ఆర్థిక చుక్కానిలేని దేశం


Wed,December 4, 2019 12:30 AM

వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగాలను కల్పించేవి సేవారంగం., ఆటోమోబైల్ రంగాలు. ఈ రంగాల్లో సంక్షోభం పెరిగిపోయింది. వీటిలో దాదాపు పది, పదిహేను శాతం ఉద్యోగులను తొలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అలాంటి మాటలు చెప్పేవారంతా విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మలు. వారు దేశాన్ని అల్లకల్లోలం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించడం అధికారపక్ష నాయకులకు అలవాటైపోయింది.

గతేడాది జీడీపీ వృద్ధి రేటు 6 శాతానికి అటుఇటుగా ఉంటే అది తమ గొప్పతనంగా చెప్పుకొన్నది ప్రభుత్వం.మరి ఇప్పుడు గత ఆరునెలల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. సామాన్యుల కొనుగోలుశక్తి పడిపోయింది. ఫలితంగా జీడీపీ వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి తగ్గిపోయింది. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వల్లే అంటూ పార్లమెంట్, టీవీ చర్చల్లో ప్రకటించే నిసిగ్గుతత్వం కనపడుతున్నది.

prabhakar-photo-small
దేశ ప్రగతిని ముందుకు నడిపించాల్సిన ప్రభుత్వాధినేతలకు ఆర్థికరంగంపై పట్టులేకున్నా, అవగాహన ఉండాల్సిన అవసరాన్ని నేటి భారతదేశ ఆర్థికరంగంలోని పరిస్థితులు ఎత్తి చూపుతున్నాయి. రాజకీయరంగంలో విద్యార్హతలు లేకు న్నా ప్రజా నాయకులుగా, ప్రభుత్వాధినేతలుగా ఎదిగి ప్రపంచఖ్యాతిని ఆర్జించవచ్చు. భారతదేశం విద్యారంగంలో వెనుకబడిందనే విషయాన్ని గుర్తించిన మన రాజ్యాంగ నిపుణులు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా శాసనకర్తలుగా, భారత భాగ్యవిధాతలుగా వెలుగొందవచ్చని, భారదేశ భవిష్యత్‌కు మార్గాలు వేయాలని నిర్ణయించారు.

ప్రపంచబ్యాంక్ లాంటి అనేక విదేశీ రేటింగ్ సంస్థలు, ఆర్థికనిపుణు లు మాత్రమే కాదు, భారదేశ రిజర్వ్ బ్యాంక్ కూడా దేశ ఆర్థికస్థితి బాగా లేదని చెపుతున్నది. ద్రవ్యలోటు గతంలో 4 శాతానికి అటు ఇటుగా ఉన్న ది. ఈ సారి 6 శాతానికి అటు ఇటుగా ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత ఆరేండ్ల కనీస స్థాయికి ఈ ఆర్థిక సంవత్సర ద్వితీయ, త్రైమాసిక వృద్ధిరేటు ఫలితాలు పడిపోయాయి. ఆర్థికరంగం పట్ల అవగాహన కన్నా, తమ వ్యక్తిగత ఎజెండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల దేశ ఆర్థిక పరిస్థితులు ఆందోళన కలిగించే స్థాయిలోకి దిగజారుతున్నాయి. దేశ ప్రజల పట్ల ఆలోచించే వ్యక్తి త్వం ఉన్న నాయకులు లేకపోగా, అలా ఆలోచించేవారిని సంకుచితులుగా, విదేశీ శక్తుల భక్తులుగా విమర్శించడం శోచనీయం.

నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి రాజకీయాల్లో ఉన్నవారిలో చాలామంది న్యాయవాదులు, బాగా చదువుకొన్నవారు, సమా జం పట్ల అవగాహన, చిత్తశుద్ధి ఉన్నవారే ఉన్నారు. దీనివల్ల, నాటి నాయకుల నిజాయితీని శంకించకుండా ఈ నాయకులతో పాటు, ప్రజల్లోని అధికభాగం నిరక్షరాస్యులైనా గ్రామాల్లో తమ వారిపట్ల సానుభూతితో ఆలోచించి వారి మేలుకోరే మంచి మనసున్న నాయకులు అనేక మంది ఉం డేవారు. అలాంటి వారందరికి దేశ పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం కోసమే ఎలాంటి విద్యార్హతలు లేకున్నా శాసనకర్తలుగా ఎదుగడానికై అందరికీ ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీచేసే హక్కు కల్పించారు.

కాలం మారుతున్నది. తరాలు మారాయి. నిజాయితీ గల నాయకుల స్థానంలో స్వార్థం, ఆశ్రిత పక్షపాతం, ధనార్జనే లక్ష్యంగా గల నాయకత్వం ఎదుగుదల ప్రారంభమైంది. దేశ ప్రజల జీవనస్థితిగతులు ఎలా ఉన్నా, తమ వర్గ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీర్ఘకాలం పాటు పాలనాపగ్గాలు తమ చేతులనుంచి జారిపోకుండా ఉండటం కోసం ఎన్ని ఎత్తులైనా వేస్తున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా ముందుకుపోగల సమర్థులు నేటి పాలకులు.
భారతదేశంలోని ఉత్పత్తిరంగాలన్నీ గత ఏడేండ్ల కన్నా దిగువస్థాయి కి పడిపోయాయి. దీంతో ఆయా సంస్థలు ఉద్యోగులను తొలిగించాలని ఆలోచిస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో దేశంలో ఇలాంటివి సర్వసాధారణమే అంటూ, రాజకీయ ప్రకటనలు చేయడం వారి విజ్ఞతకే చెల్లింది. ప్రజల ఆర్థికస్థితి దిగజారిపోయింది. కనీస అవసరాలను తీర్చుకోగల స్థ్థాయిలో లేమని, తమ కొనుగోలుశక్తి గతంలో ఎన్నడూలేనంత దిగువ కు పడిపోయిందని వాపోతున్నారు. కానీ వీటిని సరిదిద్దాల్సిన వారు నారుపోసినవాడే నీరు పోస్తాడు ప్రార్థించమని సూక్తులు చెప్తున్నారు. ఇలాంటి వారికి మనం చేతులెత్తి నమస్కరించడం తప్ప, సామాన్య ప్రజ లు చేయగలిగిందేమీ లేదు.

భారతదేశంలోని అన్నిరకాల ఉత్పత్తులు, సేవారంగాలు కలిపి గత ఆర్థిక సంవత్సరంలో చేసిన మొత్తం ఉత్పత్తిలో కనీస సగానికి కూడా సరిపోయే స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోని ఆరునెలలలో సాధించలేదు. మీకు భయం లేదు వచ్చే రెండు, మూడేండ్లలో భారతదేశ ఆర్థి కప్రగతి, జాతీయ వృద్ధిరేటు ప్రపంచ ఆగ్రరాజ్యాల స్థాయికి చేరుతుందని ధైర్యం చెప్తున్న పాలకుల ఆత్మస్థైర్యానికి సామాన్య ప్రజలు నివ్వెరపో తున్నారు.
సామాన్యుల రోజువారి భోజనంలో ప్రధాన వస్తువైన ఉల్లిగడ్డల ధర లు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. భారతదేశం చంద్రున్ని చేరుకొంటున్న ఈ రోజుల్లో ఇంకా ఉల్లిగడ్డల గురించి ఆలోచించేవారంతా దేశద్రోహులని విమర్శించి, నోరు మూయించగల గొప్ప నాయకత్వం మనది.

వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగాలను కల్పించేవి సేవారంగం., ఆటోమోబైల్ రంగాలు. ఈ రంగాల్లో సంక్షోభం పెరిగిపోయింది. వీటిలో దాదాపు పది, పదిహేను శాతం ఉద్యోగులను తొలిగించే పరిస్థితులు కని పిస్తున్నాయి. అయితే అలాంటి మాటలు చెప్పేవారంతా విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మలు. వారు దేశాన్ని అల్లకల్లోలం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించడం అధికారపక్ష నాయకులకు అలవాటైపోయింది.
ప్రభుత్వరంగంలో బాగా లాభాలు సంపాదిస్తున్న సంస్థలతో పాటు నష్టాలను తెస్తున్నా సంస్థలున్నాయి. వీటిని ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అమ్మేయాలని ప్రభుత్వం గత నాలుగైదేండ్ల నుంచి ప్రయత్నిస్తున్నది. కానీ అనుకున్నస్థాయిలో ఈ అమ్మకం ప్రక్రియ కొనసాగడం లేదు. లాభాల్లో ఉన్న సంస్థలను అమ్మకానికి పెట్టేపుడు ప్రభుత్వం విధించే నిబంధనల విషయంలో పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేస్తు న్నారు.

ప్రభుత్వరంగంలోని లాభదాయక సంస్థలైన బీపీసీఎల్, హెచ్‌పీసీ ఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ లాంటి సంస్థలతో పాటు నష్టాలను తెస్తున్న తెహ్రీ లాంటి విద్యుత్‌సంస్థలను అమ్మకానికి పెట్టారు. కానీ ప్రభుత్వేతరులు ఎవరుకూడా ముందుకురాలేదు. దీంతో ప్రభుత్వ ఆధీనంలోని నవరత్న సంస్థలైన ఓఎన్జీసీ, ఎన్టీపీసీ లాంటి సంస్థలతో వీటిని కొనిపిస్తున్నారు. అంటే కుడి జేబులో డబ్బుల్లేకుంటే ఎడమ జేబులో నుంచి తీసి కుడి జేబులో పెట్టినట్లు ఒక సంస్థలోని లాభాలతో మరో ప్రభుత్వసంస్థను కొనడంలోని ఔచిత్యమేమిటో ప్రభుత్వ ఆర్థిక నిపుణలకే అర్థం కావాలి.

ప్రభుత్వాధికారుల చేతిలో ఈ సంస్థలు లాభాలను ఆర్జించలేవని చెపుతున్నవారే, మరో ప్రభుత్వసంస్థ ఎలా లాభాలు ఆర్జిస్తుందో చెప్పలేక పోతున్నారు. కొంతమంది అధికారుల నిర్లక్షం వల్లనో లేదా మార్కెట్ పరిస్థితుల వల్లనో ఒక సంస్థ నష్టపోతే దాన్ని అందరికీ అంటగట్టడం సరికాదు. ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప వ్యాపారం చేయకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడో చెప్పింది.
బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లాంటి సంస్థలను వాటి పూర్వ సొంతదారులైన విదేశ కంపెనీల కోణాలుకొన్న నేటి ప్రభుత్వ విధానాలు, ఆర్థిక ప్రణాళికలోని ఒడిదుడుకులను అర్థం చేసుకోలేక ముందుకురావడం లేదనే వాదన కూడా ఉన్నది. ఈ రెండుసంస్థలు ప్రపంచంలోని పెద్ద ఆయిల్ రిఫైనరీలు కలిగిన వాటి కోవలోకే చెందుతాయి.

ఇక ఎయిర్ ఇండియా పరిస్థితి మరీ అధ్వాన్నం. ఇది ప్రభుత్వానికి గుదిబండలా తయారైంది. దీనికి వివిధ రాష్ర్టాల్లో ఉన్న ఆస్తుల విలువ ఎంత ఉన్నా ఇందులో ప్రభుత్వం పెట్ట్టే గొళ్ళాలు, మెళికల వల్ల కూడా ఈ విమాన సంస్థను ఎవరు కొనడానికి ముందుకురావడం లేదు. గమ్మతేమంటే, ఈ సంస్థ నష్టాల్లో ఉందని తెలిసి మరీ కొత్త విమానాలను కొనడానికి అప్పులు తీసుకొమ్మ ని ప్రభుత్వం చెప్పడం అంటే కావాలనే ఈ సంస్థ అప్పులను పెంచాలని చూస్తుందనే విషయం అర్థమవుతుంది.
నేడు భారతదేశం ఆశ్రితపెట్టుబడిదారీ విధానంలో కొనసాగుతూ, నిజమైన పెట్టుబడిదారులను, తమకు వ్యతిరేకమైన వ్యాపార, వాణిజ్య వర్గాల పెద్దలను ఆదాయపన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర దాడులు చేయిస్తుందనే మాట అందరిలో ఉన్నది. ఎందుకంటే కర్నాటకలో రాజకీయ కుటుంబంతో సంబంధాలున్న కాఫీడే అధినేత అప్పులు తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఈ రెండు సంస్థలు అడ్డుకున్నాయనే ఆరోపణలున్నాయి. చివరికి ఆయన ఆత్మహత్య పారిశ్రామికుల్లో కలకలం రేపింది. అలాగే తమకు అనుకూలమైన డీహెచ్‌ఎల్‌ఎఫ్, పీఏంసీ, ఇండియబుల్స్‌లాంటి సంస్థల్లో జరిగిన ఆర్థిక నేరాలను, కుంభకోణాల ను బయటకురాకుండా వీలైనన్నిరోజులు కప్పిపెట్టి, చివరిక్షణంలో తప్పనిసరి అయిన వేల దివాళా ప్రక్రియ వైపు నడిపించగల సమర్థత, నైపుణ్యం గలమనవారనే మంచితనంతో పనిచేసే ప్రభుత్వాధినేతలు ఉండటం వల్ల సాధారణ పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు.

గతేడాది జీడీపీ వృద్ధి రేటు 6 శాతానికి అటుఇటుగా ఉంటే అది తమ గొప్పతనంగా చెప్పుకొన్నది ప్రభుత్వం. మరి ఇప్పుడు గత ఆరునెలల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. సామాన్యుల కొనుగోలుశక్తి పడిపోయింది. ఫలి తంగా జీడీపీ వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి తగ్గిపో యిం ది. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వల్లే అంటూ పార్లమెంట్, టీవీ చర్చల్లో ప్రకటించే నిసిగ్గుతత్వం కనపడుతున్నది. ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వం తన పునాది అయిన ఆర్‌ఎస్‌ఎస్, దాని మాన సపుత్రిక అయిన స్వదేశీ జాగరన్ మం చ్‌ల ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దేశ ఆర్థికరం గాన్ని ప్రధాని ఆశించే, కళలుగానే 5 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లడానికి అన్నివర్గాల వారిని ఆహ్వానించి, వారి సూచనలు, సలహాలు తీసుకొంటే తప్ప మన వృద్ధిరేటు పెరుగదు. ఫలితంగా కనీస నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయగలిగే స్థితిలో సామాన్యుడు ఉండడు.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)

663
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles