డాలర్లకు పెరుగాలి. కానీ, 2018-19లో 7.1 శాతంగా ఉన్న స్థూల ఉత్పత్తి రేటు.. ప్రస్తుతం రెండవ క్వార్టర్‌లో 4.5 శాతానికి తగ్గింది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ఈ మాంద్యం ఇప్పట్లో తగ్గదు. అయినా కేంద్రం మాత్రం ప్రజలను మభ్యపెట్టేందుకు అసంబద్ధమైన ప్రకటనలు చేస్తున్నది.

సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌ నినాదాలు ఎన్నిక ల ప్రచారాలుగానే మిగిలిపోయాయి. ఒక పక్క ఆర్థికమాంద్యం కొనసాగుతుంటే వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పథంలోకి తెస్తామని, 20 22 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని ఎన్నికల హామీగా ప్రకటించారు. కానీ వ్యవసాయరంగం వృద్ధిరేటు ప్రస్తుతం 2.1 శాతంగా ఉన్నది. పసుపు, మిరప, ఉల్లి, పం టల్లో ప్రపంచంలోనే 1, 2 స్థానాల్లో ఉన్న దేశీయ ఉత్పత్తులు క్రమేణా తగ్గిపోతున్నాయి. తీవ్రమైన ఉల్లి కొరత, ఉల్లి ధరలు పెరుగదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇవన్నీ జరుగుతుండ గా మోదీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

అధికారం చేపట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభు త్వం ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నాలు చేసిం ది. జమ్ముకశ్మీర్‌ ఆర్టికల్‌ 370ని రద్దుచేసింది. ఆర్టికల్‌ రద్దు అనేది దేశంలోని సర్వరోగాలకు మందుగా ప్రచారం చేసింది. ఆర్టికల్‌ రద్దుచేసి నెలలు గడుస్తున్నా అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లేదు. నేతలు గృహ నిర్బంధంలో కొనసాగుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం ఉన్నదని అబద్ధాలు చెబుతున్న సర్కార్‌, తాజాగా నెలకొన్న వాస్తవాలను అంగీకరించడం లేదు. ఆర్టికల్‌ 370 రద్దును ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలని చూసిన బీజేపీకి, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అయినా బీజేపీ నేతల తీరు మారడం లేదు.

దేశంలో ఎవరుండాలి? ఎవరెక్కడ ఉండాలి? ఎవరు ఉండొ ద్దు? అనే నియంతృత్వ ఆలోచనలకు తెరదించింది. తన పంథాన్ని నెగ్గించుకునేందుకు పౌరసత్వ సవరణ బిల్లుకు చట్టం రూపం తెచ్చింది. మత ఆధారంగా, కుల ఆధారంగా విభజించవద్దని రాజ్యాంగం చెబుతున్నా పార్లమెంటు సాక్షిగా ధ్వంసం చేస్తున్నారు. పౌరసత్వ సవ రణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రంగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకోవాల్సిన నేతలు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. కేంద్రంలోని పెద్దలు గాంధీజీ-అంబేద్కర్‌ ఆలోచనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రజలు సంపూర్ణ మెజారిటీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు రెం డోసారి పట్టం కట్టారు. కానీ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోలేదన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం మొదటి టర్మ్‌లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో విఫలమైంది. ఈ సారైనా నిరు ద్యోగ నిర్మూలన కోసం తగిన చర్యలు చేపడుతారని అందరూ భావించారు. కానీ ఆ దిశగా కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకువేయడం లేదు. ఆర్థికమాంద్యంతో అనేక రంగాలు కుదేలవుతున్నాయి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం ఉత్సాహం చూపిస్తున్న ది.

నష్టాల పేరుతో ఎయిర్‌ ఇండియాను ఇప్పటికే ప్రైవేటుకు అప్పజేప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. అట్లనే ప్రజలకు నిత్యావసర వస్తువులను సమాకూర్చడంలో కేంద్రం విఫలమైంది. నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఉల్లిధరలు విపరీతంగా పెరిగాయి. ఉల్లి కొరత తీర్చాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళల రక్షణ విషయంలో కేం ద్రం సరైన చర్యలు తీసుకోవడం లేదు. మొత్తంగా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌ ప్రజల విశ్వాసాలను, అవసరాలను తీర్చడంలో విఫలమైంది. బీజేపీ ఇంకా ఎన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందోనన్న భయాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

269
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles