గ్రామాభివృద్ధికి చారిత్రకావకాశం

Thu,September 5, 2019 12:58 AM

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి, పచ్చదనం-పరిశుభ్రతలకు ఈ నెల 6 నుంచి అమలయ్యే ప్రత్యేక కార్యక్రమం ఒక చారిత్రక అవకాశమనాలి. ఇందుకోసం తగు ప్రణాళికలను రూపొందించిన కేసీఆర్‌ ప్రభుత్వం, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు ప్రభుత్వ కృషి ఎంత ముఖ్యమో ప్రజల విస్తృత భాగస్వామ్యం అంతే ముఖ్యమని భావిస్తున్నది. ఇది ప్రజలు అర్థం చేసుకోలేని విషయం కాదు. గ్రామాభివృద్ధికి ఈ తరహా ప్రయత్నం రాష్ట్రంలో ఇది మొదటిసారి గనుక, ఈ చారిత్రక అవకాశాన్ని తమ కోసం తాము సద్వినియోగపరుచుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉంటున్నది.

ఈశుక్రవారం నుంచి అమలుకు రానున్న అభివృద్ధి కార్యక్ర మం విశేషాల్లోకి వెళ్లేముందు కొంత నేపథ్యాన్ని చెప్పుకోవా లి. గ్రామాల అభివృద్ధి అనేది విస్తృతమైన మాట. దేశానికి స్వాతంత్య్రం లభించి ప్రణాళికలు మొదలైనప్పటినుంచి ఇది వాడుకలో ఉంది. కానీ పచ్చదనం-పరిశుభ్రత నిర్దిష్టమైన అర్థం కలవి. గ్రామాల లో, దానితోపాటు అక్కడి వివిధ వర్గాలకు ఏయే రంగాల్లో ఏమేమి జరిగితే, వారు కొత్తగా ఎటువంటి స్థాయిని చేరుతూపోతే, అది అభివృద్ధి అవుతుందనే ప్రశ్నపై చాలా చెప్పుకోవచ్చు. అయితే, వందల సంవత్సరాల నిజాం రాజ్యంతో, సుమారు అరువై ఏండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితితో పోల్చితే, కేవలం గత అయిదున్నరేండ్ల కాలంలోనే తెలంగాణ గ్రామాలు గణనీయమైన అభివృద్ధి దిశలో సాగుతున్నాయి. గ్రామాల్లో నివసించే ప్రజలు, గ్రామాలతో సజీవ సంబంధాలు గల వారు ఇప్పటికే గుర్తించిన వాస్తవమిది. విద్యుత్‌ సమస్య పరిష్కారం నుంచి మొదలుకొ ని, తాజాగా వివిధ నీటిపారుదల పథకాలలో జలాలు వెల్లువెత్తుతుండ టం వరకు, గత ఐదేండ్లలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి జరిగిన పను లు ఇందుకు తార్కాణం.
ఈ అభివృద్ధి ఇదేవిధంగా కొనసాగనుండగా, అభివృద్ధికి పచ్చదనం-పరిశుభ్రతలతో గల అవినాభావ సంబంధమన్నది ఇక్కడ గుర్తించవలసిన విషయం.

ఈ రెండు నిజంగానే ఒకదానితో ఒకటి విడదీయలేనివి. గ్రామాలు, అక్కడి ప్రజలు వస్తుపరంగా (మెటీరియల్‌గా) ఎంత అభివృద్ధిని సాధించినప్పటికీ, ఊరినిండా చెత్తకుప్పలు, మురుగునీరు, ఈగ లు దోమలు, గుంటల రోడ్లు, శుభ్రతను పాటించని జనం నిండి ఉండి, ఈ విషయాల్లో స్పృహ లేక, క్రమశిక్షణను పాటించక, పచ్చదనాన్ని పెంచుకోక, అనారోగ్యాల బారిన పడుతూ ఉంటే, ఆ స్థితి వస్తుపరమైన అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుంది. మానవాభివృద్ధికి ఆటంకమవుతుంది. అది నాగరికత కాదన్నది సరేసరి. ఈ విషయాల్లో రాష్ట్రస్థాయి ప్రభుత్వం, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపకపోతే అదివేరు. అప్పుడు ప్రజలు చేయగలిగింది స్వల్పం. చైతన్యం గల వ్యక్తులు, గాంధేయుల వంటివారు, స్వచ్ఛంద సంస్థలు కొంత చేయవచ్చు గాని అందు కు పరిమితులుంటాయి. పైగా అదొక వ్యవస్థ రూపం తీసుకోజాలదు.

అటువంటిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకొక వ్యవస్థీకృత రూపం ఇస్తూ ముందుకు వస్తున్నది. ప్రభుత్వం చేసే వాటికి సాధారణం గా వ్యవస్థీకృత రూపం ఉంటుందనేది నిజమే. అయితే ప్రస్తుతం కేసీఆర్‌ సంకల్పంతో పచ్చదనం-పరిశుభ్రతకు ఇస్తున్న వ్యవస్థీకృత రూపం ఇంత విస్తృతంగా, ఇంతటిస్థాయిలో ఇంతకు ముందెన్నడూ లేదన్నది గుర్తించవలసిన విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేదు. దేశంలో బహుశా కేరళ ఒక్కటే ఇందుకు మినహాయింపు కావచ్చు. పచ్చదనం-పరిశుభ్రత కు మెటీరియల్‌ అభివృద్ధితో పాటు మానవాభివృద్ధి (హ్యూమన్‌ డెవలప్‌ మెంట్‌)తో ఘనిష్ఠమైన సంబంధం ఉన్నది. దీన్ని రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే అజెండాపైకి తీసుకున్న కేసీఆర్‌, అప్పటినుంచే హరితహారం కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పెద్దఎత్తున చేపడుతుండటం తెలిసిందే. అం దులో భాగంగా పరిశుభ్రత గురించి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారుగాని, ఇప్పుడందుకు మరింత నిర్దిష్టరూపం వస్తున్నది. ఆయన మొద ట హరితహారం గురించి మాట్లాడినపుడు, ఆ కార్యక్రమాన్ని బహుశా అందరూ గతకాలపు వన మహోత్సవాల వలె మొక్కుబడి వ్యవహారంగా తీసుకొని ఉంటారు. రాష్ట్రస్థాయి అధికారుల నుంచి మొదలుకొని గ్రామీణుల వరకు అదే దృష్టి తీసుకోవటం ఈ రచయిత స్వయంగా గమనించిన విషయం. కానీ ఆయన ఏ యేటికి ఆయేడు అదే కార్యక్రమాన్ని పట్టుదలగా కొనసాగించటం, ఆ పట్టుదల ఇంకా పెరుగుతూపోవటం వల్ల ఆ స్ఫూర్తి క్రమంగా ఇతరులకు కలగసాగింది. మొక్కలను ప్రభుత్వ సిబ్బంది మొక్కుబడిగా, ప్రజలు తక్షణ ఉత్సాహంగా నాటి వదలివేయ టం వేరు, స్ఫూర్తితో పరిరక్షించటం వేరు. ఇందులో రెండవది ఉండవలిసినంతగా లేదన్నది చేదు నిజం. ఇది గమనించి ముఖ్యమంత్రి ఒక దశ తర్వాత కొన్ని గట్టి చర్యలే ప్రకటించారు గాని, అధికారుల అలస త్వం వల్ల, ప్రజలకు తగు స్ఫూర్తి కలుగనందువల్ల, ఫలితాలు మొదటి దశ కన్న కొంత పెరిగినా ఆశించిన మేర కలుగలేదు.

ముప్ఫై రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని గమనిస్తే అందులో ఒకవైపు అభివృద్ధికి సంబంధించిన అంశాలు, మరొకవైపు పచ్చదనం అంశాలు, ఇంకొకవైపు పరిశుభ్రత అంశాలు కనిపిస్తాయి. వాటినన్నింటిని ఇక్కడ జాబితా రాయవలసిన అవసరం లేదు గాని ముఖ్యమైనవి చెప్పాలంటే గ్రామాల అవసరాలు, వనరులను పరిగణనలోకి తీసుకుంటూ ఆ ప్రకారం వార్షిక ప్రణాళికను తయారుచేసుకోవటం, అందుకు గ్రామసభ ఆమోదం తీసుకొని అదే ప్రకారం ఖర్చుచేయటం, విద్యుత్‌ రంగానికి సంబంధించి ‘పవర్‌ వీక్‌' నిర్వహణ, ప్రతి జిల్లాకు కేటాయించే నిధుల్లో గ్రామానికి లభించేవాటిని ప్రణాళికకు అనుగుణంగా సక్రమ వినియోగం వంటివి అభివృద్ధి అంశాల కిందకు వస్తాయి.

బహుశా ఈ నాలుగేండ్ల అనుభవాలతో కావచ్చు ముఖ్యమంత్రి ఇప్పు డు ఒక సరికొత్త ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో ఇంతకాలపు హరితహారం స్వరూపానికి మించిన సమగ్రత ఉన్నది. ఒకవైపు అభివృద్ధిని, మరొకవైపు పచ్చదనం-పరిశుభ్రతను గమనించవచ్చు. ఇందులో అభివృద్ధి సరేసరి కాగా, ఆయన తన హరితహారం ఫిలాసఫీని ఇంత పట్టుదలగా, నిబద్ధతతో, ఈ స్థాయికి తీసుకువెళ్తుండటం ఎవరినైనా మెప్పించేదే గాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. తెలంగాణ రాష్ట్ర సాధన, విద్యుత్‌ సమస్య పరిష్కారం, ప్రాజెక్టుల నిర్మాణం, బడుగు జీవు ల సంక్షేమం, రైతాంగపు పరిస్థితి మెరుగుపడటం వంటి విషయాలలో చూపిన పట్టుదలనే ఆయన ఈ పచ్చదనం-పరిశుభ్రత, గ్రామీణాభివృద్ధి విషయాల్లోనూ చూపుతున్నట్లు, అందుకు ఇదొక కొనసాగింపు లక్షణం అయినట్లు భావించాల్సి ఉంటుంది.

దీనిని విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో ఒకసారి గమనించండి. తన ఉద్దేశాలు మొక్కుబడివి కావని మంత్రులు, అధికారుల నుంచి మొదలుకొని సాధారణ ప్రజల వరకు అందరికీ నూరిపోసేందుకు పంచాయతీరాజ్‌ తదితర శాఖలవారితో వరుసగా పలు సమావేశాలు గంటల తరబడి జరిపారు. పంచాయ తీ శాఖలోని ఖాళీలను పూరించటం, అవసరమైన ప్రమోషన్లు ఇవ్వటం, గ్రామీణ పారిశుద్ధ్యంలో ముఖ్యపాత్ర వహించే సఫాయీ కార్మికుల జీతా లు గణనీయంగా పెంచటం వంటివి వేగంగా పూర్తిచేశారు. దీనికన్న ముందే కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని రూపొందించారు. కార్యక్రమాన్ని కేంద్రీకృత దృష్టితో అమలుపరిచేందుకు 60 రోజుల ప్రణాళికను తయారుచేశారు. అందులో 30 రోజుల మొదటిదశ ఈ శుక్రవారం నుంచి చేపడుతున్నారు. నెలకు రూ.339 కోట్ల చొప్పున విడుదల చేస్తున్న ట్లు ప్రకటించారు. ప్రణాళికలను గతంలోనూ రూపొందించినా సక్రమ పర్యవేక్షణ లేకపోయిందని గుర్తించి ఈసారి ప్రతి గ్రామానికి ఒకరు చొప్పున మండలస్థాయి అధికారులను ఇంచార్జ్‌లుగా నియమిస్తున్నారు.
ashok
ముప్ఫై రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని గమనిస్తే అం దు లో ఒకవైపు అభివృద్ధికి సంబంధించిన అంశాలు, మరొకవైపు పచ్చదనం అంశాలు, ఇంకొకవైపు పరిశుభ్రత అంశాలు కనిపిస్తాయి. వాటినన్నింటిని ఇక్కడ జాబితా రాయవలసిన అవసరం లేదు గాని ముఖ్యమైనవి చెప్పాలంటే గ్రామాల అవసరాలు, వనరులను పరిగణనలోకి తీసుకుం టూ ఆ ప్రకారం వార్షిక ప్రణాళికను తయారుచేసుకోవటం, అందుకు గ్రామసభ ఆమోదం తీసుకొని అదే ప్రకారం ఖర్చుచేయటం, విద్యుత్‌ రంగానికి సంబంధించి ‘పవర్‌ వీక్‌' నిర్వహణ, ప్రతి జిల్లాకు కేటాయించే నిధుల్లో గ్రామానికి లభించేవాటిని ప్రణాళికకు అనుగుణంగా సక్రమ వినియోగం వంటివి అభివృద్ధి అంశాల కిందకు వస్తాయి. మురికి కాల్వ లు రోడ్ల శుభ్రత, ఇతర శుభ్రతలు, డంప్‌యార్డ్‌ల నిర్వహణ వంటివి పరిశుభ్రత కిందకు వస్తాయి. గ్రామాల్లో నర్సరీల పెంపు, మొక్కలను నాటడంతో పాటు పరిరక్షించి పెంచటం వంటివి హరితహారమవుతాయి. ఈ అన్ని విషయాల్లో ప్రభుత్వం ఇప్పుడు అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను కచ్చితమైన రీతిలో బాధ్యులను చేస్తుండటం, పాటించని వారి పై చర్యలు తీసుకోనుండటం విశేషం. అనుమతిలేకుండా చెట్లు నరక టం, పరిసరాలను జల వనరులను అపరిశుభ్రం చేయటం సాధారణ ప్రజలకు సైతం శిక్షార్హమైన నేరం కానున్నది. ప్రజలు, అధికారులు తమ బాధ్యతలను చైతన్యంతో గుర్తెరిగి స్వయంగా ఆచరించేవరకు ఇది అవసరం కూడా.

ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నది కేసీఆర్‌ నొక్కిచెప్పిన ఒక ముఖ్యమైన మాట. వారు భాగస్వాములు కాక తప్పని పరిస్థితులు సృష్టించటం (ఉదాహరణకు అపరిశుభ్రతకు జరిమానా) ఒక ఎత్తయితే, స్వచ్ఛందంగా, బాధ్యత గుర్తెరిగి, అందువల్ల తమకు కలిగే మేలును తెలిసి చైతన్యంతో భాగస్వాములు కావటం మరొక ఎత్తు. వారు ఈ రెండవది చేస్తూ, అధికారులతో, ప్రజాప్రతినిధులతో పనులు చేయిస్తూ, గ్రామాభివృద్ధి చేసుకొనేందుకు ఇప్పుడొక చారిత్రక అవకాశం లభిస్తున్నది. ఇదంతా క్రమంగా వ్యక్తులకు, ప్రజలకు, ప్రభుత్వానికి ఒక స్థిరమైన సంస్కృతిగా మారాలి.

502
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles