‘విద్యుత్‌ చర్చలు’ స్ఫూర్తి కావాలె


Tue,October 22, 2019 12:47 AM

విద్యుత్‌ చర్చలో అత్యంత ఆసక్తికరమైన అంశమేమంటే, ఆర్టిజన్ల సమస్యలపై రెగ్యులర్‌ ఉద్యోగ సంఘాలు వాదించడం. రెగ్యులర్‌ ఉద్యోగులు, కార్మికుల నియామకాలు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా నిబంధనల ప్రకారం జరిగాయి. కానీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అలా కాదు. ప్రభుత్వ మానవత్వ దృక్పథం వల్ల మాత్రమే ఆర్టిజన్లు సంస్థలో చేరుతున్నారు. వారిని తమలా ఎలా గుర్తిస్తారని రెగ్యులర్‌ ఉద్యోగులు ప్రశ్నించలేదిక్కడ.

ఏడు పదుల సగటు వయసు కలిగిన సీఎండీలు విద్యుత్‌ సంస్థ ల మనుగడ గురించి, వాటి భవిష్యత్‌ గురించి, వాటిపై ఆధారపడిన వేలాదిమంది ఉద్యోగుల జీవితాల గురించి పడుతున్న ఆరాటం.. విద్యుత్‌ శాఖలో మరో పది, పదిహేనేండ్లు పనిచేయాల్సిన కార్మిక సంఘ నాయకులకు కర్తవ్యబోధ చేసింది. యాజమాన్యం, కార్మికులు వేర్వేరు అన్నట్లుగా కాకుండా, తండ్రీకొడుకులు కూర్చొని కుటుంబ బాగోగులు మాట్లాడుకున్నట్లు ఉన్నది. ‘సంస్థలు బాగుండాలి, అందులో పనిచేసే ఉద్యోగులు బాగుండాలి’ అనే ఏకైక లక్ష్యంతోనే ఎవరైనా మాట్లాడారు. తక్కువ వేతనాలతో పనిచేసే వారిని ఆదుకునేలా చర్చలు సాగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అవలంబించిన విధానాల వల్ల జరిగిన నష్టాలను పూడ్చేవిధంగా సమాలోచనలు జరిగాయి. అందుకే, విద్యుత్‌సంస్థల అధికారులు, కార్మికసంఘాల నాయకుల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. అందరికీ స్ఫూర్తిగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి అద్భుతమైన సమన్వయంతో అపూర్వ విజయాలు సాధించి ప్రజల మన్ననలు పొందిన తెలంగాణ విద్యుత్‌ సంస్థలు, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే విషయంలో కూడా ఆదర్శవంతమైన ముందడుగు వేశాయి. కార్మిక సంఘాలు 71 డిమాండ్లను విద్యుత్‌సంస్థల అధిపతుల ముందుంచాయి. వాటిపై శనివారం విద్యుత్‌ సౌధలో చర్చలు జరిగాయి. విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేలా, తక్కువ వేతనాలతో పనిచేసే వారి కడుపునింపేలా నిర్ణయాలు జరిగాయి.

చర్చలకు ముందు మూడురోజులు జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, డిస్కమ్‌ల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాలరావు, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీనివాసరావులు కార్మికుల డిమాండ్లను ఒక్కొక్కటీ పరిశీలించారు. అన్నింటి పరిష్కారానికున్న మార్గాలపై చర్చించా రు. సంస్థల ఆర్థిక పరిస్థితిని కార్మికులకు వివరించారు. అన్నీ వాస్తవాల ప్రాతిపదికగానే చర్చించారు. అటు కార్మిక సంఘ నాయకులు, ఇటు విద్యుత్‌సంస్థల అధిపతులు సంస్థ పదికాలాల పాటు బాగుండాలనే కోరుకున్నారు. కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాల్లో రెండు చాలా ప్రధానమైనవి. ఆర్టిజన్లకు రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే పరిగణించి, కావాల్సిన సదుపాయాలు కల్పించడం ఒకటైతే, రెండోది 1999-2004 మధ్యకాలంలో నియమాకమైన వారిని ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌లోకి మార్చి పింఛన్‌ ప్రయోజనం కలిగించడం. కార్మికసంఘాల ఈ రెండు డిమాండ్లు కూడా అత్యంత న్యాయసమ్మతమైనవే అని సంస్థల అధిపతులు గుర్తించారు. వాటిని ఎలా పరిష్కరించాలని కూలంకషంగా చర్చించారు. వాస్తవానికి ఈ రెండు అంశాలు ఇవాళ ఓ సమస్యగా పరిగణించడానికి కారణాలు కూడా విచిత్రం. మొదటి సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం ఫలితంగా వచ్చింది. రెండోది ఉమ్మడి పాలనలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఫలితంగా వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలైన విద్యుత్‌, సింగరేణి, ఆర్టీసీ లాంటి సంస్థలను కాపాడుకోవడానికి ఎంతో ప్రాధా న్యం ఇస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణలో జాప్యం జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు మాత్రం సకాలంలో వేతన సవరణలు జరుగుతున్నాయి. వేతనాలొక్కటే సమస్య కాకపోవచ్చు. ఇంకా ఇతర సమస్యలు ఉండవని కూడా కాదు.ఏ సంస్థలో అయి నా సమస్యలు తలెత్తడం సహజం. పరిష్కారయోగ్యమైన సమస్యలను ఎంచుకొని డిమాండ్లు చేయడం, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.


తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో 23 వేల మంది కార్మికులు ఏండ్ల తరబడి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత లేదు. కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్నారు. వారి దీనస్థితిని చూసి చలించిన సీఎం కేసీఆర్‌ వారిని విద్యుత్‌ సంస్థలో విలీ నం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితంగా న్యాయపరమైన చిక్కులను అత్యంత వ్యూహాత్మకంగా అధిగమించి ఆర్టిజన్లను సంస్థల్లో విలీనం చేసుకున్నారు. వారికి సర్వీస్‌రూల్స్‌ రూపొందించడంలోనూ న్యాయపరమైన, చట్టపరమైన, ఆర్థికపరమైన చిక్కులున్నాయి. ఈ విషయంపై అటు కార్మికులు, ఇటు యాజమాన్యం చాలా సహృదయం తో వ్యవహరించాయి. ఎవరికీ ఇబ్బంది కలుగని రీతిలో, సంస్థకు కూడా ఇప్పటికిప్పుడు పెద్ద ఆర్థికభారం పడని విధంగా ఆర్టిజన్ల సమస్యను పరిష్కరించుకున్నాయి. దీంతో ఆర్టిజన్లను సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే చూసుకోవాలనే కేసీఆర్‌ సంకల్పం పరిపూర్ణమైంది.

విద్యుత్‌ చర్చలో అత్యంత ఆసక్తికరమైన అంశమేమంటే, ఆర్టిజన్ల సమస్యలపై రెగ్యులర్‌ ఉద్యోగ సంఘాలు వాదించడం. రెగ్యులర్‌ ఉద్యోగులు, కార్మికుల నియామకాలు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా నిబంధనల ప్రకారం జరిగాయి. కానీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అలా కాదు. ప్రభుత్వ మానవత్వ దృక్పథం వల్ల మాత్రమే ఆర్టిజన్లు సంస్థలో చేరుతున్నారు. వారిని తమలా ఎలా గుర్తిస్తారని రెగ్యులర్‌ ఉద్యోగులు ప్రశ్నించలేదిక్కడ. వారి జీతాలు తక్కువున్నాయి, వారిని మాలాగానే చూసుకోండని రెగ్యులర్‌ ఉద్యోగులు ఉదార స్వభావం ప్రదర్శించారు. వివిధ శాఖల్లో డైరెక్టు రిక్రూటీలు-ప్రమోటీలు, సీనియర్లు-జూనియర్లు అనే వివాదాలు ఎంతకీ తెగకుండా కోర్టుల్లో నానుతున్న ఉదంతాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ ఉద్యోగులు ఆర్టిజన్ల కోసం మాట్లాడటం ఓ ఆదర్శం.
ajay-kumar
ఈ చర్చల్లో పాల్గొన్న కార్మిక నాయకులు కూడా తమ మొదటి ప్రాధా న్యం సంస్థ మనుగడ కాపాడుకోవడమేనని ప్రకటించారు. కార్మిక సంఘ నాయకులు తమ సమస్యల గురించి కాకుండా కొత్తగా సర్వీసులోకి చేరి న ఆర్టిజన్ల భవిష్యత్‌ గురించి, ఈపీఎఫ్‌లో ఇరుక్కుపోయిన వారి బాధ గురించే వాదించారు. సంస్థల అధికారులు కూడా సానుకూలంగా స్పం దించారు. సంస్థకు ఆర్థికంగా భారం కలిగించే కోరికలేవీ కార్మిక సంఘాల నాయకులు కోరలేదు. సాధ్యం కాదు అని అధికారులు తేల్చిచెప్పిన అం శాలను పట్టుకొని రాద్ధాంతం చేయలేదు. కార్మికులు న్యాయమైన కోరిక లే కోరుతారనే నమ్మకం అధికారులకు ఉన్నది. అధికారులు తమకు అన్యాయం చేసేవారు కాదనే విశ్వాసం కార్మికులకు ఉన్నది. అందుకే విద్యుత్‌ సమస్యలు తేలిగ్గా పరిష్కారమయ్యాయి.
చర్చల సందర్భంగా జరిగిన కొన్ని నిర్ణయాలను ఒప్పందంలో రాసే విషయంలో ప్రదర్శించిన రాజీ ధోరణి నిజంగా ఓ ఆదర్శం. ఆర్టిజన్లకు ఎలా న్యాయం చేయాలనే విషయంలో కార్మిక సంఘాలకు, అధికారులకు మధ్య ఓ అవగాహన కుదిరింది. దాన్ని అమలుచేసే విషయంలో కాస్త చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొ ని, ఒప్పందంలో ఆ అంశం చేర్చలేదు. దీనిపై కార్మిక నాయకులు స్పంది స్తూ, అసలు ఒప్పందమే అవసరం లేదు, ముఖ్యమంత్రిపైనా, సీఎండీ పైనా మాకు నమ్మకం ఉన్నదని కార్మిక నాయకులు ప్రకటించారు.

విద్యు త్‌సంస్థలో ఉన్న ప్రతి కార్మిక సంఘం ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒకరిపై ఒకరికి విశ్వాసం ఉంటే, ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో విద్యుత్‌ చర్చలు నిరూపించాయి. దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తున్నాయి. నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ఎలా వదిలించుకోవాలనే అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలైన విద్యుత్‌, సింగరేణి, ఆర్టీసీ లాంటి సంస్థలను కాపాడుకోవడానికి ఎంతో ప్రాధా న్యం ఇస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణలో జాప్యం జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు మాత్రం సకాలంలో వేతన సవరణలు జరుగుతున్నాయి. వేతనాలొక్కటే సమస్య కాకపోవ చ్చు. ఇంకా ఇతర సమస్యలు ఉండవని కూడా కాదు. ఏ సంస్థలో అయి నా సమస్యలు తలెత్తడం సహజం. పరిష్కారయోగ్యమైన సమస్యలను ఎంచుకొని డిమాండ్లు చేయడం, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. విద్యుత్‌ చర్చలు అదే తత్త్వాన్ని మనకు బోధిస్తున్నాయి.
(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్టు)

504
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles