ప్రజలే అంతిమ పరిష్కర్తలు


Sat,November 9, 2019 01:05 AM

మోదీజీ ప్రభుత్వం అంటున్నట్లు కశ్మీర్ వివాదం భారత అంతర్గత సమస్యగా మిగులలేదు. 370వ ఆర్టికల్ రద్దు పాకిస్థాన్‌తో పాటు చైనా తదితర దేశాలకు కూడా ఆగ్రహం కలిగించింది. 370వ ఆర్టికల్ రద్దు తన సార్వభౌమాధికారానికి భంగం కలిగించిందని చైనా వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌తో గీక్కోవడం, చైనాతో గోక్కోవడం ఒకటి కాదని మోదీయులు గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు!

ఆసియా స్వేచ్ఛా వాణిజ్య మండలం చైనా వాణిజ్య విస్తరణకు మాత్రమే ఉపకరిస్తుందని అంతర్జాతీయ వాణిజ్య పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య మండలానికి మన ఈశాన్య భారతదేశం ద్వారాలు తెరుచుకుంటాయని ప్రధాని మోదీజీ నవంబర్ 4న బ్యాంకాక్‌లో చాలా ఉత్సాహంతో ప్రకటించారు. మర్నాడే ఈ వాణిజ్య మండలంలో భారతదేశం చేరబోదని అంతే నిరుత్సాహంతో ప్రకటించారు. ఒకవంక మతాల పేరిట ఉన్మాదం ప్రకోపిస్తున్నా మరోవంక మానవత్వాన్ని ప్రబోధించిన మహనీయుల సంస్మరణ ఆగిపోవడం లేదు.

Devulapalliprabakar
వ్యవస్థ ఏదైనప్పటికీ (విశేషించి ఆధునిక మానవ చరిత్రలో) అది పచ్చి రాచరిక వ్యవస్థయినా, నిండార మానవత్వం విలువలు లోపించిన, ముతక నిరంకుశ వ్యవస్థయినా, ప్రజలు స్వయంగా కోరి తెచ్చుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థయినా ప్రజల మద్దతు కరువైనప్పుడు వ్యవస్థల పతనం తప్పదు. ఇది కొన్ని వందల ఏండ్ల ఆధునిక మానవ చరిత్ర చాటిచెబుతున్న సత్యం. మాగ్నా కార్టా ప్రకటన రచనకు దారితీసిన చరిత్రాత్మక సత్యం ఇదే. 72 ఏండ్ల కిందటి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్య్రం సాధించుకున్న భారతదేశంలో మంచికో చెడుకో బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థ స్ఫూర్తితోనే స్వతంత్ర భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు పడ్డాయి. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి దారితీసింది, ప్రేరణ కలిగించింది నిజానికి బ్రిటిష్ పాలకుల రాజ్యాంగ చట్టాలే-ఈ బ్రిటిష్ చట్టాలన్నీ భారత స్వాతంత్రోద్యమంలో విమర్శలకు గురైనవే.

భారత స్వాతంత్య్రోద్యమ నాయకులందరు బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, సంప్రదాయాలతో గాఢంగా ప్రభావితులు కావడం విశే షం. స్వాతంత్య్రానంతరం దాదాపు మూడేండ్లకు 1951-52లో స్వతం త్ర భారత రాజ్యాంగానికి అనుగుణంగా స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యవ్యవస్థ అంకురార్పణ జరిగింది; అదే సమయాన భారత ఉపఖండ విభజన సమస్యలు (కశ్మీర్ వివాదం, లక్షలాది శరణార్థుల పునరావాసం తదితర సమస్యలు) అత్యంత క్లిష్ట పరిస్థితిని కల్పించాయి. ఆ సమయాన స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చెప్పింది ఒక్కటే-సమస్య ఏదైనా, కశ్మీర్ వివాదమైనా, హైదరాబాద్ సంస్థాన సమస్యయినా, ఇంకే సమస్యయినా అన్ని సమస్యలు ప్రజాభిప్రాయం ప్రకారం పరిష్కారం కావాలని, ప్రజలే అంతిమ పరిష్కర్తలని నెహ్రూ ఒక పరిష్కార సూత్రంగా వివరించారు.

వరుసగా 18 ఏండ్లు ప్రధాని పదవిని నిర్వహించిన సుదీర్ఘకాలంలో నెహ్రూ జాతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో ఇదే సూత్రాన్ని అనుసరించారు. 72 ఏండ్ల స్వాతంత్య్రానంతరం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నిజంగా పరిణతి పొందిందా అన్న అనుమానం కలుగుతున్నది. క్రమం తప్పకుండా ఐదేండ్లకోసారి లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొని ఓటర్లు దేశమంతట ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకున్న శ్రద్ధాసక్తులను, గౌరవాభిమానాలను ప్రదర్శిస్తున్నారు. ఇది హర్షించవలసిన పరిణామం. అయితే, మన ఎన్నికల్లో గుణాత్మక పరిణామాలు ఎంతవరకు సంభవిస్తున్నాయన్నది ముఖ్య విషయం. మన ఎన్నికల విధానంలోని లోపాలను, దోషాలను ఎంతవరకు సంస్కరించగలుగుతున్నామన్నది కూడా ముఖ్యమైన విషయం.

ఇటీవల 20 19 ఏప్రిల్, మే నెలల్లో దేశమంతటా 17వ లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ర్టాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. జాతీయస్థాయిలో, రాష్ర్టాల స్థాయిలో అధికారం చేపట్టడానికి రంగంలోకి దిగిన రాజకీయపార్టీలు తమ ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే చేపట్టదలచిన కార్యక్రమాలు ఏమి టో వివరించాయా అన్నది కీలక ప్రశ్న. 17వ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు అనుగుణంగా కేంద్రంలో రెండో సారి అధికారం చేపట్టగానే మోదీజీ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్యలు చేపట్టింది. సమాచార సేకరణ చట్టంలో మార్పులు, జాతీయ భద్రతాచట్టంలో పెనుమార్పులు, జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ ఆర్టికల్‌ను నిర్వీర్యపరుచడం వంటివి మోదీజీ ప్రభుత్వం సంకల్పించిన కొన్ని ముఖ్యమైన మార్పులు. తాము తలపెట్టదలచిన ఈ మార్పుల గురించి మోదీయులు దేశ ప్రజలకు, విశేషించి సంబంధిత జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి ఒక్క మాటైనా చెప్పలేదు. 2019 ఎన్నికల్లో మోదీజీ పార్టీ జాతీయవా దం, దేశ భక్తి, దేశ భద్రత, పాకిస్థాన్, టెర్రరిజం సమస్యలను భయానక సమస్యలుగా సృష్టించి భూతద్దంలో చూపిందిగాని దేశ ప్రజలను ఎంతోకాలం నుంచి పీడిస్తున్న పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగం, ఆర్థిక తిరోగమనం-మాంద్యం, అజ్ఞానం, అనారోగ్యం సమస్యలను ఏమాత్రం ప్రస్తావించలేదు. కనీసం స్పృశించైనా స్పృశించలేదు. నిజానికి, అమిత ప్రాధాన్యం వహించవలసిన ఈ ప్రజల సమస్యలను మోదీజీ పార్టీ తెరచాటున అణిచిపెట్టింది.

మోదీజీ పార్టీ దాచిపెట్టిన పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగం, ఆర్థికమాంద్యం తదితర సమస్యలకే దేశప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నార ని ఈ మధ్య హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో, యాభైకి మిం చిన ఉపఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పులో స్పష్టమైంది. ఈ తీర్పు విలువ ను మోదీజీ పార్టీ, మోదీ ప్రభుత్వం వెంటనే గుర్తించకుండా కేవలం నట నా కౌశల్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యం. అనేక సంవత్సరాల నుంచి భద్రతామండలి పరిధిలో ఉన్న, మొదటినుంచి కశ్మీర్‌లో ఆజాద్ కశ్మీర్ నినాదం ఇచ్చే మతోన్మాదశక్తులు, పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న శక్తులు బలంగా ఉన్నప్పటికి, కొనేండ్ల కిందట ఐరాసలో ప్రసంగిస్తూ పాకిస్థాన్ అప్పటి విదేశాంగమంత్రి జుల్‌ఫికర్ అలీ భుట్టో కశ్మీర్ కోసం ఇండియన్ డాగ్స్‌తో వెయ్యేండ్లయినా పోరాడుతామని ప్రకటించినప్పటికి అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాలు కశ్మీర్ సమస్య, వివాదంలో నేరు గా జోక్యం చేసుకుంటున్నప్పటికి (రోజుకోమాట మాట్లాడుతూ), 370వ ఆర్టికల్, 35ఏ ఆర్టికల్ అమలు జరుపుతూ తమ ప్రత్యేక ప్రతిపత్తిని కొనసాగించాలని జమ్ముకశ్మీరు రాజకీయపార్టీలు, రాజకీయశక్తులు ముక్త కం ఠంతో నినదిస్తున్నప్పటికీ మోదీజీ రెండవ టర్మ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి, నిరంకుశ నిర్ణయాలతో జమ్ముకశ్మీర్‌లో 2009 ఆగస్టు 5 నుంచి తన రహస్య ఎజెండాను ఉక్కుపాదంతో అమలుజరిపింది. మోదీజీ ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ అభిప్రాయాన్ని, కశ్మీర్ ప్రజ ల మనోభావాలను ఎంతమాత్రం ఖాతరు చేయకుండా, తమ పార్టీ అభిప్రాయమే కశ్మీర్ ప్రజల అభిప్రాయం అన్నట్లుగా చిత్రించడానికి యత్నించారు.

ఇది విఫలయత్నమని ప్రపంచానికి వెల్లడైంది. స్వతంత్ర భారత రాజ్యాంగం సంతరింపజేసిన ప్రజాస్వామ్య, పౌరహక్కులను, మానవ త్వం ప్రసాదించిన మానవ హక్కులను కశ్మీర్‌లో కేవలం కొన్నిగంటల సమయంలో హడావుడిగా మంటగలిపిన మోదీజీ ప్రభుత్వం మూడు నెలల పాటు కశ్మీర్ ప్రజా జీవితాన్ని స్తంభింపచేసిన తర్వాత, ఇంటాబయట వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక వారం రోజుల కిందట ప్రారంభించి న దిద్దుబాటు, కంటితుడుపు చర్యలు కొన్నింటికి (వారెంట్లు లేకుండానే, ప్రభుత్వ ఆదేశాలు ఏవీ జారీ చేయకుండానే నిర్బంధించిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను, రాజకీయ నాయకులను, కార్యకర్తలను, ఇతరులను విడుదల చేయకుండానే, గడిచిన మూడునెలల కాలంలో కశ్మీరులో ముక్కుపచ్చలారని బాలబాలికలను సైతం నిర్బంధంలో పెట్టారని ఇటీవల వెల్లడైంది). కశ్మీరు ప్రజల నుంచి స్పందన లభించడం లేదు. మోదీజీ ప్రభుత్వం కంటితుడుపు చర్యలను కశ్మీర్ ప్రజలు విశ్వసించడం లేదు.

ఈ పరిణామాన్ని జాతీయ, అంతర్జాతీయ పరిశీలకులు ఆసక్తితో గమనిస్తున్నారు! ఇటీవల జర్మనీ ఛాన్స్‌లర్ కూడా కశ్మీర్‌లో మోదీజీ ప్రభుత్వ చర్యలను అభిశంసించడం గమనార్హ విషయం. మోదీజీ ప్రభు త్వం అంటున్నట్లు కశ్మీర్ వివాదం భారత అంతర్గత సమస్యగా మిగలలేదు. 370వ ఆర్టికల్ రద్దు పాకిస్థాన్‌తో పాటు చైనా తదితర దేశాలకు కూడా ఆగ్రహం కలిగించింది. 370వ ఆర్టికల్ రద్దు తన సార్వభౌమాధికారానికి భంగం కలిగించిందని చైనా వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌తో గీక్కోవడం, చైనాతో గోక్కోవడం ఒకటి కాదని మోదీయులు గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు! కర్ర ఎవడిదో బర్రె వాడిది అన్నది మన గ్రామీణ ప్రాంతంలోని ముత క సామెత. ఈ సామెత గతవారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో అమల్లోకి వచ్చి భారతదేశానికి విపరీత నష్టం కలిగించే ప్రమాదం కన్పించింది. ఆగ్నేయాసియా కూటమి దేశాలు పది, కమ్యూనిస్టు చైనా ప్రోత్సాహంతో బ్యాంకాక్‌లో ఆసియా స్వేచ్ఛా వాణిజ్య మండలానికి ప్రారంభోత్సవం జరుపాలనుకున్నాయి.

ఈ దేశంలోని ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకించినప్పటికీ ప్రధాని మోదీజీ బ్యాంకాక్ వెళ్లి స్వేచ్ఛా వాణిజ్య మండల కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నారు-వెళ్లారు. ఆసియా స్వేచ్ఛా వాణి జ్య మండలం చైనా వాణిజ్య విస్తరణకు మాత్రమే ఉపకరిస్తుందని అంతర్జాతీయ వాణిజ్య పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య మండలానికి మన ఈశాన్య భారతదేశం ద్వారాలు తెరుచుకుంటాయని ప్రధాని మోదీజీ నవంబర్ 4న బ్యాంకాక్‌లో చాలా ఉత్సాహంతో ప్రకటించారు. మర్నాడే ఈ వాణిజ్య మండలంలో భారతదేశం చేరబోదని అంతే నిరుత్సాహంతో ప్రకటించారు. ఒకవంక మతాల పేరిట ఉన్మాదం ప్రకోపిస్తున్నా మరోవంక మానవత్వాన్ని ప్రబోధించిన మహనీయుల సంస్మరణ ఆగిపోవడం లేదు. 550 ఏండ్ల కిందట ఇప్పటి పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో సిక్కు మత స్థాపకుడు బాబా గురునానక్‌దేవ్ జన్మించారు. 550 ఏండ్ల తర్వాత భారత్, పాక్‌లు మతం పేరిట కలహిస్తాయని ఆరోజు ఆయన బహుశా ఊహించలేదు. ఇప్పటి పాక్‌లో అప్పుడు ప్రభవించిన గురునానక్‌దేవ్ కొన్నేండ్ల తర్వాత అక్కడే పరమపదించడం, ఈ రోజు అదే అతి పవిత్రస్థలంగా ప్రపంచమంతటా మానవాళి నివాళి అం దుకోవడం ఒక మహత్తర పరిణామం.

379
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles