పోలీసుల పాత్ర మారింది


Sun,October 20, 2019 12:34 AM

పోలీసుల అవసరం సమాజానికి ఎంతగానో ఉన్నది. బ్రిటిష్‌ వారు మన దేశాన్ని పాలించిన సమయంలో కేవలం ప్రజల స్వాతంత్య్రేచ్ఛ ను అణిచివేయడానికే పోలీసులను వాడుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పోలీసుల అవసరం మరోవిధంగా ఉండాలని ప్రజలు ఆశించడంలో తప్పులేదు. కేవ లం శాంతిభద్రతలు కాపాడటం కోసం, నేర నిరోధన పరిశోధనలకే కాకుండా ప్రగతిపథంలో రాష్ర్టాలు కానీ, దేశం కానీ పురోభివృద్ధి సాధించాలంటే పోలీసుల అక్కర ఎంతగానో ఉన్నది. ఇతర దేశాల్లో పోలీసులను అభిమానించే సంస్కృ తే ఎక్కువగా కనబడుతుంది. మన దేశంలో బహుశా బ్రిటిష్‌ పాలనానుభవంతో పోలీసులను ప్రజలు ఆదరించే స్థితి ఇంకా పూర్తిగా రాలేదు. పోలీసులు కూడా ప్రజల కోరికలకు అనుగుణంగా ప్రవర్తించే మార్గదర్శక సూత్రాలు పూర్తిగా ఆచరణలో పెట్టడం లేదు. పోలీసులు చాలామంది విధి నిర్వహణలో ఏటా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏడాదీ అక్టోబర్‌ 21నాడు విధాయకంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు వారిని తలుచుకునే సం ప్రదాయం చాలా సంవత్సరాల నుంచి దేశంలోనూ, రాష్ర్టాల్లో నూ ఆచరిస్తున్నారు. మీరు మా కోసం ప్రాణాలిచ్చారు. మేము ఉన్నాం మీ కోసం అని పోలీసులకు అండదండలు ఇవ్వడంతో పాటు ఒక మానసిక భరోసాను ఈ సంస్మరణ ద్వారా ఇవ్వాలనే సదుద్దేశంతో పోలీసు వారు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసు సంస్థలోని లోటుపాట్లతో పాటు ప్రజలు పోలీసుల నుంచి ఏమి ఆశిస్తున్నారు, పోలీసు లు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారని తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం.
మొదట ప్రజలు పోలీసులు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో తెలుసుకుందాం: 1.పోలీసుస్టేషన్లలో ప్రజలకు ఆదరణ అవసరం. 2.పోలీసులు నేరస్తులను, సామాన్యులను ఒక్కతీరుగా చూసే అలవాటును మానుకోవాలి. 3.పోలీసుల జవాబుదారీతనంతో పాటు పారదర్శకత కొట్టచ్చేట్టు కనపడాలి. 4.చిన్నచిన్న విషయాల్లో హెచ్చరించాలి కానీ, బాధించకూడదు. 5.ఒక స్నేహితుడిగా, మార్గదర్శిగా అంతరంగ విషయాలను బహిర్గతపరిచే వాడిగా పోలీసు ఉండకూడదు. 6.చట్టానికి పోలీసు బాధ్యుడి గా ఉండక తప్పదు.


ఇప్పుడు పోలీసులు ప్రజలు ఏవిధంగా ఉండాలనుకుంటున్నారో తెలుసుకుందాం: 1.తమ కోసమే ఉన్నారనే భావనతో ఉండాలి. 2.చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. 3.ఫిర్యాదు ఇవ్వగానే సమస్య పరిష్కరించబడుతుందని అనుకోకూడదు.4.తనకు ఇష్టంలేని వ్యక్తిని కసితీరా బాధిస్తేనే న్యాయమ ని భావించకూడదు. 5.తాము రాజకీయం చేయొచ్చుగానీ, పోలీసులు పౌరులుగా ఉండటానికి కూడా వీల్లేదని భావించకూడదు. 6.అనేక రకాల ఒత్తిళ్లు తేకూడదు.చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ ప్రజలూ, పోలీసులూ కొంతలోకొంత పూర్తిగా ఆచరించకపోయినా, ఆచరించటానికి ప్రయత్నించినా ఇరుపక్షాల మధ్య సామరస్య ధోరణి ఏర్పడటం ఖాయం. పోలీసులు ఈ మధ్యకాలంలో ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహిస్తున్నారనేది నిర్వివాదాంశం. ఒత్తిళ్లనేవి సొంతంగా తాము చేసే పనుల వల్లనే చాలావరకు ఉంటాయ ని పోలీసులు గ్రహించకతప్పదు. ప్రజలు కొన్నిసార్లు చట్టాన్ని గౌరవించకుండా చేసే అరాచకాల వల్ల కూడా పోలీసుల మీద ఒత్తిడి పెరుగడానికి ఆస్కారం ఉన్నది.

పోలీసుల్లో ఎక్కువమంది తీవ్రవాదం, ఉగ్రవాదం వల్ల ప్రాణాలు అర్పించే పరిస్థితి వస్తున్నది. ఒక్కొక్క ప్రభుత్వం, ఒక్కోతీరులో ఈ సమస్యను చూస్తున్నది. దేశమంతటా ఒకేతీరులో నిర్ణయాలు, పరిష్కారాలుంటే బాగుంటుంది. పోలీసు ‘స్టేట్‌ సబ్జెక్ట్‌' కావడం వల్ల అవసరమైతే చట్టాలను అవసరమైన రీతిలో మలుచుకోవాలి. అప్పుడే విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించే పోలీసుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నది.


పోలీసులు చట్టానికీ, ప్రభుత్వాలకూ విధి నిర్వహణలో బాధ్యులు అని స్పష్టంగా చెప్పినప్పుడు తాము ఆ విధంగానే విధుల నిర్వహణలో ప్రవర్తిస్తున్నామనే విషయం ప్రజలకు తెలియజేసే బాధ్యత పోలీసుల మీద ఉన్న ది. ప్రజలు పట్టించుకోకపోతే పోలీసులు చేసేదేమీ లేదు. ప్రభుత్వాలు ఆ సందర్భాల్లో జోక్యం చేసుకోకతప్పదు. ఏ కార ణం చేతనైనా ప్రభుత్వాలు ముందుకురా కపోతే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలను తీసుకోవటంలో తప్పేమీ లేదు. చీటికిమాటికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశం ఉన్న ది. ప్రజలందరూ నేరస్తులు కారు. నిజాని కి పోలీసులు నేరస్తులను, నిందితులను, చట్టాలను అతిక్రమించేవారిని నియంత్రించటానికే ఉన్నారు. నియంత్రించబడే వారి సంఖ్య చాలా తక్కువ. అదెప్పుడూ స్ఫురణలో ఉంచుకుంటే పోలీసులు ప్రజలకు మరింత దగ్గర కావడానికి అవకాశం ఉన్నది.

ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి ఇంతకుపూర్వం మైత్రీ సంఘాలు, ప్రజా పోలీసు పేరిట కొన్ని ప్రయోగాలు పోలీసుశాఖ చేసింది. ఇప్పుడు తెలంగాణలో ‘ఫ్రెండ్లీ పోలీస్‌' పేరుతో పోలీసులు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. పబ్లిసిటీ ఇలాంటి విషయాల్లో అవసరమే! కానీ కేవలం పబ్లిసిటీ మీదనే ఆధారపడితే ఫలితాలు ఆశించినరీతిలో ఉండవు. ఫ్రెండ్లీ పోలీసుగా ఎప్పుడవుతారంటే, పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారిని మర్యాదతో చూసినప్పుడు, అవినీతిరహితంగా సమస్యలను పరిష్కరించినప్పుడు, ప్రతి ఫిర్యాదుకు కేవలం రశీదుతోనో, ఎఫ్‌ఐఆర్‌తోనే సరిపుచ్చకుండా, తగుచర్యతో సంతృప్తిపరిచినప్పుడు అని చెప్పకతప్పదు.

నిజానికి పోలీసుల పనితీరు మెరుగుపడాలంటే అధికారులతోపాటు ప్రభుత్వాల శ్రద్ధ కూడా మరింత అవసరం. పోలీసును గడియారంలా చూడకూడదు. నిరంతరం ఆడే గడియా రం ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోతుంది. పనిగంటలు నిర్ణయించటంతో పాటు విశ్రాంతి అవసరం అనేది గుర్తించకపోతే పోలీసుల పనితీరులో మార్పుండదు. సిబ్బందిని పెంచకతప్పదు. ట్రైనింగ్‌, ఉద్యోగంలో చేరే ముందు ఇస్తే చాలనుకుంటే ఫలితా లు అనుకున్నట్లు రావు. ఇన్‌సర్వీస్‌ ట్రైనింగ్‌ నామమాత్రంగా ఉండకూడదు. ట్రైనింగ్‌ అంటే క్లాస్‌రూం అనుభవం కాదు. క్షేత్రస్థాయి నుంచి వచ్చినవారు ఒకరితో మరొకరు అనుభవా లు పంచుకుంటేనే పనితీరులో మార్పులకు అవసరం ఉందని గుర్తిస్తారు. సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానంతో అనేక చిక్కు కేసులను పోలీసులు పరిష్కరించటానికి కారణం సంబంధిత నాలెడ్జ్‌ని పెంచుకోవటం వల్లనే! కొత్త పరిణామంగా పోలీసుల్లో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. దీనిగురించి పట్టించుకోకపోతే అలవిగాని పరిస్థితులు డిపార్టుమెంట్‌లో ఏర్పడే ప్రమా దం ఉన్నది. సమస్య అధ్యయనంతో పాటు సైకాలజీ క్లాసుల ఆవశ్యకత గురించి ఆలోచించాలి.
Sita-Rama-Rao
పోలీసుల్లో ఎక్కువమంది తీవ్రవాదం, ఉగ్రవాదం వల్ల ప్రాణాలు అర్పించే పరిస్థితి వస్తున్నది. ఒక్కొక్క ప్రభుత్వం, ఒక్కోతీరులో ఈ సమస్యను చూస్తున్నది. దేశమంతటా ఒకేతీరులో నిర్ణయాలు, పరిష్కారాలుంటే బాగుంటుంది. పోలీసు ‘స్టేట్‌ సబ్జెక్ట్‌' కావడం వల్ల అవసరమైతే చట్టాలను అవసరమైన రీతిలో మలుచుకోవాలి. అప్పుడే విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించే పోలీసుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నది. పాత కాలం లో ఒక జడ్జి ‘పోలీసులను యూనిఫాంలో ఉన్న గుండాలు’గా వర్ణించాడు. బ్రిటిష్‌ కాలం నాటి ప్రవర్తన కొన్నాళ్లు ఆ విధంగానే ఉండటం వల్ల బహుశా అలా అని ఉండవచ్చు. ఇప్పుడు ఆ మాటకు కాలం చెల్లింది.

‘నెస్ససరీ ఈవిల్‌గా పోలీసును కొందరు నోటి దురుసుతనంతో అన్నారు. అట్లా అనుకుంటే చాలా సంస్థలను ఇన్విటబుల్‌ ఈవిల్‌' అని అనొచ్చు. అలా అనవసరంగా ప్రజల కోసం ఏర్పడిన సంస్థలను అనటం తప్పని భావించనంతకా లం ఆశించిన మార్పు ఏ సంస్థలోనూ ఉండదు. నిజానికి ప్రజ ల అవగాహనతో పాటు ఆదరణ పోలీసులకు చాలా అవసరం. ఎంత వద్దనుకున్నా పోలీసులు లేనిదే ప్రజలు ఉండలేరు!
(రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం..)

566
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles