చెదరని బంధం

Fri,September 6, 2019 03:40 AM

ప్రధాని మోదీ వ్లాదివాస్తోక్ పర్యటనతో భారత రష్యా అనుబంధం మరింత దృఢతరమైంది. రష్యా ప్రభుత్వం తమ దేశంలోని తూర్పు ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలంటూ తలుపులు తెరిచిన నేపథ్యంలో ప్రధాని మోదీ తూర్పు ఆర్థిక వేదిక సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తూర్పు ప్రాంత అభివృద్ధి కోసం వంద కోట్ల డాలర్ల రుణ సదుపాయం ప్రకటించారు. ఇదే సందర్భంలో భారత రష్యా ఇరువయవ శిఖరాగ్ర సదస్సు కూడా జరిగింది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ చర్చల ఫలితంగా రెండు దేశాల మధ్య వివిధ రంగాలలో ఇరువై అయిదు ఒప్పందాలు కుదిరాయి. వీటి మూలంగా చమురు-సహజవాయువు, అణు ఇంధనం, రక్షణ, వైమానిక-నౌకా మార్గాలు, అంతరిక్షం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత మొదలైనరంగాలలో రెండు దేశాల సంబంధాలు మరింత బలపడుతున్నాయి. వ్లాదివాస్తోక్ నుంచి చెన్నైకి నౌకా మార్గం నెలకొల్పాలని రెండు దేశాలు నిర్ణయించడం వల్ల సూయెజ్ కాలువ మీదుగా వెళ్ళే దూరభారం తగ్గుతుంది. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ప్రగతిశీల భావనతో రష్యా భారత్‌కు మద్దతుగానే ఉన్నది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోనైతే అణుశక్తి మొదలుకొని అంతరిక్షం వరకు అన్ని రంగాలలో చేయూత అందించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ అండగా నిలిచింది. ఇప్పటికీ గగన్‌యాన్ వంటి భారత అంతరిక్ష కార్యక్రమాలకు రష్యా తోడ్పాటు అందిస్తున్నది. రక్షణరంగ సహకారంలో రష్యాకు మరే దేశం సాటిరాదు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వాదనను తిప్పికొట్టడానికి ప్రధాని మోదీ ఈ పర్యటనను ఉపయోగించుకున్నారు. రష్యా తూర్పు ప్రాంతంలో పుష్కలమైన ప్రకృతి వనరులున్నాయి.

విశాలమైన రష్యాలో యూరప్ ఖండ భూభాగం బాగా అభివృద్ధి చెందింది. తూర్పున గల ఆసియా ప్రాంత పురోగతికి రష్యా ఇప్పుడే చర్యలు తీసుకుంటున్నది. ఈ తూర్పు ప్రాంతంలో వ్లాదివాస్తోక్ కీలకమైన రేవు నగరం. చైనా భూభాగానికి, జపాన్ సముద్రానికి మధ్యన అఖాతం ఒడ్డున ఉండే ఈ రేవు రష్యా దేశ పసిఫిక్ నావికా బలగాలకు నిలయం. 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం గుర్తుకువచ్చినప్పుడు భారతీయులకు వ్లాదివాస్తోక్ నగరం కూడా మనసులో మెదులుతుంది.


ఇప్పుడిప్పుడే తలుపులు తెరిచినందున వ్యాపార అవకాశాలు కూడా భారీగా ఉన్నాయి. వైద్యులు, ఉపాధ్యాయులతో పాటు సాఫ్ట్‌వేర్ తదితర రంగాలలో నిపుణుల అవసరా న్ని భారత్ తీర్చవచ్చు. వ్యవసాయరంగంలో నూ పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి. భారత్ ఇప్పటికే లుక్ ఈస్ట్ పాలసీని అమలు చేస్తున్నది. మాజీ సోవియెట్ రిపబ్లిక్ దేశాలతో భారత్‌కు సాన్నిహిత్యం ఉన్నందున రష్యా, ఆర్మీనియా, బెలారస్, కజఖ్‌స్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్ దేశాలతో కూడిన యూరేషియా ఎకనమిక్ యూనియన్‌తో కూడా సంబంధాలు దృఢపడుతున్నా యి. ఇప్పుడు వ్లాదివాస్తోక్‌లో జరిగిన తూర్పు ఆర్థిక వేదిక (ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం)కు మోదీ హాజరుకావడం ఈ విధానాలకు మరింత కొనసాగింపుగా భావించవచ్చు. రష్యాతో రాష్ర్టాల స్థాయిలో వ్యాపార సంబంధాలు నెలకొల్పాలని మోదీ భావిస్తున్నారు. అందుకే ఈ పర్యటనలో తమతోపాటు యూపీ, గుజరాత్ తదితర ఐదు రాష్ర్టాల ముఖ్యమంత్రులను, దాదాపు నూట నలభై వ్యాపార సంస్థల ప్రతినిధులను తీసుకుపోయారు. ప్రధాని మోదీ ఈ పర్యటనలో మం గోలియా అధ్యక్షుడు ఖాల్తమాగీన్ బట్టూల్గాతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. జపాన్ ప్రధాని షింజోతోనూ ఆర్థిక, రక్షణ సంబంధాలపై చర్చించారు. మలేషియా ప్రధాని మహతీర్ బిన్ మహమద్‌తో ఉగ్రవాదాన్ని కట్టడి చేసే విషయం మాట్లాడారు. విశాలమైన రష్యాలో యూరప్ ఖండ భూభాగం బాగా అభివృద్ధి చెందింది. తూర్పున గల ఆసి యా ప్రాంత పురోగతికి రష్యా ఇప్పుడే చర్యలు తీసుకుంటున్నది. ఈ తూర్పు ప్రాంతంలో వ్లాదివాస్తోక్ కీలకమైన రేవు నగరం. చైనా భూభాగానికి, జపాన్ సముద్రానికి మధ్యన అఖాతం ఒడ్డున ఉం డే ఈ రేవు రష్యా దేశ పసిఫిక్ నావికా బలగాలకు నిలయం.

1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భం గా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం గుర్తుకువచ్చినప్పుడు భారతీయులకు వ్లాదివాస్తోక్ నగరం కూడా మనసులో మెదులుతుంది. భారత సైన్యాలు ఢాకాను వశపరుచుకోబోతున్న దశలో-భారత్‌ను బెదిరించడానికి అమెరికా సప్తమ నౌకాదళం బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. దీంతో భారత్‌కు మద్దతుగా వ్లాదివాస్తోక్‌లోని సోవియెట్ నావికాదళం బయలుదేరింది. సోవియెట్ యూనియన్ రంగంలో దిగడంతో అమెరికా వెనుకకు తగ్గింది. ఇప్పటికీ చైనా, జపాన్, కొరియా ద్వీపకల్పం సమీపంలో ఉన్న వ్లాదివాస్తోక్ నగరం పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో వాణిజ్యపరంగా, భౌగోళిక- రాజకీ య పరంగా పట్టు సాధించడానికి కీలకమైనది. చైనా బలమైన సైనిక- వాణిజ్య దేశంగా అవతరించి న నేపథ్యంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రాముఖ్యం పెరిగింది. ఈ ప్రాంతంలో దక్షిణ చైనా సముద్రం మాదిరిగానే ఉత్తరాన జపాన్ సముద్రం అంతర్జాతీయ ప్రాబల్య రాజకీయాలకు వేదిక. దక్షిణ చైనా సముద్రంలో భారత్ కొంత అమెరికాకు అనుకూలంగా ఉంటూ చైనా వ్యతిరేక కూటమిలో క్రియాశీలంగా ఉన్నది. ఇప్పుడు జపాన్ సముద్ర ప్రాంతంలో రష్యాకు అనుకూలంగా ఉంటూ సమతుల్యం సాధించడానికి ప్రయత్నిస్తున్నది. పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ఏ ఒక్క దేశ పెత్తనమో నెలకొనకుం డా బహుళ ధ్రువ ప్రాబల్యం నెలకొల్పాలనే అభిప్రాయాన్ని మోదీ పుతిన్‌తో జరిపిన సమావేశంలో వెల్లడించారు. అంతర్జాతీయ రంగంలో బలాబలాలు, రాజ్యాల సంబంధాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్ తదనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవడానికి ప్రధాని మోదీ వ్లాదివాస్తోక్ పర్యట న దోహదపడుతున్నది.

178
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles