అమ్మప్రేమకు ప్రతిరూపం


Sun,December 1, 2019 12:36 AM

ఆర్టీసీ సమస్త జనావళి జీవితాలతో ముడిపడి ఉన్నటువంటిది. అభివృద్ధికి మొదటి మెట్టు. ఇలాంటి కీలక, ప్రాధాన్య సంస్థలో అరాచకులు తిష్ట వేసి రాష్ర్టాభివృద్ధికి ఆటంకం కల్పిస్తామంటే సహించరానిది. అలాంటి ప్రాధాన్య సంస్థలో అరాచకులు పాగా వేస్తే కార్మికుల బతుకులు ఆగమవుతాయి. ఈ సత్యాన్ని కార్మిక లోకం కూడా అర్థం చేసుకున్నది.

Srinivasss
అబద్ధం మనుషులను దూరం చేస్తుంది, అపా ర్థం మనసులను దూరం చేస్తుంది.... ఆర్టీ సీ కార్మికులు-కేసీఆర్ విషయంలో అదే జరిగింది. తన ధ్యాస, తన శ్వాస తెలంగాణగా బతుకుతున్న కేసీఆర్ నేను తెలంగాణను చెడగొట్టను-చెడ గొట్టేవాళ్లను క్షమించను అని ప్రకటిం చి పరిశ్రమిస్తున్నారు. కేసీఆర్ తనకు కార్మికులకు మధ్య అబద్ధం చోటుచేసుకోవడాన్ని, అపార్థం చోటుచేసుకోవడాన్ని సహించలేకపోయారు. కాబట్టి, ఒక తల్లి తన బిడ్డలను కోపగించుకున్నట్టు మాతృహృదయంతోనే బెత్తం పట్టుకున్నారు. అంతమాత్రాన ఏ తల్లి అయినా తన బిడ్డలను ఆకలికి బలి చేస్తుందా? బిడ్డలకు జీవనాధారం లేకుండా చేసి క్షోభకు గురిచేస్తుందా? చేయదు. కేసీఆర్ విషయంలో కూడా కచ్చితంగా ఇదే జరిగింది. మూర్తీభవించిన మాతృ హృదయంతో, మన్నించే తల్లి మనస్సుతో తన బిడ్డల్లాంటి ఆర్టీసీ కార్మికుల తప్పొప్పులను క్షమించి, వారి కష్టానికి, కల్మషం లేని సేవకు విలువిచ్చి, షరతులు లేని పునరాగమనానికి చేతులు చాపారు. దాదాపు రెండు నెలల సందిగ్ధానికి, అభద్రతాభావానికి, ఆందోళనకు శాశ్వతంగా తెరదించారు.

ఆశ మనిషి సహజగుణం. అత్యాశ నాయకుల అసహ జ లక్షణం. హక్కులు తప్ప బాధ్యతలు ఎరుగని నాయకు లు, ప్రశ్నించడం తప్ప సమాధానం ఇవ్వడం తెలియని నాయకులు, సమయ సందర్భాలు, పరిస్థితుల ప్రభావా లు, వాస్తవ స్థితిగతులూ బేరీజు వేసుకోలేని నాయకులు, తమను నమ్మిన కార్మికుల ఆశలే ఆయుధంగా అధికార పీఠంపై అస్త్రం ఎక్కుపెడుతరు. ఇలాంటి సందర్భంలో విమర్శలను, విషపు ప్రచారాలను భరిస్తూ సంస్థ మనుగ డ కోసం, కార్మికుల భవిష్యత్ కోసం కీలకమైన నిర్ణయా లు తీసుకునేందుకు కాస్త సమయం తీసున్నారు కేసీఆర్. తన మానవతా హృదయాన్ని, కార్మికుల ఎడల బాధ్యత నూ ఔదార్యాన్ని చాటుకున్నారు. కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరమని గొప్ప ఊరట కల్పించారు. కార్మికులకు ఎలాంటి వేధింపులుండవని స్పష్టమైన హామీ ఇచ్చి తిరుగులేని ధైర్యం నూరిపోశారు. సమ్మెకా లంలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యో గం ఇస్తామని ప్రకటించి ఆ కుటుంబాల్లో దీపం వెలిగించారు. ఆ కుటుంబాలకు చెందిన బిడ్డలు అనాథలు కాకుం డా, ఆకలిబారిన పడకుండా దారిచూపారు.

నిజానికి ఆర్టీసీ గురించి, ఆ కార్మికుల గురించి వారి కష్టం గురించి కేసీఆర్‌కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. గతంలో రోడ్డు రవాణా శాఖా మంత్రిగా పనిచేసి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించిన ఘనచరి త్ర కేసీఆర్‌కు ఉన్నది. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగి ఆర్టీసీ డిపోలను, బస్ స్టేషన్లను స్వయంగా సందర్శించి కార్మికులను ఉత్సా హపరిచి, వారికి భరోసా ఇచ్చి ఆర్టీసీని లాభాల బాట పట్టించారు. ప్రయాణికుల కష్టాలు స్వయంగా పరిశీలించి, మెరుగైన సేవలు అందేలా చేసి వారి మన్ననలు పొందా రు. కానీ తన నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ లో, తన సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో తన ఆశలకు అనుగుణంగా, దేశంలోనే మిన్నగా తీర్చిదిద్దాలనుకు న్న ఆర్టీసీ నుంచి రాష్ర్టాధినేతకు తగిన సహకారం కొరవడింది. ఉద్యమ సమయంలో స్వయంగా తన ప్రోత్సాహం తో ఎదిగిన నాయకులు తమ స్వార్థం కోసం, తమ ఆధి పత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలతో చేతులు కలిపి సమ్మె పేరుతో బెదిరింపు రాజకీయాలకు పాల్పడ టం సహించరానిది. కార్మికులకు మాయమాటలు చెప్పి ఆర్టీసీ సంస్థనే విచ్ఛిన్నం చేసేందుకు యూనియన్ నేతలు పూనుకున్న నేపథ్యంలో కేసీఆ ర్ కొంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. కార్మిక నాయకుల కుటిలత్వాన్ని అర్థం చేసుకొని, వారి నుంచి కార్మికులు భవిష్యత్తులో ఎదుర్కోబో యే అనర్థాల నుంచి కాపాడేందుకు తానే స్వయంగా కార్మికులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరుచుకునేందుకు పూనుకోవటం ఆహ్వానించదగినది.

అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి డిపో నుంచి అనుభవజ్ఞులైన కార్మికులను ప్రగతిభవన్‌కు ఆహ్వానించి వారితో సంస్థ బాగోగుల గురించి చర్చించి తగు నిర్ణయాలు తీసుకునేందుకు సన్నద్ధమవటం ముదావహం. ఇప్పటికే సంస్థ తక్షణ అవసరాల నుంచి గట్టెక్కించేందుకు వం ద కోట్లు కేటాయించారు. ప్రజలకు కొంత భారమైనా, సమ్మెద్వారా సంస్థ నెత్తినపడ్డ భారాన్ని తగ్గించేందుకు, సం స్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకూ బస్సు చార్జీలను పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్టీసీని కేసీఆర్ అమ్మేయబోతున్నారని, ప్రైవేట్ వ్యక్తులకు సంస్థను ధారాదత్తం చేయబోతున్నారనీ ఇల్లెక్కి గోల చేసిన ప్రతిపక్ష నేత లు సిగ్గుతో తలదించుకునేలా, ప్రైవేట్ రూట్లు ఉండబోవ ని వాటిని ఆర్టీసీకే ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు. దీం తో ఆర్టీసీ కార్మికులను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనం పొందాలని పగటికలలు కన్న ప్రతిపక్షాల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. వారి నోళ్లు మూతపడ్డా యి. ఇప్పుడున్న జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్లో ఏ రంగమైనా పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉండటం అసాధ్యం. ఈ విషయం విపక్షాలకూ తెలియంది కాదు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం కూడా బస్సు రూట్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ, కేసీఆర్ మాత్రం కార్మికుల మీద ఉన్న అపారమైన ప్రేమ తో వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రైవేట్ రూట్లను కూడా ఆర్టీసీ అప్పగించాలన్న గొప్ప నిర్ణయం తీసుకున్నా రు. కార్మికుల పట్ల తనకున్న అభిమానం చాటుకున్నారు.

నిజాయితీగా చెప్పుకోవాలంటే, కార్మిక నాయకులకు -రాజ్యానికి మధ్య ఉన్న సంబంధం, బాధ్యత, నిబద్ధతకు సంబంధించినది. ఎవరు తమ విద్యుక్తధర్మాన్ని, బాధ్య తను మరిచినా అసలుకే మోసం వస్తుంది. ఆశించిన లక్ష్యం అటకెక్కుతుంది. ఆర్టీసీ సమస్త జనావళి జీవితాల తో ముడిపడి ఉన్నటువంటిది. అభివృద్ధికి మొదటి మెట్టు. ఇలాంటి కీలక, ప్రాధాన్య సంస్థలో అరాచకులు తిష్ట వేసి రాష్ర్టాభివృద్ధికి ఆటంకం కల్పిస్తామంటే సహించరానిది. అలాంటి ప్రాధాన్య సంస్థలో అరాచకులు పాగా వేస్తే కార్మికుల బతుకులు ఆగమవుతాయి. ఈ సత్యాన్ని కార్మిక లోకం కూడా అర్థం చేసుకున్నది. పరిధులు, పరిమితులూ దాటి దుస్సాహసాలకు దిగితే ఎంతటి విపత్తు ఏర్పడు తుందో ఆర్టీసీ సమ్మె ప్రబల ఉదాహరణ.
ఇక నుంచైనా ఆర్టీసీ ప్రగతిరథాలు ప్రజా శ్రేయస్సులో భాగమవ్వాల్సిన అవసరం ఉన్నది. నిబద్ధత, నిమగ్నతతో వ్యవహరిస్తే, కన్నతల్లి ప్రేమతో కేసీఆర్ అక్కున చేర్చు కుం టారని ఇప్పటికే అనేకమార్లు రుజువైంది. దీనికి అనుగు ణంగా కార్మికలోకం నడుచుకోవాలి.

492
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles