అసమానతలపై ఆగ్రహం


Thu,November 7, 2019 01:00 AM

ఆర్థిక మందగమనం, కరెన్సీ విలువ తగ్గుదల అట్టడుగు ప్రజల ఆర్థికపరిస్థితిని మరింత దిగజార్చింది. స్వయం ఉపాధిరంగంలో భద్రత కరువైంది. ప్రజల రుణభారం పెరిగిపోయింది. 1980 దశకంలో విద్యారంగాన్ని ప్రవేటీకరించిన తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఫీజులు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దీంతో విద్యార్థులు విద్యారుణాలు తీసుకున్నారు. కానీ నిరుద్యోగ, చిరుద్యోగాల మూలంగా చెల్లించలేని పరిస్థితి కలిగింది. విద్య, వైద్యం, రవాణా రంగాలను ప్రైవేటుపరం చేయడంతో ప్రజలపై భారం పెరిగింది. పింఛన్లకు కూడా ప్రైవేట్ రంగంపై ఆధారపడవలసి వస్తున్నది. అవినీతి పెరిగిపోయింది.

చిలీలో చెలరేగుతున్న ఆందోళనలు నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థికవిధానాల ఫలితాలు ఎట్లా ఉంటాయో ఎత్తిచూపుతున్నాయి. మూడు వారాల పాటు చెలరేగి సద్దుమణిగినట్టు కనిపించిన ఆందోళనలు దేశాధ్యక్షుడు పినేరా రాజీనామా చేయబోనని ప్రకటించడంతో మళ్లా భగ్గుమన్నాయి. ఆందోళన బాటపట్టిన ప్రజలు పినేరా రాజీనామాను మాత్రమే కోరడం లేదు. దేశంలో అమలు జరుగుతున్న ఆర్థికవిధానాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక చిన్న నిరసన భారీ ఆందోళనగా మారడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. గత నెల మొదట్లో ప్రభుత్వం రద్దీ సమయంలో మెట్రో ప్రయాణ చార్జీలను పెంచింది. దీంతో విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ నిరసనలపై ఆర్థికమంత్రి స్పందిస్తూ చార్జీలు భారం అనుకునేవారు కొంచెం ఉదయమే లేచి వెళ్ళ వచ్చు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య మూలంగా విద్యార్థులలో ఆగ్రహం భగ్గుమన్నది. అసలు చార్జీలు చెల్లించకుండానే మూకుమ్మడిగా ఉచిత ప్రయాణాలు చేశారు. అవరోధాలను ధ్వంసం చేస్తూ మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో వీధుల్లో నిరసనలు మొదలయ్యాయి. క్రమంగా విద్యార్థుల నిరసన అన్ని సామాజికవర్గాల ఆందోళనగా మారిపోయిం ది. సూపర్‌బజార్లను లూటీ చేయడం, పెట్రోలు బంకులను ధ్వంసం చేయడం మొదలైంది. రెండువారాల పాటు దేశం అట్టుడికిపోయింది. లూటీ లు, దహనాలు, కాల్పులు తదితర ఘటనలన్నిటిలో దాదాపు ఇరువై మంది మరణించారు. వెయ్యిమందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. పినే రా రాజీనామా చేయాలనేది ప్రజలు చేస్తున్న డిమాండ్లలో ఒకటి. ఆయన రాజీనామా చేయబోనని ప్రకటించడంతో మళ్ళా నిరసనలు, ప్రదర్శనలు మొదలయ్యాయి.

ఇటీవలికాలం వరకు చిలీ ఆర్థికవ్యవస్థను బహు గొప్పదిగా ప్రశంసించారు. అత్యంత సుస్థిరమైన ఆర్థికవ్యవస్థగా చెప్పుకొచ్చారు. స్థూల ఆర్థిక కోణంలో చూస్తే చిలీ ఒక విజయవంతమై న ఆర్థికవిధానాలు అనుసరించే దేశం. రాగి ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ది. లాటిన్ అమెరికాలోనే అత్యంత వేగవంతమై న వృద్ధిచెందే దేశం. లాటిన్ అమెరికాలోకెల్లా అతి పెద్ద మధ్యతరగతి గల దేశంగా గుర్తింపు పొందింది. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిక ప్రకారం కూడా చిలీ లాటిన్ అమెరికా దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నది. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం-పేదరికం భారీగా తగ్గిపోయిం ది. సరళీకృత వాణిజ్య విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని భావించారు. స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థలో సాధారణంగా కనిపిం చే విపరీత వృద్ధి- మాంద్య చక్రం నుంచి బయటపడిన దేశంగా ఆర్థికవేత్తలు చెబుతుంటారు. అయినా మరి ఈ సామాజిక అనిశ్చితి ఎందుకు చెలరేగినట్టు? ఆర్థికాభివృద్ధి జరిగింది కానీ సంపద కొద్ది మంది చేతిలోనే కేంద్రీకృతమైంది. ఆర్థికవేత్తల అంకెలకు అందని సామాజిక వాస్తవికతలు బయట చెప్పుకుంటున్న దానికి భిన్నంగా ఉన్నాయి. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయా యి. అభివృద్ధి ఫలాల సమపంపిణీ జరుగడం లేదు. 36 దేశాల ఆర్థిక సహకార అభివృద్ది సంస్థ (ఓఈసీడీ)లో అత్యధిక అసమానతలు ఉన్నది చిలీలోనే. మార్కెట్ అనుకూల విధానాలు ప్రైవేటు రంగానికి ఊతం ఇచ్చాయి. పెట్టుబడులను పెంచాయి. కానీ ప్రజల సంక్షేమం కోసం ఖర్చుపెట్టే స్థితిని ప్రభుత్వం కోల్పోయింది. చిలీ సంక్షేమ విధానాల్లో అట్టడుగు నుంచి రెండవ స్థానంలో ఉన్నది. పేదరికం సమాజంలో అనిశ్చితిని సృష్టించే స్థాయికి చేరుకున్నది. ఆ ఫలితమే ఈ ఆందోళనలు.

ఆర్థిక మందగమనం, కరెన్సీ విలువ తగ్గుదల అట్టడుగు ప్రజల ఆర్థికపరిస్థితిని మరింత దిగజార్చింది. స్వయం ఉపాధిరంగంలో భద్రత కరువైంది. ప్రజల రుణభారం పెరిగిపోయింది. 1980 దశకంలో విద్యారంగాన్ని ప్రవేటీకరించిన తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఫీజులు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దీంతో విద్యార్థులు విద్యారుణాలు తీసుకున్నారు. కానీ నిరుద్యోగ, చిరుద్యోగాల మూలంగా చెల్లించలేని పరిస్థితి కలిగింది. విద్య, వైద్యం, రవాణా రంగాలను ప్రైవేటు పరం చేయడంతో ప్రజలపై భారం పెరిగింది. పింఛన్లకు కూడా ప్రైవేట్ రంగంపై ఆధారపడవలసి వస్తున్నది. అవినీతి పెరిగిపోయింది. పినోచెట్ సైనిక పాలనలో అన్నిరంగాల ప్రైవేటీకరణ జరిగిం ది. ఆ తర్వాత ప్రభుత్వాలు వామపక్ష పాలనగా చెప్పుకుంటున్నప్పటికీ అవే ఆర్థికవిధానాలను కొనసాగించాయి. ఈ పరిస్థితులన్నీ ప్రజలలో అసంతృప్తికి దారి ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దిగజారుతున్న ఆర్థికపరిస్థితిని ఆర్థికవేత్తలు పసిగట్టలేకపోయారు. మీడియా కూడా సామాజిక పరిస్థితులను ప్రతిబింబించలేకపోయింది. ఈ ఆందోళనల మూలంగా దేశాధ్యక్షుడు కార్పొరేట్ సంస్థల పన్నుకోతను విరమించుకున్నారు. ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి ఎనమండుగురు మంత్రులను తొలిగించారు. కొన్ని ఉపశమనాలను ప్రకటించడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ ప్రజలు సం తృప్తి చెందడంలేదు. ప్రభుత్వ సొమ్మును వెచ్చిస్తామని అంటున్నారు కానీ కార్పొరేట్ సంస్థలపై భారం వేయడం లేదెందుకు అని ప్రశ్నిస్తున్నారు. భారీ ఎత్తున కార్పొరేట్ సంస్థలపై పన్ను తగ్గిస్తూ సంక్షేమ పథకాలకు కోత వేస్తున్న ప్రభుత్వాలు చిలీ పరిణామాలను గమనించడం మంచిది.

308
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles