ఏడు పదుల చైనా


Thu,October 3, 2019 11:50 PM

మావో నాయకత్వంలో 1949లో అవతరించిన జన చైనా ఏడు పదులు నిండి ఈ నెల ఒకటవ తేదీన సంబురాలు జరుపుకున్నది. అనేక దేశాలలో మాదిరిగానే చైనాలో కూడా సమసమా జం కోసం కన్న కలలు భగ్నం కావడం విషాదకరం. అయితే అంతర్జాతీయ యవనికపై చైనా ఒక సామ్యవాద దేశంగా కాకున్నా, ఒక ఆసియా దేశంగా గర్వపడవలసిన స్థాయికి చేరుకున్నదనేది అంగీకరించవలసిందే. చైనా అంటే ప్రధానంగా చెప్పుకోవలసింది ఆర్థికాభివృద్ధి. ప్రపంచంలో అమెరికా తరువాత రెండవ స్థానంలో నిలిచింది. వాణిజ్యరంగంలో అమెరికాతో ఢీ అంటే ఢీ అం టూ సవాలు చేస్తున్నది. అమెరికా మూడవ ప్రపంచదేశాలపై ఒత్తిడి తెచ్చి ప్రపంచీకరణ సూత్రాలను నెలకొల్పింది. ఇప్పుడు ప్రపంచీకరణ పోకడలకు చైనా మార్గం చూపుతుంటే అమెరికా రక్షిత విధానాలను ఆశ్రయిస్తున్నది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా మొదలుకొని ఇండో పసిఫిక్‌ వరకు వాణి జ్య సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నది. సైనికంగా కూడా చైనా బలమైన శక్తిగా ఎదిగి నాటో కూటమిని ఎదిరిస్తున్నది. చైనాను కట్టడి చేయడానికి అమెరికా కూటములు కట్టవలసి వస్తున్నది. బహుళ ధ్రువ ప్రపంచంలో చైనా ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. శాస్త్ర సాంకేతికరంగాల్లో శిఖరాగ్రానికి చేరుకోవడానికి చైనా నాయకత్వం పట్టుదలతో వ్యవహరిస్తున్నది. అంతరిక్షం, వ్యవసా యం, జన్యుశాస్త్రం, కృత్రిమ మేధ, కమ్యూనికేషన్లు ఇట్లా ఏ భవిష్యత్తులో కీలకంగా మారే అన్ని రంగాల్లోనూ చైనా అత్యుద్భుతమైన రీతిలో ప్రయోగాలు సాగిస్తున్నది. దేశమంటే ఆర్థిక, సాంకేతికాభివృద్ధి, సైనిక బలం మాత్రమే కాదు. సామాజిక వికాసం అం తకన్నా ప్రధానం. చైనా విజయాల వెనుక నీలినీడలను కూడా గమనించవలసి ఉన్నది.


చైనా అభివృద్ధి చెందుతున్నదీ అంటే మనలను మనం కించపరుచుకున్నట్టు భావించకూడదు. మనం చైనా కన్నా అనేకరంగాల్లో వెనుకబడి ఉండవచ్చు. కానీ అనేకవిధాలుగా ముందున్నామనేది గర్వించదగిన విషయం. ఈ రెండు దేశాలు పరస్పరం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. భారత్‌ 1947లో స్వాతంత్య్రం పొంది నెహ్రూ నాయకత్వంలో నవభారతంగా రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. 1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రయోగం ఎంతోకాలం నిలువకుండా, స్వేఛ్చా మార్కెట్‌ వైపు మలుపుతిరిగింది. మన దేశంలో సామ్యవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని మేళవించిన సరికొత్త ప్రయోగం విజయవంతమైంది.


చైనా పెట్టుబడిదారీ వ్యవస్థవైపు మొగ్గిన తరువాత ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అసమానతలు ఉన్న సమాజంలో ఏక పార్టీ వ్యవస్థ మరింత అణిచివేతకు దారితీస్తుంది. ప్రజలకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేవు. నిరంకుశ వ్యవస్థ లో సమ్మెలకు తావులేకుండా, శ్రమశక్తిని చౌకగా లభిస్తుంది కనుక విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. పెట్టుబడుల ను ఆకర్షించడం, ఎగుమతులను పెంచుకోవడమనే విధానం ద్వారా చైనా ఆర్థికాభివృద్ధి సాధించింది. ఇది సామాజికాభివృద్ధికి దోహదపడదు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలకు కంపించిపో తుంది. మైనారిటీల అణిచివేత కూడా తీవ్ర స్థా యిలో ఉన్నది. నిరంతరం ప్రజల ఆలోచనలను తమకు అనుగుణంగా మలుచుకునే ప్రక్రియ సాగుతూ ఉంటుంది. జిన్‌జియాంగ్‌, టిబెట్‌ ప్రజలపై తీవ్రమైన అణిచివేత సాగుతున్నది. హాంకాంగ్‌లో అణిచివేత విధానాలకు అక్కడి ప్రజలు ఆందోళన బాటపట్టారు. ప్రజాస్వామ్యం లేకుండా ఎంత అభివృద్ధి సాధించి ఏమీ లాభం! భారత్‌, చైనా ఇరుగుపొరుగు దేశాలు. ఈ రెండు ఆసియా సమాజాల మధ్య అనేక సారూప్యాలున్నాయి. 21వ శతాబ్దం ఈ రెండు దేశాలదే అనే మాట వినబడుతున్నది. ఈ నేపథ్యంలో రెండింటినీ పోల్చి చూడటం పరిపాటి. చైనా అభివృద్ధి చెందుతున్నదీ అంటే మనలను మనం కించపరుచుకున్నట్టు భావించకూడదు. మనం చైనా కన్నా అనేకరంగాల్లో వెనుకబడి ఉండవచ్చు. కానీ అనేకవిధాలుగా ముందున్నామనేది గర్వించదగిన విషయం. ఈ రెండు దేశాలు పరస్పరం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. భారత్‌ 1947లో స్వాతంత్య్రం పొంది నెహ్రూ నాయకత్వంలో నవభారతంగా రూపుదిద్దుకోవ డం ప్రారంభించింది.

1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రయోగం ఎంతోకాలం నిలువకుండా, స్వేఛ్చా మార్కెట్‌ వైపు మలుపుతిరిగింది. మన దేశంలో సామ్యవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని మేళవించిన సరికొత్త ప్రయోగం విజయవంతమైంది. పాశ్చాత్య దేశాలు ఈర్ష్యపడే రీతిలో ప్రజాస్వా మ్య వ్యవస్థలను పొందించుకున్నం. అనేక సామాజిక, ఆర్థిక జాడ్యాలపై పోరాటం సాగించాం. శాస్త్రసాంకేతిక రంగాలలో కూడా ఎంతో అభివృద్ధి సాధించాం. ప్రజాస్వామ్య సమాజాన్ని నెలకొల్పుకోవడం ఎట్లా అనేది చైనా మన నుంచి నేర్చుకోవలసిందే. ఇదేరీతిలో మనం కూడా చైనా అభివృద్ధి విధానాలను కొన్నింటిని నేర్చుకోవాలె. మన దేశంలోని రెండు రాష్ర్టాల పెట్టులేని పాకిస్థాన్‌ చుట్టూ మన ఆలోచనలు తిరుగుతుంటాయి. కానీ చైనా అమెరికాను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాత్మక అభివృద్ధిని సాధిస్తున్నది. చైనా మనకన్నా మూడింతల పెద్ద దేశం. కానీ మంచి నీటి లభ్యత మన దేశంలో నాలుగింతలు ఎక్కువ. అయినా చైనా మంచినీటి సమస్యను అధిగమించింది. సౌరశక్తి, విద్యుత్‌ వాహనాలు, మౌలిక వసతులు మొదలైన అనేకరంగాలలో దూసుకుపోతున్నది. మన దేశానికి మాత్రం ముందుచూపుతో నడిపించే దార్శనికత కలిగిన రాజకీయ నాయకత్వం లేదు. అంతర్జాతీయరంగంలో చైనా ప్రబలశక్తిగా ఎదిగింది. మన దేశం కూడా అమెరికా ఉపగ్రహంగా మారకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కాపాడుకోవాలె. ఫైవ్‌ ట్రిలియన్‌ ఎకానమీ సాధించడమే గొప్ప కాదు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం వంటి విలువలను కాపాడుకుంటూ నే, స్వావలంబన కోల్పోకుండా అభివృద్ధి చెందాలె. భారత్‌, చైనా ఆసియా సౌహార్దతతో పరస్పరం సహకరించుకుంటూ ఇతర వర్ధమాన దేశాలకు చేయూతనివ్వాలె.

209
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles