మన విమోచనం జూన్ రెండే..


Tue,September 17, 2019 01:01 AM

చరిత్ర అనేది శాస్త్రీయ ఆధారాలతో నిరూపించబడాలి. కానీ బీజే పీ,సంఘ్‌పరివార్ శక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను అశాస్త్రీయంగా మత కోణంలో వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్ విలీన ఉద్యమానికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రె స్ ఆపరేషన్ పోలోకు నెహ్రూ, వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్రమహాసభ కారకులు. అయితే వీటితో ఎటువంటి సంబంధం లేని బీజేపీ, సంఘ్‌పరివార్ శక్తులు సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపాలని మాట్లాడటం విడ్డూరం. 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్ (Titural head)గా కొనసాగారు. 1950 జవనరి 26న హైదరాబాద్ స్టేట్‌లో నిజాం పాలన అంతమై రాజ్యాం గపాలన ప్రారంభమైంది. చారిత్రకంగా తెలంగాణ విమోచన దినాన్ని వెతుక్కుంటే అది 2014 జూన్ 2వ తేదీనే. వలస పాలన నుంచి విముక్తి పొంది స్వయం పాలన పొందిన రోజు అయిన జూన్ 2వ తేదీనే విమోచన దినంగా పాటించాలి. కాబట్టి సెప్టెంబర్ 17కు ఎటువంటి ప్రాధాన్యం లేదు. నిజాం రాజ్యాన్ని మత ప్రాతిపదికన పాలించాడని, పాకిస్థాన్‌లో తన రాజ్యాన్ని కలుపడానికి ప్రయత్నించాడని సంఘ్‌పరివార్ శక్తులు వాదిస్తు న్నాయి. కానీ పోలీస్ చర్యకు ముందే నిజాం భారత సార్వభౌమాధికారా న్ని ఒప్పుకున్నాడు. అందుకోసం భారత ప్రభుత్వంతో 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందాన్ని చేసుకున్నాడు. దీనికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వరు? గతంలో నిజాం బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోవడం ద్వారా దాని సామంత రాజ్యంగా ఉన్న హైదరాబాద్ స్టేట్ ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు బదిలీ అయ్యింది. దీన్ని ఎందుకు గుర్తించరు? దీనిద్వా రా దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు భారత ప్రభుత్వానికి బదిలీ చేయబడినాయి.


దేశ విభజన సందర్భంలోనే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావాలని ఇక్కడి ప్రజలు కోరుకున్నారు. ఈ సందర్భంలోనే హిందు మహాసభ, ఎంఐఎం లాంటి మత సంస్థలు హైదరాబాద్ సంస్థానంలో ప్రజలను మతాల పేరిట విభజించడం కోసం ప్రయత్నించాయి. కానీ వారు హైదరాబాద్ స్టేట్ ప్రజలను పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు. నిజాం వ్యతిరేక పోరాటంలో, హైదరాబాద్ స్టేట్ భారత్‌లో విలీనం విషయంలో హిందు మహాసభ, ఆర్య సమాజ్‌ల పాత్ర నామమాత్రమేనని చరిత్ర చెప్తున్నది.


అంతకుముందు నిజాం రాజు అలీఖాన్ 1798 లో బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుంటూ సంతకం చేశాడు. అప్ప టినుంచి హైదరాబాద్ స్టేట్ వ్యవహారాలు చూడటం కోసం బ్రిటిష్ రెసిడెన్సీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుత కోఠీ ఉమెన్స్ కాలేజీనే నాటి బ్రిటిష్ రెసిడెన్సీ. మరి నిజాం హైదరాబాద్ స్టేట్‌ను పాకిస్థాన్‌లో కలుపాలనుకుంటే ఇండియా సార్వభౌమాధికారాన్ని ఒప్పుకొని యథాతథ ఒప్పందాన్ని ఎందుకు చేసుకుంటాడు? పోలీస్ చర్య ద్వారా నిజాం రాజ్యం భారత్‌లో విలీనమైంది. సెప్టెంబర్17న నిజాం రాచరిక పాలన అంతమైంది.1950 జనవరి 26 వరకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీద నే హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన కొనసాగింది. కాబట్టి సెప్టెంబర్ 17కు చారిత్రకంగా ఎటువంటి ప్రాధాన్యం లేదు. నిజాం రాచరిక పాలన అంతమై రాజ్యాంగబద్ధ పాలన ప్రారంభమైన 1950 జనవరి 26వ తేదీని హైదరాబాద్ విలీన దినంగా గుర్తించాలి. అయితే ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్‌ను విచ్ఛిన్నం చేసి హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్ర రాష్ట్రంలో కలిపే కుట్రలకు ఢిల్లీ పాలకులు, ఆంధ్ర నేతలు పాల్పడినారు. వారి వంచన వల్ల మళ్లీ తెలంగాణ 1956 నవంబర్ 1న సీమాంధ్ర వలసపాలనలోకి వెళ్లింది. దాదాపు 58 ఏండ్లు వలస పాలన లో తెలంగాణ మగ్గింది. సుదీర్ఘ పోరాటాల వల్ల సీమాంధ్ర పాలన నుంచి తెలంగాణ విముక్తి అయింది. కాబట్టి జూన్ 2వ తేదీని తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం ప్రకటించింది.
దేశ విభజన సందర్భంలోనే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావాలని ఇక్కడి ప్రజలు కోరుకున్నారు. ఈ సందర్భంలోనే హిందు మహాసభ, ఎంఐఎం లాంటి మత సంస్థలు హైదరాబాద్ సంస్థానంలో ప్రజలను మతాల పేరిట విభజించడం కోసం ప్రయత్నించాయి. కానీ వారు హైదరాబాద్ స్టేట్ ప్రజలను పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు.

నిజాం వ్యతిరేక పోరాటంలో, హైదరాబాద్ స్టేట్ భారత్‌లో విలీనం విషయంలో హిందు మహాసభ, ఆర్య సమాజ్‌ల పాత్ర నామమాత్రమేనని చరిత్ర చెప్తున్నది. హైదరాబాద్ విలీన పోరాటానికి జాయిన్ ఇండియా పేరుతో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకత్వం వహించింది. నిజాం, భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి ఆంధ్ర మహాసభ నాయకత్వ వహించింది. మరి సంఘ్‌పరివార్ వాళ్లు ఏ పోరాటంలో పాల్గొన్నారో వారి స్థానాన్ని నిజాయితీగా వెతుక్కోవాలి. 1948 ఆపరేషన్ పోలో కంటే ముం దే మహత్తర తెలంగాణ పోరాటం 1945లోనే ప్రారంభమైంది. హైదరాబాద్ విలీనం తర్వాత కూడా అది కొనసాగింది. నిజాం రజాకార్లు, ఇండియన్ ఆర్మీ చేతిలో అనేకమంది ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, రైతులు హత్యకు గురయ్యారు. దేశ్‌ముఖ్, జాగీర్దార్ల గడీలను కూల్చి లక్షల ఎకరా ల భూమిని పేదలకు పంచారు. సాయుధ పోరాటంలో లక్షలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారు. హైదరాబాద్ విలీనంతో పాటు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా ఆపడం కూడా పోలీస్ చర్యకు ప్రధాన కారణం. జాతీయ స్వాతంత్య్ర పోరాటంలో గాని, నిజాం వ్యతిరేక పోరాటం లో గాని సంఘ్‌పరివార్ శక్తులకు ఎటువంటి భాగస్వా మ్యం లేదు. హిందుమహాసభ నాయకుడైన సావర్కర్ దేశంలో బ్రిటిష్ వలస పాలన కొనసాగాలని భావించాడు. అంతేగాకుండా వారికి సహకరించాడు. బ్రిటిష్ ప్రభుత్వం తనను జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటానని క్షమాపణ పత్రం, ఉత్తరాలు రాశాడు. గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిస్తే Stick The post అనే ఉద్యమానికి సావర్కర్ పిలుపునిచ్చాడు.
raja-ram-yadav
ఈ ఉద్య మం ద్వారా బ్రిటిష్ వారికి సంపూర్ణ సహకారం అందివ్వాలని సావర్కర్ ఆర్‌ఎస్సెస్ శ్రేణులకు పిలుపునిచ్చాడు. అట్లాగే నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా వారి భాగస్వామ్యం ఎప్పుడూ ఎక్కడా లేదు. తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేని బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై విషం చిమ్ముతున్నది. బిడ్డను బతికించి తల్లిని చంపారని మోదీ పదేపదే అన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని అమిత్ షా అంటున్నారు. ఈ మాటల ద్వారా బీజేపికి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదని అర్థమవుతున్నది. సెప్టెంబర్ 17 పేరుతో తెలంగాణను మత ప్రాతిపదికన అస్థిరపరుచడానికి ప్రయత్నిస్తున్నది. ఇది తెలంగాణపై సాంస్కృతిక దాడిగానే చూడాలి. సుదీర్ఘ పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పయనిస్తున్నది. ఈ సందర్భంలో బీజేపీ తెలంగాణ సహజీవన సంస్కృతిపై దాడిచేసి మధ్యయుగాలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. సెప్టెంబర్ 17పై రాద్ధాంతం ఇందు లో భాగమే. రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకులకు, మతవాదులకు తెలంగాణలో స్థానం లేదు. ఇలాంటి వారినుంచి తెలంగాణను రక్షించుకోవడానికి ప్రగతిశీల ప్రజాస్వామ్యశక్తులు ఏకం కావాలి, పోరాడాలి.

(వ్యాసకర్త: రీసెర్చ్ స్కాలర్ హిస్టరీ డిపార్ట్‌మెంట్, ఓయూ)

361
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles