మౌనం మాట్లాడిన వేళ


Mon,September 30, 2019 12:49 AM

ఎడారి గొంతుకల్లో చెమట పాట వినిపించిన కవి త్వ మాంత్రికుడు సురగౌని రామకృష్ణ. ఆయన మాట లు కులపు అడ్డుగోడల్ని చీల్చే కవితా తరంగాలు. నరనరాన్ని మేల్కొలిపే నవ ధైర్య తరంగాలు.కలం పడితే చాలు కవిత్వం ఆయన వేలి కొసల్లో ఓలలాడుతుంది.అతను వర్తమాన కవితా కెరటం సుర గౌని రామకృష్ణ. ఆయన కలం నుంచి జాలువారిన ‘మౌనం మాట్లాడిన వేళ’ వర్తమాన కవిత్వంలో ఎన్న దగినది.
రచయిత నిరుపేద కుటుంబం నుంచి రావడం వల్లే అనుకుంటా పల్లె జీవితాన్ని, కుటుంబ అనుబంధాల ను, రైతు జీవితాలను, వర్తమాన సమాజాన్ని ఇంత హృద్యంగా అక్షరీకరించగలిగాడు. జలగీతం, కాలచ క్రం, నిష్క్రమించిన సూర్యుడు కవితల్లో సమాజంలో ని అంశాలను కళ్లకు కట్టినట్లు దృశ్యమానం చేశారు. కవికి అక్షరాల మీద చాలా చక్కని పట్టు ఉన్నది. కవి హృదయం నుంచి అక్షరాలు నిప్పు కణికలై ఉద్భవించాయి. ‘దేహం తొడిగిన అక్షరం’ అనే కవితలో కవి అక్షరానికున్న శక్తిని చూపించాడు.
‘అక్షరం అవమానాల ఆకలి కొలిమిలోంచి ఎగిసిపడ్డ నిప్పుకణికై జ్వలిస్తుంది..’ అని చెప్పడంలో అక్షరం ఏమి చేయగలదో స్పష్టంగా తెలిపాడు.
అణగారిన ఆశ్రిత వర్గాలను సైతం ప్రస్తావింపజేశా డు కవి. ముఖ్యంగా దళితుల కష్టాలను, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసిన మహనీయులను గుర్తు చేసుకుంటాడు కవి. ‘సామాజిక స్వప్నం’ అనే కవిత లో అంబేద్కర్‌ ఆశయాలను గుర్తుచేసి అణగారిన వర్గాలను చైతన్యం చేశాడు.
‘అంటరాని వాడని అవమానాలకు గురై తాగునీటి నుంచి నడిచే నేల వరకు అడుగడుగునా నిషేధించ బడిన బడుగుజీవుల ఆశాజ్యోతి’ అంటాడు కవి.
అంటరానివాళ్ల అభివృద్ధికి కృషిచేసిన మహనీయు డు అంబేద్కర్‌ను అతనొక సామాజిక స్వప్నం అనడంలో అంటరానివాళ్ల మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత లు అర్థమవుతాయి.
తన మాతృభాష అంటే కవికి అమితమైన ప్రాణం అని ‘అమృతం నింపుకున్న అమ్మ భాష’ అనే కవిత లో తెలుస్తుంది.


‘భాషంటే కేవలం అక్షరం కాదు
ఒక ఆలోచన.. ఒక సంస్కృతి
జాతికి వెలుగునిచ్చేది భాష..’ అంటాడు.
ఈ వాక్యం చాలు కవికి తన భాష మీద ఎంతటి ప్రేమ ఉన్నదో తెలుసుకోవచ్చు. ఈ విధంగా తన మాతృభాష గొప్పదనాన్ని అక్షరబద్ధం చేశాడు కవి.
తను ఒక రైతుగా, రైతుబిడ్డగా రైతు మీద ఎనలేని మక్కువ చూపించాడు. కరువు కోరల్లో చిక్కుకున్న రైతు దీనస్థితిని చక్కని వ్యక్తీరణతో మన ముందుంచాడు.
‘నిష్క్రమించిన సూర్యుడు’ అనే కవితలో రైతుపై చూపిన అభిమానం ఎనలేనిది.
‘దళారుల, దగాకోరుల దశావతారాల్ని
తన ఒంటరి దేహంపై మోసిమోసి
అలసిపోయాడేమో పాపం
కర్షక సూర్యుడు నిష్క్రమించాడు’.. అంటూ కరువు నేలపై రైతు దీనస్థితిని వివరించి గుండెల్ని ఊటలు చేశాడు.
రాయలసీమ అంటేనే నీటికి కటకట. అది నీటి జాడే లేని మరో ఎడారి ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నది నగ్న సత్యం.
‘భగీరథ ప్రయత్నం’ అనే కవితా ఖండికలో..
‘మసిబారిన మా సీమ నేలపై
పాతాళ గంగను పైకి లాగిపొవా..’ అని భగీరథుణ్ణి ప్రార్థించడంలో కవికి సీమ సమస్యల పట్ల ఉన్న అవగాహన చిత్తశుద్ధి ఎంతటిదో తెలుస్తుంది.
జన్మనిచ్చి, పెంచి, పెద్దచేసి తనను ఈ స్థాయికి తెచ్చి న తల్లిదండ్రులంటే కవికి అమితాభిమానం. ‘ఒక చిన్న ఆశ’ అనే కవితలో అమ్మ మీద అభిమానాన్ని కవితా రూపంలో చూపించాడు.
‘తన రక్తమాంసాలతో నాకు రూపం ఇచ్చి
ప్రాణం పోసిన అమ్మ పాదాలను ఒక్కసారి
మనసారా ముద్దాడాలని ఉంది..’ అని అమ్మ మీద ప్రేమను ప్రకటిస్తాడు.
కవికి ఇల్లాలంటే ఎంత ప్రేమో ‘ఆమెలో సగం’ అనే కవితలో తన భావాన్ని కవితా రూపంలో రాశా డు.
‘శివుడు తనలో సగం భార్యకిచ్చాడు. కానీ ఇక్కడ మన రామకృష్ణుడు నేనే ఆమెలో సగం..’ అని చెప్పడం లో కవికి ఇల్లాలు మీద ప్రేమ, ఆప్యాయత అభిమా నం స్పష్టంగా తెలుస్తుంది.
‘నా మనసు దిగులు పడితే
ఆమె కళ్ళు చినుకులై రాలుతాయి
ఆమె కళ్ళు వర్షిస్తే
నా మనసు మూగబోతుంది..’ అనడంలో కవికి ఇల్లాలు అంటే ఎంత ప్రాణమో అర్థమవుతుంది.
ఏదేమైనా రచయిత కుటుంబం, సమాజం, తన జీవిత కెరటాల్లో పడిలేచిన సందర్భాల్లో తాను అనుభవించిన క్షోభ, జీవితంలో ఎదురైన సమస్యలు, అనుభవాలను నిజాయితీగా వ్యక్తీకరించాడు. ఆ క్రమంలో చక్కనైన పదచిత్రాలు, భావాలతో తన కవిత్వంలో సాంద్రతను పెంచాడు.
కవి సురగౌని రామకృష్ణ భవిష్యత్తులో ఇలాంటి కవితా సంపుటాలను మరెన్నో తెచ్చి, తనదనైన సామాజిక బాధ్యతను నిబద్ధతతో నెరవేర్చాలని కోరుకుంటూ...
- ఈడిగ నగేష్‌, 94945 43470

రచయిత నిరుపేద కుటుంబం నుంచి రావడం వల్లే అనుకుంటా పల్లె జీవితాన్ని, కుటుంబ అనుబంధాలను, రైతు జీవితాలను, వర్తమాన సమాజాన్ని ఇంత హృద్యంగా అక్షరీకరించగలిగాడు. జలగీతం, కాలచక్రం, నిష్క్రమించిన సూర్యుడు కవితల్లో సమాజంలోని అంశాలను కళ్లకు కట్టినట్లు దృశ్యమానం చేశారు. కవికి అక్షరాల మీద చాలా చక్కని పట్టు ఉన్నది. కవి హృదయం నుంచి అక్షరాలు నిప్పు కణికలై ఉద్భవించాయి.
Silent

118
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles