సంపూర్ణ అక్షరాస్యతకు సమిష్టికృషి

Tue,September 10, 2019 11:08 PM

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అనేక సంక్షేమ పథకాల అమలు లో తెలంగాణ ముందున్నది. విద్య, వ్యవసాయ, నీటి పారుదల, పారిశ్రామికరంగం, ఇనఫర్మేషన్ టెక్నాలజీ, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలులోనూ, అభివృద్ధి సూచికలో అగ్రగామిగా ఉండి దేశానికి దిక్సూచిగా ఉంటున్నది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం మూలంగా అక్షరాస్యతలో మాత్రం తెలంగాణ చాలా వెనుకబడి ఉండటం రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షించే పౌరులను కలవరపెడుతున్నది. మిగతా రంగాల మాదిరిగా విద్యారంగాన్ని ఒక్క ఏడాదిలో హఠాత్తుగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. భారతదేశపు సగటు అక్షరాస్యత 74.04 శాతం. బీహార్ రాష్ట్ర అక్షరాస్యతా శాతం 61.8. తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యతా శాతం 66.50. (పురుషులు 74.95, స్త్రీలు 57.92) తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న జిల్లా హైదరాబాద్ (86 శాతం), అత్యల్ప అక్షరాస్యత శాతం మహబూబ్‌నగర్ (56.06) జిల్లా. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 26 జిల్లాల అక్షరాస్యత రాష్ట్రస్థాయి అక్షరాస్యతా రేటు సగటు కన్నా తక్కువగా ఉన్న ది. ఇది మనల్ని కలవపెడుతున్న ప్రధాన సమస్య. సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఏటా మనం ఘనంగా నిర్వ హించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యార్థులు, విద్యావంతులు, యువకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళాభ్యుదయ సంఘాలు, గ్రామ, పట్టణ స్థాయిలో ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రజాప్రతినిధులు తమ బాధ్యతగా తమ ప్రాంతాల్లోని నిరక్షరాస్యుల్ని గుర్తిం చాలి. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో ప్రధాన భూమిక పోషించాలి. అక్షరాస్యత కలిగిన మానవవనరుల వల్ల రాష్ట్రం ఆర్థికాభివృద్ధి చెందుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాభివృద్ధిలో అనేక మార్పులు వచ్చాయి.

ప్రభుత్వం పల్లె ప్రగతికి వివిధ కార్యక్రమాలను రూపొందించింది. వీటిని అమలుచేయడానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు, గ్రామ, పట్టణ ప్రజాప్రతినిధులు విద్య, ఆరోగ్య, పరిశుభ్రత, మొక్కల పెంపకంతోపాటు నిరక్షరాస్యత నిర్మూలనా కార్యక్రమాలను ఏర్పాటుచేయాలి. దీనికోసం గ్రామాల్లోని నిరక్షరాస్యులను గుర్తించాలి.


దీనివల్ల ఆ విజ్ఞానంతో గ్రామ, పట్టణంలోని పౌరులంతా స్వతహాగా, బాధ్యతగా తన జీవనాన్ని ఆదర్శంగా కొనసాగించేందుకు జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. తద్వారా రాష్ట్రంలోని ప్రకృతి, మానవ వనరుల అభివృద్ధే కాకుండా మన వ్యవసాయ, పాడి, పౌల్ట్రీ, ఆరోగ్యం, విద్య, నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే సామర్థ్యాలు పెంపొందుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందటంలో, వినియోగించుకోవడంలో దళారుల చేతుల్లో మోసపోయే ప్రమాదం ఉండదు. అక్షరాస్యత వల్ల ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజలు భాగస్వామ్యం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్రంలోని పాఠశాల, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల్లో నిరక్షరాస్యులుగా ఉన్నవారిని గుర్తించాలి. వీరందరిని అక్షరాస్యలుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలి. పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముప్ఫై రోజుల ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఈ స్ఫూర్తితోనే రాష్ట్రంలో నిరక్షరాస్యతా నిర్మూలనకు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా ఎదుగాలి. దీనివల్ల ప్రభుత్వ చట్టాలపై అవగాహన కలుగుతుంది. తమ బడీడు పిల్లల్ని బడిలో చేర్పించాలి. బడిలోని విద్యార్థులు మధ్యలో బడి మానివేయకుండా 18 ఏండ్ల వయస్సు వచ్చేవరకు విద్యార్జన చేసేలా ప్రోత్సహించాలి. బాలిబాలికలకు సమాన విద్యావకాశాలు కల్పించాలి. దీంతో వారు అభివృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్షరాస్యత వల్ల బాల కార్మిక వ్యవస్థను రూపుమాపవచ్చు. బాల్యవివాహాలను నిరోధించవచ్చు. ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడే అలవాట్లు పెంచుకోవచ్చు. ప్రకృతి వనరులను, ఆర్థిక వనరులను సక్రమంగా ఉపయోగించుకునే సామర్థ్యాలు పెంపొందించుకోవచ్చు. ఇవన్నీ అక్షరాస్యత కల్గిన పౌరుల్లో అధికంగా ఉండే ఆస్కారం ఉంటుంది.

సంపూర్ణ అక్షరాస్యత గ్రామాలుగా, పట్టణాలుగా రూపొందించటంలో తోడ్పడే ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలి. అలాగే ఈ కార్యక్రమంలో
మహిళాభ్యుదయ సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు భాగస్వాములయ్యేలా చూడాలి. అన్ని దానాలలో కెల్లా విద్యా దానం గొప్పది. బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దటంలో విద్య తోడ్పడుతుంది.


పల్లె ప్రగతికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను రూపొందించింది. వీటిని అమలు చేయడానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారు లు, గ్రామ, పట్టణ ప్రజాప్రతినిధులు విద్య, ఆరోగ్య, పరిశుభ్రత, మొక్కల పెంపకంతో పాటు నిరక్షరాస్యత నిర్మూలనా కార్యక్రమాలను ఏర్పాటుచేయాలి. దీనికోసం గ్రామాల్లోని నిరక్షరాస్యులను గుర్తించాలి. ఆయా గ్రామాల్లోని పాఠశాల ఉపాధ్యాయులకు వయోజన విద్య, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా కృషి చేయాలి. తమ అధీనంలోని విద్యార్థినీ విద్యార్థులతో అక్షరాస్యలుగా తీర్చదిద్దేట్టు ప్రోత్సహించాలి. ఇందుకు వారిని కార్యోన్ముఖుల్ని చేయాలి. భవిష్యత్తులో దేశం డిజిటల్ మయం కాబోతున్నది. ఇంటర్నెట్ సౌకర్యంతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. ఈ తరుణంలో ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యావంతులందరూ నూత న డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. తమ వృత్తి నైపుణ్యాలను, జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. విద్యావంతులందరూ రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్, కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించుకునే నైపుణ్యాల అభివృద్ధి కోసం పాటుపడాలి. దేశంలోని ప్రభుత్వ పథకాలు, ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ టెక్నాలజీలో నిర్వహిస్తున్నాం. దీనిదృష్ట్యా ప్రజలు మోసానికి గురికుండా, నష్టపోకుండా ప్రస్తుత విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఇందులో మానవజాతి ప్రయోజనాన్ని కాంక్షించి ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా తమ వ్యాసాంగాలు కొనసాగించుకోవాలి. రాష్ట్రంలోని విద్యాలయాలు, యూనివర్సిటీల్లోని ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, విద్యార్థి నాయకులు తమ విద్యార్జనతో పాటు సామాజిక స్పృహ తో సామాజిక బాధ్యతగా భావించాలి. నిరక్షరాస్యతా నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. రాష్ట్రంలోని పాఠశాల, కళాశాల, సాంకేతిక, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులు, వయోజన విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
dr-Anabheri-Rajeshwar-rao
నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని రూపొందించి అమలుచేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిధులను సమకూర్చి స్వచ్ఛంద, సేవా సంస్థలను భాగస్వాములుగా చేస్తూ యువ శక్తిని వినియోగించుకోవాలి. సకాలంలో మన రాష్ర్టాన్ని కూడా దేశంలోని అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళ రాష్ట్రం సరసన చేర్చే దిశగా కృషిచేయాలి. సంపూర్ణ అక్షరాస్యత గ్రామాలుగా, పట్టణాలుగా రూపొందించటంలో తోడ్పడే ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలి. అలాగే ఈ కార్యక్రమంలో మహిళాభ్యుదయ సం ఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు భాగస్వాములయ్యే లా చూడాలి. అన్ని దానాలలో కెల్లా విద్యా దానం గొప్పది. బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దటంలో విద్య తోడ్పడుతుంది. కాబట్టి విద్యావంతులందరూ భాగస్వాములయ్యేలా తగిన ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకోవాలి. వీరు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. బడీడు పిల్లలందరినీ బడుల్లో చేరిపించాలి. విద్యార్థుల డ్రాపౌట్స్‌ను తగ్గించేలా కృషిచేయాలి. భవిష్యత్తులో పిల్లలు నిరక్షరాస్యలుగా మారకుండా నిరంతరం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. విద్యావ్యాప్తికి, అక్షరాస్యతను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కార్యోన్ముఖు లు కావాలి. తద్వారా మన రాష్ర్టాన్ని అక్షరాస్యతలో అగ్రరాష్ట్రంగా నిలిపేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలి. సంపూ ర్ణ అక్షరాస్యతతో బంగారు తెలంగాణ భవితకు పునాది వేయాలి.

286
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles