ప్రతిపక్షాల ద్వంద్వ విధానాలు


Tue,October 15, 2019 12:27 AM

దేశంలో జరిగే ప్రతి పనిని తమ ప్రమేయంతోనే జరుగాలని కేంద్రం భావిస్తున్నది. రాష్ర్టాలు చేస్తున్న అభివృద్ధి పనులను, ఇత ర మార్పులను అడ్డుకొని తమపార్టీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా విమర్శలు చేయడం నేటి దేశ రాజకీయ చిత్రపటంలో కనిపించే విచిత్రమైన పరిస్థితి. ఫెడరల్ వ్యవస్థలో రాష్ర్టాలకు, కేంద్రానికి మధ్య స్పష్టమైన పని విభజనను రాజ్యాంగంలో పొందుపరిచారు. గత మూడు దశాబ్దాలలో రాష్ర్టాలపై ఆధిపత్యం చలాయించాలనే ఆలోచనల తో కేంద్రం రాష్ర్టాల అధికారాలను కైవసం చేసుకోవడానికి అనేకసార్లు రాజ్యాంగ సవరణలు చేసింది. విద్య, స్థానిక పరిపాలనలను కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే కేంద్రం చేతిల్లోకి తీసుకున్నది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాలను, జీఎస్టీ పేర వివిధ రకాల పన్నులను రాష్ర్టాల చేతిలోనుంచి తీసుకొని ఏకీకృత పన్నుల విధానం పేర రాష్ర్టాల ఆర్థిక స్థితిగతులను నిర్ణయించే స్థితికి చేరింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాను దేశస్థాయిలో అవలంబిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక విధివిధానాలను తాము పాలిస్తున్న రాష్ర్టాలలో కూడా పాటించడం లేదు. అలాగే ఇతరపార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో, అవే కేంద్ర విధానాలను అధికారంలో ఉన్న పార్టీలు అవలంబిస్తున్నాయి. కానీ బీజేపీ స్థానిక నాయకులు వ్యతిరేకించడం ఆ పార్టీ విధాన లోపాన్ని, పార్టీ నాయకుల సమన్వయ లోపాన్ని, రాజకీయ సిద్ధాంత లొసుగులను బయటపెడుతున్నది. ప్రపంచమంతా ఆర్థిక సరళీకరణ జరిగి, మార్కెట్ ప్రభుత్వం చేతిలో కాకుండా ప్రైవేట్ వ్యాపారవర్గాల చేతిలో ఉన్నది.


ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వాన్ని నిందించడం సరి కాదు. దానికి ముందు ఆ సమస్య పుట్టుపూర్వోత్తరాలే కాకుండా, దేశంలో మిగతా రాష్ర్టాలలో ఉన్న పరిస్థితులను, అక్కడి ప్రభుత్వ విధానాలను పరిశీలిం చాలి. ఇలా పరిపూర్ణ అవగాహనతో విమర్శిస్తే హుందాగా ఉంటుంది. సమస్యను పరిష్కరించే దిశలో నడిపించడానికి బదులు ఆవేశాలను రెచ్చగొడుతూ, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాజకీయ నాయకుల స్వప్రయోజనాలను గుర్తించలేనంత అమాయకులేమీ ఆర్టీసీ కార్మికులు కాదు.


అవినీతి మయమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించిన బీజేపీ ఆర్థిక విధానాలూ స్వేచ్ఛా విపణి, పెట్టుబడి ఆర్థిక విధానాలే అవలంబిస్తున్నది. అందుకు అనుగుణంగా దేశంలోని అనేక ప్రభుత్వాధీన సంస్థలను, వ్యాపార సంస్థలను కేంద్రం ప్రైవేట్ పరం చేయడానికి, సంక్షేమ పథకాల కు కావల్సిన నిధులను రాబట్టుకోవడానికి యత్నిస్తున్నది. బీజేపీ అధికారంలో ఉన్న ఎన్నో రాష్ర్టాలలో ప్రజారవాణా వ్యవస్థ, విద్యా, వైద్యరంగాల్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నది. ప్రజారవాణా వ్యవస్థ లో ప్రపంచంలో అతి పెద్ద వ్యవస్థ అయిన రైల్వేలను పూర్తిగా ప్రైవేట్ రం గానికి అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2012లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వేలో 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ చట్టాలలో మార్పులు తెచ్చింది. దానికి అనుగుణంగానే లోకోమోటివ్ రంగంలో జపాన్ పెట్టుబడులు పెట్టింది. అలాగే మొన్ననే పూర్తిస్థాయి ప్రైవేట్ రైలు లక్నో నుంచి కొత్త ఢిల్లీకి ప్రారం భమైంది. నమూనాగా ప్రారంభించిన 53 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పనులన్నీ ప్రైవేట్ రంగానికి అప్పజెప్పటం గమనార్హం. అందులో భాగంగానే మొన్నటి పండగ సీజన్లో ఫ్లాట్ ఫాం టికెట్‌ను 10 నుంచి 30 రూపాయలకు పెంచిన సంగతి విదితమే. విద్యా, ఆరోగ్యంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ అధీనంలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితులలో ఈ మూడురంగాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వాధీనంలో నిర్వహించడం సాధ్యం కాదనే విషయం అనేక కమిటీల నివేదికల్లో తేలిం ది.

అంతెందుకు కేంద్రంలో మహా రత్న అవార్డు పొందిన ఎన్నో ప్రభు త్వ సంస్థలలో అధిక మొత్తం వాటాలను ప్రైవేట్ రంగానికి అమ్మివేయటా నికి గత 20 ఏండ్లలో జరిగిన ప్రయత్నాలను ఎవరైనా అడ్డుకొన్నారా అని ప్రశ్నించుకోవాలి. అందుకే వేల కోట్ల లాభాలను ఆర్జిస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో 53 శాతం వాటాను ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి అమ్మి ఈ ఏడాది ఏర్పడే ద్రవ్యలోటులో దాదాపు 63 శాతం పైగా పూడ్చుకోవాలని చూస్తున్నది. ఒక్క భారత పెట్రోలియం కార్పొరేషన్‌నే కాదు, అలాంటి మరెన్నో సంస్థలను ప్రైవేట్‌రంగానికి అప్పజెప్పడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించడం, తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం జరిగిపోయాయి. కానీ అలా ప్రభుత్వంలో కలుపడంలో ఉన్న సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకోని ప్రతిపక్షాలు సమ్మెకు మద్దతు ప్రకటించడం వింతగా ఉన్నది. గురివింద తన కింద ఉండే నలుపును గుర్తించదన్నట్టు కాంగ్రెస్, బీజేపీలు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాలలో గత మూడు దశాబ్దాలుగా అమలుచేసిన విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలను, కార్మికులను రెచ్చగొట్టడం విచిత్రంగా ఉన్నది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం విద్యను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నిర్వహించాలని చూస్తున్నా అది సాధ్యం కావడం లేదనే విషయం అర్థం అవుతున్నది. అలాగే బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, అస్సాం లాంటి రాష్ర్టాలలో విద్యా, వైద్య, ప్రజారవాణా వ్యవస్థల తీరు చూస్తే దేశం ఇంకా క్రీస్తు పూర్వ కాలంలో ఉన్నట్లు అర్థం అవుతుంది. ఈ రాష్ర్టాలను పాలిస్తు న్నది, ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. లేదా వాటి సహాయంతో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలే.
Prabhakar-rao
రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే.. విద్యా, వైద్యం, ప్రజా రవాణా వ్యవ స్థలు ప్రభుత్వ అధీనంలో పూర్తిగా ఉండాలని అందరూ ఆశిస్తారు. కానీ మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులలో దేశ సంపదలో సగానికిపైగా ప్రజల సంక్షేమ పథకాలకే సరిపోగా మిగిలిన సగంలో కనీస మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే అని గ్రహించాలి. ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వాన్ని నిందించడం సరి కాదు. దానికి ముందు ఆ సమస్య పుట్టుపూర్వోత్తరాలే కాకుండా, దేశంలో మిగతా రాష్ర్టాలలో ఉన్న పరిస్థితులను, అక్కడి ప్రభుత్వ విధానాలను పరిశీలిం చాలి. ఇలా పరిపూర్ణ అవగాహనతో విమర్శిస్తే హుందాగా ఉంటుంది. సమస్యను పరిష్కరించే దిశలో నడిపించడానికి బదులు ఆవేశాలను రెచ్చగొడుతూ, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాజకీయ నాయకుల స్వప్రయోజనాలను గుర్తించలేనంత అమాయకులేమీ ఆర్టీసీ కార్మికులు కాదు. ప్రతిపక్షాల ఉద్యమాలు రేపటి హుజూర్‌నగర్ ఉప ఎన్నికే ధ్యేయంగా కార్మికుల సమ్మెను వాడుకోవాలని చూడటం విచారకరం. అట్లనే కార్మికులు నెల రోజులు ముందే ప్రభుతానికి నోటీసు ఇస్తే, ఇన్నా ళ్ళు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఈ నెల రోజులలో ఎలాంటి కార్యాచరణకు పూనుకొన్నాయి? ప్రభుతానికి- కార్మికులకు మధ్య ఎలాంటి సయోధ్య చర్యలు చేపట్టాయో ప్రజలకు తెలుపాల్సిన బాధ్యత వారిపై ఉన్నది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)

377
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles