కార్మికులను ఆగం చేసిందెవరు?


Tue,November 19, 2019 01:41 AM

సెప్టెంబర్ 1న కేంద్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారమే కేసీఆర్ 5100 రూట్లపై పర్మిట్లు ఇచ్చారు. ఆ చట్టం రూపొందించి ఆమోదించిన బీజేపీ నాయకులు నేడు వింత వాదన చేయడం అర్థరహితం. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో 7 వేల బస్సులు ఆర్టీసీలో ఉంటే 25 వేల బస్సులు ప్రెవేట్‌లో ఉన్నాయి. మరి దీనికి బీజేపీ తెలంగాణ నాయకులు ఏం సమాధానం చెబుతారు? 67 శాతం జీతాలు పెంచి ఆదుకున్నదెవరు? అర్థం పర్థం లేకుండా సమ్మెకు ఉసిగొల్పి ఆగం జేస్తున్నదెవరో ఆర్టీసీ కార్మికులు ఇకనైనా గమనించాలి.

VijayT
తెలంగాణ.. నాలుగు కోట్ల ప్రజల చిరకాల కల ఎన్నో త్యాగా లు, పోరాటాలతో సాధ్యమైంది. సాధించుకున్న తెలంగాణ ఒక బలమైన శక్తిగా దేశానికే ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తూ, ప్రతి ఎకరానికి నీరందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణను నిలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అద్భుతంగా పాలన నడుస్తున్న సమయంలో అధికార వాంఛ తప్ప మరో ఆలోచన లేని కుట్రల ముఠా కన్ను తెలంగాణపై పడింది. తెలంగాణపై ఉద్యమకాలం నుంచి నేటి వర కు అనేక కుట్రలు జరిగాయి. కేసీఆర్‌కు కుట్రలను ఛేదించడం కొత్తకాదు. తెలంగాణను ఆగం చేయాలని చూసిన ఎందరో ఉద్ధండులను పొలిమేరల దాకా తరిమిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఆ నేపథ్యంలోంచే గత నలభై రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది. ఆర్టీసీ విలీనం ప్రధాన డిమాండ్ గా దసరా పండుగ ముందు సమ్మెను ప్రారంభిస్తున్నట్టు యూనియన్లు ప్రకటించాయి. 48 వేల మంది కార్మికులను పక్కదారి పట్టిస్తూ ఉసిగొల్పి సమ్మెలోకి దించారు. కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. సమ్మె మొదలైనప్పుడు కార్మికులతో ఉన్న నాయకులు నేడు మొహం చాటేశారు. పొలికల్ మైలేజ్‌గా మారుతుందనుకున్న ఆర్టీసీ సమ్మె బెడిసికొట్టడంతో పార్టీలన్నీ పక్కకు తప్పుకొని నేడు కార్మికులను బలి పశువులను చేశాయి.

ఇక్కడ లోపం ఎవరిది? రెచ్చగొట్టిన వారెటుపోయారు? బీరాలు పలికినవారు ఏమైపోయారు? విలీనం చేయాలన్న బీజేపీ నాయకులు విలీనం మా ఎజెండాలో లేదని మాట మార్చడం వెనక మతలబు ఏంటి? మైకుల ముందు వీర ఉపన్యాసాలు దంచికొట్టిన వారెవరూ నేడు కార్మికులతో కనపడరేం? ఇప్పటికైనా కార్మికులు ఆ దిశగా ఆలచన చేయాలి.తెలంగాణను అర్థం చేసుకోవాలంటే తెలంగాణను ప్రేమించగలుగాలి. తెలంగాణలో సబ్బండవర్గాలకు మేలుచేస్తున్న ముఖ్యమంత్రి ఆర్టీసీ సమ్మె విషయంలో ఎందుకు కఠినంగా ఉన్నారో ఆలోచించాలి. వాస్తవానికి రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్టీసీని కష్టం వచ్చిన ప్రతీసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటూ వచ్చారు. నాడు సకలజనుల సమ్మెలో పాల్గొన్నవారికి సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను తెలంగాణ ఏర్పాటు తర్వాత అందజేశారు. రాష్ట్ర అవతరణ తర్వాత వారి వేతనాలను భారీగా పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే. 67 శాతం జీతాలను పెంచి దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయ ని సాహసాన్ని కేసీఆర్ చేశారు. ఇది కార్మికులు బాగుండాలనే ఉద్దేశం తప్పి తే ఇంకేం లేదు. సీఎం కేసీఆర్‌ను వీళ్లు అర్థం చేసుకున్నదేమిటి? పలుమా ర్లు కేసీఆర్ వారికి వాస్తవాలు వివరించి విధుల్లో చేరాలని సూచించినా కార్మికులను విధుల్లో చేరకుండా కొన్ని పార్టీలు అడ్డం పడ్డాయి. అయినా సీఎం కేసీఆర్ సమ్మెకాలంలో సమర్థవంతంగా బస్సులను నడిపిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులపై ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు.. వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయలేక పోయాయి? కేంద్రం మోటర్ వెహికిల్ చట్టం ప్రవేశపెట్టి ఆమోదించినప్పుడు ఇక్కడి బీజేపీ నాయకులు నిద్రపోయారా? ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ జీతం కేవలం రూ.7-18 వేలు మాత్ర మే. కానీ తెలంగాణలో ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో బతుకాలని, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని వారి జీతాల ను రెట్టింపు చేశారు సీఎం కేసీఆర్. ఇక్కడ ఆదుకున్నదెవరు, ఆగం జేస్తున్నదెవరు? కార్మికులు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవ్వాళ ప్రజలే ఆర్టీసీ కార్మికుల సమ్మె అర్థరహితం అంటున్నారు.

వింత వాదనలు, వికృత చేష్టలు, కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషం, అధికారం దక్కట్లేదనే అసూయతో కొన్ని పార్టీలు తమ అక్కసునంతా ప్రభుత్వం, కేసీఆర్‌పై వెళ్లగక్కేందుకు ఆర్టీసీ కార్మికులను అస్త్రంగా మలుచుకున్నారు. వికృత రాజకీయ క్రీడను ప్రారంభించారు. అశ్వథ్థామరెడ్డి కొన్ని పార్టీల ట్రాప్‌లో పడి స్వార్థంతో కార్మికులను రెచ్చగొట్టి లేని ఆశలు కల్పించి కార్మి కుల జీవితాలను రోడ్డుపై పడేశాడు. కార్మికుల ఆత్మహత్యలకు, ఆర్టీసీ కార్మికులు ఆగం కావటానికి బీజేపీ, అశ్వథ్థామరెడ్డి బాధ్యత వహించాలి. ఆర్టీ సీ ఇంకా ఏపీ నుంచి విడిపోలేదని, కేసీఆర్‌కు ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసే హక్కులేదని, కేసీఆర్‌ను గద్దెదించాలని కొందరు బ్లాక్ మెయిలర్లు అసంబద్ధ వాదనలు చేస్తున్నారు. అవగాహన లేని బీజేపీ నాయకులు పన్నిన పన్నాగంలో కార్మికులు చిక్కుకున్నారు. పండుగపూట సమ్మెకు వెళ్లి లాభా లు వచ్చే సమయంలో నష్టాలను మిగిల్చి, జరుగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు విలీన డిమాండ్‌ను వదులుకుంటున్నాం ముఖ్యమంత్రి మమ్మ ల్ని చర్చకు పిలువాలని కార్మిక నేతలు చెప్తూ ఒకవైపు కార్యచరణ ప్రకటించడం దేనికి సంకేతం.

దేశంలో ఆర్థిక మాంద్యానికి కారణం బీజేపీ. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం అసంబద్ధం. సెప్టెంబర్ 1న కేంద్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారమే కేసీఆర్ 5100 రూట్లపై పర్మిట్లు ఇచ్చారు. ఆ చట్టం రూపొందించి ఆమోదించిన బీజేపీ నాయకులు నేడు వింత వాదన చేయడం అర్థ రహితం. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో 7 వేల బస్సులు ఆర్టీసీలో ఉంటే 25 వేల బస్సులు ప్రెవేట్‌లో ఉన్నాయి. మరి దీనికి బీజేపీ తెలంగా ణ నాయకులు ఏం సమాధానం చెబుతారు? 67 శాతం జీతాలు పెంచి ఆదుకున్నదెవరు? అర్థం పర్థం లేకుండా సమ్మెకు ఉసిగొల్పి ఆగం జేస్తున్నదెవరో ఆర్టీసీ కార్మికులు ఇకనై నా గమనించాలి.

తెలంగాణ ఎదుగుదల ఇష్టం లేని ప్రతిపక్ష పార్టీలు ప్రశాంతంగా ఉన్న చోట ఆందోళనలు రేకెత్తించి, కార్మికులను ఉసిగొల్పి వారి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. దీనికి కొన్ని మీడియా సంస్థలు తమ కళనంతా రంగరించి తెలంగాణపై థాట్ పోలిసింగ్ చేస్తూ తమ కుట్రలను అమలు చేస్తున్నాయి. కార్మికులు ఒక్కసారి ఆలోచన చేయాలి ఆదుకున్నదెవరు? ఆగంజేస్తున్నదెవరో తెలుసుకోవాలి. విధుల్లో చేరిన కార్మికులపై భౌతిక, మానసికదాడులు జరిపి వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు యూనియన్, ప్రతిపక్షనేతలు. గతంలో మల్లన్నసాగర్‌తో పాటు పలు అంశాల్లో ఈ సోకాల్డ్ మేధావులు, ప్రతిపక్ష నాయకులు ప్రజలను, రైతులను రెచ్చగొట్టి ఆగం చేశారు. చివరికి వాళ్లను వదిలి ఇంకోచోట టెంట్ వేశారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఆసరా చేసుకొని ప్రతిపక్షాలు కుట్రకు దిగాయి. కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు దించి వారికి తీరని నష్టం కలుగజేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణమవుతున్నారు.

కేసీ ఆర్ మనసున్న నేత. అతను తెలంగాణ సాధించినవాడు, నిర్మిస్తున్నవా డు. దేశమే మెచ్చిన పాలనకు అధినేత కేసీఆర్. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్నివర్గాలపై, ముఖ్యంగా కార్మికులపై ఎనలేని ప్రేమ ఉంటుం ది. అందుకే వారిని అన్నివిధాలా ఆదుకున్నారు. ఇకనైనా కార్మికులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్టీసీ భవిష్యత్తు గురించి మాత్రమే కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అపోహలు వీడి, పంతాలు వీడి ఆర్టీసీ కార్మికులు సమ్మె ను విరమించాలి. రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఇది ఆర్టీసీ సంస్థ, కార్మికుల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది.

610
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles