వాతావరణ ఎమర్జెన్సీ


Fri,November 8, 2019 01:18 AM

వాతావరణ మార్పును అరికట్టడం కన్నా ఆర్థికాభివృద్ధి ప్రధానమైపోయింది. దీంతో ఈ ప్రమాదాన్ని ముందుగానే ఎదుర్కోవాలనే శాస్త్రవేత్తల తపన ఆచరణరూపం పొందలేకపోయింది. ఈ నలభై ఏండ్లలో శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలు సాగిస్తూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. రోజులు గడిచేకొద్దీ వాతావరణ మార్పు ప్రమాదకరంగా మారిందనే సూచనలు మరింత బలంగా కనబడుతూ ఉన్నాయి. ఈ నలభై ఏండ్లలో వాతావరణ మార్పును అరికట్టడానికి దృఢమైన చర్యలు చేపట్టకపోవడం, భూతాపం పెరిగిపోతూనే ఉండటం అత్యంత బాధాకరం.

వాతావరణ మార్పును అరికట్టవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడ్డదంటూ 153 దేశాలకు చెం దిన 11,258 మంది శాస్త్రవేత్తలు మంగళవారం నాడు చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా విధానకర్తలు మొదలుకొని సాధారణ పౌరుల వరకు అందరూ గమనించవలసినది. భూగోళతాపం పెరుగుడుపై శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ శాస్త్రవేత్తలు తాజా నివేదిక లో మానవాళికి ముంచుకొస్తున్న ముప్పు గురించి మరింత నిస్సందేహంగా వివరించారు. వేలాది మంది శాస్త్రవేత్తలు ఏకమై దీనిని వాతావరణ అత్యవసర (క్లయిమేట్ ఎమర్జెన్సీ) పరిస్థితిగా ప్రకటించడం ఇదే మొదటిసారి. మానవుల అనేక కార్యకలాపాల వల్ల గ్రీన్‌హౌజ్ వాయువులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. వీటిని అరికట్టడం పెద్ద సవాలుగా మారింద ని గుర్తించారు. తక్షణం చేపట్టవలసిన ప్రధాన చర్యలను కూడా శాస్త్రవేత్తలు బయోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన తమ నివేదికలో వివరించడం విశేషం. మానవాళి ఉనికికి ప్రమాదం ఏర్పడ్డదని తెలిసిన తర్వాత కూడా అవే విధ్వంసకర విధానాలు కొనసాగుతున్నాయనేది శాస్త్రవేత్తల అత్యవసర హెచ్చరిక పరిశీలిస్తే అర్థమవుతుంది. జనాభా పెరుగుదల, అడవులు అంతరించడం, శిలాజ ఇంధనాల వాడకం మొదలైన మానవ కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి.

వాతావరణ మార్పును అరికట్టడానికి నిర్దిష్టమైన సూచనలు చేయడం శాస్త్రవేత్తల తాజా నివేదికలోని ప్రత్యేకత. ఇప్పటికైనా సమయం మిం చిపోలేదని ప్రజలు అప్రమత్తమైతే వాతావరణ మార్పును అరికట్టవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపా రు. ఇందుకోసం విధానకర్తలు తీసుకోవలసిన ఆరు సూచనలు చేశారు. ఇందులో ప్రధానమైన వి జనాభా, ఆర్థిక విధానాలను మార్చుకోవడం. ఆర్థికాభివృద్ధి పేరిట కొద్దిమంది సంపదను పోగేసుకోవడమనే వికృత పోకడ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిన తరుణంలో శాస్త్రవేత్తల సూచన గమనార్హమైనది. ప్రకృతి వనరులను కొల్లగొట్టే విధంగా, జీడీపీ కొలమానాలతో, ఆర్థికాభివృద్ధి ఎంత సాధించామనే లక్ష్యాల స్థానంలో-ఆర్థిక అసమానతలు తొలిగించడమనేది ప్రాధాన్యం పొందాలని శాస్త్రవేత్తలు హితవు చెప్పారు. మాన వహక్కులకు ప్రాధాన్యం లభించాలని కూడా సూచించారు. మహిళలకు విద్యను అందించ డం ద్వారా వారి హక్కులను బలోపేతం చేయా లె.

అందరికి కుటుంబ నియంత్రణ అందుబాటులోకి రావాలె. జనాభాను నియంత్రిస్తూ, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలనేది శాస్త్రవేత్తల సందేశం. వాతావరణ మార్పులను అరికట్టే బాధ్యతను విధానకర్తలకే పరిమితం చేయకుండా ప్రతి మానవుడు తన జీవనసరళిని మార్చుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. మాంసాహార వినియోగాన్ని తగ్గించాలని, శిలా జ ఇంధనాలను ఇక భూగర్భంలోనే ఉండనివ్వాలని, పరిశుద్ధ ఇంధనాన్ని వాడాలని శాస్త్రవేత్తలు సూచించారు. ప్రజలు కార్లలో, విమానాల్లో తిరుగడం మానివేయాలనీ, పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని శాస్త్రవేత్తలు సూచించారు.

వాతావరణ మార్పు ప్రమాదం ఎదురవుతున్నదనేది ఇటీవల గుర్తించినది కాదు. నలభై ఏండ్ల కిందటనే శాస్త్రవేత్తలు ఈ ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించారు. దాదాపు యాభై దేశాల శాస్త్రవేత్తలు జెనీవాలో సమావేశమై భూగోళ తాపం పెరుగుడు పెద్ద సమస్యగా మారబోతున్నదని చెప్పారు. దీన్ని ఎదుర్కొనే వ్యూహాలను రచించడంపై దృష్టిసారించారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కృషి సాగింది. ఈ క్రమంలో వాతావరణ మార్పుపై ప్రభుత్వాల ప్యానెల్ ఏర్పాటైంది. ప్రమాదం ముం చుకురావడానికి ముందే పరిష్కారం సాధించాలని శాస్త్రవేత్తలు భావించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల లాభాలు ప్రాధాన్యం పొందాయి. శిలాజ ఇంధనాలను తగ్గించడమనేది సవాలుగా నిలిచింది. వాతావరణ మార్పును అరికట్టడం కన్నా ఆర్థికాభివృద్ధి ప్రధానమైపోయింది. దీంతో ఈ ప్రమాదాన్ని ముందుగానే ఎదుర్కోవాలనే శాస్త్రవేత్తల తపన ఆచరణ రూపం పొందలే కపోయింది.

ఈ నలభై ఏండ్లలో శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలు సాగిస్తూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. రోజులు గడిచేకొద్దీ వాతావరణ మార్పు ప్రమాదకరంగా మారిందనే సూచనలు మరింత బలంగా కనబడుతూ ఉన్నాయి. ఈ నలభై ఏండ్లలో వాతావరణ మార్పును అరికట్టడానికి దృఢమైన చర్యలు చేపట్టకపోవడం, భూతాపం పెరిగిపోతూనే ఉండటం అత్యంత బాధాకరం. భూగోళంపై మానవులు తమ ఉనికిని కోల్పోయే భయానక పరిస్థితికి కూడా పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు. పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఈ హెచ్చరికలు చేస్తున్న శాస్త్రవేత్తల సంఖ్య పెరిగింది, వారి గొంతు కూడా మరింత తీవ్రమైంది. వారి పరిశోధనలు కూడా మరింత విస్తృతమయ్యాయి ఈ క్రమంలోనే వేలాదిమంది శాస్త్రవేత్తలు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మానవులు ఇప్పటికైనా అప్రమత్తం కావాలె. భావితరాలను దృష్టిలో పెట్టుకొని భూగోళాన్ని నివాసయోగ్యంగా కాపాడుకోవాలె.

149
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles