బతుకమ్మ మొగ్గలు


Thu,October 3, 2019 02:33 AM

batukamma
గునుగు తంగేడుపూలన్నీ వనమొదిలి నేడు ఉరికివచ్చెను చూడు మన వాకిళ్ళలోకి బతుకమ్మగా మారే పూల భాగ్యమ్ము హరివిల్లులు జారి ముంగిళ్ళలో ముగ్గులయ్యే వేళపువ్వులన్నీ తెలంగాణలో వాగులయ్యేనుపూలసంద్రంలో బతుకమ్మ పున్నమై మెరిసేనుబంగారుతంగేడు మురిసిపోతూనేగౌరమ్మ మేనిపై చీరతానయ్యిందిపసుపుపచ్చని బాల మా తల్లి బతుకమ్మఅన్నదమ్ములంతా ఉరికి వెళ్ళిఊరంతా పూలతో నింపిన వేళచెల్లి మోవిపై మెరిసేటి చిరునవ్వే బతుకమ్మకృష్ణమ్మకు గోదావరికి జాగ్రత్తలు చెప్పాలిఅలల ఊయల్లో అమ్మను మెల్లంగా ఊపమనిమల్లెలంత సుకుమారి అమ్మ బతుకమ్మ
- శాంతి కృష్ణ, 9502236670
gandhi

మహాత్ముడు

మహాత్ముడు మానవుడు మనలో ఒకడు భూమి మీద నడిచినాడు మన కాలపు బుద్ధుడుధర్మపథం మార్గమని నమ్మి ఆచరించాడు సత్యదీక్ష ధ్యేయంగా చాటిచెప్పి నిలిచాడు మనుషుల్లో మహర్షి మహనీయుడు అతడు భరతజాతి మెచ్చిన గాంధీ మహాత్ముడు
- డాక్టర్‌ పత్తిపాక మోహన్‌, 9966229548

142
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles