సీఎం నిర్ణయం భేష్


Wed,December 4, 2019 12:26 AM

55 రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మి కులను ఎలాంటి షరతులు విధించకుండా మళ్లీ విధుల్లో చేర్చుకోవాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమైనది. అం తేకాకుండా సమ్మెకాలం జీతాలు కూడా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ పట్ల యావత్ ఆర్టీసీ కార్మిక లోకం సంతో షం వ్యక్తం చేస్తున్నది. సమ్మెకాలంలో మర ణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబంలోని ఒక వ్యక్తికి ఉద్యోగం, తక్షణ సాయం కింద 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లిం చాలని అధికారులను ఆదేశించటం కార్మి కుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమను తెలియజేస్తున్నది. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగు లు యూనియన్ నాయకుల మోసపూరిత మాటలను పక్కనబెట్టి ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కృషిచేయాలె.
- బైరి జనార్దన్, ప్రగతినగర్, హైదరాబాద్


అవగాహన కల్పించాలె

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు షీ టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీజీపీకి లేఖ రాయడం మంచి నిర్ణయం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళా శాలల్లోని విద్యార్థినులకు ఆత్మరక్షణ మెళకువలు నేర్పించాలి. విద్యార్థిను ల్లో అవగాహన పెంచాలి. వేధింపులకు గురవుతున్న మహిళలు, విద్యార్థి నులు పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత షీ టీమ్స్‌పై ఉన్నది.
- బేగరి ప్రవీణ్‌కుమార్, అంతారం, రంగారెడ్డి జిల్లా

ఆల్ ది బెస్ట్

దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే సంవత్సరం జనవరిలో ప్రారంభం కానున్న అండర్-19 ప్రపంచకప్‌కు హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్‌వర్మ సెలెక్ట్ కావడం హర్షణీయం. తిలక్ వర్మ ఈ మెగా టోర్నీలో తన సత్తా నిరూపించుకొని భారత జట్టులో చోటు దక్కించుకోవాలి. అండర్-19 ప్రపంచకప్‌లలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికైన కోహ్లీ, కైఫ్ లాంటి క్రికెటర్లను తిలక్‌వర్మ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్ తిలక్‌వర్మ.
- జవ్వాజి సుధాకర్, కురిక్యాల, కరీంనగర్

196
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles