స్త్రీ మనోగతపు అక్షరాలు


Mon,October 21, 2019 12:41 AM

కవిత్వం ఎవరికోసం అన్న ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం వెతుక్కోవడం కష్టమే. వ్యక్తి నుంచి వ్యక్తికి అభిప్రాయం మారు తూ ఉంటుంది. స్త్రీ భావనలను అక్షరీకరించినప్పుడు ఒకలాగ, అదే ఒక పురుషుడు వ్యక్తపరిచేటప్పుడు ఇంకోలాగ ఉంటుంది. ఆడవారి ఈతిబాధలు, సమస్యలు, వారి మనోభావాలు చెప్పా ల్సి వచ్చినప్పుడు సున్నితంగా ఆలోచించాల్సిందే. ఇదంతా ఎం దుకంటే ఆడవారి జీవితంలో సంఘటనలకు అక్షరరూపం ఇస్తూపోతే అదే ఒకవాదంగా తయారవుతుంది. అలాంటి కొన్ని సంఘటనలను కవిత్వంగా మనముందుకు తెచ్చారు రేణుక అయోల తన ‘ఎర్రమట్టి గాజులు’ కవితా సంపుటిలో. నిజానికి పుస్తకం పేరు స్త్రీ వాదాన్ని సూచించినా నిజానికి అన్ని కవితలు అదేదారి పట్టాయా అంటే కానేకాదు. తన ఎరుకలో జరిగిన అన్ని సంఘటనలు వస్తువులు స్త్రీ వాదం వైపు ఉన్నా కూడా, ఎక్కువగా అటు పోలేదు. మిగతావి కూడా ఆలోచింపజేస్తాయి.
ErraMattiGajulu


స్త్రీ వాద గొంతుకతో రాసినవి కొన్ని అయితే, సున్నితత్వాన్ని రంగరించి రాసినవి మరికొన్ని. ప్రతి సందర్భాన్ని మానవీయంగా ఆకట్టుకునే శైలి, పద చిత్రాలతో ఇలా ఎన్నో అంశాలు ఈ ‘ఎర్రమట్టి గాజులు’లో కనిపిస్తాయి. రేణుక అయోల కవిత్వం ఎంతటి కఠిన హృదయాన్నైనా కరిగిస్తుంది. ‘ఎర్రమట్టి గాజులు’ చదివితే కచ్చితంగా మనలను కదిలిస్తుంది, వెంటాడుతుంది. హింసాదౌర్జన్యాలు లేని సమాజం కోసం ఆలోచింపజేస్తుంది.

సొంత మనుషులను కోల్పోయినప్పుడు అంత శూన్యమే గోచరిస్తుంది. అలాంటిది నిన్నటిదాకా మన తో ఉన్న తండ్రి దిగంతాల్లో కలిసిపోతే, ఒక నిశ్శబ్దం భయపెడుతుంది. ఇదిగో ఇలాగే.. ‘ఇల్లు ఖాళీ లేదు/ఓ చీకటి గుహ దేహంలోకి ప్రవేశినట్టు ఉంది..’ అంటే ఎం త బాధకు గురై ఉంటుంది. ఇంకోచోట గుర్తుచేసుకుంటుంది.. ‘నిన్నటివరకు నీది నాది ఒక పేగుబంధం/ఇప్పుడది ఎముకలు/బూడిద అనుకుంటే/దుఃఖం గొంతులోనే ఉంది..’ నాన్నను పోగొట్టుకొని ఏడ్చిన క్షణాలవి.
సాధారణంగా పనిచేసే మహిళలు హ్యాండ్‌బ్యాగ్‌ను తమతో పాటుగా తీసుకెళ్తారు. అందులో లంచ్‌బాక్స్‌ మాత్రమే ఉందని అనుకుంటాం కానీ ఒక ప్రపంచమే ఉంటుందని తెలుసుకుం టాం. జీవితంలో జరిగిన ప్రతి అనుభవానికి నీలిరంగు హ్యాండ్‌ బ్యాగ్‌ సాక్షి.. ఎంత అద్భుతంగా వ్యక్తీకరించారో.. ‘పాత నీలిరం గు హ్యాండ్‌బ్యాగ్‌/అటుఇటు తిరుగుతున్నా సమయాలని సందర్భాలని ఓ దగ్గర పడేసి వెళ్ళాక/కాలం నాచేతిలో పునర్జీవించిం ది..’. మనం సాధారణంగా పాతవి అయినవాటిని అల్మారాలో పడేస్తాం. ఎప్పుడో ఒకప్పుడు సర్దుతున్నప్పుడు సడన్‌గా కనిపిస్తుంది. దానితో పెనవేసుకున్న జ్ఞాపకాలు ముసురుతాయి. అం దుకే..‘ మనసుకు దగ్గరగా ఒక రహస్యం దాచుకోవడానికి చోటు దొరికింది/ఎన్నో ఊహలని దాచిపెట్టే కాలేజీ అమ్మాయిలా ఉం డేది/ఇలా లైఫ్‌లో ప్రతిచోట జరిగిన దానిని రిజిష్టర్‌ ఛేదిస్తుం ది..’ (నీలిరంగు హ్యాండ్‌బ్యాగ్‌). ఇలాంటి జ్ఞాపకాలు ప్రతి ఒక్క రికి ఉంటాయి. ముందుకుసాగుతున్న కొద్ది పదచిత్రాల కవిత్వం పలుకరిస్తూపోతూనే ఉంటుంది. ఏమిలేని ఒకరోజు అంటూ అనుకున్న ప్రతిసారి సూదిలో దారం కొత్తరోజును కుట్టి చూపిస్తుంది. ఊదారంగు డిసెంబరాలు జీవితం చూపులోకి విరబూస్తాయి. నిరాశను పారదోలి జీవితంపై ఆశ ఉండాలి అనుకోవడం తప్పేమి కాదు కదా..!
ఇక ‘ఎర్రమట్టి గాజులు’లో తల్లి హృదయాన్ని ఆవిష్కరించిన తీరు అద్భుతం. కూతురును చదివించి ప్రయోజనకారిని చేయా లనే తపన. అలాగే ప్రతి ఆడపిల్ల చదువుకొని తల్లికి పేరు తీసుకురావాలి. గొప్పస్థానానికి చేరుకున్నాక అమ్మని చూడాలి. అందుకే ప్రతి ఎర్రమట్టి గాజులు తపన పడుతున్నాయి బిడ్డ కోసం.

ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇప్పటికి స్త్రీని ఆచారాల పేరు తో సంకెళ్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కొన్ని కుల సమూహాల్లో మహిళలను నెలసరి సమయంలో మూడురోజులు ఇంట్లోకి రానివ్వరు. ఆ మూడురోజులు మూడు యుగాలుగా గడుపుతా రు అమ్మాయిలు. ఎంతో బాధాకరంగా ఆ విషయాన్ని అక్షరాల్లో వర్ణించారు. ‘మూడు రోజుల హింస చెంబుడు నీళ్లలో తేలింది/బహిర్‌ భూమి యుద్ధం కళ్ళకి కట్టింది/నెత్తుటి వాసనకి వెంటబ డే గ్రామసింహాలు /మరుగు కోసం దాక్కునే శరీరం ఎంత హిం సనో కదా..’ వీటిని అరికట్టలేమా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఆచారాల పేరుతో హింసాత్మకత కొనసాగుతున్న తీరుకు అద్దం పడుతుంది.(ఒక సండాసు కథ).చుట్టూ ఘోరాలు జరుగుతున్నా వార్తలు చూసినంతవరకే మనం ఆవేశపడుతాం. దేశం నాశనమయ్యిందని ఎవరు పని చేయడం లేదని వాపోతాం. కానీ అది అప్పటివరకు మాత్రమే. రోజువారి వార్తల వానల్లో మనం మునిగినప్పుడు ఎక్కడి నుం చో వచ్చేస్తుంది అక్షరాల పడవ. అందులో ప్రయాణించి చూడాల్సిందే.. పత్రికలో వచ్చే వార్తలకు మన మనోభావాలు ఎలా ఉంటాయి ‘అక్షరాల పడవ’లో బాగా చెప్పారు. ‘నిన్న రాత్రి వేడెక్కిన అక్షరాలు పొద్దునే వార్తాపత్రికలో చదువుతాను /టీ ఆవిరితో ఉద్రేకపడ్తాను..’ అందుకే చివరిలో అంటారు.. ‘చెట్టు విదిల్చిన జల్లులో తడిచిన అక్షరాలూ/నానిపోయి నడవలేని ఆవేదన లు/కంటి చూపుకి దూరం అయ్యాయి..’(అక్షరాల పడవ).అసిఫా మీద రాసిన కవిత చాలా ఆలోచించదగింది. ఈ కవి త చదువుతున్నప్పుడు మనం ఇంత క్రూర సమాజంలో బతుకు తన్నామా అనిపిస్తుంది. ‘హైనాల దాష్టికాల ఆనవాళ్లు /సూర్యు డి ముఖం మీద దిగంబరంగా ఛిన్నాభిన్నంగా పడి ఉన్నాయి/చూడటానికి ఏమి లేనట్టు తెల్లటి వస్ర్తాలతో పవిత్ర దేవుళ్ళ అభ య హస్తం నీడలోడబ్భు ఏళ్ళ స్వతంత్ర భరతంలో ఇలాటివి ఇంకా జరుగుతుండటం సిగ్గుచేటు..’(ఆసిఫా).
ఇవి కొన్ని కవితలు మాత్రమే. స్త్రీ వాద గొంతుకతో రాసినవి కొన్ని అయితే, సున్నితత్వాన్ని రంగరించి రాసినవి మరికొన్ని. ప్రతి సందర్భాన్ని మానవీయంగా ఆకట్టుకునే శైలి, పద చిత్రాల తో ఇలా ఎన్నో అంశాలు ఈ ‘ఎర్రమట్టి గాజులు’లో కని పిస్తా యి. రేణుక అయోల కవిత్వం ఎంతటి కఠిన హృదయాన్నైనా కరిగిస్తుంది. ‘ఎర్రమట్టి గాజులు’ చదివితే కచ్చితంగా మనలను కదిలిస్తుంది, వెంటాడుతుంది. హింసా దౌర్జన్యాలు లేని సమా జం కోసం ఆలోచింపజేస్తుంది. అడుగులు వేయిస్తుంది.
- పుష్యమీ సాగర్‌, 90103 50317

109
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles