ఫెడరలిజం-మౌలికాంశాలు

Tue,September 10, 2019 12:44 AM

ఫెడరలిజం అంటే సమాఖ్యలో సమైక్యత. సమైక్యతలో స్వేచ్ఛ, సమానత్వం, ఇండివిజ్యువాలిటీ. రాజకీయ పరిపాలన, ఆర్థిక, సాంస్కృతికరంగాల్లో ఒక దేశం స్థాయిలో ఒక ప్రాంతం, జాతి, జెండర్, గణతెగలు, సామాజిక వర్గా లు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం, ఒక రాష్ట్రం సర్వాధికారాలను అన్ని రంగాల్లో సాధికారికతను, స్వావలంబనను, స్వయం సమృద్ధిని, సమాన అవకాశాలను కలిగి ఉండే జీవన విధానం, సంస్కృతి. ఇప్పుడున్న దేశంలో ఒకభాగంగా ఉండటం కన్నా తమకు తాము ఒక స్వతంత్ర దేశంగా విడిగా బతికితే బాగుండు అనిపిస్తే, అది ఫెడరలిజం కాదు. ఇందుకు భిన్నంగా ఒక దేశంగా అనేక ప్రాంతాలు, జాతులు, భాషలు తమకు తాము స్వచ్ఛందంగా కలిసి ఉంటే బాగుండని అనుకొని కలిసి జీవిస్తే అది ఫెడరలిజం. సోవియట్ యూనియన్ 1985లో 13 దేశాలుగా, స్వచ్ఛందంగా విడిపోయారు. అనగా గతంలో సరైన ప్రాధాన్యం, స్వేచ్ఛా ఆయా రాష్ర్టాలకు లేకపోవడం వల్ల, నిజమైన ఫెడరలిజం అమలు చేయకపోవడం వల్ల స్వతంత్ర దేశాలుగా విడిపోవడం జరిగింది. భారతదేశంలో కేంద్రీకృత ఆధిపత్యం నుంచి ఇలా అనేక దేశాలుగా విడిపోయి యూరప్ యూనియన్ వలె సమాఖ్యగా ఏర్పడుతుందేమో ఎవరు చెప్పగలరు? ఆయా కేంద్ర ప్రభుత్వాల ఒత్తిడి, అణిచివేత అధికారాలు లాక్కోవడం నిర్లక్ష్యం తదితర కారణాలు, ఆత్మగౌరవం స్వేచ్ఛా, సమానత్వం వంటి కారణాల వల్ల ఒకే దేశం అనేక దేశాలుగా విడిపోవడం జరుగుతూ వస్తున్నదే. అనేక కారణాల రీత్యా, చరిత్ర పరిణామాల రీత్యా, వారి విస్తరణ కాంక్ష రీత్యా, యూరప్ ప్రాంతాలు, దేశాలు చిన్నచిన్న దేశాలుగా, స్వతంత్ర దేశాలుగా విడిపోయి కొనసాగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్, అమెరికా రెండు దేశాల మధ్య వెనుకబడిపోతు న్న పరిణామాన్ని గుర్తించి, యూరప్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక ఫెడరల్ వ్యవస్థ. మతం ఒక్కటే అయినప్పటికీ క్రైస్తవులు, ముస్లింలు అనేక దేశాలుగా, అనేక రాష్ర్టాలుగా జీవిస్తున్నారు.

రిజర్వేషన్లు యాభై శాతం గనుక విద్య, ఉద్యోగ, న్యాయవ్యవస్థ రంగాల్లో వీటిని పకడ్బందీగా, సమర్థవంతంగా అమలుచేయడానికి ఈ రిజర్వేషన్ల కేటగిరీల కోసం ప్రత్యేకంగా యూపీఎస్సీలను బ్యాంకు, రైల్వే, టెలిఫోన్ రిక్రూట్‌మెంట్ బోర్డులను రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుచేయడం అవసరం. పరీక్షలు ఒక్కటే అయినా, వేర్వేరుగా నిర్వహించినా సగం ఉద్యోగాలు కాబట్టి తప్పనిసరిగా ఈ సగం ఉద్యోగాల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు ద్వారానే ఈ 50 శాతమైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందుకోవడం సాధ్యపడుతుంది. ఇదికూడా ఫెడరలిజంలో భాగంగా చర్చించినప్పుడే నిజమైన ఫెడరలిజం అవుతుంది. ఈ విషయాలను పట్టించుకోలేని ఫెడరలిజం కొన్ని సామాజికవర్గాల, పాలకవర్గాల, ఆధిపత్యవర్గాల ప్రయోజనాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది.


గల్ఫ్ దేశాలు ఒకట్రెండు జిల్లాల అంతవి కూడా దేశంగా కొనసాగుతున్నాయి. యూరప్ ఆక్రమణదారుల వలసలో జీవించడంవల్ల బ్రిటీష్ వారి కాలంలో అన్ని ప్రాంతాలు ఒకే ఏలుబడిలో కి రావడం వల్ల భారతదేశంలో అనేక రాజ్యాలు స్వతంత్ర దేశాలుగా ఏర్ప డే పరిణామం స్థానంలో భారతదేశం ఒకే దేశం ఆవిర్భవించడం జరిగింది. సామ్రాట్ అశోకుడు, మొఘల్ సామ్రాట్ అక్బర్ కాలంలో ఈ రెండు సం దర్భాల్లోనే భారత ఉపఖండం ఒక దేశంగా కొనసాగింది. ఆ తర్వాత బ్రిటీష్ పరిపాలనలో తిరిగి ఒకదేశంగా రూపుదిద్దుకొని స్థిరపర్చడం జరిగింది. మిగతా శతాబ్దాల తరబడి అనేక రాజ్యాలుగా విడిగా కొనసాగాయి. అవ న్నీ కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడటానికి ఈస్ట్ ఇండియా కంపెనీ 1857 దాకా, ఆ తర్వాత ఇంగ్లండ్ ప్రభుత్వం ఎక్కడికక్కడ భారతీయ రాజుల తో, సంస్థానాలతో ఒప్పందాలు కుదుర్చుకొని నడుపుకుంటూ రావడం జరిగింది. జాతీయోద్యమకాలంలో దవ్రిడ స్థాన్, దర్తస్థాన్, ఖలిస్థాన్, పాకిస్థాన్, సౌతిండియా వంటి ప్రత్యేక దేశాల్లో నినాదాలు కొంతకాలం సాగా యి. పాకిస్థాన్ ఏర్పడింది. దక్షిణ భారతదేశం ఉత్తరాదితో అణిచివేతకు నిధుల, వనరుల దోపిడికి తరలింపునకు గురవుతున్నదని రాజకీయంగా అణిచివేయబడుతున్నదని భావిస్తూ దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశంగా విడిపోవాలని ఆలోచనలు ప్రజల్లో కొనసాగుతున్నాయి. దక్షిణాది నిధులను ఇక్కడినుంచి తరలించి ఇక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని లెక్కలతో సహా చర్చలు సాగుతున్నాయి. అందువల్ల ఫెడరిలిజం చర్చనూ, దాని ప్రాధాన్యాన్ని గుర్తించి ఆచరిస్తే దేశం సమైక్యంగా, సమాఖ్యగా కొనసాగుతుంది. లేకుంటే గతంలో వలె అనేక రాజ్యాలుగా, రాష్ర్టాలుగా చీలిపోవడానికి కేంద్రంలో ఉండేవారు కారకులవుతారు. జాతీయోద్యమం లో, శతాబ్దాల చరిత్ర పరిణామాలను గమనించకపోతే దేశం సమాఖ్యంగా కొనసాగడం ఎంత కష్టమో చరిత్రే ఒక ఉదాహరణ. ఒక ప్రత్యేక సాక్ష్యం.

1919 రాజ్యాంగం, 1935 రాజ్యాంగం, 1946 రాజ్యాంగం, 1950 జనవరి 26 రాజ్యాంగం పరిణామాలను గమనిస్తే ఫెడరలిజం స్వభావం నుంచి క్రమంగా కేంద్రీకృత రాజ్యం, కేంద్రీకృత దేశంగా మారుతూ వచ్చి న క్రమం చూడవచ్చు. అశోకుడు, అక్బర్ నిర్మించిన కేంద్రీకృత రాజ్య వ్యవస్థ చాలాకాలం నిలువలేదు. కొనసాగలేదు. బ్రిటీష్ వాళ్లు నిర్మిస్తూ వచ్చిన ప్రావిన్సులు, ప్రెసిడెన్సీలు, రెసిడెన్సీలు, 565 సంస్థానాలపై కొంత అదుపు వంటివి సాధిస్తూ రావడం జరిగింది. అలా యూరప్‌లోవలె భారతదేశం అనేక దేశాలుగా, స్వతంత్రంగా విడిపోకుండా ఒక దేశంగా కలిసి ఉంచే ఏర్పాట్లు, ఆధిపత్యాలు కొనసాగుతూ వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, కేంద్రం సామ్రాజ్యమైతే, రాష్ర్టాలు సామంత రాజ్యాలుగా కొనసాగుతూ వచ్చాయి. బ్రిటీష్ వారు చేసింది కూడా ఇదే మరింత బలపర్చడం. భారత రాజ్యాంగంలో ఈ పరిణామాలను అధిగమించి ఇందు కు భిన్నంగా ఆయా అంశాలను పొందుపర్చుకోవడం సాధ్యపడలేదు. 1947లో స్వాతంత్య్రం రాగానే 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చేలోపే 565 సంస్థానాలను రకరకాల ఒప్పందాలతో దేశంలో భాగం చేయడం జరిగింది. కాలక్రమంలో అలా చేసుకున్న ఒప్పందాల్లో ఒక్కటైన రాజ్యపాలనలను 1969లో రద్దుచేయడం జరిగింది. వారికి ప్రత్యేక సౌకర్యాలు ఉపసంహరించడం జరిగింది. వారు కూడా అందరివలె ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే విధానంలోకి తీసుకురాగలిగినారు. కానీ, ఇంగ్లండ్‌లో నామమాత్రంగానైనా రాజరిక వ్యవస్థ నేటికీ కొనసాగుతున్నది. మనదేశంలో దాన్ని రాష్ట్రపతికి, గవర్నర్‌కు బదలాయించడం జరిగింది. ఇటీవలి కాలంలో ఆయా రాష్ర్టాల, ప్రాంతాల, జాతుల స్వేచ్ఛలను, హక్కులను, స్వావలంబనను, అభివృద్ధి సంక్షేమ రంగాలను, పరిపాల నా న్యాయ వ్యవస్థలను, రాజకీయాలను ఫెడరలిజం నుంచి కేంద్రీకృత విధానానికి ఒక్కొక్కటిగా మలుచడం జరుగుతుంది.
BS-Ramulu
తోడుగా సముద్రం నిన్నే ముంచేస్తుంది అని లోకోక్తి. జీఎస్టీ ద్వారా రాష్ర్టాలు ఈ విషయంలో సమస్త అధికారాలు కోల్పోవడం, కేంద్రం బలీయం కావడం జరిగింది. ఎంసెట్ వంటి పరీక్షలు కేంద్రమే నీట్ ద్వారా నిర్వహించడంతో ఉన్నత విద్యపై కూడా రాష్ర్టాలు తమ నిర్ణయాత్మక అధికారాన్ని కోల్పోయాయి. అమెరికాలో ఇన్‌కంటాక్స్ రాష్ర్టాల పరిధిలోనే ఉన్నది. దీన్నికూడా కేంద్రం ఇండియాలో తన పరిధిలోకి తీసుకుంది. రిజర్వేషన్లు యాభై శాతం గనుక విద్య, ఉద్యోగ, న్యాయవ్యవస్థ రం గాల్లో వీటిని పకడ్బందీగా, సమర్థవంతంగా అమలుచేయడానికి ఈ రిజర్వేషన్ల కేటగిరీల కోసం ప్రత్యేకంగా యూపీఎస్సీలను బ్యాంకు, రైల్వే, టెలిఫోన్ రిక్రూట్‌మెంట్ బోర్డులను రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పా టుచేయడం అవసరం. పరీక్షలు ఒక్కటే అయినా, వేర్వేరుగా నిర్వహించి నా సగం ఉద్యోగాలు కాబట్టి తప్పనిసరిగా ఈ సగం ఉద్యోగాల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు ద్వారానే ఈ 50 శాతమైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందుకోవడం సాధ్యపడుతుంది. ఇదికూడా ఫెడరలిజంలో భాగం గా చర్చించినప్పుడే నిజమైన ఫెడరలిజం అవుతుంది. ఈ విషయాలను పట్టించుకోలేని ఫెడరలిజం కొన్ని సామాజికవర్గాల, పాలకవర్గాల, ఆధిప త్య వర్గాల ప్రయోజనాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది. దేశమన్నా, రాష్ట్రమన్నా, ప్రాంతం అన్నా ఆయా ప్రజలే. అందువల్ల ఆయా ప్రజల సామాజికవర్గాల వారీగా ఫెడరలిజాన్ని, అభివృద్ధి సంక్షేమాలను, విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి నైపుణ్యాలను, వికాసాలను నియోజకవర్గాలవారీగా, సామాజికవర్గాల వారీగా పరిగణనలోకి, ఆచరణలోకి తీసుకున్నప్పుడే నిజమైన ఫెడరలిజం.

(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)

358
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles