సెప్టెంబర్ 17కు ప్రాసంగికత లేదు


Fri,September 13, 2019 01:40 AM

తెలంగాణ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17కు ప్రాధాన్యం ఉన్నదన్న విషయంలో ఎవరికీ భిన్నభిప్రాయం లేదు. అయి తే ఇటీవలికాలంలో సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికం గా విమోచన దినం నిర్వహించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరాట్వాడాలో, హైదరాబాద్ కర్నాటక జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణలో కూడా అటువంటి ఉత్సవాలు ఎందుకు జరుగకూడదన్న వాదన ముందుకుతెస్తున్నారు. మరట్వాడాలో, హైదరాబాద్ కర్నాటక జిల్లాల్లో ప్రజల అనుభవాలకు, ఇక్కడ తెలంగాణలో ప్రజల అనుభవాలకు తేడా ఉన్నదన్న వాస్తవాన్ని వారు పరిగణనలోకి తీసుకోవడం లేదు.సెప్టెంబర్ 17 అనంతరం తెలంగాణలో చోటుచేసుకున్న విద్రోహ రాజకీయ పరిణామాలను విశ్లేషణ చేయకుండా చేస్తున్న ఈ ప్రచా రం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న డిమాండ్‌గానే చూడవలసి ఉంటుంది. నిజానికి సెప్టెంబర్ 17ను ఎట్లా చూడాలన్న అంశంపై తెలంగాణ సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉద్యమకాలం నుంచే ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ సొసైటీ ఈ భిన్న దృక్కోణాలను క్రోడీకరిస్తూ 2009 లో 17 సెప్టెంబర్-భిన్న దృక్కోణాలు శీర్షికతో పుస్తకాన్ని కూడా వెలువరించింది. తెలంగాణ వాదులు సెప్టెంబర్ 17ను విలీనం, విమోచన, ఆక్రమణ, విముక్తి వంటి భిన్న పదాలతో వర్ణించారు. ఏదేమైనా ఆ రోజు న అప్పటివరకు స్వతంత్ర సంస్థానంగా ఉన్న హైదరాబాద్ రాజ్యం భార త యూనియన్‌లో విలీనమైందనేది కాదనలేని సత్యం. (రాజ్యాంగ పరంగా 1950, జనవరి 26వ తేదీనే విలీనం జరిగిందనేది కొందరి చరిత్రకారుల అభిప్రాయం). విమోచన, విముక్తి అనేటువంటి వ్యక్తీకరణలు సెప్టెంబర్ 17కు ఆపాదించడం సరైంది కాదనేది తెలంగాణలోని చాలామంది చరిత్రకారుల, మేధావుల అభిప్రాయం.


1962లో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాను భారత యూనియన్‌లో విలీనం చేసే చర్యను భారత ప్రభుత్వం గోవా విముక్తిగానే పేర్కొన్నది. 1972లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ చెర నుంచి విడిపించడానికి చేసిన సైనిక చర్యను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ విముక్తిగానే పేర్కొన్నది. కానీ, 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేషన్ పోలో పేరిట సాగిన సైనికచర్యను భారత ప్రభుత్వం పోలీస్ చర్యగా పేర్కొన్నది తప్ప ఎక్కడా విమోచన, విముక్తి అన్న పదాలను వాడలేదు.


నిజానికి సమకాలీన చరిత్రకారులు, వ్యాఖ్యాతలు, భారత ప్రభు త్వం, భారత సైన్యం ఎవరూ కూడా ఆ సంఘటనను విమోచనగా, విముక్తిగా పేర్కొనలేదు. 1962లో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాను భారత యూనియన్‌లో విలీనం చేసే చర్యను భారత ప్రభుత్వం గోవావిముక్తిగానే పేర్కొన్నది. 1972లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ చెర నుంచి విడిపించడానికి చేసిన సైనిక చర్యను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ విముక్తిగానే పేర్కొన్నది. కానీ, 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేష న్ పోలో పేరిట సాగిన సైనికచర్యను భారత ప్రభుత్వం పోలీస్ చర్యగా పేర్కొన్నది తప్ప ఎక్కడా విమోచన, విముక్తి అన్న పదాలను వాడలేదు. పోలీస్ యాక్షన్‌గా పిలువబడిన సైనికచర్య లక్ష్యం హైదరాబాద్ రాజ్యం లో బలపడుతున్న కమ్యూనిస్టులను అణిచివేయడం, రజాకార్లను అణిచివేసే పేరు మీద అమాయక ముస్లింలను ఊచకోతకు గురిచేయడమే అయ్యింది తప్ప నాడు హైదరాబాద్ రాజ్య ప్రజలు అనుభవిస్తున్నటువంటి భూస్వామ్య దోపిడీ నుంచి విముక్తి మాత్రం లభించలేదు. సారాంశంలో 1948 సెప్టెంబర్ 17 అనంతరం జరిగిందేమిటి? 1.అప్పటివరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కేంద్రీకృత ఆధిపత్యానికి లోబడి స్వతంత్రంగా కొనసాగుతున్న హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. 2.వెంటనే కాకున్నప్పటికీ రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైంది. 3.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వల్ల మూడు వేల గ్రామాల్లో భూస్వాముల అధీనంలోని 10 లక్షల ఎకరాల భూమి విముక్తమై రైతుకూలీల పరమైం ది. సైనికచర్య తర్వాత ఈ భూములు తిరిగి భూస్వాములపరమైనాయి. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం సాధించిన విముక్తి ఫలాలను సైని కచర్య తిరగదోడింది. 4.సైనికచర్యలో రైతాంగ పోరాటానికి నాయక త్వం వహించిన కమ్యూనిస్టులను, పోరాటంలో పాల్గొన్న వేలాదిమంది రైతుకూలీలు ఊచకోతకు గురైనారు.5.హైదరాబాద్ రాజ్యంలో ముఖ్యం గా మరాట్వాడాలో వేలాదిమంది ముస్లింలు రజాకార్ల పేరుమీద సైన్యం ఊచకోతకు బలైనారు.

1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయలదే పైచేయి అయి విశాలాంధ్ర ఏర్పాటైంది. కానీ విశాలాంధ్రలో ప్రజారాజ్యం మాత్రం సుదూర స్వప్నంగా మిగిలిపోయింది. రాసిచ్చిన హామీ పత్రాలు నీటిమీద రాతలయ్యాయి. అరువై ఏండ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో వివిధ సందర్భాల్లో ఏర్పడిన చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ ఉత్తర్వులు, కమిషన్‌లు, శాసనసభా కమిటీలు ఏవీ కూడా తెలంగాణకు ప్రయోజనాలు చేకూర్చలేకపోయాయి. ఆరు దశాబ్దాల సమైక్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య భావసమైక్యత ఏర్పడలేదు. తెలంగాణ వలసదోపిడీకి కేంద్రంగా మారింది.


ఇందుకు పండిత్ సుందర్ లాల్ కమిటీ నిజనిర్ధారణ నివేదిక సాక్ష్యంగా ఉన్నది. 6.సైనికచర్య తర్వాత 1948-1952 దాకా హైదారాబాద్ స్టేట్‌లో సైనికపాలన కొనసాగింది. 1952లో హైదారాబాద్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. 1956లో రాష్ర్టాల పున ర్‌వ్యవస్థీకరణ తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలను కలిపి ఏపీగా ఏర్పాటుచే యడంతో తెలంగాణ తిరిగి పరాధీనమైంది. 7.సెప్టెంబర్ 17 విలీనం తెలంగాణలో ఆంధ్రా వలస పాలనకు పునాదిరాయి వేసింది. ఈ వలసపాలన నుంచి తెలంగాణ విముక్తం కావడానికి అరువై ఏండ్లు పట్టింది. విశాలాంధ్ర నినాదం-ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు-విద్రోహ రాజకీయాలు: కర్నూల్ రాజధానిగా 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిం ది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనివార్యమని 1940 దశకంలోనే రూఢీ అయ్యింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాజధాని సమస్య ముందుకు వస్తుం ది. మద్రాసును తమిళ ప్రజలు వదులుకోరు. తెలంగాణను కలుపుకొని విశాలాంధ్ర ఏర్పడితే ఈ సమస్యలన్నీ తీరుతాయి. తెలంగాణలో సకల సౌకర్యాలతో నిర్మితమైన హైదరాబాద్ నగరం ఉన్నది. రాజధాని సమ స్య తీరిపోతుంది. తెలంగాణ నేల మీద పారుతున్న కృష్ణా, గోదావరీ నదులను మలుపుకపోవచ్చు. విద్యుదుత్పత్తికి, పారిశ్రామికాభివృద్ధికి అవసరమయ్యే బొగ్గు గనులు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ సహా విశాలాంధ్ర ఏర్పడితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్న స్పృహ వారికి ఉన్నది. అందుకే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకుముందే విశాలాంధ్ర భావన పురుడుపోసుకున్నది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సమాంతరంగా విశాలాంధ్ర ఉద్యమం కూడా ఊపందుకున్నది. పుచ్చలపల్లి సుందరయ్య 1946లో సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారా జ్యం పేరుతో ఒక పుస్తకాన్ని రాసి విశాలాంధ్ర భావనను స్థిరపర్చినాడు. 1946-56 వరకు దశాబ్దకాలం పాటు చోటుచేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రో హ రాజకీయాలకు 1948, సెప్టెంబర్ 17 తర్వాత ఒక భూమిక ఏర్పడింది.

ఆ తర్వాతనే తెలంగాణలో విశాలాంధ్ర భావనకు ప్రజా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు మొదలైనాయి. తెలంగాణ మేధావివర్గం మెదళ్లలోకి విశాలాంధ్ర భావన ఎక్కించబడింది. దాశరథి, కాళోజీ, దేవులపల్లి రామానుజరావు వంటి ప్రజాకవులు, రచయితలు విశాలాంధ్ర భావనకు లొంగిపోయారు. (1969 నాటికి కాళోజీ, దాశరథిలు తమ తప్పును తెలుసుకొని తెలంగాణవాదులుగా మారినారు) 1949లో విశాలాంధ్ర మహాసభ ఏర్పాటై అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తమ తాత్కాలిక రాజధాని కర్నూల్, శాశ్వత రాజధాని హైదరాబాద్ అని తీర్మానించినారు. దీన్నిబట్టి మొదటినుంచి వారిచూపు హైదరాబాద్ నగ రం మీద, తెలంగాణ వనరుల మీద ఉన్నదని స్పష్టమైంది. 1950లో వరంగల్ పట్టణంలో విశాలాంధ్ర మహాసభ జరిపింది. ఈ సభకు ఆంధ్ర నుంచి ప్రకాశం పంతులు, కడప కోటిరెడ్డి తదితరులు హాజరై విశాలాంధ్ర కోసం ఉద్యమించాలని తీర్మానించినారు. 1953 ఆగస్టులో విశాలాంధ్ర సమావేశాలు హైదరాబాద్‌లో జరిగాయి. విశాలాంధ్ర భావనకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యమాలు జరిగాయి. 1952లో జరిగిన గైర్ ముల్కీలకు వ్యతిరేకంగా జరిగిన గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం ప్రధానమైంది. వరంగల్‌లో మొదలైన గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం అన్ని జిల్లాలకు పాకింది. 1952లో ముఖ్యమంత్రి బూర్గుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లభించిన స్వేచ్ఛతో గైర్ ముల్కీ వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్నది. వెల్లోడి పరిపాలనాకాలంలో విపరీతంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి చొరబడిన గైర్ ముల్కీలను వెనక్కి పంపి ఆ ఉద్యోగాల్లో స్థానికులను భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. 1953లో నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫజల్ అలీ కమిషన్ సంఘం ముందు తెలంగాణవాదు లు విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ వందలాది విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. విశాలాంధ్ర ఏర్పాటైతే తాము అన్ని రంగాల్లో నష్టపోతామని, దోపిడీకి అన్యాయానికి లోనవుతామని విన్నవించారు.
sridhar-rao-deshpande
(తెలంగా ణ ప్రజల ఈ భయాందోళనలు అన్నీ నిజమేనని 60 ఏండ్ల సమైక్య రాష్ట్ర చరిత్ర రుజువుచేసింది) తెలంగాణ ప్రజల అనుమానాలను, భయాందోళనలను ఫజల్ అలీ కమిషన్ పరిగణనలోనికి తీసుకున్నది. ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలు ప్రత్యేక రాష్ర్టాలుగా కొనసాగాలని సిఫార్సు చేసింది. కమి షన్ సిఫార్సుతో బెంబేలెత్తిన ఆంధ్రా నాయకత్వం ఢిల్లీకి పరుగులు తీసింది. ఢిల్లీలో నెహ్రూ, పటేల్, గోవింద్ వల్లబ్ పంత్ తదితర జాతీయ నాయకులతో తమకున్న పరిచయాలతో వారిని విశాలాంధ్రకు అనుకూలంగా మార్చుకోగలిగారు. విశాలాంధ్ర భావన వెనుక దోపిడీ దురుద్దేశపూరిత సామ్రాజ్యవాద తత్వం ఉన్నదన్న నెహ్రూ కూడా ఫజల్ అలీ కమిషన్‌ను సిఫార్సులను తుంగలో తొక్కి ఆంధ్రా నాయకుల ఒత్తిడికి తలొగి ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల విలీనాన్ని ప్రకటించాడు. 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయలదే పైచేయి అయి విశాలాంధ్ర ఏర్పా టైంది. కానీ విశాలాంధ్రలో ప్రజారాజ్యం మాత్రం సుదూర స్వప్నంగా మిగిలిపోయింది. రాసిచ్చిన హామీ పత్రాలు నీటిమీద రాతలయ్యాయి. అరువై ఏండ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో వివిధ సందర్భాల్లో ఏర్పడిన చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ ఉత్తర్వులు, కమిషన్‌లు, శాసనసభా కమిటీలు ఏవీ కూడా తెలంగాణకు ప్రయోజనాలు చేకూర్చలేకపోయాయి. ఆరు దశాబ్దాల సమైక్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య భావసమైక్యత ఏర్పడలేదు. తెలంగాణ వలసదోపిడీకి కేంద్రంగా మారింది. సాంస్కృతిక అణిచివేతకు గురైంది. ఇదంతా జరుగడానికి 1948 సెప్టెంబర్ 17న పునాదిరాయి పడింది. ఆ రోజుకు ముందు తెలంగాణ ప్రజలు పెనం మీద ఉంటే ఆ తర్వాత పొయ్యిలో పడినట్లయ్యింది. 1956 నవంబరు 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన సెప్టెంబరు 17 విమోచన దినం ఎట్లవుతుంది? తెలంగాణలో రాచరిక పాలనను అంతంచేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకావడానికి దోహ దం చేసిననందున తెలంగాణ చరిత్రలో 1948 సెప్టెంబరు 17 ఒక మైలు రాయి మాత్రమే. అన్ని రోజుల్లాగే అదొక సాధారణ దినంగా గడిచిపోవాలే తప్పా ఉత్సవాలు దేనికి? సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణా విమోచన దినంగా జరుపమనే డిమాండుకు తెలంగాణలో ప్రాసంగికత లేదు.

(వ్యాసకర్త: ముఖ్యమంత్రి ఓఎస్డీ)

394
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles