కాలుష్యం కాటు


Sun,November 17, 2019 12:43 AM

వాతావరణ మార్పుపై ప్రభుత్వాల నివేదికను డూమ్స్‌డే నివేదికగా పేర్కొంటారు. ఈ నివేదిక గత ఏడాది విడుదలైంది. వాతావరణ మార్పు వైపరీత్యాన్ని అరికట్టాలంటే భూగోళం రెండు డిగ్రీల మేర వేడెక్కకుండా నిరోధిస్తే సరిపోదని ఈ నివేదిక హెచ్చరించింది. భూగోళం ఒకటిన్నర డిగ్రీలకు మించి వేడెక్కకుండా నివారించాలని సూచించింది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే 2050 వరకు ఏటా శిలాజ ఇంధనాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ను 7.4 శాతం తగ్గిస్తూ ఉండాలె. ఈ లక్ష్యా న్ని సాధించాలంటే విధానకర్తలు ఏమి చేయాలనేది కూడా లాన్సెట్ నివేదిక సూచించింది. భారత్ అనుసరించవలసిన ఆరోగ్య, పర్యావరణ విధానాలను కూడా సూచించింది.

Student
వాతావరణ మార్పు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందనేది తెలిసిందే. అయితే ఈ ప్రభావం పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటుందని లాన్సెట్ కౌంట్‌డౌన్ 2019 నివేదిక వెల్లడించింది. 35 ప్రపంచ అకడమిక్ నివేదికల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం- వాతావరణ మార్పు వల్ల పంటలు దెబ్బతింటాయి. దీనివల్ల పిల్లలు పోషకాహారం పొందలేక అనారోగ్యం పాలవుతారు. వాతావరణ మార్పులు చోటు చేసుకోవడం వల్ల డెంగ్యూ, విరేచనాలు వంటి వ్యాధులకు గురవుతారు. వాయు కాలుష్యం వల్ల దీర్ఘకాలికంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాతావరణ మార్పునకు ఆరోగ్యానికి మధ్య ఉండే సంబంధం గురించి లాన్సెట్ కౌంట్‌డౌన్ నివేదిక 41 కీలకాంశాల ప్రాతిపదికగా చర్చించింది.

పిల్లలు ఎదుగుతున్న దశలో వారి శరీరాలపై, రోగనిరోధక వ్యవస్థలపై వాతావరణ మార్పు ప్రభావం ఎక్కువ ఉంటుందని లాన్సెట్ నివేదిక వివరించింది. పర్యావరణ కాలుష్య ప్రభావం కూడా ఎదుగుతున్న పిల్లలపై ఎక్కువగా ఉంటుందని లాన్సెట్ కౌంట్‌డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిక్ వాట్స్ వెల్లడించారు. పిల్లల ఊపిరితిత్తులు ఎదుగుతున్న దశలో వారు కాలుష్యానికి గురయితే అవి కుంచించుకుపోతాయి. ఊపిరితిత్తుల పనివిధానం మందగిస్తుంది. ఆస్తమా వల్ల ఇబ్బందిపడుతారు. గుండె పోటు కూడా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పసిపిల్లలపై ఈ దుష్ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. పంటల ఉత్పత్తి తగ్గితే వాటి ధరలు పెరుగుతాయి. దీంతో కొనుగోలుశక్తి తగ్గి పోషకాహార లభ్యత తగ్గుతుంది. దీంతో పిల్లలపై తగినంత పోషకాహారం అందదు. దీనివల్ల వ్యాధులు ఎక్కువగా సోకుతాయి. భూగోళ తాపం పెరుగుడం వల్ల కూడా రోగాలు పెరుగుతాయి.

భారత దేశంలోని మూడింట రెండు వంతుల శిశుమరణాలకు పోషకాహార లోపమే కారణం. పోషకాహారం లేకపోవడం వల్ల ఐదేండ్ల లోపు పిల్లలు ఎక్కువగా మరణిస్తున్నారు. 1960 దశకంలో మక్కజొన్న, వరి పంట దిగుబడి రెండు శాతం తగ్గిం ది. వాతావరణంలో మార్పు కూడా విబ్రియో బ్యాక్టీరియా పెరుగడానికి కారణమైంది. దీనివల్ల డయేరియా, కలరా వ్యాధులు ప్రబలాయి. వాతావరణ మార్పు వల్ల డెంగ్యూ ఎక్కువగా వస్తున్నది. 2000 సంవత్సరం తరువాత మొదటి పదేండ్లలోని తొమ్మిదేండ్ల పాటు డెంగ్యూ ఎక్కువగా కనిపించింది. పిల్లలు పెరిగే కొద్దీ వారిపై కాలుష్య ప్రభావం కూడా పెరుగుతూ ఉం టుంది. 2016-18 మధ్యకాలంలో బొగ్గు మూలంగా పదకొం డు శాతం కాలుష్యం ఏర్పడ్డది.

భారత్ శిలాజ ఇంధనాల్లో బొగ్గు అత్యంత కాలుష్యకారకం. ఈ కాలుష్యంతో పాటు కొన్నేండ్లుగా ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరిగాయి. 2001 - 14 మధ్యకాలంతో పోలిస్తే 2015- 18లో కార్చిచ్చులు పెరిగిపోయాయి. 77 శాతం ప్రపంచ జనాభా ఈ కార్చిచ్చుల ప్రభావాలకు గురయ్యారు. 2018లో వేడిగాలులకు గురైన వారి సంఖ్య 22 కోట్లు. వేడిగాలులు, కార్చిచ్చుల ప్రభావానికి గురైన వారి సంఖ్య భారత్‌లో ఎక్కువగానే ఉన్నది. 2018లో భారత్‌లో కార్చిచ్చులకు గురైన వారు రెండు కోట్లకు పైగా ఉంటే, వేడిగాలులకు గురైన వారు నాలుగున్నర కోట్లు. కార్చిచ్చులు, వేడిగాలులు ఎన్ని రోజుల పాటు వచ్చాయి, ఎంత మంది వీటి ప్రభావానికి గురయ్యారు అనేదానిని ఎంత ప్రభావం చూపుతున్నాయనేది లెక్కిస్తారు.

గత రెండు దశాబ్దాలలో వాతావరణ మార్పు వల్ల వచ్చే వ్యాధులను గుర్తించి అరికట్టడానికి భారత్ అనేక చర్యలు తీసుకున్నది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌కు చెందిన పూర్ణిమా ప్రభాకరన్ ప్రకారం- ప్రజారోగ్యం కోసం గత ఐదు శతాబ్దాలుగా సాగించిన కృషి వాతావరణ మార్పు వల్ల నిష్ప్రయోజనకరం అవుతున్నది. 2015లో వచ్చిన వేడిగాలుల వల్ల వేలాది మంది మరణించారు. అధిక జనాభా, ఆరోగ్య రక్షణలో ఉన్న అసమానతలు, పేదరికం, పోషకాహార లోపం మూలంగా భారత్‌లోని ప్రజలపై వాతావరణ మార్పు ప్రభావం అధికంగా ఉంటున్నది. సంపన్న దేశాలతో పోలిస్తే పేద మధ్యతరగతి దేశాలలో వాతావరణ మార్పు ప్రభావం అధికంగా ఉంటున్నది. ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాలు తగినంతగా లేకపోవడం వల్ల ప్రజలను వాతావరణ మార్పుకు అనుగుణంగా మారలేరు.

భూగోళం వేడెక్కడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయనేది తెలిసిందే. ఇప్పటికే భూగోళం పారిశ్రామిక యుగం కన్నా ముందు నాటితో పోలిస్తే ఒక డిగ్రీ సెల్సియస్ మేర వేడెక్కిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. 2100 నాటికి మూడు నుంచి ఐదు డిగ్రీల మేర వేడెక్కే ప్రమాదం ఉన్నది. అందువల్ల వాతావరణ మార్పును అరికట్టడానికి ప్రపంచం మరింత కృషి చేయవలసి ఉన్నదని లాన్సెట్ నివేదిక సూచించింది. స్పెయిన్‌లో వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో లాన్సెట్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకున్నది. భూగోళ తాపం రెండు డిగ్రీల సెల్సియస్‌కన్నా మించకుండా చర్యలు తీసుకోవాలని, వీలైతే ఒకటిన్నర డిగ్రీ దగ్గరే నిలిపివేయాలని ప్యారిస్ ఒడంబడిక సూచిస్తున్నది. ఈ విధంగా చర్యలు తీసుకోనట్టయితే వాతావరణ మార్పు పిల్లల ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపుతుంది.

వాతావరణ మార్పుపై ప్రభుత్వాల నివేదికను డూమ్స్‌డే నివేదికగా పేర్కొంటారు. ఈ నివేదిక గత ఏడాది విడుదలైంది. వాతావరణ మార్పు వైపరీత్యాన్ని అరికట్టాలంటే భూగోళం రెండు డిగ్రీల మేర వేడెక్కకుండా నిరోధిస్తే సరిపోదని ఈ నివేదిక హెచ్చరించింది. భూగోళం ఒకటిన్నర డిగ్రీలకు మించి వేడెక్కకుండా నివారించాలని సూచించింది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే 2050 వరకు ఏటా శిలాజ ఇంధనాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ను 7.4 శాతం తగ్గిస్తూ ఉండాలె. ఈ లక్ష్యా న్ని సాధించాలంటే విధానకర్తలు ఏమి చేయాలనేది కూడా లాన్సెట్ నివేదిక సూచించింది. భారత్ అనుసరించవలసిన ఆరో గ్య, పర్యావరణ విధానాలను కూడా సూచించింది.

వ్యాధులు ప్రబలకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలె. పం టల వైవిధ్యాన్ని పాటించాలె. తక్కువ నీటిని వినియోగించే, తక్కువ శ్రమ అవసరమయ్యే పంటలను ఎంచుకోవాలె. వ్యవసాయ రంగంలోని వారిని కాపాడటానికి మార్కెట్ వ్యవస్థలను మార్చాలె. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ పోవాలె. పర్యావరణ హిత ఇంధన వాడకాన్ని పెంచాలె. ప్రపంచవ్యాప్తంగా కూడా శిలాజ ఇంధనాల వాడకాన్ని క్రమంగా తగ్గించాలె. పేద దేశాలు పర్యావరణ హిత ఇంధనం వైపు మారడానికి సంపన్న దేశాలు ఏటా వంద బిలియన్ డాలర్ల తోడ్పాటు అందించాలె. సమర్థవంతమైన, చౌకైన, అందరికి అందుబాటులో ఉండే ప్రజా రవాణాను ప్రోత్సహించాలె. కొత్త వ్యాధులకు చికిత్స చేయడానికి వీలుగా ఆరోగ్యరంగాన్ని తీర్చిదిద్దుకోవాలె.
(వార్తా కథనం: ది వైర్)

335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles