పదోన్నతులు కల్పించాలె


Thu,October 17, 2019 12:05 AM

రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో, శిశుసంక్షేమం, విద్యాభివృద్ధిలో అంగన్‌వాడీ టీచర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చి నమాట ప్రకారం అంగన్‌వాడీ టీచర్ల సేవల ను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి వేతనాలు పెంచటం హర్షణీయం. ప్రజాపక్షపాతిగా సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల వారి సమస్యలను అడుగకున్నా తీరుస్తున్న తీరు శ్లాఘనీయం. ఈ క్రమంలోనే గతంలో మాట ఇచ్చినట్లుగా ఉన్నత చదువులు చది వి అంగన్‌వాడీ టీచర్లుగా పనిచేస్తున్న విద్యాధికులకు పదోన్నతులు కల్పిస్తే మరి న్ని ప్రయోజనాలు నెరవేరుతాయని అంగ న్‌వాడీ టీచర్లు కోరుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి న అవసరం ఉన్నది.
- సీహెచ్‌ పద్మ, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా


అవినీతి అదుపు ఆవశ్యం

ఈ మధ్యన అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కుతున్న ఉందంతాలు చూస్తుంటే అవినితి, అక్రమాలపై ప్రభుత్వ కఠినంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ విధంగానే రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలపై కూడా దృష్టిసారించి అవినీతిపరులకు కళ్లెం వేయాలి. అలక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు సస్పెండ్‌ చేయటం కూడా ముదావహం. అవినీతికి పాల్పడుతున్న పెద్ద తిమింగలాలను కూడా వలవేసి పట్టుకోవాలి. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పాదుకొల్పాలి.
- వీర పూర్ణచందర్‌రావు, హైదరాబాద్‌

ప్రభుత్వ పాఠ్యపుస్తకాలే పెట్టాలె

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పెట్టకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మోడల్‌ స్కూళ్ల ప్రవేశపరీక్షలు రాయాలంటే ప్రైవేటే పాఠశాల విద్యార్థులు రాయలేకపోతున్నారు. కాబట్టి అన్ని ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే బోధించేట్లు చర్యలు తీసుకోవాలి.
- జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాల జిల్లా.

113
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles