బోనులో ఇరికిన పులి


Tue,November 19, 2019 01:43 AM

వాళ్లకు మేము తప్ప మరో గత్యంతరం లేదు. చచ్చినట్టు మాతో కలిసిరావాల్సిందే అని రెండు పార్టీలు భీష్మించుకు కూర్చున్నాయి. ఫలితంగా పీఠం దగ్గర మొదలైన లొల్లి తెగదెంపుల దాకా చేరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం కాగా.. రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి గద్దెనెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నది.

బాల్‌ఠాక్రే ఉన్నన్నాళ్లూ ఎప్పుడూ అధికార పీఠం కోరుకోలేదు. కింగ్‌గా ఉండటం కంటే కింగ్‌మేకర్‌గా ఉండటానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. తన వ్యవహారశైలి, పార్టీ మూల సిద్ధాంతాల పరంగా ఆయన అలా ఆలోచించి ఉండొచ్చు. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. మొదటిసారిగా ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. ఇదే ఊపులో కింగ్ మేకర్ నుంచి కింగ్‌గా ఎదుగుదామని భావించిన శివసేన బోనులో ఇరుక్కుంది.

hqdefault
మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా వీడటం లేదు. బీజేపీ కూటమి విఫలమైన తర్వాత శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం దాదాపు ఖాయమైనట్టే అని అంతా అనుకున్నారు. శివసేన దేనికైనా రెడీ అన్నట్టు సంకేతాలు ఇస్తుండగా.. ఎన్సీపీ-కాంగ్రెస్ ఇంకా చర్చోపచర్చలు సాగిస్తునే ఉన్నాయి. ఇది క్రమంగా శివసేనలో అభద్రతాభావాన్ని పెంచుతున్నది. పొత్తు కుదిరితే ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు ఇచ్చి ఎన్సీపీ, కాంగ్రెస్ డిప్యూటీ సీఎం పదవులు తీసుకుంటాయని వార్తలు వస్తున్నా యి. మంత్రులు, ఇతర పదవుల్లో మూడు వాటాలు తప్పనిసరి. పీఠంపై శివసేన కూర్చున్నా, పగ్గాలు మాత్రం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, కాం గ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేతుల్లోనే ఉంటుందనేది కాదనలేని వాస్త వం. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకాకుండా రాష్ట్రపతి పాలన కొనసాగి నా.. మళ్లీ ఎన్నికలు జరిగినా శివసేనకు తిప్పలు తప్పవు. అక్టోబర్ 24న అసెంబ్లీ ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఇప్పటివరకు పరిణామాలను గమనిస్తూ, భవిష్యత్తును విశ్లేషిస్తే.. పులి బోనులో ఇరుక్కున్నట్టే కనిపిస్తున్నది.

ఫలితాల వెల్లడి తర్వాత బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అంతా సాఫీగా సాగిపోతుందని దేశమంతా భావించింది. కానీ అనూహ్యంగా 50-50 ఫార్ములా తెరపైకి వచ్చింది. అధికారాన్ని చెరో రెండున్నరేండ్లు పంచుకునేందుకు ఒప్పందం కుదిరిందని శివసేన.. అలాంటిదేమీ లేదని బీజేపీ ప్రకటించాయి. వాళ్లకు మేము తప్ప మరో గత్యంత రం లేదు. చచ్చినట్టు మాతో కలిసిరావాల్సిందే అని రెండు పార్టీలు భీష్మించుకు కూర్చున్నాయి. ఫలితంగా పీఠం దగ్గర మొదలైన లొల్లి తెగదెంపుల దాకా చేరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం కాగా.. రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి గద్దెనెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నది. ఇక్కడే బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ పెద్దలు తమ రాజకీయ పరిణతి ని, వ్యూహ చతురతను ప్రదర్శించారు.

ఇప్పటివరకు జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నా.. శివసేన బలవంతం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయనే భావన కలుగుతుంది. మోదీ-షా, పవార్, సోనియా కలిసి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన బృందాన్ని రెచ్చగొట్టడం ద్వారా అలాంటి పరిస్థితులు సృష్టించారనడం కరక్టేమో. దీంతో నల్లేరుపై నడకలా సాగాల్సిన చోట శివసేన కత్తిమీద సాము చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.బీజేపీ కోణంలో పరిశీలించినప్పుడు.. సాధారణంగా బీజేపీ తన మిత్రపక్షాలకు ఎదిగే అవకాశం ఇవ్వదు. చాపకింద నీరులా తానే విస్తరి స్తూ ఉంటుంది. బీహార్ మినహా ఎన్డీయే అధికారంలో ఉన్న అన్ని రాష్ర్టా ల్లో ఇదే పరిస్థితి. మహారాష్ట్రలో శివసేన మాత్రం దశాబ్దాలుగా కొరకరా ని కొయ్యగా ఉన్నది. రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో శివసేన చాలా బలంగా ఉన్నది.

ఇప్పుడు శివసేన తన బద్ధశత్రువు, లౌకికవాద కాంగ్రెస్‌తో చేతులు కలుపడం వల్ల హిందూత్వ ఓటుబ్యాంకు.. ముఖ్యంగా మరాఠేతర ఓటుబ్యాంకును బీజేపీ తనవైపు తిప్పుకోవచ్చు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ అనూహ్యస్థాయిలో బలపడే అవకాశం ఉన్నది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా.. ఐదేండ్లపాటు కొనసాగుతుందని కచ్చితంగా చెప్పలేం. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి పీకలమీద కత్తి పెట్టడానికైనా వెనుకాడదు. ఏ నిర్ణ యం తీసుకోవాలన్నా ఢిల్లీ నుంచి అనుమతి తప్పనిసరి. క్రమశిక్షణ విషయంలోనూ శివసేనకు చికాకు తప్పకపోవచ్చు. ఇలా పార్టీల మధ్య ఏర్ప డే లుకలుకలను బీజేపీ అవకాశంగా మలుచుకొని కర్ణాటక తరహాలో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే అంతిమంగా ఈ పరిణామాలన్నింటికీ శివసేసే కారణమనే నింద పడుతుంది.

కాంగ్రెస్, ఎన్సీపీ కోణంలో పరిశీలించినప్పుడు.. ఒకే దెబ్బకు రెండుమూడు పిట్టలు కొట్టే వ్యూహం కనిపిస్తున్నది. సంకీర్ణం పేరుతో శివసే న హిందుత్వ వాదానికి, సావర్కర్ నినాదానికి కళ్లెం వేయగలిగితే హిం దూ ఓటర్లు ఆ పార్టీకి దూరమవుతారు. దీనిని బీజేపీ అందిపుచ్చుకోగలిగితే పులి బక్కచిక్కుతుంది. కాంగ్రెస్, ఎన్సీపీ దృష్టిలో ప్రత్యర్థి పార్టీ ల్లో ఒకటి బలహీనపడుతుంది. ఇది మొదటి లాభం. పీఠంపై లొల్లి మొదలైన తర్వాత శివసేనకు ఎన్సీపీ మద్దతు పలికినా.. కాంగ్రెస్ మాత్రం బీజేపీతో తెగదెంపులు చేసుకోవాల్సిందేనని షరతు పెట్టింది. దీంతో ఎన్డీయే నుంచి శివసేన బయటికివచ్చింది. ఇకపై రాష్ట్రంలో బీజే పీ, శివసేన ప్రత్యర్థులుగా మారనున్నాయి. సమీప భవిష్యత్తులో జరుగబోయే అన్ని ఎన్నికల్లో హిందుత్వ ఓటుబ్యాంకును పంచుకుంటాయి. ఇన్నాళ్లూ వీరికి మద్దతు పలికిన తటస్థ ఓటర్లు వేరే పార్టీని ఆశ్రయించవ చ్చు. ఇది ఓట్లపరంగా కాంగ్రెస్, ఎన్సీపీకి కలిసొస్తుంది. ఇక సంకీర్ణ ప్రభు త్వం ఏర్పడి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తే ఆ ఖ్యాతి మూడు పార్టీలకు సమానంగా దక్కుతుంది. హిందుత్వ ఓటర్లు బీజేపీని వదిలి శివసేన వైపు, తటస్థ ఓటర్లు మూడు పార్టీలదిక్కూ చూసే అవకాశం ఉం టుంది. దీంతో బీజేపీ బలహీనమవుతుంది. ఇది ఒకవిధంగా తుపాకీని శివసేన భుజాలపై పెట్టి బీజేపీని కాల్చడం వంటిదే.
Mahendarreddy
ఒకవేళ ప్రభుత్వం ఏర్పడకపోతే శివసేన మినహా మూడుపార్టీలకు వచ్చే నష్టమేమీ లేదు. శివసేన మొండి పట్టుదల వల్లే ఇదంతా జరిగిందంటూ బీజేపీ నింద వేస్తుంది. శివసేన, బీజేపీ వల్లే అస్థిరత అంటూ ఎన్సీపీ, కాంగ్రెస్ హాయిగా తప్పించుకుంటాయి. పైగా.. ఉద్ధవ్ ఠాక్రే మాదిరిగా తాము అధికారం కోసం సిద్ధాంతాలకు విరుద్ధంగా అడ్డదారు లు తొక్కలేమంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తాయి. శివసేన మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోతుంది. ఇటు 50-50 ఫార్ములాపై బీజేపీ అబద్ధమాడిందని నిరూపించలేదు.. అటు బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చేతులు కలుపడాన్ని సమర్థించుకోనూ లేదు. ఫలితంగా మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఓటు బ్యాంకు చీలడం ఖాయం.

చివరగా.. శివసేన ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ రణరంగంలో ఉన్నది. బాల్‌ఠాక్రే 1966లో పార్టీని స్థాపించారు. దాదాపు 15 ఏండ్ల తర్వాత 1980లో బీజేపీ పురుడుపోసుకున్నది. రెండు పార్టీలదీ హిందు త్వ ఎజెండానే అయినా.. మరాఠా నినాదం కారణంగా మహారాష్ట్రను దాటి శివసేన విస్తరించలేకపోయింది. పైగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోసాగింది. బాల్‌ఠాక్రే ఉన్నన్నాళ్లూ ఎప్పుడూ అధికార పీఠం కోరుకోలేదు. కింగ్‌గా ఉండటం కంటే కింగ్‌మేకర్‌గా ఉండటాని కే ప్రాధాన్యం ఇచ్చేవారు. తన వ్యవహారశైలి, పార్టీ మూల సిద్ధాంతాల పరంగా ఆయన అలా ఆలోచించి ఉండొచ్చు. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. మొదటిసారిగా ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. ఇదే ఊపులో కింగ్ మేకర్ నుంచి కింగ్‌గా ఎదుగుదామని భావించిన శివసేన బోనులో ఇరుక్కుం ది. అదే సమయంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి శివసేన తన దూకుడుకు కళ్లెం వేసుకొని, సర్దుకుపోయే గుణాన్ని అలవాటుచేసుకొంటే మాత్రం మహారాష్ట్రలో బీజేపీకి కష్టకాలం మొదలైనట్టే.

670
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles