పరిస్థితిని చక్కదిద్దాలె

Sat,September 7, 2019 10:35 PM

భారత ఆర్థికవ్యవస్థకు దెబ్బలు వరుసపెట్టి తాకుతున్నాయి. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్-ముక్త్ భారత్ మాత్రమే కాదు, ఆర్థిక మందగమన ముక్త్ భారత్ పట్ల దృష్టి సారించవలసిన సమయం ఇది. ఇవాళ బీజేపీకి పెద్ద ప్రమాదం, సవాలు ప్రతిపక్షం నుంచి కాదు, వీధుల్లోని నిరుద్యోగ యువత ఆగ్రహం, కూలుతున్న ఆర్థి కవ్యవస్థ నుంచే అసలు ప్రమాదం పొంచి ఉన్నది. ఒకవైపు ఆర్థిక రంగం లో దుర్వార్తలు వెలువడుతుంటే, మరోవైపు ప్రపంచ ఆర్థి క విశ్లేషకులు జీడీపీ ఆరు శాతం కన్నా తక్కువగా ఉం టుందని అంచనా వేస్తున్నారు. అంటే మనం మెల్లగా భారీ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్నామా? మార్కె ట్ పరిశీలకులు చాలాకాలంగా చెబుతున్నట్టుగా ఆర్థిక వ్యవస్థ పతనం తప్పనిసరిగా కనిపిస్తున్నది. ఉగ్రవాదం మాదిరిగానే ఆర్థిక మాంద్యానికి అనుభవపూర్వక నిర్వచనం లేదు. ఒక్కో ఆర్థికవ్యవస్థకు ఒక రకంగా ఉంటుంది. ఆర్థిక మందగమనం మాంద్యంగా మారాలని లేదు. కానీ మోదీ ప్రభుత్వం వెంటనే పట్టించుకొని పరిస్థితిని చక్కదిద్దాలె. ఆర్థిక మందగమనం లేనేలేదంటూ ఖండించడం ఆర్థిక వ్యవస్థకూ, ప్రభుత్వానికి మంచిది కాదు. 2008 మాంద్యం: కుప్పకూలిన ఆర్థికవ్యవస్థనే పుం జుకోగలదు. కానీ ప్రార్థనలు, పత్రికా సమావేశాలతో ఫలితం ఉండదు. 2008-09లో భారత ఆర్థికవ్యవస్థ భారీ ఆసియా మాంద్యంలో భాగమే. ఈ ఆసియా మాంద్యం ప్రపంచ ఆర్థికవ్యవస్థలను హడలగొట్టింది. అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం ఈ ఆసియా మాంద్యానికి దారితీసింది. ఈ మంద్యం దెబ్బనుంచి తప్పించుకోవడానికి అమెరికా ఫెడరల్ రిజర్వు (మన ఆర్బీఐ వం టిది) ఏడు రేట్ కట్స్‌ను ప్రకటించి రుణ వ్యవస్థలోకి నగదు ప్రవహించేలా చేసింది. దీంతో యథేచ్ఛగా రుణ వితరణ సాగింది.

బ్యాంకుల విలీనాలు, రుణం సౌలభ్యం, పరిశ్రమలకు తాయిలాలు, తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే తగిన నియమాలు, ఉపయోగ అవకాశాల్లేని అతి రుణాలు పరిస్థితిని దిగజారుస్తాయి. చమురు ధరల హెచ్చుతగ్గులు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ప్రధాన ఆర్థికవ్యవస్థల మందకొడితనం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో లోపాలు మొదలైనవి ప్రధాని ఎజెండా అయిన అందరికీ ఉద్యోగాలు, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనే కలపై ప్రభావం చూపవచ్చు.


ఇప్పుడు తిను తర్వాత చెల్లించు నమూనా అమెరికా బ్యాంకులను కుదేలు పర్చడమే కాకుండా ప్రపంచ ఆర్థిక పతనానికి దారితీసింది. 20 01 నుంచి 2006 వరకు భారత ఆర్థిక వాతావరణం చక్కగా ఉండేది. కానీ ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రకంపనలు భారత ఆర్థికవ్యవస్థపై కూడా పడ్డాయి. తక్కువ ఎగుమతులు (జీడీపీలో 15 శాతం), పారిశ్రామిక ఉత్పత్తి బలం గా 7.8 శాతం ఉండటం మూలంగా మనగలిగింది. నాటి ప్రధాని మన్మోహన్ చెప్పినట్టు ఆర్థికవ్యవస్థ పుంజుకోనప్పటికీ, ప్రభుత్వ సంప్రదాయ ఆర్థిక విధానాల వల్ల నాటి ఆర్థిక అనిశ్చితి భారీ సంక్షోభంగా ముదరలేదు. మరి 2019 నాటికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను నిద్ర పట్టకుండా చేసిన మార్పులేమిటి? ప్రస్తుత సమస్య: విశ్లేషకులు చెబుతున్న ప్రకారం.. 2008-09 సంక్షోభం 2014 వరకు కొనసాగి నరేంద్ర మోదీ ఘన విజయం తర్వాత కొంత సడలింది. కొత్తగా ఏర్పడిన మోదీ ప్రభుత్వం వల్ల ఆర్థిక పురోగతి ఉంటుందని, ఉత్పత్తి పెరుగుతుందని, సులభ వ్యాపార పద్ధతులు వస్తాయని, పన్నుల సంస్కరణలు భారీగా జరుగుతాయని, అన్నిటికి మించి లక్షలాది మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని ఆశలు జనించాయి. కోటి ఉద్యోగాలు అనేది యువతపైన, పారిశ్రామిక వర్గాలపైన మంచి ప్రభావం చూపింది. మోదీ ప్రభుత్వం రెండేండ్ల పాలన తర్వాత 2016లో అవినీతి, నల్లధనంపై పోరా టం మొదలుపెట్టింది. ఈ క్రమంలో పెద్ద నోట్లను రద్దుచే సింది. ఈ నిర్ణయం ఎంతో ఆలోచించి తీసుకున్నదే అయినప్పటికీ, ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం దీని ప్రతికూల ప్రభావం కనిపిస్తున్నది. పెద్ద నోట్లరద్దు నుంచి తేరుకోకముందే జీఎస్టీని ప్రవేశ పెట్టారు. ఈ దిద్దుబాటు చర్య వల్ల దీర్ఘకాలంలో వ్యాపారం, అభివృద్ధి పుంజుకుంటాయన్నారు. కానీ తక్షణం మాత్రం ఆర్థికవ్యవస్థను స్తంభింపజే సింది. ఆ తర్వాత అనేక ఘటనలు ఆర్థికరంగంలో పూర్తి ప్రతిష్టంభనకు దారితీశాయి.
Seshadri-chari
డిమాండ్ తగ్గిపోయింది, ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈలోగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కుప్పకూలుతూ, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వచ్చిపడింది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ హడావుడిగా స్పందించింది. అన్ని నాన్-బ్యాంకింగ్ రుణసంస్థలపై విస్తృత పరిమితులను విధించింది. దీంతో రుణదాతలకు తప్పుడు సంకేతాలిచ్చినట్టయింది. రుణదాతల విశ్వాసం సన్నగిల్లడంతోపాటు పెట్టుబడుల వాతావరణం దెబ్బతిన్నది. ఈ క్రమంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగాలకు రుణలభ్యత దెబ్బతిన్నది. మార్కెట్ సెంటిమెంట్ కూడా సన్నగిల్లింది. మేక్ ఇన్ ఇండియా పథకం రెక్కలు విచ్చుకొని ఎగురాల్సి ఉండగా మూలకు ముడుకుపోయింది. బ్యాంకుల విలీనాలు, రుణం సౌలభ్యం, పరిశ్రమల కు తాయిలాలు, తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తా యి. అయితే తగిన నియమాలు, ఉపయోగ అవకాశాల్లే ని అతి రుణాలు పరిస్థితిని దిగజారుస్తాయి. చమురు ధరల హెచ్చుతగ్గులు, అమెరికా-చైనా వాణిజ్యయు ద్ధం, ప్రధాన ఆర్థికవ్యవస్థల మందకొడితనం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో లోపాలు మొదలైనవి ప్రధాని ఎజెండా అయి న అందరికీ ఉద్యోగాలు, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనే కలపై ప్రభావం చూపవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ భయానక పన్ను విధానం, వ్యాపా ర వ్యతిరేక నిర్ణయాలపై వస్తున్న ప్రశ్నలను దాటవేసే విధానం మానుకొని పారిశ్రామికులు, వాణిజ్యవర్గాలు, నిపుణులతో చర్చలు జరుపాలె.

(వ్యాసకర్త: బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడు. ఆర్గనైజర్ పత్రిక మాజీ సంపాదకుడు. అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి)
ది ప్రింట్ సౌజన్యంతో...

443
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles