చరిత్రను తిరిగి రాయాలా?


Sat,November 16, 2019 12:42 AM

భారత యూనియన్‌లో కశ్మీర్ విలీనానికి ప్రాతిపదికగా 370వ ఆర్టికల్‌ను వర్తింపజేయాలన్న ప్రతిపాదనను నెహ్రూతో పాటు అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, అప్పటి కేంద్రమంత్రి శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ (తర్వాత భారతీయ జనసంఫ్‌ు పార్టీ స్థాపకుడు) కూడా ఆమోదించారు అన్న చారిత్ర క సత్యం ఇటీవల అధికార పత్రాల నుంచి వెల్లడైంది! ఈ చారిత్రక సత్యా లు రుచించనివాళ్లు, ఈ సత్యాలను జీర్ణించుకోలేకపోతున్నవారు ఇప్పటి చరిత్రను మార్చి రాయాలంటున్నారు. చరిత్రకు వక్రభాష్యం చెప్పుతున్నారు.

క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దం వరకు ఎక్కడా ప్రాచీన భారత వాఙ్మయంలో హిందూ పదం ప్రస్తావనే లేదు. అప్పటివరకు హిందూ పదం ఒక మతానికి కాకుండా కేవలం ఒక సామాజికవర్గానికి మాత్రమే వర్తించిం ది. హిందూ మతం అన్నది తర్వాత అనేక ఏండ్లకు వచ్చిన మాట. ఈ చారిత్రక సత్యాలను సుప్రీంకోర్టులోని విజ్ఞులైన ఐదుగురు న్యాయమూర్తులు గమనించకపోవడం విచారకరం.

Devulapalliprabakar
చరిత్రను తిరుగరాయాలి. చరిత్రను తిరిగి రాయాలి... అన్నది ఈ రోజుల్లో కొందరి ముఖ్య నినాదం. ఈ నినాదం అలవోకగా ఇచ్చింది కాదని, దీనివెనుక పెద్ద కుట్ర ఉందని కొందరి అనుమానం. కొందరికి అన్నివైపుల అన్నీ కుట్రలే కనిపిస్తాయి. కొందరి కి ఎక్కడ ఏ కుట్రలూ కన్పించవు-వడ్డించిన విస్తరి వాళ్ల జీవితం. వాళ్లు నిశ్చయంగా అదృష్టవంతులు. 2019 ఏప్రిల్-మే లోక్‌సభ (17వ లోక్‌సభ) ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయన్నది ముఖ్యం కాదు.. ఇక నవభారత నిర్మాణం జరుగుతుంది.. అని బహుశా నోరుజారి అన్నారు. ప్రధాని మాట ప్రకారం ఇక నవభారత నిర్మాణం జరుగుతుందని విశ్వసించిన వారికి ఆశాభంగం తప్పడం లేదు-నవభారత నిర్మాణానికి బదులు ప్రాచీన లేక పౌరాణిక భారత నిర్మా ణం జరుగుతున్నది; శరవేగంతో! స్వతంత్ర భారతం ముందుకువెళ్లడానికి బదులు వెనుకకు వెళ్తున్నది. అన్నిరంగాల్లో పురోగమనానికి బదులు తిరోగమనం వికటాట్టహాసంతో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.

చరిత్ర ను తిరుగరాయాలి, తిరిగి రాయాలి అంటూ గట్టిగా ఈరోజు వాదిస్తున్నవారు నిజం చెప్పాలంటే ఇటీవల దేశచరిత్రలో ఎటువంటి పాత్ర నిర్వహించలేకపోయినవాళ్లు లేక బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దాదాపు రెం డు వందల ఏండ్లు దేశవిముక్తి, స్వాతంత్య్ర ఉద్యమాలను వ్యతిరేకించిన వారు, స్వాతంత్య్ర ఉద్యమంలో మీ పాత్ర ఏమంటే జవాబు చెప్పలేనివారు, చరిత్రహీనులు. సామాజిక చైతన్య ఉద్యమాల్లో మీరు చేసిందేమిటని ప్రశిస్తే సూటిగా సమాధానం చెప్పలేనివాళ్లు ఈ రోజు గొంతు విప్పి చరిత్రను మార్చి రాయాలంటున్నారు. ఇటీవలి భారత చరిత్రలోని, విశేషించి భారత ఆధునిక చరిత్రలోని, ముఖ్యంగా భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని చారిత్రక వాస్తవాలు, దేశ స్వాతంత్య్రం కోసం దేశభక్తి ఉద్దీపించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అసంఖ్యాకులు అపూర్వరీతిలో కావించిన అశేష త్యాగాలు, ఆ మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు దేశాభిమానంతో నిర్వహించిన మహోజ్వల పాత్ర గురించి చదువడం, వినడం, రాయడం ఇష్టం లేని వాళ్లు ఇప్పటి చరిత్రను మార్చి రాయాలంటున్నారు.

ఈ మధ్య ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్మారక గ్రంథాలయం, మ్యూజియం పాలకవర్గంలో కొన్ని మార్పులు జరిగా యి. పాత సభ్యులను మార్చి కొత్త సభ్యులను నియమించారు. కొత్తగా నియమితుడైన సభ్యుడు ఒకాయన ఇక దేశ ప్రజలు నెహ్రూను మర్చిపోవాలన్నాడు. చరిత్రను మార్చి, మార్పుచేర్పులు చేసి కొత్త చరిత్ర రాయాలంటున్నవాళ్లకు ఇప్పటి చరిత్రలోని కొన్ని ప్రశ్నలు, కొన్ని వాస్తవాలు ఇరకాటం, అయిష్టత, విముఖత కలిగిస్తున్నాయి. ఫలానా పార్టీ వాళ్లు బ్రిటిష్ పాలకులకు మద్దతు పలికారు, అండగా నిలిచారు.. అన్నది ఇప్ప టి చరిత్రలోని ఒక కీలకాంశం. ఫలానా పార్టీ బ్రిటిష్ పాలకుల ప్రోత్సాహంతో స్థాపితమై భారత స్వాతంత్య్ర ఉద్యమానికి వెన్నుపోటు పొడిచింది-నాజీల, ఫాసిస్టుల స్ఫూర్తితో మరో పార్టీ స్థాపితమైంది.. అన్నవి భారత స్వాతంత్య్ర ఉద్యమచరిత్రలో మరికొన్ని అంశాలు. కొందరు బ్రిటిష్ పాలకులకు క్షమార్పణ పత్రాలు రాసిచ్చి పోలీసుల అరెస్టుల నుంచి బయటపడ్డారు. తర్వాత వాళ్లే పెద్ద మనుషులుగా చెలామణి అయినారు..

అన్నది మరో చారిత్రక అంశం. భారత యూనియన్‌లో కశ్మీర్ విలీనానికి ప్రాతిపదికగా 370వ ఆర్టికల్‌ను వర్తింపజేయాలన్న ప్రతిపాదనను నెహ్రూతో పాటు అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భా య్ పటేల్, అప్పటి కేంద్రమంత్రి శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ (తర్వాత భారతీయ జనసంఫ్‌ు పార్టీ స్థాపకుడు) కూడా ఆమోదించారు అన్న చారిత్ర క సత్యం ఇటీవల అధికార పత్రాల నుంచి వెల్లడైంది! ఈ చారిత్రక సత్యా లు రుచించనివాళ్లు, ఈ సత్యాలను జీర్ణించుకోలేకపోతున్నవారు ఇప్పటి చరిత్రను మార్చి రాయాలంటున్నారు. చరిత్రకు వక్రభాష్యం చెప్పుతున్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ సారథి, అహింసామూర్తి, శాంతిదూత, జాతిపిత గాంధీజీది హత్య కాదని, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన హంతకుడు దేశభక్తుడని ఇటీవల విష కలుషిత ప్రచా రం జరిపినవాళ్లు కూడా చరిత్రను మార్చి రాయాలంటున్నారు. చరిత్ర గమనంలో తమకు అంటిన ఎన్నో మచ్చలను తొలిగించుకోవడానికి ఇది మంచి అవకాశమని భావిస్తున్నవాళ్లు వెంటనే కొత్త చరిత్ర రాయాలని తహతహలాడుతున్నారు. భవిష్యత్తులో ఏదో ఒకరోజు చరిత్రను మార్చాలంటున్నవాళ్లు దేశ రాజకీయాల్లో, పరిపాలనారంగంలో ప్రాబల్యం వహిస్తారని ఇందిరా గాంధీ ఆనాడే ఊహించారు.

చారిత్రక సత్యాలకు వక్రభాష్యం చెప్పడానికి వీల్లేకుండా ఇందిరాగాం ధీ ఆమె హయాంలో, ఆమెకు నచ్చిన, ఆమె ఆమోదించిన చారిత్రక అం శాలతో ఒక కాల నాళికను (టైమ్ కాప్సుల్‌ను) రూపొందింపజేసి ఢిల్లీలో భూగర్భంలో భద్రపరిచారు. ఈరోజు చరిత్రను మార్చి రాయాలంటున్నవాళ్లకు ఇందిరాగాంధీ కాలనాళిక చెవిలోని జోరీగ అవుతుంది. విచి త్రమేమంటే, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా వారం రోజుల కిందట అయోధ్య రామ జన్మభూమి వివాదంలో అపూ ర్వరీతిలో ఒక తీర్పు ఇచ్చింది. ఇది పాము చావని, కట్టె విరుగని తీర్పు. శాంతి, సామరస్యాల కోసమని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తు లు తమ రాజ్యాంగ ధర్మాసనంలో ఏకగ్రీవంగా 1045 పేజీల తీర్పు ఇస్తూ ఇప్పటి చరిత్రను విస్మరించి కేవలం వివిధవర్గాల (ప్రధానంగా మెజారిటీ వర్గం) విశ్వాసాలకు, భక్తావేశానికి, నిరాధార నమ్మకాలకు, భావనా ప్రభంజనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

దేశంలోని రాజకీయ వాతావరణానికి తగినట్లుగా వేషధారణ చేయడంలో, మాటలు మార్చడంలో తాము ఎవరికీ తీసిపోని దక్షులమని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులు ఈ తీర్పు ద్వారా నిరూపించారు. గావూ జలే హనుమాన్ బాహర్ అంటారు. ఈ దేశం చరిత్రకు, చారిత్రక యధార్థాలకు, వాస్తవాలకు సుప్రీంకోర్టు తీర్పులో ఎంతటి ప్రాధాన్యం లభించాలో అం తటి ప్రాధాన్యం లభించకపోవడం, వాస్తవాలను విస్మరించి కేవలం అం ధ విశ్వాసాల వెల్లువలో సుప్రీంకోర్టు కొట్టుకపోవడం శోచనీయం. ప్రపం చ ప్రసిద్ధి పొందిన, నిగ్రహానికి, నిబ్బరానికి, సంయమనానికి పేరొందిన మన ఒక ఆంగ్ల దినపత్రిక సుప్రీంకోర్టు అయోధ్య తీర్పుపై తన సంపాదకీయంలో స్పందిస్తూ వ్యక్తపరిచిన అభిప్రాయం ఇది... ...judiciary has with simple mind, ventured to give legal burial a prolonged dispute that began as a minor litigation.... ఒక చిన్న వివాదంగా ప్రారంభమై ఒక భయంకర గాయంగా మారిన సమస్యకు సుప్రీంకోర్టు చట్టబద్ధ దహన సంస్కారాలు జరిపిందని ఈ పత్రిక వ్యాఖ్యానించడం గమనార్హం.

అయోధ్య వివాదాస్పద స్థలంలో (ఈ స్థలంలో బాబ్రీ మసీదును 19 92, డిసెంబర్ 6న కూల్చివేయడం నేరమని సుప్రీంకోర్టు తన తీర్పులో అంగీకరించింది). రామాలయం నిర్మాణానికి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటుచేసే విధిని, బాధ్యతను సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం మరింత విచిత్రం. ఇది భారత మతాతీత రిపబ్లిక్ అన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు విస్మరించింది. స్వతంత్ర భారత్‌లో ఇటువంటి విచిత్రం, విడ్డూరం ఇంతకు ముందెన్నడూ సంభవించలేదు. ఇది హిందూదేశం అన్న భావనతో సుప్రీంకోర్టు తన తీర్పు ఇచ్చింది. క్రీస్తుకు పూర్వం 3500 ఏండ్ల తర్వాతనే వేద సంస్కృతి ప్రారంభమైందని ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దం వరకు ఎక్కడా ప్రాచీన భారత వాఙ్మయంలో హిందూ పదం ప్రస్తావనే లేదు.

అప్పటివరకు హిందూ పదం ఒక మతానికి కాకుండా కేవలం ఒక సామాజికవర్గానికి మాత్రమే వర్తించిం ది. హిందూ మతం అన్నది తర్వాత అనేక ఏండ్లకు వచ్చిన మాట. ఈ చారిత్రక సత్యాలను సుప్రీంకోర్టులోని విజ్ఞులైన ఐదుగురు న్యాయమూర్తులు గమనించకపోవడం విచారకరం. ఆది శంకరాచార్యులు క్రీస్తుకు పూర్వం వాడో, క్రీస్తు తర్వాత వాడో ఇంతవరకు తేల్చని చరిత్ర మనది! కన్యాశుల్కం నాటకంలో రామప్పంతులు తాంబూలాలు ఇచ్చుకున్నాం ఇక తన్నుక చావండి అని అంటాడు. ఇదేరీతిలో సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు ఇచ్చింది ఇక మీరే తేల్చుకోండని చెప్పింది. మానవ చరిత్ర ఆరంభంలో తేదీలు, మతలబులు శాస్త్రీయంగా ఖరారు కాలేదన్నది జగమెరిగిన సత్యం.

703
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles