మన బియ్యానికి బ్రాండ్ ఇమేజ్


Tue,October 15, 2019 11:31 PM

ts-rice
ప్రస్తుత సంవత్సరంలో విస్తారంగా వానలు పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కొత్త మెగా ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో వరి ధాన్యం గతంలో ఎన్నడూ లేనంత పెద్దఎత్తున పండే అవకాశాలున్నాయి. ఈ సీజన్లో ఇలా పం డిన వరిధాన్యం మొత్తం కూడా ప్రభుత్వం నిర్ణయించిన సేకరణ కేంద్రాలను ముంచెత్తుతుంది. గతంలో పంట వచ్చే సమయంలో వేలాదిమంది రైస్ మిల్లర్స్ ట్రేడర్స్ ప్రభుత్వ సేకరణ కేంద్రాలు ధాన్యం సేకరణలో ఉండేవి. దీనివల్ల ఈ సేకరణ జాప్యం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కానీ అంతకంటే ఎక్కువగా కానీ జరిగింది. అందుకు విరుద్ధంగా కొన్ని సంవత్సరాలుగా పండిన పంట మొత్తం కూడా ప్రభుత్వం నిర్ణయించిన సేకరణ కేం ద్రాల్లో ప్రభుత్వం కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో వరి పండించే పొలాల విస్తీర్ణం తగ్గినా, ఉత్పాదకత పెరుగకున్నా సేకరణ మాత్రం ఎన్న డూలేనం త అధికస్థాయిలో ఏయేటికాయేడు పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వాధికారులు తమ ఘనకార్యంగా భావిస్తూ ముఖ్యమంత్రికి ఈ విషయంలో తప్పుడు సంకేతాలు ఇచ్చారు. వాస్తవానికి ధాన్యం సేకరణ ఏయేటికాయేడు పెరుగడానికి కారణం బహిరంగ మార్కెట్లో ధాన్యానికి కానీ బియ్యానికి గానీ ఏ మాత్రం డిమాం డ్ లేకపోవడం. గతంలో తెలంగాణ రాష్ట్ర బియ్యానికి ఇతర రాష్ర్టాలలో ఇతర దేశాల్లో ఉన్న మార్కెట్ పూర్తిగా పడిపోవడం, దానివల్ల ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యం మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనవలసిన పరిస్థితి దాపురించింది. ఎక్కడ ఇతర అవకాశాల్లేవు. అందుకే రైతులు ధాన్యం కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తమ ధాన్యాన్ని అమ్ముకోవడం జరుగుతున్నది.


అనేక విషయాలో, అనేక విధానాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు భారత దేశంలో అనేక రాష్ర్టాలకు మార్గదర్శకంగా ఉన్నది. రాష్ట్రం ఇప్పుడు 30 రూపాయలకు బియ్యాన్ని సేకరించి ఒక రూపాయికి రేషన్ కార్డుల ద్వారా పేద ప్రజలకు సరఫరా చేస్తున్నది. ఈ పథకానికి స్వస్తి చెప్పి నగదు రూపంలో లబ్ధిదారులందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నెలవారీగా ఈ డబ్బు చెల్లించే ఏర్పాటుచేయాలి. ఇలా చేయడం వల్ల ప్రజలకు తమకు ఇష్టమైన బియ్యాన్ని, నాణ్యమైన బియ్యాన్ని తనకు ఇష్టమైనప్పుడు కొనుక్కునే పూర్తిస్వేచ్ఛ లభిస్తుంది.


ఈ పరిస్థితులు రావడానికి గతంలో ప్రభుత్వాలు ఆచరించిన దూరదృ ష్టి లేని విధానాలే కారణం. దీనివల్ల బహిరంగ మార్కెట్లో తెలంగాణ రాష్ట్రం బియ్యాన్నికున్న గొప్ప బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. రాష్ట్ర బియ్యా న్ని ఒక చౌక, నాణ్యత లేని వస్తువుగా మార్చడం జరిగింది. దీనికి అర్థశాస్త్రంలో చెప్పిన giffen paradox giffen products సూత్రం. ప్రజల ఆదాయం పెరిగినా కొన్ని వస్తువుల ధర పెరుగదు. వాటి వినియోగం కూడా పెరుగదు. దాన్ని giffen paradoxగా చెబుతారు. అలాగే కొన్ని వస్తువుల ధర పడిపోయినప్పుడు వినియోగం కూడా పడిపోతుంది. మామూలుగా అయితే తగ్గినప్పుడు వస్తువు వినియోగం పెరుగాలి. కానీ giffen ప్రొడక్ట్ అని ముద్రపడిన వస్తువుల విషయంలో ఇది జరుగదు. నాణ్యమైనవి అయినా రేషన్ రేషన్ బియ్యాన్ని ఒక్క రూపాయికి విడుదల చేశారు. దీంతో ప్రజలకు బియ్యం ఒక నాణ్యత లేని వస్తువుగా, వినియోగించడానికి వీలులేని వస్తువుగా మారిపోయింది. దాని వినియో గం పూర్తిగా నానాటికీ పడిపోయింది. రేషన్‌కార్డుల సంఖ్య పెరిగినా వినియోగించే ప్రజల సంఖ్య తగ్గిపోయింది. రేషన్ బియ్యం అనే ఒక విలువ లేని వస్తువు మార్కెట్ నుంచి తక్షణమే తొలిగించాలి. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన బియ్యం ఇతర రాష్ర్టాల్లో, ఇతర దేశాల్లో ఉన్న బ్రాండ్ ఇమేజ్ కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. బహిరంగ మార్కెట్లో తెలంగాణలో ఉత్పత్తి జరిగిన బియ్యానికి డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రం గట్టెక్కగలుగుతుంది. రేషన్ బియ్యం అనే ఒక వస్తువు స్థానంలో నాణ్యమైన తెలంగాణ బియ్యం అనే ఒక వస్తువును ప్రవేశపెట్టాలి. తద్వారా ధాన్యానికి గతంలో ఉన్న డిమాండ్ పరిస్థితులను కలిపించవచ్చు.

అనేక విషయాలో, అనేక విధానాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు భారత దేశంలో అనేక రాష్ర్టాలకు మార్గదర్శకంగా ఉన్నది. రాష్ట్రం ఇప్పుడు 30 రూపాయలకు బియ్యాన్ని సేకరించి ఒక రూపాయికి రేషన్ కార్డుల ద్వారా పేద ప్రజలకు సరఫరా చేస్తున్నది. ఈ పథకానికి స్వస్తి చెప్పి నగదు రూపంలో లబ్ధిదారులందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నెలవారీగా ఈ డబ్బు చెల్లించే ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రజలకు తమకు ఇష్టమైన బియ్యాన్ని, నాణ్యమైన బియ్యాన్ని తనకు ఇష్టమైనప్పు డు కొనుక్కునే పూర్తిస్వేచ్ఛ లభిస్తుంది. వినియోగదారుడి ప్రాథమిక హక్కు అంటే తనకు ఇష్టమైన వస్తువును తనకు నచ్చిన ధరల్లో కొనుక్కునే స్వేచ్ఛ ఉండటం. రాష్ట్రం ధాన్యాన్ని సేకరించి, బియ్యాన్ని మాత్రం నాణ్యమైన విధంగా తయారుచేసి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్‌తో బహిరంగ మార్కెట్లో విక్రయించగలుగాలి. అప్పుడు బియ్యం ధర మార్కె ట్ సూత్రాలకు అనుగుణంగా స్థిరీకరించబడి దాన్ని మొత్తం ప్రభుత్వమే స్వీకరించవలసిన పరిస్థితులను అధిగమించవచ్చు. అలాకాకుండా ఇప్పటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే వానకాలంలో చేతికొచ్చే పంట మొత్తం ప్రభుత్వమే సేకరించాలి. దాన్ని తరలించి కస్టవ్‌ు మిల్లింగ్ ద్వారా బియ్యంగా మార్చి ఒక రూపాయికే కిలో బియ్యంగా మార్కెట్లోకి విడుదల చేయాలి. లేకుంటే మిగిలిన మొత్తం కూడా గోదాములలో చెడిపోయే పరిస్థితి ఏర్ప డుతుంది. తెలంగాణలో పండే వరిధాన్యం పంట విషయంలో అనేకమైన లాభా లు రాష్ర్టానికి, ప్రజలకు చేకూరుస్తున్నాయి. వరిగడ్డి నుంచి మొదలు బియ్యంగా మార్చిన తర్వాత వచ్చే తవుడు, నూకలు, చిట్టు, వరిపొట్టు, బూడిద వరకు ప్రతి వస్తువు ద్వారా ఈ రాష్ట్రంలో లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కూడా లభిస్తుంది.
t-devendhar
ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలను అవలంబించాలి. తద్వా రా రానున్నరోజుల్లో ధాన్యం సేకరణ ద్వారా కొన్ని వేల కోట్ల నష్టాన్ని నివారించవచ్చు. వినూత్న ఆలోచనలు, వినూత్న విధానాల్లో మాత్రమే తెలంగాణ రాష్ట్ర బియ్యానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావచ్చు. దానిద్వారా వినియోగం పెరుగుతుంది. వినియోగదారుడికి, పండించిన రైతుకు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది.

420
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles