ఆరోగ్య శ్రీని విస్తరించాలె


Thu,September 19, 2019 12:45 AM

రాష్ట్రంలోని పేద బడుగు, బలహీన వర్గాల నెలవారీ జీతం సుమారు రూ.10 నుంచి 15 వేల వరకే. ఇందులో సగానికిపైగా రోగాలకు, వాటి మందులకు ఖర్చవుతు న్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రక్ష ణకు పెద్దపీఠ వేసి ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సదుపాయాన్ని అందజేస్తున్నది. అయినా కొన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చికిత్స లేకపోవడంతో పేద రోగులు ఇబ్బం దులకు గురవుతున్నారు. తత్ఫలితంగా డబ్బులతో చికిత్స చేయించుకోవటం భారంగా మారింది. కాబట్టి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లో అని వ్యాధులకు చికిత్స జరి గేలా చర్యలు తీసుకోవాలి. కేవలం ప్రభు త్వ దవాఖానల్లోనే కాకుండా ప్రైవేట్‌ దవా ఖానల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్య లు తీసుకోవాలి.
- పుట్ట రాకేశ్‌, రాంనగర్‌, వరంగల్‌


భారత్‌ తన సత్తా నిరూపించుకోవాలె

ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో నిష్క్రమించిన టీమిండియా, వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌పై ఇప్పుడు సన్నాహ మవుతున్నది. కనీసం మినీ ప్రపంచకప్‌ను అయినా చేజిక్కించుకొని అభి మానుల కోరిక నేరవేర్చాలని తహతహలాడుతున్నది. ఇందులో భాగంగా నే దేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోరా డుతున్నది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఆరంభంలో వర్షం కారణం గా తొలి మ్యాచ్‌ రద్దు కావటం నిరాశపర్చింది. మిగతా రెండు మ్యాచ్‌లై నా సజావుగా సాగితే, భారత్‌కు ఎంతో ఉపయోగకరం.
- ఎస్‌.అనిల్‌కుమార్‌, మైలారం, సిద్దిపేట జిల్లా

నిర్మాణాత్మకంగా వ్యవహరించాలె

అసెంబ్లీ చర్చల్లో భాగంగా అధికారపక్షం ప్రతీ విషయంపై అర్థవంతంగా చర్చ కొనసాగిస్తున్నది. ప్రతి ప్రశ్నకు సావధానంగా సమాధానం ఇస్తున్న ది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సహక రించాలి. ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వంపై విరుచుకుపడాలనే ధోరణిగా వ్యవహరిస్తే ప్రయోజనముండదు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా సూచన లు చేయాలనే విషయాన్ని మరిచిపోకూడదు.
- బి.రమేశ్‌, అంబర్‌పేట్‌, హైదరాబాద్‌

154
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles