మహాకవి కాళోజీ

Mon,September 9, 2019 12:43 AM

kaloji2
కాళోజీ కవనాలు
వ్యథభరితపు గానాలు
తెలంగాణ నేలపైన
ఉదయించిన కిరణాలు
మనయాస మనభాష
కాళోజీ కవిఘోష
ప్రజాక్షేమము కొరకు
పోరాడెను హమేష
వాడియైన మాటలతో
కవిత్వమను ఈటెలతో
దుమ్ములేపె కాళోజీ
సిరాచుక్క మెరుపులతో
పేదవాళ్ళ కష్టము
తన కవితల కిష్టము
కాళన్న పుస్తక సిరి
తరగనిదని స్పష్టము
కాళోజీ జన్మదినము
తెలంగాణ భాషదినము
మాతృభాష ప్రేమికులకు
అదే కదా పర్వదినము

- వడిచర్ల సత్యం, 94413 50137

88
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles