ప్లాస్టిక్ పీడ!

Thu,September 12, 2019 01:31 AM

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో బుధవారం ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగి స్తూ అక్టోబర్ 2వ తేదీ (మహాత్మా గాంధీ 150 జయంతి) ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను ఇండ్ల నుంచి, కార్యాలయాల నుంచి లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం స్వయం సహాయక బృందాలు, పౌర సమాజం, వ్యక్తులు అందరూ కృషిచేయాలని కూడా ఆయన విజ్ఞప్తిచేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రజలు తమ అలవాట్లను మార్చుకో వాలని సూచించారు. ప్లాస్టిక్ ముక్త్ భారత్‌ను నెలకొల్పుకోవాలని ప్రధాని కోరడం ఇది మొదటిసారి కాదు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని ఒక్కసారి మాత్రమే వాడే వస్తువులను మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేల చౌడుబారడాన్ని నిరోధించే ఐక్యరాజ్యసమితి ఒడంబడిక పధ్నాలుగవ సదస్సు ఈ నెల తొమ్మిదవ తేదీన ఢిల్లీ శివారులో జరిగింది. ప్రధాని మోదీ ఈ సదస్సులో మాట్లాడుతూ- వచ్చే కొన్నేండ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్‌యూపీ)ను నిషేధించాలని భారత్ నిర్ణయించింది. ప్రపంచ నాయకులు దీనిని అనుసరించాలె అని ప్రధాని మోదీ కోరారు. ఎస్‌యూపీకి గుడ్‌బై చెప్పవలసిన సమయం వచ్చింది అన్నారు. కేంద్ర ప్రభు త్వం ఎస్‌యూపీ వస్తువులను నిషేధించబోతున్నదని కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల రెండవ తేదీన ఆరు రకాల ప్లాస్టిక్ వస్తువులు-సంచులు, కప్పు లు, ప్లేట్లు, చిన్న సీసాలు, స్ట్రాలు, చిన్న సీల్డ్ పొట్లాలపై నిషేధ ప్రకటన చేస్తుందని ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. కానీ కేంద్రమంత్రుల మాటలు, చేతలు గమనిస్తే మాత్రం కేంద్రం చిత్తశుద్ధితో ఈ ఎస్‌యూపీ నిషేధానికి పూనుకుంటుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

2015లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు జరిపిన అధ్యయనం ప్రకారం.. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో డెబ్బయి శాతం వృథాగా మారిపోతున్నదని వెల్లడైంది. ఏండ్లు గడిచేకొద్దీ ప్లాస్టిక్ వాడకం
పెరిగిపోతున్నది. చెత్తలో ప్లాస్టిక్ శాతం ఎక్కువగా ఉంటున్నది. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆరు రకాల వస్తువులను నిషేధించినా, మొత్తం ప్లాస్టిక్ వాడకంలో ఇవి ఐదు శాతమే. దీన్నిబట్టి ప్లాస్టిక్ వాడకం ఎంత ఉన్నదో ఊహించుకోవచ్చు. ఎస్‌యూపీ వస్తువుల్లో యాభై శాతం సముద్రాలలో పడేస్తున్నారు. దీనివల్ల సముద్రాలలో జీవాలు మరణిస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ మూలంగా పర్యావరణం దెబ్బతింటున్నది.


కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ నెల తొమ్మిదిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని ఎస్‌యూపీని నిషేధం విధిస్తామని అనలేదని గుడ్‌బై చెబుతామని మాత్రమే అన్నారని వివరించారు. అక్టోబర్ రెం డవ తేదీ నుంచి ప్లాస్టిక్ వృథా పదార్థాలను సేకరించడం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నిషేధించదలుచుకున్న ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంపై చర్చించడానికి కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రి పాశ్వాన్ సంబంధిత వర్గాలతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ప్లాస్టిక్ సీసాల ఉత్పత్తిదారులు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయం ఏమీ లేదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ప్రత్యామ్నాయ పదార్థాల వాడకం వల్ల సీసా విలువ ఇరువై రూపాయల నుంచి యాభైకి పెరుగకూడదని పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. దాదా పు తొంభై శాతం సీసాలు రీసైకిల్ అవుతున్నాయని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. అసలు ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ అంటే ఏమిటో నిర్వచించాలని వారు అంటున్నారు. మళ్ళా వాడకుండా, రీసైకిల్ చేయకుండా ఉపయోగించి పడేసేదే ఎస్‌యూపీ వస్తువని ఐక్యరాజ్యసమితి వర్గీకరించింది. ఇందులో అస్పష్టత ఏమీ లేదు. ఎస్‌యూపీని నిర్వచించి, రూపుమాపే మార్గపటం తయారుచేయడానికి రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ నాలుగైదు సమావేశాలు జరిపినా తేలిందేమీ లేదు. ఎప్పుడు తేలుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ సమావేశాలు, చర్చల తీరు గమనిస్తే ఇంతకూ ప్రభుత్వం ఎస్‌యూపీ నిషేధానికి కట్టుబడి ఉన్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

2015లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు జరిపిన అధ్యయనం ప్రకారం.. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో డెబ్బయి శాతం వృథాగా మారిపోతున్నదని వెల్లడైంది. ఏండ్లు గడిచేకొద్దీ ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతున్నది. చెత్తలో ప్లాస్టిక్ శాతం ఎక్కువగా ఉంటున్నది. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆరు రకాల వస్తువులను నిషేధించినా, మొత్తం ప్లాస్టిక్ వాడకంలో ఇవి ఐదు శాతమే. దీన్నిబట్టి ప్లాస్టిక్ వాడకం ఎంత ఉన్నదో ఊహించుకోవచ్చు. ఎస్‌యూపీ వస్తువుల్లో యాభై శాతం సముద్రాలలో పడేస్తున్నారు. దీనివల్ల సముద్రాలలో జీవాలు మరణిస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ మూలంగా పర్యావరణం దెబ్బతింటున్నది. 2022 వరకు ఎస్‌యూపీని నిర్మూలిస్తామని భారత్ ఇప్పటికే అంతర్జాతీ య చర్చల్లో హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ ఎస్‌యూపీ నిషేధం విషయమై పదేపదే మాట్లాడటం ఉత్సాహకరంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎస్‌యూపీ నిషేధానికి ఒక స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించి అమలుచేయాలె. తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలు ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ ఆదేశాలు జారీచేశాయి. ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయాలె. ఇందుకు అనుగుణంగా తమ అలవాట్లను, జీవనవిధానాన్ని మార్చుకోవాలె. ఉదాహరణకు దుకాణందారు దగ్గర ప్లాస్టిక్ బ్యాగును ఆశించకుండా ఇంటినుంచే బట్ట లేదా జనుప సంచిని తీసుకుపోవచ్చు. ప్లాస్టిక్ సీసాలకు బదులుగా లోహంతో చేసిన పాత్రలు వాడుకోవచ్చు. భూగోళం నివాసయో గ్యంగా ఉంటేనే మన ముందుతరాల బతుకగలుగుతాయనే స్పృహ ప్రజల్లో ఉండాలె.

151
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles