కాళోజీ ఎన్నడో అన్నడు

Sat,September 7, 2019 01:43 AM

ప్రజాస్వామ్యానికి, మానవాళి హక్కులకు, మానవతావాదాని కి, మనిషి ప్రాథమిక హక్కులకు, పౌర హక్కులకు హిట్లరి జం వల్ల సంభవించే విపత్తు గురించి, నేటికీ ప్రపంచం పలుచోట్ల విజృంభిస్తున్న నాజీ శక్తుల ప్రమాదం గురించి కాళోజీ కవి 70 ఏం డ్ల కిందనే హెచ్చరించారు-‘నవ యుగంబున నాజీ వృత్తుల నగ్న నృత్య మింకెన్నాళ్లు? పోలీసు అండను దౌర్జన్యాలు పోషణ బొందేదెన్నాళ్లు? దమననీతితో దౌర్జన్యాలకు దాగిలిమూతలు ఎన్నాళ్లు? కంచెయె చేనును మేయుచుండగా కాంచకుండుటింకెన్నాళ్లు?.. హింస పాపమని యెంచు దేశమున హిట్లరత్వమింకెన్నాళ్లు?.. శాంతిభద్రతల పేరిట దుష్టతను సమర్థించుటింకెన్నాళ్లు?.. దౌర్జన్యము నెదిరించక మనకీ దాసోహం ఇం కెన్నాళ్లు? కలము పోటున కదపజాలని కావ్యగాన మింకెన్నాళ్లు?’ అని ప్రశ్నించారాయన. మానవత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపడానికి బుసలు కొట్టిన, ప్రపంచ శాంతి, సఖ్యత, సామరస్యాలకు, సౌభ్రాతృత్వానికి, వసుధైక కుటుంబ భావనకు భంగకరంగా పరిణమించిన నాజీ, ఫాసిస్టు దుష్టశక్తులను తీవ్రంగా ఖండించిచారు కాళోజీ. ప్రజాస్వామ్య పరిరక్షణకు పెట్టని కోటగా నిలిచిన, మానవత్వ విలువల కోసం తన అక్షరాయుధాలను ప్రయోగించిన మహాకవి, ప్రజాకవి కాళోజీ. ప్రజాస్వామ్యం పరిఢవిల్లవలసిన నవయుగంలో నాజీ వృత్తుల (నాజీ, ఫాసిస్టుశక్తుల) నగ్న నృత్యం ఇంకెన్నాళ్లని ప్రశ్నించిన, పరితాపానికి గురైన ప్రపంచకవి కాళోజీ.

సమకాలిక సమాజంలోని పలురూపాల దుష్టత్వాన్ని బట్టబయలు చేసి, తుత్తునియ లు చేయడానికి తన కలాన్ని ఖండపరశువుగా, అక్షరాలను అక్షయ తూణీర అస్ర్తాలుగా ప్రయోగించిన కాళోజీ ‘కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక’ అని భీషణ ప్రతిన చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలకు, సిద్ధాంతాలకు, భావాలకు, విధానాలకు తన జీవితాన్ని, తన అక్షర తపస్సును అంకితం చేసిన కాళోజీ స్వేచ్ఛాప్రియుడు, స్వాతంత్య్ర కాంక్షా సంపన్నుడు; అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడానికి ఆయన ఒక కవిగా, సామాజిక స్పృహ గల నిరంతర, నిర్విరా మ ఉద్యమకారుడుగా ప్రదర్శించిన ధైర్య సాహసాలు సాటిలేనివి. దుష్ట శక్తులను ప్రతిఘటించిన, అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రజా ఉద్యమాలన్నింటికి ఆయన అండగా, బాసటగా, ఆశీస్సుగా నిలిచారు. “ఇచ్ఛయె నా ఈశ్వరుడని కచ్చితముగ నమ్ముతాను’ అని ఆయన మరో మ్యాగ్నా కార్టా ప్రకటించారు. ‘చెమ్మగిల్లిన కన్నులలో కమ్మలెన్నో చదివినాను’ అని ఉద్ఘోషించిన కాళోజీ కష్టాల పాలైన తన ప్రజల పక్షాన నిలిచాడు.

‘..ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయం అట్లానె ఉంటుందనుకోవడం దురాశ..’ అన్న కాళోజీ చీకట్లను చీల్చి తరుమడానికి చండశాసనుడైన నిదర్శనాలున్నాయి. చీకట్లను చూసి, రాచరికవ్యవస్థ ఆంక్ష లు, నిర్బంధాలకు గురై కాళోజీ భీతిల్లలేదు, ఆయన అక్షర అస్త్ర సన్యాసం చేయలేదు.ఇక్కడి రాచరిక వ్యవస్థను కూల్చడానికి కాళోజీ అక్షర విన్యాసం ప్రారంభించి, స్వాతంత్య్ర సమర రంగంలో, పలు సామాజిక ఉద్యమాల్లో క్రియాశీల పాత్రనిర్వహిస్తున్న రోజుల్లోనే అక్కడ నాజీ, ఫాసిస్టు దుష్టశక్తుల విజృంభణ మొదలైంది.


‘అనామకుని ధీశక్తిని అడిగేవాడే లేడు, ఆడంబరయుక్తమైన పేడ బొమ్మనైన చాలు.. తోక వూపి మూతినాకు తుచ్ఛులకే వైభవాలు..’ అంటూ కాళోజీ నాటి సమాజంలోని అసమానతలను, వివక్షతను చూసి ఆశ్చర్యపడ్డారు, ఆగ్రహం వ్యక్తపరిచారు. ఆయనది అశ్వత్థామ ఆగ్రహం, పాండవాగ్రజుడు ధర్మజుని కినుక, సూటిగా, డొంక తిరుగుళ్లు, శాఖాచంక్రమణాలు లేకుండా అక్రమాలను చీల్చి చెండాడటం కాళోజీ ప్రత్యేకత. అలంకారాలు, ఆభరణాలు, నిఘంటువులు, ఛందోనియమాల అవస రం లేని అచ్చమైన తెలంగాణ తెలుగు భాషలో అత్యంత శక్తివంత, అం తిమ ఆయుధ ప్రయోగంతో పాఠకుల, ప్రజల హృదయాల్లోకి చొచ్చుక పోవడంలో సాటిలేనివాడు కాళోజీ. ఆయన 70 ఏండ్ల కిందట, అప్పటి అన్యాయాలను, రాచరికాన్ని, అరాచకత్వాన్ని సహించలేక రాసిన కవితలను చదివినప్పుడు, విన్నప్పుడు అవి సర్వకాలీనమైనవి కనుక ఇప్పటి దుస్థితిపై, ఇప్పటి దుష్ట శక్తులపై ఆ కవితలను ఎక్కుపెట్టారన్పిస్తుంది. ఆయన నాడు అన్నారు- ‘...రక్షణకు ఏర్పడ్డ బలగము రక్కసుల పక్షం బు చేరిన రాక్షసుల యిష్టానుసారం రాజ్యమును నడిపించినట్లు..’ కాళోజీ తర్వాత 70 ఏండ్లకు ప్రజాస్వామ్యం ముసుగులో సంభవించనున్న విషమ పరిణామాలను ముందే ఊహించి అన్నారన్పిస్తుంది!

కాళోజీ కవి పూర్వపు హైదరాబాద్‌ సంస్థానం త్రివేణీ సంగమ ఉదాత్త, ఉత్కృష్ట సంస్కృతీ సభ్యతల ప్రతీకగా, అమూల్య ఫలంగా 1914, సెప్టెంబర్‌ 9న జన్మించారు. పుట్టింది ఎక్కడైనా ఆయన అచ్చంగా, అక్షరాల తెలంగాణ బిడ్డ.


‘..ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయం అట్లానె ఉంటుందనుకోవడం దురాశ..’ అన్న కాళోజీ చీకట్లను చీల్చి తరుమడానికి చండశాసనుడైన నిదర్శనాలున్నాయి. చీకట్లను చూసి, రాచరికవ్యవస్థ ఆంక్ష లు, నిర్బంధాలకు గురై కాళోజీ భీతిల్లలేదు, ఆయన అక్షర అస్త్ర సన్యాసం చేయలేదు. ఇక్కడి రాచరిక వ్యవస్థను కూల్చడానికి కాళోజీ అక్షర విన్యా సం ప్రారంభించి, స్వాతంత్య్ర సమర రంగంలో, పలు సామాజిక ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్న రోజుల్లోనే అక్కడ నాజీ, ఫాసిస్టు దుష్టశక్తుల విజృంభణ మొదలైంది. మతోన్మాదం, జాతి విద్వేషం ప్రకోపించి, తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు నాజీ నియంత హిట్లర్‌ యుద్ధోన్మాదం హద్దులు దాటింది. మొదట సంఖ్యాబలం లేకపోయినా జర్మనీ ఛాన్స్‌లర్‌గా నియుక్తుడై, తర్వాత జర్మనీ ప్రజల జాతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టి నాజీ నియంతగా, నరరూప రాక్షసుడిగా మారిన హిట్లర్‌-పొరుగున ఉన్న ముస్సోలిని (ఇటలీ నియంత), దూరాన ఉన్న జపాన్‌ చక్రవర్తి హీరోహితో అండ నిలువగా రెండవ ప్రపంచ యుద్ధాని కి బీజం వేశాడు. యూరప్‌లో 1939 సెప్టెంబర్‌ 1న హిట్లర్‌ తన సేనల ను పంపి పోలండ్‌ను ఆక్రమించాడు. బ్రిటన్‌ తదితర యూరప్‌ దేశాల ను మొదట, తర్వాత యూఎస్‌ఏను లొంగదీయడానికి పోలండ్‌ ఆక్రమణ మొదటిమెట్టని హిట్లర్‌ అనుకున్నాడు.

అంచులు తెంచుకొని పొంగి పొరలిన నాజీ నియంత హిట్లర్‌ మతోన్మాదం, జాతి విద్వేషం, యుద్ధోన్మాదం ఫాసిస్టు సామ్రాజ్యవాదానికి గేట్లు తెరిచాయి. యూదు జాతీయుల సామూహిక వధకు (తుపాకులతో కాల్చిచంపి, విషభరిత శిబిరాల్లో నిర్బంధించి, ఎన్నో రాక్షస కృత్యాలు జరిపి) కనికరం లేకుండా కత్తు లు దూసిన హిట్లర్‌ ఒక్క పోలండ్‌లోనే 30 లక్షల మంది యూదులను, ఇతర దేశాల్లో మరో 30 లక్షల మంది యూదులను, రెండవ ప్రపంచ యుద్ధంలో మొత్తం 5 కోట్ల మందిని హతమార్చి రక్తసిక్త హస్తాలతో వికటాట్టహాసం చేశాడని, ఓటమి పొందిన పిదప ఈ నాజీ నియంత తన ప్రేయసితో కలిసి ఆత్మహత్య చేసుకోక తప్పలేదని చరిత్ర వివరిస్తున్నది. నాజీ, ఫాసిస్టు శక్తులను ఓడించి ప్రపంచ వినాశనాన్ని అరికట్టడానికి రెండవ ప్రపంచయుద్ధంలో క్యాపిటలిస్టు దేశాలు (అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌) మొట్టమొదటి కమ్యూనిస్టు దేశం సోవియట్‌ యూనియన్‌తో చేతులు కలుప వలసి వచ్చింది. నాడు తమ ప్రశంసలతో హిట్లర్‌ను స్తుతించిన భారతీయ నాయకుల పేర్లను ఈ మధ్య న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. పోలండ్‌ మంచుకొండల్లో ప్రారంభించిన తన దురాక్రమణ యుద్ధాన్ని మాస్కో మంచుకొండల వరకు కొనసాగించి హిట్లర్‌ చివరి క్షణాల్లో గ్రహించాడు మంచుపొరలు ఎంత ప్రమాదకరమైనవో. మినీ హిట్లర్‌లు కూడా మంచుకొండల్లోనే తమ దుస్సాహసాన్ని ప్రారంభించడం నేటి విశేషం! 80 ఏండ్ల తర్వాత వారం రోజుల కిందట ఇప్పటి జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ స్వయంగా పోలండ్‌ వెళ్లి మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని తమ ఘోర నేరాలను క్షమించమని వేడుకున్నాడు.

నాజీ నియంతృత్వశక్తుల వినాశకర విధ్వంస చర్యలను నాడు వివరంగా గమనించిన కాళోజీ ‘..శస్ర్తాలు నిర్మించి సైన్యాలు సమకూర్చి, ఉర్వినంతయు గెలువ యుద్ధాలు ప్రకటించి, దుష్టశక్తులు పోరి దొర్లుపొయ్యాయి..’ అంటూ సంతసించాడు. కానీ, కాళోజీ ఆత్మ ఈరోజు అశాంతి పాలవుతున్నది. ఆయన ఆశించినట్లు ప్రపంచంలో నాజీ శక్తుల ఓటమి, అంతం శాశ్వతంగా జరుగలేదు. ఈ సత్యాన్ని కాళోజీ కవి నాడే గ్రహించి అన్నాడు-‘ప్రపంచ చరిత్ర సాంతము ప్రకటించు నొక్క విషయము, మాంధాతల నాటినుండి మార్పులేదు యీ జగాన, ధృతరాష్ర్టుడు దుర్యోధనులు కృతవర్మలు శకునులు శల్యులు దుశ్శాసనులు జయద్రధులు ద్రోణులు భీష్ములు కర్ణులు పాంచాలులు కుంతులు పాండవులు శిఖండులు పదేపదే పుట్టుచు పెరుగుచు, పదేపదే తరుగుచు విరుగుచు, పై మెరుగులు లోమరుగులు, విషపు నవ్వు వెక్కిరింత, దొంగ నవ్వు దొంగేడుపు, ముసుగులో గుసగుసలు’. ‘ఆంఖో దేఖే హాల్‌' అన్నట్లు నేటి ప్రపంచ పరిస్థితిని, స్వతంత్ర భారత్‌ స్వరూపాన్ని కాళోజీ ఈ కవితలో కన్పింపజేశారు.

కాళోజీ కవి పూర్వపు హైదరాబాద్‌ సంస్థానం త్రివేణీ సంగమ ఉదా త్త, ఉత్కృష్ట సంస్కృతీ సభ్యతల ప్రతీకగా, అమూల్య ఫలంగా 1914, సెప్టెంబర్‌ 9న జన్మించారు. పుట్టింది ఎక్కడైనా ఆయన అచ్చంగా, అక్షరాల తెలంగాణ బిడ్డ. తెలంగాణ ప్రజలతో, తెలంగాణ ప్రజల భాష, సంస్కృతులతో అద్వైతం పొందిన, తెలంగాణ అస్తిత్వం, హక్కులు, ప్రయోజనాల కోసం, తెలంగాణ శ్రేయస్సు, ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు ఆరాటపడిన మహాకవి, ప్రజాకవి, మహనీయుడు, వైతాళికుడు కాళోజీ. పుట్టిన మరుక్షణం నుంచి చివరిశ్వాస పీల్చేవరకు, 88 ఏండ్ల దీర్ఘకాలంలో (2002, నవంబర్‌ 13 వరకు) తెలంగాణ నేలపై కాళోజీ పాల్గొనని, ఆయన అండగా నిలువని, ఆయన ఆశీర్వదించని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమం, కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన కవితాసంకలనం ‘నా గొడవ’, ఆయన అచ్చ మైన తెలంగాణ తెలుగులో రచించిన ఆత్మకథ ‘ఇదీ నా గొడవ’. తెలంగాణ ప్రజాకవి కాళోజీగా ప్రపంచ ప్రసిద్ధుడైన ఆయన తన ఆత్మకథలో అన్నారు

‘అందరు నన్ను కాళోజీ అంటరు గాని, అది నా పేరు గాదు. మా ఇంటిపేరు.. అసలు నేను పుట్టి వుండేటివాణ్ణి గాను..’ ఆయనే అన్నాడు-‘అతిథివోలె వుండి వుండి అవని విడిచి వెళ్లుతాను..’ ఆయన అవనిపై ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా, ఆచం ద్ర తారార్కం మిగిలి ఉంటడు. ఆయన కలిగించిన స్ఫూర్తి, తెలంగాణ ప్రజలకు శాశ్వత, నిరంతర పవిత్ర స్రోతస్విని. 25 ఏండ్ల నూనూగు మీసాల యువప్రాయం నుంచి మూడు పర్యాయాలు ఆయన తెలంగాణ యోధుడిగా నిజాం పాలనలో కారాగారవాస శిక్షలు అనుభవించాడు. ‘అవనిపై జరిగేటి అవకతవకల చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’ (కాళోజీ రచించిన ఈ గీతాన్ని పీవీ నరసింహారావు ఆంగ్లంలోకి అనువదించారు) అని కాళోజీ తమ సాధు స్వభావాన్ని, నవనీత హృదయాన్ని ఆవిష్కరించారు. ఈ రోజు కాళోజీ జీవించి ఉంటే నయా నాజీ శక్తుల విజృంభణతో ఆవేదనకు గురై అవశ్యం ధిక్కరణకు సిద్ధపడేవాడు!
-(సెప్టెంబర్‌ 9న కాళోజీ జయంతి సందర్భంగా...)
Prabhakar-Rao

540
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles