సైనికుని తమ్ముడు


Mon,October 21, 2019 12:33 AM

GURKHA
నిశిరాత్రి నింగి
చీకట్ల పాములు కరుస్తున్న వేళ
గుండెనిండా ధైర్యంతో
కళ్ళల్లో రేడియం పూసుకొని
బయలుదేరుతాడు..!
ఖాకీ డ్రెస్సు
ఒక చేతిలో టార్చ్‌
మరోచేతిలో లాఠీ
పెదవుల మధ్య విజిల్‌
చిల్లిగవ్వలేని జేబులో
చిరుగుల దస్తీ..
నేపాలీయో బీహారీయో
ఏ తల్లి కొడుకో
ఏమి తింటాడో
ఎక్కడుంటాడో
చిరునామా లేని వ్యక్తి
అతడు గూర్కా!
తోడునీడ వీడని మిత్రుడు
బతుకుపోరులో క్షతగాత్రుడు
మనసు తెరమీద
ఊరిపటం గీసుకొని
బయలుదేరుతాడు
కోరలు నూరే పిచ్చికుక్కలను
గజదొంగల గ్యాంగులను
ఈ ఏకాకి
ఎదురుకుంటాడు ముఖాముఖి!
చలిలో వానలో తుఫానుగాలిలో
గుర్కా ఉన్నాడులే అంటూ
గురకకొట్టే ఇళ్ళ యజమానులు
పైసా విదిల్చరు
ఆకలి కడుపుతో
భద్రతనిచ్చే అపరపోలీసు
సరిహద్దులను కాపాడే
సైనికుని తమ్ముడు..
అయినా
చీకటి పలకమీద
రెండు బొగ్గు అక్షరాలు
అతడే గూర్కా...
- డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌
94410 54637

104
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles