పేదలకు భరోసా

Tue,September 10, 2019 12:45 AM

ఆర్థికంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శాసనసభ కు సమర్పించిన బడ్జెట్‌లో పేదల సంక్షేమాన్ని, రాష్ట్ర పురోగతిని విస్మరించకపోవడం ప్రశంసనీ యం. తాజా బడ్జెట్‌లో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం 1,46,492.30 కోట్ల రూపాయలు కాగా, ఇందులో రెవెన్యూ వ్యయం 1,11,055.84 కోట్లు. మూలధన వ్యయం 17,274.67 కోట్లు. రెవెన్యూ మిగులు 2,044.08 కోట్ల రూపాయలు కాగా, ఆర్థిక లోటు 24,081.74 కోట్లు ఉంటుందని అంచనా. తెలంగాణ ఏర్పడిన మొదటి ఐదేండ్లలో తెలంగాణ రాష్ట్రం స్థిమితపడటానికి సమగ్ర పథకాన్ని రచించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ పునాదులపై మలిదశ పాలనలో కూడా సరికొత్త బాటలు నిర్మించాలని స్వప్నించిన మాట వాస్తవం. కానీ పెద్దనోట్లు రద్దు కావడం, జీఎస్టీ ప్రవేశపెట్టడం వంటి ప్రయోగాలు వికటించడం మూలంగా దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. జీడీపీ వార్షిక వృద్ధి ఐదు శాతానికి తగ్గిపోయింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కూడా దేశంపై మరింత ప్రభావం చూపుతుందనే భయాందోళన లు నెలకొన్నాయి. ఈ ప్రభావాలన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడుతున్నాయి. ఇన్ని పరిమితుల మధ్య రాష్ట్ర బడ్జెట్‌ను రూపకల్పన చేయవలసి వచ్చింది. రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎట్లా ఉంటుందనే విషయం లో అనేక ఆందోళనలు ఉన్నాయి. కానీ కేసీఆర్ తన సహజ ధోరణిలో, ఎంతో మథించి, ప్రజా సంక్షేమానికి ఇబ్బందులు కలుగని రీతిలో బడ్జెట్‌ను రూపొందించారు. సంక్షేమ పథకాలకు, వ్యవసాయరంగానికి, నీటి పారుదల ప్రాజెక్టులకు నిధుల కొరత తలెత్తకుండా యథావిధిగా సాగే ఏర్పా ట్లు చేయడం ఊరట కలిగిస్తున్నది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం తాను ఎంచుకున్న వ్యూహాలు చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారని బడ్జెట్‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది.

ఆర్థిక మందగమనం వల్ల పలు రాష్ర్టాలు అల్లాడిపోతున్నాయి. కర్ణాటక, పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో మైనస్ ఆదాయాభివృద్ధి రేటు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తమ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ఈ రాష్ర్టాల కన్నా దాదాపు ఆరు దశాబ్దాల పాటు పరాయి పాలనలో కునారిల్లిన తెలంగాణ మెరుగ్గా ఉన్నదీ అంటే అందుకు కారణం- మొదటి ఐదేండ్ల పాలనలో కేసీఆర్ అత్యంత క్రమశిక్షణతో అనుసరించిన అభివృద్ధి, సంక్షేమ విధానాలే.


దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితిని గమనిస్తున్న వారికి, కొత్తగా ఏర్పడి ఇప్పుడిప్పుడే తన కాళ్ల మీద నిలబడుతున్న మన రాష్ట్ర పరిస్థితి ఏమిట నే గుబులు కలుగడం సహజం. దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలలోని లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆటో, రియల్ ఎస్టేట్ రంగాల్లోని అనేక మంది కాంట్రాక్టు కార్మికులు వీధిన పడ్డారు. ఇంకా లక్షలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింద ని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. ఆర్థిక మందగమనం నుంచి మాంద్యంలోకి జారిపోతున్నామనే హెచ్చరికలు వినబడుతున్నాయి. దేశ ఆర్థికపరిస్థితిలో భాగంగా-రాష్ట్రంలో 15 శాతం ఆదాయాభివృద్ధి ఆశిస్తే 5.46 శాతం మాత్ర మే సాధ్యమైంది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు తదితర శాఖల పన్ను రాబడి దారుణంగా తగ్గిపోయింది. పన్నేతర ఆదాయం పడిపోయింది. కేంద్ర నిధుల్లో కూడా కోత పడుతున్నది. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సృజనాత్మకంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసి, పేదల సంక్షేమం, అభివృద్ధి అనే ప్రాధాన్యాలను ఉపేక్షించకపోవడం గమనార్హం. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల మొదలైన భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ ధీమాగా ప్రకటించారు. రైతుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన పథకాలన్నీ యథాతథంగా ఉంటాయని స్పష్టంచేశారు. రైతుబంధు తోడ్పాటును ఏడాదికి ఎనిమిది నుంచి పది వేలకు పెంచుతూ, ఈ పథకానికి 12 వేల కోట్లు కేటాయించారు. రైతు బీమాను కొనసాగిస్తూ కేటాయింపులు చేశారు. పంట రుణాల మాఫీ కోసం ఆరు వేల కోట్లు ప్రతిపాదించారు. ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతున్నది. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీటికయ్యే విద్యుత్ బిల్లుల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్స్, కళ్యాణలక్ష్మి, ఆరు కిలోల బియ్యం మొదలైన పథకాలకు కూడా నిధుల కొరత రానివ్వబోనని కేసీఆర్ బడ్జెట్ ప్రసంగంలో భరోసా ఇచ్చారు.

గ్రామ పంచాయతీల ద్వారా ఆదర్శపాలనను సాకారం చేయాలనే లక్ష్యాన్ని కూడా కేసీఆర్ విస్మరించలేదు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపు ఉంటుంది. ఈ రెండింటిని కలపి గ్రామ పంచాయతీలకు ప్రతి నెల రూ.339 కోట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక మందగమనం వల్ల పలు రాష్ర్టాలు అల్లాడిపోతున్నాయి. కర్ణాటక, పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో మైనస్ ఆదాయాభివృద్ధి రేటు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తమ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ఈ రాష్ర్టాల కన్నా దాదాపు ఆరు దశాబ్దా ల పాటు పరాయి పాలనలో కునారిల్లిన తెలంగాణ మెరుగ్గా ఉన్నదీ అంటే అందుకు కారణం- మొదటి ఐదేండ్ల పాలనలో కేసీఆర్ అత్యంత క్రమశిక్షణతో అనుసరించిన అభివృద్ధి, సంక్షేమ విధానాలే. వివిధ పథకాల పేర ప్రతి గ్రామానికి నెలకు లక్షలాది రూపాయలు సరఫరా అయ్యేలా చేయడంతో పేదలు కోలుకోవడంతోపాటు కొనుగోలు శక్తి పెరిగి సమాజంలోని అన్నిరంగాలు వికసించాయి. ప్రాజెక్టులను అతివేగంగా నిర్మించారు. వ్యవసాయ, గ్రామీణ, పారిశ్రామిక రంగాలన్నిటి నీ గాడిలో పెట్టారు. తెలంగాణ సమాజం ఇప్పటికి ఇంతకన్నా ఎన్నో గడ్డు పరిస్థితులను చవిచూసింది. మన సమాజమంతా క్రమశిక్షణతో, ఐక్యతతో కృషి చేస్తే ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కడం కూడా కష్టమేమీ కాదు. బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ చెప్పినట్టు పరిస్థితి మెరుగవుతుందనే ఆశాభావంతో ముందుకుసాగుదాం.

129
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles