ప్రాచీన తెలుగు అంటే పట్టదా?


Fri,September 13, 2019 01:39 AM

కొన్నిరోజుల కిందట కొన్ని పత్రికల్లో ఒక వార్త చదివాను. ప్రాచీన తెలుగు భాషా అధ్యయన విశిష్ట కేంద్రం (Cent -re of Excellence Studies in Classical Telug -u) అనే తెలుగువారికి ప్రతిష్ఠాత్మకమైనది. ఈ ప్రాచీన తెలుగు కేంద్రం హైదరాబాద్‌కు రావలసి ఉన్నది. కానీ ఈ కేంద్రాన్ని నెల్లూరుకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం, ప్రోద్బలం వల్ల జరిగిందనేది ఆ వార్త సారాంశం. కానీ, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, భాషాపరంగా సాంస్కృతికంగా అవమానం జరిగిందని, పోరాటం చేసినామని సాక్షాత్తూ తెలంగాణ రచయితలు, మేధావులు ఈ వార్త విషయమై ఎందుకు స్పందించడం లేదు? వారికి ప్రాచీన తెలుగు అంటే గిట్టదా? లేక పట్టదా? ప్రాచీన తెలుగు (Classical Telugu) అంటే ఇదేదో పనికిరాని కాలం చెల్లిన తెలుగు అని అనుకుంటున్నారా? ప్రాచీన తెలుగు అన్న గుర్తింపు మన మాతృభాషకు జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హోదా, గౌరవం. ఇది మన తెలుగు జాతి గర్వించదగిన అంశం. అంటే కానీ ఇదేదో ప్రాచీన తెలుగు భాష అని కానీ, ప్రాచీన సాహిత్యమని కాని అర్థం కాదు. ఈ అపోహ నుంచి బయటపడాలి. ప్రాచీన తెలుగు కేంద్రం అన్నది నాటి నుంచి నేటివరకు భాషా సాహిత్యాలు అధ్యయననానికి కేం ద్ర ప్రభుత్వం ఇచ్చిన గొప్ప సౌకర్యమని భావించాలి. కాగా నిన్నమొన్నటి దాకా తెలంగాణ వాళ్లకు భాషా విషయంలో అన్యా యం జరిగింది. అవమానం జరిగిందని తెలంగాణ మేధావివర్గం అరిచి కరిచినంత పనిచేసింది. ప్రతిష్ఠాత్మకమైన ప్రాచీన తెలుగు భాషా కేంద్రం ఆంధ్రా ప్రాంతానికి తరలిపోతుంటే ఏ మాత్రం స్పందించకుండా నిద్రపోతున్నదా? లేదా తెలిసి మౌనంగా ఉంటున్నదా?


నిజానికి ప్రాచీన తెలుగు కేంద్రం తరలింపును రెండు తెలుగు రాష్ర్టాలతో సంప్రదించి తీసుకోవాల్సిన నిర్ణయం. రెండు తెలుగు రాష్ర్టాలు ఉన్నందున ఈ ప్రాచీన తెలుగు భాషా కేంద్రాన్ని రెండు కేంద్రాలుగా చేసి రెండు రాష్ర్టాలలో ఏర్పా టుచేయాలి. ఈ కేంద్రానికి సంబంధించిన ఆర్థిక వనరులను కార్యాలయ సిబ్బందిని రాష్ట్ర పునర్విభజన కమిటీ సిఫార్సుల మేరకు ఆయా నిష్పత్తిలో కేటాయిస్తే ఎవరికీ ఎలాంటి వివాదం ఉండదు.


తెలుగు భాషకు తెలంగాణ పుట్టినిల్లు. అది ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి అనేక ప్రక్రియలుగా విస్తరించిందనే చారిత్రకధారాలతో ఇన్నాళ్ళూ పరిశోధనల్లో మనం నిరూపించాం. న్యాయంగా తెలంగాణ ప్రాంతానికి రావలసిన ప్రాచీన తెలుగు కేంద్రం ఆంధ్రాకు తరలిపోతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాం? ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగు భాషా సాహిత్యా ల వికాసం కోసం తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడినా యి. ఈ మధ్యనే ఏర్పడిన తెలంగాణ సాహిత్య అకాడమీ, అంతేగాక మొన్నమొన్ననే మద్రాసు హైకోర్టులో ప్రాచీన తెలుగు గుర్తింపుపై ఉన్న స్టే కేసును ఎత్తివేయించడానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఎం తో కృషిచేసింది. ఇప్పటికైనా తగినరీతిలో రచయితలు, మేధావులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు స్పందించాలి. తెలంగాణకు న్యాయంగా రావాలసిన ప్రాచీన తెలుగు భాషా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి పునఃసమీక్ష చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. 2008లో తెలుగు భాషకు ప్రాచీన హోదా ప్రకటించింది. అప్పుడు తెలుగువాళ్లకు ఒకే రాష్ట్రం ఉంది. ప్రాచీన తెలుగు కేంద్ర ఎక్కడ, ఏ ప్రాం తంలో పెట్టాలన్న దానిమీదనే చర్చోపర్చల మీమాంసలో ఆరేండ్లు గడిచిపోయాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత తెలుగువాళ్లకు రెండు రాష్ర్టాలయ్యాయి. ఇప్పటికీ మళ్లీ ఐదేండ్ల కాలం గడిచింది. ఇంకా ప్రాచీన తెలుగు కేంద్రం ఎక్కడ పెట్టాలన్న మీమాసంలో ఉండగానే 2018లో ఈ కేంద్రాన్ని తాత్కాలిక సిబ్బందితో మైసూరు భారతీయ భాషల కేంద్రంలోనే ప్రారంభించారు. ఈ విషయంపై చివరికి రెండు తెలు గు రాష్ట్రాలతో సంప్రదించలేదు. అకస్మాత్తుగా కొందరు ఆంధ్ర ప్రాంత నాయకుల ప్రమేయంతో ప్రాచీన తెలుగు కేంద్రాన్ని నెల్లూరులో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ప్రాంత భాషాభిమానులను ఆశ్చర్యపరిచింది.
acharya-k-yadagiri
నిజానికి ప్రాచీన తెలుగు కేం ద్రం తరలింపును రెండు తెలుగు రాష్ర్టాలతో సంప్రదించి తీసుకోవాల్సిన నిర్ణయం. రెండు తెలుగు రాష్ర్టాలు ఉన్నందున ఈ ప్రాచీన తెలుగు భాషా కేంద్రాన్ని రెండు కేంద్రాలుగా చేసి రెండు రాష్ర్టాలలో ఏర్పాటుచేయాలి. ఈ కేంద్రానికి సంబంధించిన ఆర్థిక వనరులను కార్యాలయ సిబ్బందిని రాష్ట్ర పునర్విభజన కమిటీ సిఫార్సుల మేరకు ఆయా నిష్పత్తిలో కేటాయిస్తే ఎవరికీ ఎలాంటి వివాదం ఉండదు. రెండు రాష్ర్టాల తెలుగు భాషాభిమానులకు పరిశోధకులకు రచయితలకు సమన్వాయం జరుగుతుంది. ఈ పరస్పర సమన్వయంతో రెండు రాష్ర్టాల తెలుగు వాళ్లందరూ తెలుగు భాషాభివృద్ధికి కలిసి కృషి చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతిష్ఠాత్మకమైన ప్రాచీన తెలుగు కేంద్రం ఏర్పాటు విషయంలో రచయితలు, మేధావులు ప్రభుత్వ, ప్రభుత్వేతర భాషా సంస్థలు వెంటనే స్పందించాలని కోరుతున్నాను.

(వ్యాసకర్త: పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమీ)

357
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles